5 May 2024

సోకుల్లు మెహమెట్ పాషా 1505-1579 Sokullu Mehmet Pasha 1505-1579

 


సోకుల్లు మెహమెట్ పాషా 1505-1579 ఒట్టోమన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మరియు  ప్రభావవంతమైన  వ్యక్తి. సోకుల్లు మెహమెట్ పాషా 16వ శతాబ్దం చివరలో సుల్తాన్ సెలిమ్ II పాలనలో గ్రాండ్ విజియర్ మరియు నేవీ అడ్మిరల్‌గా పనిచేశారు.

సోకొల్లు (లేదా సోకుల్లు) మెహ్మద్ పాషా 1505లో బోస్నియాలోని సోకోల్‌లో జన్మించాడు సోకుల్లు మెహమెట్ పాషా తన నిజాయితీ మరియు నమ్మకమైన ప్రజాసేవ ద్వారా  ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉన్నత స్థాయికి పదోన్నతి పొందాడు.

1546లో బార్బరోస్ హేరెట్టిన్ మరణించిన తరువాత సోకుల్లు మెహమెట్ పాషా ఒటొమన్  నావికాదళానికి అడ్మిరల్ మరియు తరువాత ఆర్మీ జనరల్ అయ్యాడు. సోకుల్లు మెహమెట్ పాషా 1566లో హంగేరిలోని స్జిగెట్వార్ వెలుపల ఆస్ట్రియాతో జరిగిన యుద్ధంలో ఒటొమన్   దళాలకు నాయకత్వం వహించాడు

సోకుల్లు మెహమెట్ పాషా ఒట్టోమన్ సామ్రాజ్యా శక్తిని బలోపేతం చేయడానికి మరియు విస్తరించడానికి పాటుపడినాడు. ఒట్టోమన్ చరిత్రలో సోకుల్లు మెహమెట్ పాషా ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణింపబడినాడు.

సోకుల్లు మెహమెట్ పాషా ముగ్గురు ఒట్టోమన్ సుల్తానులకు గ్రాండ్ విజియర్‌గా పనిచేశాడు; సులేమాన్ I (ది మాగ్నిఫిసెంట్), సెలిమ్ II (ది సోట్) మరియు మురాద్ III. సోకుల్లు మెహమెట్ పాషా సుల్తాన్ సెలీమ్ కుమార్తె ఇస్మిహాన్‌ను వివాహం చేసుకున్నాడు. దురదృష్టవశాత్తూ సుల్తాన్ మురాత్ III పాలనలో ఐదు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత,  సుల్తాన్ మురాత్ III ఆగ్రహానికి గురిఅయి 1579లో సోకుల్లు మెహమెట్ పాషా తన ఇంట్లోనే దాడి జరిగి  ఎటువంటి కారణం లేకుండా హత్య చేయబడ్డాడు. సోకొల్లును ఇస్తాంబుల్‌లోని ఇయుప్ మసీదు సమీపంలో ఖననం చేశారు

 గ్రాండ్ విజియర్‌గా, సోకుల్లు మెహమెట్ పాషా ఒట్టోమన్ సామ్రాజ్యంలో పరిపాలనా మరియు ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఒట్టోమన్ రాజ్య ఆదాయాన్ని పెంచడంలో సహాయపడే కొత్త పన్ను వ్యవస్థను ఏర్పాటు చేయడంతో సహా. సైనిక విజయాలు మరియు ఇతర రాజ్యాలతో చర్చల ద్వారా ఒట్టోమన్ భూభాగాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించాడు

నేవీ అడ్మిరల్‌గా, సోకుల్లు మెహ్మెట్ పాషా ఒట్టోమన్ నౌకాదళం యొక్క నిర్మాణం మరియు విస్తరణను పర్యవేక్షించారు, సోకుల్లు మెహ్మెట్ పాషా ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని రక్షించడంతో పాటు  మరియు ఒట్టోమన్ నౌకాదళ శక్తిని  విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించినాడు. సోకుల్లు మెహ్మెట్ పాషా 1571లో సైప్రస్‌ను జయించడంతో సహా అనేక విజయవంతమైన ఒట్టోమన్ నౌకాదళ విజయాలకు  నాయకత్వం వహించాడు

సోకొల్లు మెహ్మద్ పాసా కు ఒక కుమార్తె మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు:

.ఎర్ర సముద్రం మరియు హిందూ మహాసముద్రం మరియు వెలుపల లింక్ చేయడానికి రూపొందించిన ఇస్త్మస్ ఆఫ్ సూయెజ్ మీదుగా ఒక గ్రాండ్ కెనాల్‌ను ప్లాన్ చేసిన మొదటి వారిలో సోకుల్లు మెహ్మెట్ పాషా ఒకరు. తన జీవిత కాలంలో సోకుల్లు మెహ్మెట్ పాషా స్వయంగా అనేక హమ్మమ్‌లు, కార్వాన్‌సెరై, ఫౌంటైన్‌లు మరియు మసీదులను నిర్మించాడు.

ఇస్తాంబుల్‌లోని సుల్తానాహ్‌మెట్ జిల్లా సమీపంలోని కదిర్గాలో సోకుల్లు మెహ్మెట్ పాషా పేరు మీద అత్యంత ప్రసిద్ద మసీదు మరియు మదరసా ఉంది. దీనిని 1577-78లో గొప్ప వాస్తుశిల్పి సినాన్ నిర్మించారు.

విసెగ్రాడ్‌లోని మెహ్మద్ పాసా సోకోలోవిక్ బ్రిడ్జ్ కూడా నిర్మించాడు.

సోకొల్లు మెహ్మద్ పాషా కాన్స్టాంటినోపుల్‌లో మరియు ఒట్టోమన్ భూభాగాల్లో నిర్మాణపరంగా ప్రసిద్ధి చెందిన అనేక భవనాలనునిర్మించాడు... మక్కా మరియు కాన్స్టాంటినోపుల్ లో మసీదులనునిర్మించాడు..

 సోకొల్లు మెహ్మద్ పాషా ఫెరిదున్ అహ్మద్ బేగ్, సిపహజాడే మహ్మద్ మరియు కుత్బెద్దీన్ మెక్కితో సహా తన కాలంలోని ప్రముఖ ఒట్టోమన్ భూగోళ శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులతో కలిసి పనిచేశాడు

 

 

 

 

 

లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ మూడవసారి గెలిచారు Sadiq Khan wins third term as London Mayor

 



లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్ లండన్ మేయర్‌గా రికార్డు స్థాయిలో మూడవసారి గెలుపొందారు. సాదిక్ ఖాన్ తన ప్రధాన ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీ కి చెందిన సుసాన్ హాల్‌ పై సులభంగా గెలిచాడు. సాదిక్ ఖాన్ 276,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు.

సాదిక్ ఖాన్ యొక్క తన ప్రచార వాగ్దానాలలో ప్రాథమిక పాఠశాలల్లో ఉచిత భోజనాన్ని కొనసాగించడం, నిర్దిష్ట ప్రజా రవాణా ఛార్జీలను స్తంభింపజేస్తామని వాగ్దానం చేయడం మరియు మరింత మంది పోలీసు సిబ్బంది  నిమించడం ఉన్నాయి.

తన విజయ ప్రసంగంలో, సాదిక్ ఖాన్ "న్యాయమైన, సురక్షితమైన మరియు పచ్చని లండన్"ను అందిస్తానని హామీ ఇచ్చారు. సాదిక్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు చేసిన చేసిన హాల్ విమర్శించబడింది.

లండన్‌లో మరియు ఇంగ్లండ్ మరియు వేల్స్‌లోని స్థానిక సంస్థలలో లేబర్‌ పార్టీ ముందజలో ఉంది. ఇంగ్లండ్‌లోని 107 స్థానిక కౌన్సిల్‌లలో 106 ఫలితాలు ప్రకటించడంతో, లేబర్ పార్టీ  50 కౌన్సిల్‌లలో (ఎనిమిది అదనంగా) మెజారిటీని గెలుచుకుంది, కన్జర్వేటివ్‌ పార్టీ మొత్తం ఆరు (10 నష్టాలతో) గెలిచారు. లిబరల్ డెమొక్రాట్ పార్టీ 12 కౌన్సిల్‌లను గెలుచుకున్నారు (రెండు లాభం).

 లేబర్ పార్టీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ గ్రేటర్ మాంచెస్టర్‌లో తిరిగి ఎన్నికయ్యారు. లివర్‌పూల్, సౌత్ యార్క్‌షైర్ మరియు వెస్ట్ యార్క్‌షైర్‌లలో కూడా లేబర్ పార్టీ  గెలిచింది.

 

 

4 May 2024

ఫరా మాలిక్ భాంజీ, భారతదేశంలో అత్యంత ధనిక ముస్లిం వ్యాపారవేత్త Farah Malik Bhanji, the Richest Muslim Businesswoman in India


ఫరా మాలిక్ భాంజీ భారతీయ వ్యాపార రంగంలో అత్యంత సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందింది. మెట్రో షూస్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఫరా మాలిక్ ప్రఖ్యాత పాదరక్షల సమ్మేళనం conglomerate., మెట్రో షూస్ కంపెనీని సుమారు రూ. 28,773 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో నూతన శకంలోకి నడిపించారు.

1955లో ముంబైలో మెట్రో షూస్‌ను స్థాపించిన తన తాత మాలిక్ తేజాని వ్యాపారంలో మూడవ తరం వ్యాపారవేత్తగా ఫరా మాలిక్ నాయకత్వ బాద్యతాలను ఉత్సాహంతో స్వీకరించింది. ఫరా మాలిక్ మెట్రో షూస్ బ్రాండ్‌ను పునరుజ్జీవింపజేసి దాని  మార్కెట్ ఉనికిని విస్తరింపజేసింది.

ఫరా మాలిక్ యొక్క విశేషమైన సహకారం తో మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ రూ. 35,117 కోట్లు వ్యాపార టర్నోవర్ ను  కలిగి ఉంది. పాదరక్షల రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించిన  మెట్రో షూస్   కంపెనీ చైన్  మరియు సాంకేతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో ఫరా మాలిక్ కీలక పాత్ర పోషించారు

ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్, ఫైనాన్స్ మరియు గణితంలో ఉన్నతమైన డిగ్రీలు పొందిన ఫరా మాలిక్ కు గొప్ప వ్యాపార చతురత మరియు ఫ్యాషన్ పట్ల మక్కువ ఉంది. మార్కెటింగ్ నుండి ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, కొత్త కాన్సెప్ట్ క్రియేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్పియర్‌హెడింగ్ కార్యక్రమాల వరకు ఫరా ప్రయాణం ఆమె బహుముఖ ప్రతిభ మరియు నాయకత్వ లక్షణాలను వివరిస్తుంది.

ఫరా మాలిక్ యొక్క మార్గదర్శకత్వంలో, మెట్రో షూస్, భారతదేశంలోని 80+ నగరాల్లో 160కి పైగా ప్రత్యేకమైన షోరూమ్‌లతో కూడిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌గా అభివృద్ధి చెందింది మరియు  వినియోగదారులకు విభిన్నమైన పాదరక్షలు మరియు ఉపకరణాలను అందిస్తోంది

 1947లో ముంబైలో ఒకే దుకాణంతో ప్రారంభమైనప్పటి నుండి, ఇటివల మెట్రో షూస్ ఫరా మాలిక్ యొక్క సారథ్యంలో విస్తరించింది. ఇప్పుడు 136 నగరాల్లో విస్తరించి ఉన్న 598 అవుట్-లెట్స్ కలిగి ఉంది. మెట్రో షూస్. బ్రాండ్ అధిక నాణ్యత, నైపుణ్యం మరియు అధిక-ఫ్యాషన్ ఉత్పత్తులకు పర్యాయపదంగా మారింది, విస్తృతమైన గుర్తింపు మరియు ప్రశంసలను సంపాదించింది.

ఫరా మాలిక్ 250 మంది విశ్వసనీయ విక్రేతలతో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే, స్కేచర్స్, క్రోక్స్ మరియు క్లార్క్స్ వంటి ప్రపంచ పాదరక్షల దిగ్గజాలతో సహకారాన్ని సులభతరం చేసింది.

 భారతదేశంలోని పాదరక్షల పరిశ్రమపై ఫరా మాలిక్ భాంజీ యొక్క చెరగని ముద్ర ఆమె వ్యవస్థాపక స్ఫూర్తికి, వినూత్న ఆలోచనలకు మరియు శ్రేష్ఠతకు నిబద్ధతకు నిదర్శనంగా పనిచేస్తుంది. ఫరా మాలిక్ నాయకత్వం మెట్రో షూస్‌ను ఉన్నత శిఖరాలకు నడిపిస్తూనే ఉంది మరియు  ఫ్యాషన్ రిటైల్ రంగంలో నమ్మకమైన పేరును సాధించినది.

 


3 May 2024

ఇస్లాం ప్రకారం 10 పాపాలు 10 sins according to Islam

 



 

ఒక ముస్లిం పెద్ద మరియు చిన్న పాపాలన్నిటి నుండి దూరంగా ఉండాలి. విశ్వాసపాత్రుడైన ప్రతి ముస్లిం అల్లాహ్ యొక్క శిక్షకు మరియు కోపానికి గురిచేసే మాట లేదా పని నుండి దూరంగా ఉండాలి.  

దివ్య ఖురాన్ మరియు హదీసులలో ప్రధాన పాపాలు స్పష్టం చేయబడ్డాయి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: "మీరు నిషేధించబడిన పెద్దపాపాలకు దూరంగా ఉంటె, మేము మీ చిన్న పాపాలను మన్నిస్తాము. మిమ్మల్లి గౌరవనీయమైన స్థానాలలో ప్రవేశింపజేస్తాము.." (4:31)

ఇస్లాంలో, పాపాలు పెద్ద మరియు చిన్న పాపాలుగా వర్గీకరించబడ్డాయి, పెద్ద పాపాలు తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయి. అరబిక్‌లో "కబైర్" అని పిలువబడే పెద్ద పాపాలు-ఖురాన్ మరియు హదీసులలో స్పష్టంగా నిషేధించబడిన చర్యలు మరియు ప్రవర్తనలు. వాటిని  ఉద్దేశపూర్వకంగా, పశ్చాత్తాపం లేకుండా చేయడం తీవ్రమైన శిక్షకు దారి తీస్తుంది

ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి పెద్ద పాపాలను నివారించడము  విశ్వాసులకు  చాలా ముఖ్యమైనది.

ఇస్లాంలోని కొన్ని ప్రధాన పాపాలు ఇక్కడ ఉన్నాయి:

1. షిర్క్ (అల్లాహ్‌తో భాగస్వాములను చేయడం):

షిర్క్ అనేది ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం.  అల్లాహ్‌తో భాగస్వాములను కలపడం లేదా ఇతరులకు అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన దైవిక లక్షణాలను ఆపాదించడం షిర్క్ గా పిలబడుతుంది.  పశ్చాత్తాపం లేకుండా మరణిస్తే అల్లా క్షమించని ఏకైక పాపం షిర్క్.

దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది, "అల్లాహ్ తనతో సాంగత్యాన్ని క్షమించడు, కానీ అది మినహా మిగతా వాటిని – ఆయన తాను కోరినవారికి క్షమిస్తాడు. " (ఖురాన్ 4:48).

2. హత్య చేయడం (అన్యాయంగా జీవితాన్ని తీసుకోవడం):

అన్యాయంగా మరొకరి ప్రాణం తీయడం ఇస్లాంలోని ప్రధాన పాపాలలో ఒకటి. దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది, "అల్లాహ్ పవిత్రం గావించిన (నిషేదించిన) ఏ ప్రాణిని చంపకండి" (ఖురాన్ 17:33).

హత్య తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది మరియు జీవిత పవిత్రతకు భంగం కలిగిస్తుంది.

3. వడ్డీ (రిబా):

రుణాలపై వడ్డీ వసూలు చేయడం ఇస్లాంలో ఖచ్చితంగా నిషేధించబడింది. అల్లాహ్ ఖురాన్‌లో ఇలా చెప్పాడు, "వడ్డీ తినే వారు (పునరుత్థాన దినాన) దెయ్యం పట్టిన  ఉన్మాదిలా లేచి వస్తారు. " (ఖురాన్ 2:275). వడ్డీ/రిబా దోపిడీగా మరియు సమాజానికి హానికరంగా పరిగణించబడుతుంది.

4. వ్యభిచారం మరియు వివాహేతర లైంగిక సంబంధాలు:

వివాహానికి వెలుపల పెట్టుకోవడం ఇస్లాంలో పెద్ద పాపం. ఖురాన్ ఇలా చెబుతోంది, "వ్యభిచారం దరిదాపులకు పోకండి. అదొక సిగ్గుమాలిన చేష్ట, బహు చెడ్డ మార్గం. " (దివ్య ఖురాన్ 17:32).

వ్యభిచారం వివాహం మరియు కుటుంబం యొక్క పవిత్రతను ఉల్లంఘించినట్లు పరిగణించబడుతుంది.

5. మత్తు పదార్థాలు (మద్యం మరియు డ్రగ్స్) తీసుకోవడం:

ఆల్కహాల్ మరియు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, ఇవి ప్రజల ఆలోచనా శక్తిని  దెబ్బతీస్తాయి మరియు హానికరమైన పరిణామాలకు దారితీస్తాయి. ఖురాన్ ఇలా చెబుతోంది, "ఓ విశ్వసించినవారలారా, మత్తు పదార్థాలు, జూదం, దైవేతర స్థానాలు, బాణాల ద్వారా అదృష్టాని పరిక్షి౦చుకోవటం – ఇవి అపవిత్ర సైతాను పనులు,  కనుక మీరు వాటికి దూరంగా ఉండండి.-  కృతార్ధులు అవుతారు. (ఖురాన్ 5:90).

6. దొంగతనంలో పాల్గొనడం:

మరొక వ్యక్తి యొక్క సమ్మతి లేకుండా దొంగిలించడం లేదా వారి ఆస్తిని తీసుకోవడం ఇస్లాంలో ఖచ్చితంగా నిషేధించబడింది.

ఖురాన్ ఇలా చెబుతోంది, "సమంజసమైన రీతి లో తప్ప, తండ్రి లేని బిడ్డల ఆస్తి జోలికి పోకండి. అదైనా (అనాధలు) యుక్త వయస్సు కు చేరుకొనేవరకే. " (ఖురాన్ 6:152). దొంగతనం అనేది ఇతరుల హక్కుల ఉల్లంఘన మరియు విశ్వాస ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

7. వెన్నుపోటు మరియు అపవాదు:

ఇతరుల వెనుక ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, పుకార్లు వ్యాప్తి చేయడం మరియు వారి కీర్తిని దూషించడం ఇస్లాంలో ప్రధాన పాపాలు.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, "మీకు వెన్నుపోటు అంటే ఏమిటో తెలుసా?... అది మీ సోదరుడు ఇష్టపడని విషయం గురించి ప్రస్తావించడమే" (సహీహ్ ముస్లిం).

వెన్నుపోటు మరియు అపవాదు సమాజానికి హానికరం మరియు సంబంధాలకు వినాశకరమైనవిగా పరిగణించబడతాయి.

8. తల్లిదండ్రులపట్ల  అవిధేయత:

తల్లిదండ్రులపట్ల  అవిధేయత లేదా అగౌరవం ఇస్లాంలో పెద్ద పాపంగా పరిగణించబడుతుంది.

దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది, "ఒకవేళ వారు, నీ  వెరుగని వారిని ఎవైరినైనా నాకు సాటి కల్పించమని నీపై ఒత్తిడి తెస్తే మాటకు, నీవు వారి మాట విననవసరం లేదు. ప్రపంచం లో మాత్రం వారిపట్ల సద్భావం తో మెలగాలి. అయితే వారు మీకు తెలియని వాటిని నాతో సాంగత్యం చేయాలని ప్రయత్నిస్తే, వారికి విధేయత చూపకండి" (ఖురాన్ 31:15).

తల్లిదండ్రులను గౌరవించడం మరియు విధేయత చూపడం ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన విధులలో ఒకటిగా పరిగణించబడుతుంది..

9. వాగ్దానాలు మరియు ఒప్పందాలను ఉల్లంఘించడం:

ఇస్లాంలో వాగ్దానాలు మరియు ఒప్పందాలను ఉల్లంఘించడం పెద్ద పాపం. ఖురాన్ ఇలా చెబుతోంది, " వాగ్దానానికి కట్టుబడి ఉండండి. మరియు ఒడంబడికను నెరవేర్చండి. వాస్తవానికి, వాగ్ధానం విషయంలో ప్రశ్నించడం జరుగుతుంది. " (ఖురాన్ 17:34).

ఒప్పందాలను గౌరవించడం మరియు వాగ్దానాలను నెరవేర్చడం ఇస్లామిక్ నీతిలో ముఖ్యమైన సూత్రాలు.

10. అహంకారం మరియు గర్వం:

అహంకారం మరియు గర్వం ఇస్లాంలో ఖండించబడిన ప్రధాన పాపాలు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, "హృదయంలో అణువణువునా గర్వం ఉన్నవారు స్వర్గంలోకి ప్రవేశించరు" (సహీహ్ ముస్లిం). వినయం మరియు విధేయత ఇస్లాంలో అత్యంత విలువైన ధర్మాలు.

ఈ పాపాలను నివారించడం మరియు ఏదైనా గత పాపాలకు క్షమాపణ కోరడం ముస్లింలకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి చాలా అవసరం. హృదయపూర్వక పశ్చాత్తాపం మరియు అల్లాహ్ యొక్క క్షమాపణ కోరడం ఆధ్యాత్మిక శుద్ధీకరణ మరియు విముక్తికి దారి తీస్తుంది.

దివ్య ఖురాన్‌లో పేర్కొన్నట్లుగా "మరియు వారు అనైతికతకు పాల్పడినప్పుడు లేదా తమను తాము తప్పు చేసుకున్నప్పుడు, అల్లాహ్‌ను స్మరించుకుని, తమ పాపాలకు క్షమాపణ కోరుకొంటారు - మరియు అల్లాహ్ తప్ప పాపాలను ఎవరు క్షమించగలరు? తెలిసికూడా వారు తమ స్వయం కృతాలపై మంకు చూపరు. " (ఖురాన్ 3:135).

 

2 May 2024

సెజైర్లీ గాజీ హసన్ పాషా 1713 –1790 Cezayirli Gazi Hasan Pasha 1713 –1790

 


18వ శతాబ్దం చివరిలో సెజైర్లీ గాజీ హసన్ పాషా లేదా అల్జీర్స్‌ (1713 -  1790)  ఒట్టోమన్ గ్రాండ్ అడ్మిరల్ (కపుడాన్ పాషా) (1770-1790) మరియు ఒట్టోమన్ గ్రాండ్  వజీర్  (1790).

 గాజీ హసన్ పాషా పశ్చిమ అనటోలియాలోని  టెకిర్డాగ్ లో ఒక టర్కిష్ వ్యాపారి వద్ద  జార్జియన్ బానిసగా పెరిగాడు. గాజీ హసన్ పాషా ను తన  సొంత కొడుకులతో సమానంగా భావించి టర్కిష్ వ్యాపారి పెంచాడు.

గాజీ హసన్ పాషా ఒట్టోమన్ మిలిటరీ లో క్రమంగా ఎదిగాడు మరియు అల్జీర్స్‌లో ఉన్న బార్బరీ కోస్ట్ పైరేట్స్‌తో కొంతకాలం ఉన్నాడు (అందుకే గాజీ హసన్ పాషా పేరు సెజైర్లీ, అంటే టర్కిష్‌లో "అల్జీరియన్" అని అర్ధం). గాజీ హసన్ పాషా చెస్మే యుద్ధంలో ఒక టర్కిష్ ఫ్లీట్ కమాండర్ మరియు ఆ యుద్దంలో   టర్కిష్ నౌకాదళాన్ని ఘోర  విపత్తు నుండి కాపాడాడు

తను చేసిన కార్యానికి గాజీ హసన్ పాషా ఒట్టోమన్ రాజ్య ప్రశంసలు అందుకున్నాడు. గాజీ హసన్ పాషా మొదట చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మరియు తరువాత గ్రాండ్ విజియర్‌గా పదోన్నతి పొందాడు. గాజీ హసన్ పాషా ఏజియన్ ద్వీపం లెమ్నోస్‌లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న రష్యన్ నౌకాదళాన్ని పారదోలాడు..

చెస్మే యుద్ధం తరువాత గాజీ హసన్ పాషా 1773లో నావల్ ఇంజనీరింగ్ గోల్డెన్ హార్న్ షిప్‌యార్డ్ (తరువాత టర్కిష్ నావల్ అకాడమీ) స్థాపించినాడు.

పాలస్తీనా యొక్క స్వయంప్రతిపత్త అరబ్ పాలకుడు జహీర్ అల్-ఉమర్ పాలిత ప్రాంతం అరేAcreను 1775 వేసవిలో హసన్ పాషా దిగ్బంధించాడు. ముట్టడిని సడలించడానికి హసన్ పాషా 50,000 పైస్టర్లు చెల్లించాలని జహీర్ అల్-ఉమర్ ను ఆదేశించాడు. జహీర్ నిరాకరించాడు మరియు హసన్ పాషా యొక్క ఓడలు అరేAcreపై బాంబు దాడి చేశాయి. జహీర్ అల్-ఉమర్ పారిపోయాడు, కానీ తప్పించుకునేలోపు హసన్ పాషా యొక్క దళాలచే చంపబడ్డాడు

16వ శతాబ్దం ప్రారంభంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికాపై ఆధిపత్యం చెలాయించింది, ఎందుకంటే అల్జీర్స్ 1525లో, 1551లో ట్రిపోలీ మరియు 1574లో టునిస్ ఒట్టోమన్ రీజెన్సీగా ఉన్నాయి.ఒట్టోమన్ పాలకులు అల్జీరియా, టునిస్ మరియు ట్రిపోలీలను నియంత్రించారు.

రీజెన్సీలు నియమించబడిన గవర్నర్లచే పాలించబడతాయి కాలక్రమేణా, గవర్నర్ల స్థానంలో నియమించబడిన సైనిక పాలకులు "దైలార్" (మేనమామలు)గా పిలవబడ్డారు. సైనిక పాలకులు తమ జెండాలను ఎగురవేసి అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రంలో ప్రయాణించారు. సైనిక పాలకులు అమెరికా తీరాల నుండి ఐస్‌లాండ్ వరకు ప్రతిచోటా దాడి చేస్తూ గొప్ప భీభత్సాన్ని సృష్టించారు. యూరోపియన్లు చాలా చోట్ల ఒట్టోమన్ నావికుల గురించి వ్రాసిన అనేక పాటలు మరియు జానపద కథలు ఉన్నాయి.

18వ శతాబ్దం చివరి నాటికి ఒట్టోమన్ సామ్రాజ్యం దాని పూర్వ శక్తిని కోల్పోయినప్పటికీ, ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సామ్రాజ్యాలలో ఒకటి. 1783లో స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ మహాసముద్రాలు మరియు సముద్రాలలో చురుకుగా ఉంది.

అమెరికన్లు 1786లో అరబిక్‌లో మొరాకోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొరాకో నౌకాశ్రయాలను ఉపయోగించేందుకు అమెరికన్ నౌకలకు మొరాకో రాజు నుండి అనుమతి పొందారు.

అల్జీరియన్ సముద్రపు దొంగలు 1785 నుండి అమెరికన్ నౌకలను దోచుకోనేవారు. జూలై 1785లో, కాడిజ్ తీరంలో చిక్కుకున్న U.S. నౌకను అల్జీర్స్ నౌకాశ్రయానికి తీసుకువచ్చారు.

తరువాతి సంవత్సరాల్లో, డజన్ల కొద్దీ U.S. నౌకలను అల్జీరియన్ సముద్రపు దొంగలు స్వాధీనం చేసుకున్నారు. 1794లో, U.S. కాంగ్రెస్ బార్బరీ సముద్రపు దొంగలకు వ్యతిరేకంగా పోరాడేందుకు దాదాపు $700,000 కేటాయించింది మరియు బలమైన నౌకలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. 1795లో, US తమ నౌకలను కాపాడుకోవడానికి జోసెఫ్ డొనాల్డ్‌సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని అల్జీర్స్‌కు పంపింది.

సుల్తాన్ సెలిమ్ III పాలనలో, అల్జీరియన్ నాయకులు సెప్టెంబర్ 5, 1795న ఒట్టోమన్‌లో యునైటెడ్ స్టేట్స్‌తో ఒప్పందంపై సంతకం చేశారు

అల్జీర్స్ గవర్నర్ హసన్ పాషా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, అల్జీర్స్‌లోని అమెరికన్ నౌకా ఖైదీలను విడిపించడానికి మరియు సంవత్సరానికి $21,600 (12,000 అల్జెరిన్ సీక్విన్స్) పన్నును చెల్లించడానికి అమెరికా US $642,500 కప్పంగా హసన్ పాషాకు ఇస్తుంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న U.S. 18వ శతాబ్దం చివరిలో మధ్యధరా సముద్రంలో తన వాణిజ్య నౌకలు తిరగడానికి  ఒట్టోమన్ రీజెన్సీ ఆఫ్ అల్జీర్స్‌కు టాక్స్/కప్పం చేల్లిచినది. .

19వ శతాబ్దం మొదటి త్రైమాసికం వరకు అమెరికా ఈ పన్నును 20 సంవత్సరాలకు పైగా చెల్లించింది.తరువాత, అమెరికా దాని బలమైన నౌకాదళం మరియు సైనిక శక్తి కారణంగా టాక్స్ కట్టడం మానేసింది.

ఈజిప్ట్‌కు ప్రావిన్స్‌లో వాస్తవ పాలకులుగా మారిన ఇబ్రహీం బే (మమ్లుక్) మరియు మురాద్ బే నేతృత్వంలోని మామ్లుక్ ఎమిర్‌లను తరిమికొట్టమని 1786లో, హసన్ పాషా,  సుల్తాన్ అబ్దుల్ హమీద్ I నుండి ఆదేశం పొందినాడు. హసన్ పాషా ఆగష్టు 1786 ప్రారంభంలో ఈజిప్ట్‌కు చేరుకున్నాడు మరియు ఈజిప్ట్ లోని మామ్లుక్ ఎమిర్‌లను పారద్రోలినాడు. ఒక సంవత్సరం పాటు హసన్ పాషా ఈజిప్ట్ యొక్క వాస్తవ ఒట్టోమన్ గవర్నర్‌గా కొనసాగారు. హసన్ పాషా తరువాత అతని కేతుడా (సహాయకుడు/డిప్యూటీ) ఇస్మాయిల్ పాషా ట్రిపోలిటానియన్  ఈజిప్ట్‌కు ఒట్టోమన్ గవర్నర్‌గా నియమించబడ్డాడు (1788–89, 1789–91).

1787-1792 నాటి రష్యన్ -టర్కిష్ యుద్ధంలో, హసన్ పాషా (అప్పుడు 74సంవత్సరాల వయస్సు లో ) టర్కిష్ దళాలకు నాయకత్వం వహించాడు, 17 జూన్ 1788, ఫిడోనిసి యుద్ధం మరియు ఓచకోవ్ ముట్టడిలో హసన్ పాషా పాల్గొన్నాడు.

హసన్ పాషా అనారోగ్యంతో లేదా బహుశా విషం కారణంగా 19 మార్చి 1790న మరణించాడు. 

హసన్ పాషా విగ్రహం రిసార్ట్ పట్టణం అయిన ఎస్మేÇeşme లో కలదు. హసన్ పాషా ఆఫ్రికాలో ఉన్నప్పుడు మచ్చిక చేసిన సింహంను  ప్రతిచోటా తనతో పాటు తీసుకువెళ్ళేవాడు...

 

29 April 2024

గ్రీన్ ఇస్లాం లేదా ఇస్లామిక్ పర్యావరణవాదం Green Islam or Islamic environmentalism

 


గ్రీన్ ఇస్లాం లేదా ఇస్లామిక్ పర్యావరణ వాదం  ప్రపంచాన్ని వేగవంతమైన పర్యావరణ మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచవ్యాప్త౦గా ముస్లింలను చేతన్యపరచడం మరియు ప్రకృతిని గౌరవించడం మరియు పర్యావరణ మార్పులకు ప్రతిస్పందించడం లక్ష్యంగా గ్రీన్ ఇస్లాం ఇస్లామిక్ పర్యావరణ వాదం  పనిచేస్తుంది.

గాలి, నీరు మరియు నేల కాలుష్యాన్ని తనిఖీ చేయడంలో మరియు గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించడంలో ప్రజల ఆసక్తి మరియు భాగస్వామ్యాన్ని పెంచడం కోసం  గ్రీన్ ఇస్లాం పనిచేస్తుంది.

ఇస్లాం ప్రకృతి పట్ల గౌరవం ప్రదర్శిస్తుంది. ప్రపంచం భద్రంగా ఉండాలంటే, మనిషి జీవితం నరకం కాకూడదంటే, ఏం చేయాలి, ఏం చేయకూడదో ప్రబోదిస్తుంది.

" భూమిని కేవలం ఒక వస్తువుగా భావించడం, ప్రకృతి పట్ల అత్యాశ ద్వారా ప్రళయం వస్తుంది"

రంజాన్ మాసంలో ఉపవాసం చేసినట్లే భూమిని కూడా మతపరంగా రక్షించుకోవాలని ముస్లింలకు ఇస్లాం బోదిస్తుంది.

"చెట్టు నాటడం అనేది రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం లాంటి అలవాటు కావాలి - పర్యావరణ పరిరక్షణ అనేది దాన ధర్మం లాంటి అలవాటు కావాలి.

ఎందుకంటే అల్లా పవిత్ర ఖురాన్‌లో ఇలా చెప్పాడు:

జనులు తమ చేజేతులా చేసుకొన్న  దాని పలితంగా నెలపైనా, నీటిలోనూ విచ్చినం ప్రబలిపోయింది. – తద్వారా దేవుడు వారి కొన్ని చేస్తాల రుచి వారికి చూపించటానికి! బహుశా వారు తమ దోరణిని మానుకొంటారని -30:41"

ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాలు  గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవటానికి ఇస్లాం ఒక ఆశాకిరణంగా కనిపిస్తుంది.

గ్రీన్ ఇస్లామిక్  ఉద్యమ౦ ద్వారా  సోషల్ మీడియాలో పర్యావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి ప్రయత్నించాలి.. వాతావరణం లేదా పర్యావరణ మార్పు ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ అన్ని దేశాలపై తన ప్రభావం చూపుతుంది.

ముస్లింలు ప్రకృతి పట్ల శ్రద్ధ వహించాలన్న ఇస్లాం ప్రవక్త(స) సూచనలను ముస్లింలు పాటించాలి.  మసీదులలో సౌర ఫలకాలను మరియు నీటి రీసైక్లింగ్ వ్యవస్థను అమర్చాలి. నీటి ప్రవాహాన్ని మృదువుగా చేసే మరియు వృధాను నియంత్రించే కుళాయిలు వ్యవస్థాపించాలి..గ్రీన్‌హౌస్ వాయువులను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో వాటిని నియంత్రించాలి.

 

గ్రీన్ ఇస్లాం ఉద్యమం అనేక ఇస్లామిక్ దేశాలలో చాలా విస్తృతంగా వ్యాపించింది.

ముస్లింలు ప్రకృతి పట్ల శ్రద్ధ వహించాలన్న ప్రవక్త మహమ్మద్ సూచనలను పాటించాలి.  ఇస్లాం ప్రాథమిక సూత్రాల వెలుగులో పర్యావరణ అవగాహన కల్పించాలీ. ఇందుక్స్ ప్రముఖ ఇస్లామిక్ పండితులు వాతావరణ మార్పులతో వ్యవహరించడంపై ఫత్వాలు జారీ చేయాలి..

చెట్లను నరకడం తప్పు అని ప్రజలు గ్రహించాలి.పర్యావరణ విషయం లో ఇస్లాం ఒక అందమైన చొరవ. "ప్రకృతిని మనం గౌరవిస్తాము మరియు కాపాడతాము అనేది  ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రాలలో చేర్చబడింది.

పర్యావరణ పరిరక్షణ అనేది మానవులకు మాత్రమే కాకుండా ప్రతి జీవి యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. గ్రీన్ ఇస్లాం యొక్క ఉద్యమం ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచంలోని ముస్లింలకు ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రాలు మరియు బోధనల గురించి అవగాహన కల్పిస్తుంది, ”

 హిజ్రా తర్వాత ఒక సంవత్సరం తరువాత, ఇస్లాం ప్రవక్త యుద్ధం సమయంలో లేదా తరువాత ఎటువంటి చెట్టు లేదా వ్యవసాయ భూమికి హాని కలిగించకూడదని ఒక చట్టాన్ని రూపొందించారు. ఇది ఇస్లాంలో పర్యావరణానికి ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ఒక హదీసు ప్రకారం. ఒక వ్యక్తి యొక్క చివరి సమయం లో  అవకాశం వస్తే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఒక మొక్కను నాటాలి. ప్రవక్త యొక్క ఈ సూక్తి  ఇస్లాంలో అడవుల పెంపకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

 గ్రీన్ ఇస్లాం ఉద్యమం ప్రతి దేశంలోని ముస్లింలకు సందేశాన్ని ఇస్తోంది మరియు ఇస్లాం బోధనలను వారికి గుర్తుచేస్తుంది. ".