2 May 2014

లారెన్స్ ఆఫ్ అరేబియా

అరబ్ ల మిత్రుడు  అల్-అరున్స్ గా అరబ్బులచే ప్రేమగా  పిలవబడిన లారెన్స్ ఆఫ్ అరేబియా- టి.ఈ.లారెన్స్ (1888 - 1935) బ్రిటిష్ విద్యావేత్త,రచయిత సైనికుడు,అరబ్ విప్లవ సమర్ధకుడు, సహజ అరబ్ పక్షపాతి, అరబ్బుల హితుడు, సన్నిహితుడు, మరియు అరబ్బులచే ఆదరంగా అల్-అరున్స్(AL-AURUNS) గా పిలువబడే టి.ఈ.లారెన్స్ 1888 లో బ్రిటన్ లోని వేల్స్ ప్రాంతం లో జన్మించినాడు. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో మద్య ప్రాచ్యం లో ఇతని సైనిక అనుభవాలపై ఆధారపడి నిర్మించిన” లారెన్స్ ఆఫ్ అరేబియా” చిత్రం ప్రపంచప్రఖ్యాతమైనది.
చిన్నతనంనుండి టి‌.ఈ.లారెన్స్ చురుకైన విద్యార్ధి. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో చరిత్ర అబ్యసించినాడు. సైనిక చరిత్రల అద్యయనం  పట్ల అమిత ఆసక్తి ప్రదర్శించేవాడు. 1911-14 వరకు సిరియా, పాలస్తీనాలో పనిచేసినాడు. అరబిక్ బాషను అబ్యసించినాడు. శతాబ్దాల తరబడి టర్కీ సుల్తాన్ పరిపాలనలో మగ్గుతున్న అరబ్ ప్రజల ల పట్ల సహజ అబిమానం తో  వారి బాష,చరిత్ర  ఆచార-వ్యవహారములను ఆద్యయనము చేసినాడు. మొదటి ప్రపంచ యుద్దం లో బ్రిటిష్ సైన్యం తరుపున  జూనియర్ ఆఫీసర్ గా రహాస్య సమాచార సేకరణ విభాగం లో  పనిచేసినారు. తన కున్న అరబిక్ పరిజ్ఞానంతో ఈజిప్ట్ లోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లోని   అరబ్ బ్యూరో లోపనిచేసినాడు.
మొదటి ప్రపంచయుద్దానికి పూర్వం మద్యప్రాచ్యం లోని అరబ్ ప్రాంతాలు టర్కీ సుల్తాన్ పరిపాలనలో ఉండేవి.  సినాయి,పాలస్తీనా ప్రాంతాలలో టర్కీ వారికి వ్యతిరేకం గా జరిగిన బ్రిటిష్ సైన్య దాడులలో పాల్గొన్నాడు మద్య ప్రాచ్యము లో టర్కీపై సాగించిన  సైనిక దాడులలో బ్రిటిష్ సైన్యం పెద్దగా విజయాలు సాదించలేదు మొదట్లో సూయజ్ కాలువపై టర్కీ సైన్యం అక్రమణను నిలువరించిన, సినాయి ప్రాంతం లోని గాజా  వద్ద నుండి వారి సైన్యాలు ముందుకు సాగలేదు.
ఇంకొక వైపు 1916 లో హెజాజ్ ప్రాంతం లో  ప్రారంభమయిన అరబ్ విప్లవం మొదట్లే బాగానే సాగింది. అరబ్ విప్లవ దళాలు మెక్కా,జీడ్డ,టైఫ్ ప్రాంతాలను ఆక్రమించినవి మదీనా ఆక్రమణ లో విఫలం చెందినవి, లారెన్స్ హెజాజ్ పాలకుడైన షరిఫ్ హుస్సైన్ కుమారుడు ఫైజల్ కు సహాయకునిగా,బ్రిటిష్ సైన్యం అరబ్ విప్లకారులకు మద్య సంధానకర్తగా  బ్రిటిష్ సైన్యం చే పంపబడినాడు. లారెన్స్ గొప్ప వ్యూహ కర్త, గెరిల్లా యుద్ద నిపుణుడు. ఇతని ఆద్వర్యంలోని చిన్న చిన్న అరబ్ గెరిల్లా దళాలు టర్కీ దళాలపై గెరిల్లా దాడులు చేస్తూ వారి సమాచార-ప్రసార, సప్లయి మార్గాలను నష్టపరిచినవి.  1917 లో అరబ్ దళాలు ఎర్ర సముద్ర తీరం లోని ముఖ్యమైన రేవు పట్టణం ఐనా ఆకాబా స్వాదినం చేసుకొన్నాయి. 1917 లో బ్రిటిష్ సైన్యాలు జెరుసలెం ఆక్రమించినాయి. 1918 లో బ్రిటిష్ సైన్యాలు టఫల వద్ద టర్కీ దళాలను పెద్ద ఎత్తున నాశనము చేసినవి. డీరా రైల్వే గెంక్షన్ వద్ద టర్కీ సైన్యము పై బ్రిటిష్ వారి  ఆక్రమణ జరిగింది .1918 లో టర్కీ పాలన నుండి దామాస్కస్ పతనం చెందినది. అరబ్ విప్లవ నాయకుడు ఫైజల్ దామాస్కస్ ప్రవేశించినాడు. వీటన్నింటిలోనూ లారెన్స్ పాల్గొన్నాడు.
మొదటి ప్రపంచ యుద్దనంతరము టర్కీ పాలన నుండి విముక్తి పొందిన  అరబ్బుప్రాంతాలలో అరబ్బుల  స్వయం పాలన ఏర్పరచటానికి లారెన్స్ తీవ్రంగా కృషి చేసినాడు. మెదటి ప్రపంచ యుద్ధానంతరము జరిగిన ప్యారిస్ శాంతి చర్చలలో పాల్గొన్నాడు. కానీ తన ప్రయత్నం లో లారెన్స్ విఫలం చెందినాడు ఎందుకనగా ప్యారిస్ శాంతి చర్చలు ప్రారంభం కాక ముందే బ్రిటన్-ఫ్రాన్స్ లు టర్కీ ఆధీనం లోని అరబ్ ప్రాంతాలపై ఒక అంగీకారానికి వచ్చినాయి. తన ఆశ నెరవేరనప్పటికి లారెన్స్ అరబ్ ప్రాంతం లో ఒక హీరో గా, అరబ్బుల ప్రియస్నేహితునిగా, అరబ్ జానపద కథలలో నాయకునిగా,  అరబ్బుల గుండెలలో చిరస్మరణీయుడు అయినాడు.
లారెన్స్ అరబ్ జాతీయ వస్త్రధారణ యందు ఆసక్తి చూపేవాడు. అరబ్బువిప్లవకారులతో భుజం భుజం కలిపి టర్కీ సైన్యం పై ఆక్రమణ జరిపేవాడు. ఎడారి యుద్ద వీరులగు బెడోయిన్ తెగ వారివలె ఒంటెను అదిష్టించి, వారితో పాటు నివసిస్తూ, భూజీస్తూ వారి ప్రేమాభిమానాలను పొందిన   జీవనం గడిపెవాడు.
నాకు పరిచయమున్న మానవులందరిలోనూ అల్-అరున్స్ గొప్ప రాజకుమారుడు” అని అతనితో పాటు యుద్దం లో పాల్గొన్న ఒక అరబ్ షేఖ్ అబివర్ణించినాడు
మక్కా ప్రభువు (షరిఫ్ఫ్ ఆఫ్ మెక్కా) లారెన్స్ ను తన కన్నకొడుకుగా పేర్కొన్నాడు. సాహసవంతునిగా,ఉత్తేజవంతుడైన మర్యాదస్తునిగా కీర్తించినాడు.
1920-30 మద్య లారెన్స్ ఆర్‌ఏ‌ఎఫ్,టాంక్ కార్ప్స్ లో మారు పేరులతో పనిచేసినాడు. అతడు రచించిన “ది సెవెన్ పిల్లర్స్ ఆఫ్ విస్డమ్” పుస్తకము  బాగా ప్రచారం పొందినది. అమిత వేగం తో మోటార్ సైకిల్ నడపటానికి ఇష్టపడే లారెన్స్ 1935 లో మోటార్ సైకిల్ ప్రమాదం లో మరణించినాడు. అరబ్బులు తమ ప్రియ  మిత్రుడు “లారెన్స్ ఆఫ్ అరేబియా” “అల్-అరున్స్” ను కోల్పోయినారు.  




No comments:

Post a Comment