22 May 2018

రమదాన్ అంటే ఏమిటి?



-
ముస్లింల కోసం, రమదాన్ అనేది  ప్రార్థన, దివ్య ఖురాన్ పఠనం, ఆత్మశోధన మరియు సూర్యకాంతి సమయంలో ఉపవాసం కోసం అంకితమైన పవిత్ర నెల. కానీ ఉపవాసం(సామ్  అనే అరబిక్  పదం) అనేది కేవలం ఆహారం లేదా పానీయం నుండి దూరంగా ఉండటం మాత్రమే సూచిoచదు. ఉపవాసం ఆహారం, పానీయం, లైంగిక సంబంధం మరియు స్వీయ శుద్ధీకరణ,  అన్ని చెడు ఆలోచనలు మరియు పనులు నుండి దూరంగా ఉండుటను సూచిస్తుంది. రమదాన్ మాసం లో ముస్లింలు ప్రతి దినం సహరి తో ఉపవాసం ప్రారంభించి ఇఫ్తార్ తో అంతం చేస్తారు.  

రంజాన్ యొక్క మతపరమైన ప్రాముఖ్యత
రమదాన్ ఇస్లాం లో అత్యంత పవిత్ర నెలగా భావిస్తారు మరియు దివ్య  ఖురాన్ అవతరించిన నెల. ఈ నెలలో, స్వర్గానికి ద్వారాలు తెరువబడుతాయి మరియు నరకానికి గేట్లు మూతబడుతాయి. దివ్య ఖుర్ఆన్ రెండవ మరియు సుదీర్ఘమైన అధ్యాయమైన సూరత్ అల్ బఖరహ్ లో ఉపవాసం పాటించమని  ముస్లింలకు/విశ్వాసులకు  ఆదేశం కలదు.
  
ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలా?
సాంకేతికంగా, అoదరు  "ఆరోగ్యకరమైన" ముస్లింలకు  ఉపవాసం తప్పనిసరి.  కానీ మినహాయింపులు కూడా  ఉన్నాయి. పిల్లలు, వృద్ధులు మరియు గర్భవతి, ప్రసవం జరిగిన తరువాత (post natal), పాలు ఇచ్చే లేదా రుతుమతి అయిన మహిళలు (breastfeeding or menstruating women) మినహాయించబడ్డారు, ప్రయాణికులు లేదా భౌతికంగా లేదా మానసికంగా బాధపడుతున్న వ్యక్తులు ఉపవాసం నుండి మినహాయించబడ్డారు. ఉపవాసం లేనివారు తరువాతి రోజున ఉపవాసం ఉండుట ద్వారా దానిని భర్తీ చేయవచ్చు లేదా అవసరం ఉన్న వ్యక్తికి ఆహరం తినపించవచ్చు.

ఉపవాసం యొక్క నియమాలు
విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయిoపబడినది. దీనివల్ల మీలో తఖ్వా/దైవభీతి  జనించే అవకాసం ఉంది.  " [సూరత్ అల్ బఖరహ్,  183]

ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు, "ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసం ఉంచి  మరియు అతని బహుమానములు కోరుతూ రమదాన్ నెలలో ఉపవాసం పాటిస్తారో , వారి గత పాపములు క్షమించబడతాయి." –(ఇమామ్ బుఖారీ, ముస్లిం)

రమదాన్ నెలలో  ఉపవాసం ఇస్లాం యొక్క ప్రధాన మూల విశ్వాసాలలో ఒకటి. ప్రతి  ఆరోగ్యవంతులైన ముస్లింల మీద ఇది విధిగా ఉంది మరియు ఉపవాసం సమయంలో ప్రయాణించ రాదు.   స్త్రీలు, వారు రుతుమతి అయిన లేదా శిశుజననం తర్వాత రక్తస్రావం కలిగి ఉంటే వారు ఉపవాసం పాటించనవసరం లేదు..

ఉపవాసానికి సంభందించిన ముఖ్య అంశాలు:
ఉపవాసం లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి.

అవి 1.ఉద్దేశం: రమదాన్ నెలలో ఉపవాసం ఉండాలి అనే  ఉద్దేశ్యం కలిగి  ఉండాలి. దీనిని బయట ప్రకటించవలసిన అవసరం లేదు, వాస్తవానికి ఇది నాలుకతో సంబంధం లేని హృదయ చర్య. అల్లాహ్ పట్ల విధేయత ఉపవాసం పాటించటానికి తోడ్పడుతుంది.

రెండో ముఖ్యమైన అంశం ఉపవాసాన్ని భంగపరిచే చర్యలనుండి దూరంగా ఉండటం: సూర్యోదయం  నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని భంగపరిచే చర్యల నుండి మీరు దూరంగా ఉండవలె .

ఉపవాస సమయంలో పై రెండు ముఖ్యమైన అంశాలను మీరు పాటించినట్లయితే, మీ ఉపవాసం చెల్లుబాటు అవుతుంది.


ఉపవాసాన్ని రద్దు చేసే చర్యలు:

·        భోజన లేదా తాగుడు ఉద్దేశ్యo కలుగుట
·        ఎవరైనా మరచిపోవటం వలన, తప్పు లేదా బలహీనత వలన తింటాడు లేదా త్రాగితే, అతని ఉపవాసం చెల్లుతుంది మరియు ఉపవాసం కొనసాగుతుంది. ఏ కారణం అయినా మీరు తినడానికి లేదా త్రాగడానికి ఎంచుకుంటే, మీ ఉపవాసం చెల్లనిది అవుతుంది.
·        కావాలని వాంతి చేసుకోవటం: ఒకవేళ వాంతి అనుకోకుండా అయితే  ఉపవాసం కొనసాగించాలి. ఉద్దేశ పూర్వకంగా, వాంతి చేసుకొంటే, అప్పుడు అతని ఉపవాసం  చెల్లనిది అవుతుంది.
·        ఉద్దేశపూర్వక లైంగిక సంభోగం: ఒకరు ఉపవాస సమయం లో  లైంగిక సంభోగం చేస్తే, అతడు తప్పక కఫారా/ ప్రాయశ్చిత్తం చేయాలి. (అరవై రోజులు నిరంతరం ఉపవాసం లేదా అరవై మంది పేద ప్రజలకు ఆహారం ఇవ్వాలి).
·        రుతుమతి  లేదా శిశుజననం తో  రక్తస్రావం: రుతుమతి అయిన లేదా శిశుజననం తరువాత రక్తస్రావం జరుగుతున్న,  అలాంటి రక్తస్రావం సూర్యాస్తమయం కావడానికి ముందే ప్రారంభమైతే, ఆ రోజు ఉపవాసం చెల్లదు మరియు ఆ తర్వాత ఉపవాసం ఉండాలి.

పైన పేర్కొన్న అన్ని చర్యలు అన్ని విద్వాంసులు అంగీకరించారు. ఏదేమైనా, పైన పేర్కొనబడని కొన్ని ఇతర చర్యలు కూడా అంగీకరించబడవు.

ఉపవాసంలో అనుమతించబడే  చర్యలు

ఉపవాసం చేస్తున్నప్పుడు అనుమతించదగిన కొన్ని చర్యలు ఉన్నాయి, అవి ఉపవాసంను రద్దు చేయవు.
  
ఉదాహరణకి:

·        స్నానం చేయడం: దాహం కారణంగా లేదా శరీరం ఎక్కువ వేడెక్కినట్లయితే.

·        నోరు మరియు ముక్కును శుభ్రపరచడం: నోటి మరియు ముక్కును శుభ్రం చేయడానికి అనుమతించబడిoది; కాని జాగ్రతగా ఉండాలి, చాలా ఎక్కువ నీరు వాడడం వల్ల అది  నీళ్ళు మింగడానికి కారణం కావచ్చు అప్పుడు అది మీ ఉపవాసాన్ని భంగపరుస్తుంది.  చెల్లుబాటుకాదు.
·        ఐ-లైనర్ లేదా కంటి చుక్కల వాడకం: కాటుక లేదా కంటి చుక్కల వాడకం  అనుమతించబడింది.

·        సూది మందులు తీసుకోవడం: పోషకాహార లేదా వైద్య అవసరాల కోసం సూది మందులను తీసుకోవటానికి అనుమతించ బడింది.

·        సుపోజిటరీలను తీసుకొవటం: అదేవిధంగా, ఎనీమా తీసుకోవటానికి అనుమతి ఉంది. చికిత్సా ప్రయోజనాల కోసం ఔషధంను వ్యక్తిగత ప్రేవేట్ (ముందు లేదా వెనుక) భాగాలలో  వాడవచ్చు

·        అనుకోకుండా  వినియోగం: మీరు అనుకోకుండా ఏదైనా తింటే మీ ఉపవాసం చెల్లకుండా పోదు. ఉదాహరణకు, అనుకోకుండా మీ లాలాజలమును మ్రింగుట లేదా అనుకోకుండా మీ నోటిలోకి ప్రవేశించిన దుమ్ము లేదా శ్వేత పిండిని మింగుట

·        నాలుకతో ఆహారం రుచి చూడటం: మీరు మీ నాలుకతో ఆహారాన్ని రుచి
చూసిన  లేదా టూత్పేస్ట్ లేదా మౌత్ వాష్తో వాడిన ఏమీ మింగాక పోతే మీ ఉపవాసం చెల్లుతుంది.
·        వివిధ సువాసనలను   వాసన చూడుట

·        జీవిత భాగస్వామిని ముద్దుపెట్టుట లేదా, ఆలింగనం చేసుకోనుట:ఒక వ్యక్తి తనను తాను  నియంత్రించుకోగలిగినంత కాలం తన భార్యను ముద్దు పెట్టుకోవటానికి మరియు ఆలింగనం చేసుకోవడానికి అనుమతి ఉంది.

·        రక్తం గీయడం: ఏ కారణం అయినా రక్తం గీయడానికి కూడా అనుమతి ఉంది. రక్తం తీయటం  వ్యక్తిని బలహీనపరుస్తుంటే, ఇది ఇష్టపడని చర్యగా పరిగణించబడుతుంది.

·        జనాబా( janaabah) దశ  లో ఉండటం: ఫజర్ అయిన తరువాత జనాబా దశ లో మీమ్ములను  కనుగొంటే మీ ఉపవాసం చెల్లుతుంది. ఘుసుల్  (పూర్తి స్నానం) ఫజర్ లో చేయవచ్చు.  

ఎవరిని  ఉపవాసం నుండి మినహాయించాలి?

·        రమదాన్ నెలలో ఉపవాస విరమణ కు కొన్ని నియమాలు ఉన్నాయి. కాని  ఉపవాసం మరుసటి   రోజున ఉపవాసం ఉండాలి. అనారోగ్యం లేదా ప్రయాణిస్తున్న వ్యక్తి కోసం ఇది నియమం.

·        ప్రసవానంతర రక్తస్రావం ఎదుర్కొంటున్న లేదా రుతువు(periods) సమయం  లో ఉన్న స్త్రీలు వారి రక్తస్రావం ముగుసే వరకు ఉపవాసం పాటించరు. వారు తరువాతి రోజున వారు ఉపవాసం కోల్పోయిన రోజులను పూర్తి చేయాలి.

·        శాశ్వత అనారోగ్యం లేదా వృద్ధాప్యం వలన ఉపవాసం పాటించని వారికి, వారు ఉపవాసం తప్పిపోయినందుకు ఫిదియా fidiya (ఒక పేద వ్యక్తికి తినిపించాలి.) చెల్లించాలి.

·        గర్భిణీ మరియు నర్సింగ్ మహిళలు, ఉపవాసము వారిని లేదా వారి బిడ్డను బలహీనపరుస్తుందని భయపడుతుంటారు వారు  ఉపవాసం ఉండనవసరం లేదు.  కాని రమదాన్ ముగిసిన తరువాత, వారు రమదాన్లో తప్పిపోయిన ఉపవాసం అన్ని రోజులు ఉపవాసం ఉండాలి లేదా fidiyah (ఒక పేద వ్యక్తికి  తినిపించుట)పాటించాలి.

 
·        హనాఫీ న్యాయ సూత్రాల ప్రకారం, అటువంటి స్త్రీలు తప్పిపోయిన రోజులు ఉపవాసము చేయటానికి మాత్రమే అర్హులు మరియు వారు తప్పిపోయిన రోజులకు, రోజు ఒక పేద వ్యక్తికి ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. 

·         ఇమాం అహ్మద్ మరియు యాష్-షాఫీ ఇలాంటి మహిళలు శిశువు కోసం మాత్రమే భయపడుతుంటే, వారు ఫిదియా fidiyah చెల్లించాల్సి ఉంది  మరియు తప్పిపొయిన రోజులను తరువాత పూర్తి చేయాలి.   వారు తమ కోసం లేదా లేదా తమకోసం మరియు శిశువు కోసం మాత్రమే భయపడుతుంటే, అప్పుడు వారు తప్పిపోయిన రోజులను తరువాత తేదీలలో మాత్రమే పూర్తి చేస్తారు.

రమదాన్లో సిఫార్సు చేయబడిన చర్యలు:

సిఫారసు చేయబడిన కొన్ని చర్యలు ఉన్నాయి, మరియు మీరు వాటిని పాటిస్తే, అల్లాహ్ నుండి మరిన్ని బహుమతులు పొందుతారు:
·        సుహూర్ (సూర్యోదయం ముందటి  భోజనం) కలిగి మరియు దానిని ఫజర్ ముందు వరకు చేయకుండుట.

·        సూర్యాస్తమయ సమయం లో ఉపవాసo తొందరగా ముగించడం  
·        ఇంకొక సిఫార్సు చేయబడిన చర్య ఏమిటంటే తాజా లేదా పొడి ఖర్జురాలను తినడం ద్వారా ఉపసంహరించుకోవడం మరియు అవి అందుబాటులో లేనట్లయితే, త్రాగే నీరు తో ఉపవాసం ను భంగ పరచడం. 

·        ప్రవక్త(స) ఉపవాసం విరమించేటప్పుడు "దాహం పోయింది, సిరలు తేమగా ఉన్నాయి  మరియు అల్లాహ్ ఇచ్చే , బహుమతి ధృవీకరించబడింది" అనే వారు.

·        మరొక సిఫార్సు చర్య ఇషా తర్వాత  ప్రతిరోజూ తరావి ప్రార్థన చేయటం

·        మరింత పురస్కారాలను పొందడానికి, రమదాన్లో దివ్య ఖుర్ఆన్ పఠనం మరియు అధ్యయనం పెరగాలి. ఈ సమయంలోనే  దివ్య ఖుర్ఆన్ యొక్క అవతరణ  మొదలైంది మరియు ఈ నెలలో ప్రవక్త(స) దైవ దూత గాబ్రియేల్ తో దివ్య ఖుర్ఆన్ ను సమీక్షించేవారు. 

·        అలాగే మిస్వాక్ (దంతాల శుభ్రపరచడానికి) ఉపయోగించి  బహుమతులు పొందవచ్చు. మిస్వాక్ అందుబాటులో లేకపోతే, నోరు శుభ్రం చేయడానికి ఏ ఇతర శుభ్రపరిచే సాధనం అయిన సరిపోతుంది.


రమదాన్ లో మమ్ములను శక్తివంతులుని చేయమని,  మా ఉపవాస దీక్షలను అంగీకరించమని, మనకు క్షమాపణ మరియు జన్నత్  లో  స్థానం కల్పించమని  అల్లాహ్ ను ప్రార్ధిoచుదాము. అమీన్.




No comments:

Post a Comment