23 April 2024

ముస్లింలకు ఇతరుల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా? డేటా ఏమి చెబుతుంది. Do Muslims have more children than others? Here’s what available data show

 



రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రజల సంపదను "చొరబాటుదారులకు" మరియు "ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి" పంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రధాని శ్రీ మోడీ ప్రస్తావన ముస్లింల గురించి.

మత సమూహాలకు సంబంధించిన జనాభా గణన డేటా 13 సంవత్సరాల పాతది.  మత సమూహాల గురించి నవీకరించబడిన గణాంకాలు అందుబాటులో లేవు. కొన్ని సంబంధిత డేటా పాయింట్లు క్రింది విధంగా ఉన్నాయి:

 

భారతదేశ ముస్లిం జనాభా పెరుగుదల

2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింల జనాభా 17.22 కోట్లు, అది భారతదేశ జనాభా 121.08 కోట్లలో 14.2%గా ఉంది.

2001జనాభా లెక్కల ప్రకారం  ముస్లింల జనాభా 13.81 కోట్లు, అది 2001 భారతదేశ జనాభాలో 13.43% (102.8 కోట్లు)గా ఉంది..

2001 మరియు 2011 మధ్య కాలంలో ముస్లింల జనాభా 24.69% పెరిగింది. ఇది భారతదేశ ముస్లింల జనాభాలో అతి నెమ్మదిగా పెరుగుదల.

1991 మరియు 2001 మధ్య, భారతదేశ ముస్లిం జనాభా 29.49% పెరిగింది

 

Ø మత సమూహాల మధ్య సగటు గృహ పరిమాణం


నేషనల్ శాంపిల్ సర్వే 68వ రౌండ్ (జూలై 2011-జూన్ 2012) నుండి వచ్చిన డేటా ప్రకారం, ప్రధాన మత సమూహాల సగటు గృహ పరిమాణం క్రింది విధంగా ఉంది

 మతం

గృహ పరిమాణం

హిందూ

4.3

 ఇస్లాం

5

క్రైస్తవం

3.9

సిక్కు

4.7

ఇతరులు

4.1

మొత్తం

4.3

మూలం: భారతదేశంలోని ప్రధాన మత సమూహాలలో ఉపాధి మరియు నిరుద్యోగ పరిస్థితి, NSS 68వ రౌండ్

 

Ø లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో, ముస్లింలలో నిరుద్యోగ నిష్పత్తి

 

ముస్లింలకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (LFPR) మరియు వర్కర్ పాపులేషన్ రేషియో (WPR) అన్ని మత సమూహాలలో కన్నా ముస్లిములలో అత్యల్పంగా ఉంది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) ప్రకారం LFPR మరియు WPR పడిపోతున్న ఏకైక మత సమూహం ఇస్లాం. ముస్లింలలో నిరుద్యోగిత రేటు (UR) అఖిల భారత సంఖ్య కంటే తక్కువగా ఉంది.

 

LFPR అనేది జనాభాలో శ్రామిక శక్తిలో ఉన్న వ్యక్తుల శాతంగా నిర్వచించబడింది (అంటే పని చేయడం లేదా పని కోసం వెతకడం లేదా అందుబాటులో ఉండటం).

WPR జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతంగా నిర్వచించబడింది.

UR అనేది కార్మిక శక్తిలో ఉన్న వ్యక్తులలో నిరుద్యోగుల శాతం.

 

 

 

ఆల్ ఇండియా మగ

All India Male

ఆల్ ఇండియా ఫిమేల్ All India Female

ఆల్ ఇండియా పర్సన్ All India Person

ముస్లిం మగ Muslim Male

ముస్లిం ఆడ Muslim Female

ముస్లిం పర్సన్

Muslim Person

లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ Labour Force Participation Rate

58.1

30.5

44.5

47.7

14.2

32.5

కార్మికుల జనాభా నిష్పత్తి Worker Population Ratio

56.1

29.6

43.1

46.6

13.8

31.7

నిరుద్యోగిత రేటు Unemployment rate

3.4

2.8

3.2

2.3

2.6

2.4

మూలం: వార్షిక నివేదిక, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) జూలై 2022-జూన్ 2023

 

 

 

 

మూలం: ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్

.

 

 

 

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ నైమా ఖాతూన్ Naima Khatoon becomes first woman to head AMU

 

ముస్లిం మహిళా సాధికారికత: 

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్  గా  ప్రొ. నైమా ఖాతూన్ నియమించబడినారు.  103 ఏళ్ల చరిత్ర అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి ఒక మహిళ వైస్ ఛాన్సలర్ అవడం ఇదే తొలిసారి.

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సోమవారం రాత్రి ప్రొఫెసర్ నైమా ఖాతూన్ గుల్రిజ్ నియామక ఉత్తర్వులపై సంతకం చేశారు.

యూనివర్శిటీ కొత్త వైస్ ఛాన్సలర్‌ను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రొఫెసర్ నైమా ఖాతూన్ పేరును ఎంపిక చేసింది.

ఇంతకు ముందు ప్రొఫెసర్ నజ్మా అక్తర్ జామియా మిలియా ఇస్లామియాలో మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ అయ్యారు.

JNUకి కూడా మహిళా VC నేతృత్వం వహిస్తున్నారు

"ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ నైమా ఖాతూన్ ఐదేళ్లపాటు AMU వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యారు" అని అధికారిక నోటిఫికేషన్ తెలిపింది.

AMU 1920లో స్థాపించబడింది. దీని మొదటి ఛాన్సలర్ లేడీ బేగం సుల్తాన్ జహాన్ కాగా, మొదటి వైస్-ఛాన్సలర్ మహమూదాబాద్‌కు చెందిన రాజా ముహమ్మద్ అలీ ముహమ్మద్ ఖాన్.

నైమా ఖాతూన్ AMU సైకాలజీ మరియు ఎడ్యుకేషనల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. నైమా ఖాతూన్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా మరియు సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కెరీర్ ప్లానింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రొఫెసర్ నైమా ఖాతూన్ ఒడిశాకు చెందినది.ప్రొఫెసర్ నైమా ఖాతూన్ 1981లో AMU నుండి బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. నైమా ఖాతూన్ BA, సైకాలజీ (ఆనర్స్) పరీక్షలో మెరిట్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

ప్రొఫెసర్ నైమా ఖాతూన్ 1988 నుండి AMUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధిస్తున్నప్పుడు 'ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ పొలిటికల్ సెగ్రిగేషన్ అండ్ సోషియో-సైకలాజికల్ కోరిలేషన్స్ ఇన్ హిందూ అండ్ ముస్లిం యూత్' అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది.

ప్రొఫెసర్ నైమా ఖాతూన్ AMU  లోని వివిధ హాళ్లకు ప్రొవోస్ట్ మరియు వార్డెన్ మరియు డిప్యూటీ ప్రొక్టర్‌గా పనిచేసిన గణనీయమైన పరిపాలనా అనుభవం ఉంది.

ప్రొఫెసర్ నైమా ఖాతూన్ ‘పే ఈక్విటీ మరియు ఫీజు రేషనలైజేషన్ కమిటీ’ వంటి అనేక ముఖ్యమైన కమిటీలలో కూడా సభ్యురాలు.

1999-2000లో ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండాలో సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో అసోసియేట్ ప్రొఫెసర్/రీడర్‌గా కూడా పనిచేశారు.

ప్రొఫెసర్ నైమా ఖాతూన్ వైస్ ఛాన్సలర్ పదవికి ఎంపికైన తర్వాత మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎలాంటి వివక్ష లేదని, మహిళలకు అనుకూలంగా సానుకూల చర్యలు తీసుకుంటామన్నారు.  

22 April 2024

భారతీయ విప్లవ నాయకుడు చౌదరి ఖలీకుజ్జమాన్ 1889 —1973 కాకోరి విప్లవకారులకు సహాయం చేశాడు Indian revolutionary leader Chaudhary Khaliquzzaman1889 —1973 helped the revolutionaries of Kakori

 

1905 బెంగాల్ విభజన నేపథ్యంలో అనుశీలన్ సమితి లేదా బెంగాల్  విప్లవకారుల  సంస్థ ఉద్భవించింది.. అనుశీలన్ సమితి స్వామి వివేకానంద, బాల గంగాధర తిలక్, అరబిందో ఘోష్ మరియు ఇతర జాతీయవాద ఆలోచనాపరులు మరియు పండితుల నుండి ప్రేరణ పొందింది.

 

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు అనుశీలన్ సమితి బెంగాల్‌కే పరిమితమైంది. ఆ సమయంలో పంజాబ్‌లో గదర్ పార్టీ లేదా వారణాసిలో కొన్ని విపవ సంస్థలు  ఉండేవి...

ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అనుశీలన్ సమితి ని విస్తరించాలని విప్లవకారులు భావించారు. ఇందుకోసం జోగేష్ చంద్ర ఛటర్జీకి బాధ్యతలు అప్పగించి వారణాసికి పంపారు. అప్పటికే క్రియాశీలంగా ఉన్న విప్లవ సంఘాల సహాయంతో జోగేష్ వారణాసి లో  ఒక విప్లవ పార్టీ నిర్మాణానికి పూనుకొన్నారు.

1923లో అనుశీలన్ సమితి చాప్టర్ ను లక్నోలో ప్రారంభించాలని విప్లవకారులు  నిర్ణయించారు. అప్పట్లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకోవడం పట్ల యువత అసంతృప్తితో ఉన్నారు. కొన్ని నెలల తర్వాత విప్లవ సంస్థ అనుశీలన్ సమితి మరియు దాని సభ్యులు పెద్ద హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)ని ఏర్పాటు చేశారు.

లక్నోలోని పార్టీ సానుభూతిపరుల సహాయం కోసం ఢాకాలోని పార్టీ నేతలు  జోగేష్ ను  కోరారు. అందులో జోగేష్ చే  సూచించబడిన అత్యంత ముఖ్యమైన వ్యక్తి, చౌదరి ఖలీకుజ్జామాన్. ఆ సమయంలో చౌదరి ఖలీకుజ్జామాన్ లక్నో మున్సిపల్ బోర్డు ఛైర్మన్ మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు

కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ సమావేశంలో జోగేష్, ఖలీకుజ్జమాన్‌ను గయాలో కలిశారు. ఆ సమయంలో అంశీలన్ సమితి సీనియర్ నాయకులు ఖలీకుజ్జమాన్‌ ను విప్లవ పార్టీ అనుశీలన్ సమితి పూర్తికాల సభ్యునిగా చేరాలని కోరారు. ఖలీకుజ్జమాన్‌ స్వయంగా ఆయుధాలు చేపట్టడం సరికాదని నమ్మాడు, అయితే అంశీలన్ సమితి పార్టీకి భౌతిక మద్దతు పలికారు.

లక్నో మున్సిపల్ బోర్డ్ చైర్మన్ చౌధురి ఖలీఖుజమాన్‌ను జోగేష్ కలిశారు  మరియు ప్రతుల్ గంగూలీ నుండి పరిచయ లేఖ ను అందజేశారు. చౌధురి ఖలీఖుజమాన్‌  కి,  జోగేష్ తన లక్ష్యాలను తెలియజేసి లక్నోలో అంశీలన్ సమితి ఒక యూనిట్‌ని నెలకొల్పాలని కోరాడు. చౌధురి ఖలీఖుజమాన్‌  అంగీకరింఛి  లక్నోలో అంశీలన్ సమితి తరుపున రిక్రూట్ అయిన వారి ఆర్థిక అవసరాలను అందించడానికి తన వంతు సహాయ హస్తాన్ని అందిస్తానని వాగ్దానం చేశారు.

జోగేష్ వారణాసికి తిరిగి వెళ్లి సచింద్ర నాథ్ బక్షిని తనతో పాటు లక్నోకు తీసుకువచ్చాడు. జోగేష్, బక్షిని ఖలీఖుజ్జమాన్‌తో పరిచయం చేసి లాంఛనంగా అంశీలన్ సమితి పార్టీని ప్రారంభించారు. ఖలీఖుజ్జమాన్‌ అంశీలన్ సమితి పార్టీకి ఆర్థికంగా సహాయం చేయడానికి అంగికరించినారు  మరియు జోగేష్‌ కు మున్సిపల్ బోర్డులో ఉద్యోగం ఇచ్చారు.

కొన్ని నెలల తర్వాత, జోగేష్ మరియు బక్షిని కకోరి ట్రైన్ డకోయిటీకి సంబంధించి అరెస్టు చేశారు. కాకోరీ కేసులో విప్లవకారులకు న్యాయవాదులను ఏర్పాటు చేయమని జోగేష్, ఖలీకుజ్జమాన్‌కు సందేశం పంపాడు. ఖలీకుజ్జమాన్‌ ప్రయత్నాల ద్వారానే న్యాయవాదులు హర్కరణ్ నాథ్ మిశ్రా, C. B. గుప్తా మరియు గోవింద్ బల్లభ్ పంత్ విప్లవకారుల తరుపున వాదించడానికి కోర్టుకు హాజరయ్యారు.

ఖలీఖుజ్జమాన్ కోర్టు కార్యకలాపాలను చూసేందుకు వెళ్ళాడు, అక్కడ ఒక CID అధికారి జోగేష్ చంద్ర ఛటర్జీ అనే విప్లవకారుడికి సహాయం చేసినందుకు ఖలీఖుజ్జమాన్ ని ప్రశ్నించారు. ఖలీఖుజ్జమాన్ దానిని నిరాకరించాడు. C.I.D చీఫ్,  జోగేష్‌ చంద్ర ఛటర్జీ కి మున్సిపల్ బోర్డులో పోస్ట్ ఇచ్చారు.' అని ఖలీఖుజ్జమాన్ తో  అన్నాడు. అంతట ఖలీఖుజ్జమాన్ 'నేను చాలా మందికి పోస్ట్‌లు ఇస్తాను' అని బదులిచ్చారు..

పై వివరణ అనుశీలన్ సమితి కేవలం హిందూ పార్టి మాత్రమె కాదు ఖలీకుజ్జామాన్ వంటి ముస్లిం వ్యక్తులు  కూడా రహస్య విప్లవ సంస్థ అనుశీలన్ సమితి కోసం పని చేయగలరు అని తెల్పుతుంది. విప్లవ పార్టీ అనుశీలన్ సమితి యొక్క లౌకిక స్వభావం గురించి  తెలియజేస్తుంది. 

21 April 2024

శ్మశానవాటిక లో కాపరి గా మానవాళికి సేవ చేస్తున్న ఒడిశాకు చెందిన సంసున్ బీబీ Samsun Bibi of Odisha tends to crematorium as service to humanity

 


 

ఒడిశాకు చెందిన సంసున్ బీబీ 2012 నుండి హిందూ శ్మశానవాటిక లో కాపరిగా విధులు నిర్వహిస్తోంది. సంసున్ బీబీ శ్మశాన వాటికను ప్రతిరోజూ శుభ్రపరుస్తుంది మరియు దానిలో 30 వేప చెట్లను నాటింది.

ప్రతిరోజూ, సంసున్ బీబీ తను నాటిన మొక్కలు మరియు 30 వేప చెట్లకు నీరు పోస్తుంది. సంసున్ బీబీ శ్మశానవాటిక గేట్లకు తాళాలు వేసి శ్మశానవాటికలోని లైట్లను ఆన్ చేస్తుంది. సంసున్ బీబీ శ్మశానవాటికలో  ఎటువంటి ద్రవ్య ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకార సేవ అందిస్తుంది.

సంసున్ బీబీ కథనాన్ని గుజరాత్ సమాచార్, మొదట నివేదించింది మరియు ఆమె వీడియో X లో పోస్ట్ చేయబడింది:

కేంద్రపారా మునిసిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాటలలో సంసున్ బీబీ చాలా కాలంగా శ్మశాన వాటికను నిర్వహిస్తున్నారు. ఆమెకు డబ్బు చెల్లించడం లేదు. కొన్నిసార్లు, చనిపోయిన వ్యక్తుల బంధువులు మరియు కుటుంబ సభ్యులు ఆమె సేవ కోసం ఆమెకు డబ్బు చెల్లిస్తారు, ”అన్నారు..

సంసున్ కోవిడ్ సమయాల్లో కూడా, తన విధులను నిజాయితీగా నిర్వహించారు..సంసున్ కు ముగ్గురు కుమార్తెలు మరియు భర్త షేక్ సులైమాన్ దినసరి కూలీ.

2012లో ఒడిశాలోని కేంద్రపారా అనే చిన్న పట్టణంలో షేక్ సులైమాన్ మరియు అతని భార్య సంసున్ బీబీ హిందూ శ్మశానవాటికకు సంరక్షకులుగా బాధ్యతలు చేపట్టారు.

సాంసున్ బీబీ సారథ్యంలో, శ్మశానవాటిక అసంఖ్యాకమైన మొక్కలు మరియు ముప్పై గంభీరమైన వేప చెట్లతో అలంకరించబడిన పచ్చని ఒయాసిస్‌గా వికసించింది.

కేంద్రపార సీనియర్ న్యాయవాది ఉమేష్ చంద్ర సింగ్ మాట్లాడుతూ నేటి సమాజంలో మత సామరస్యం, మత సహనం అరుదైన వస్తువులుగా మారిన తరుణంలో సంసున్ బీబీ ఆశలకు ప్రతీక.

సంసున్ బీబీ సర్వమత సామరస్యం యొక్క శాశ్వత స్ఫూర్తికి సజీవ స్వరూపంగా మారారు. సంసున్ బీబీ అడ్డంకులను అధిగమించే ప్రేమ మరియు కరుణ యొక్క శక్తికి శాశ్వతమైన నిదర్శనం.

ఇంగ్లిష్ క్రికెట్ రూపురేఖలే మార్చిన ఆంధ్రా వ్యక్తి కొడుకు రామన్ సుబ్బ రో Raman Subba Row, son of an Andhra man, changed the face of English cricket

 



ఇటీవ‌లే 92 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన రామ‌న్ సుబ్బ రో, ఇంగ్లండ్‌ టెస్ట్ క్రికెట‌ర్. రామ‌న్ సుబ్బ రో తన విశిష్ట కెరీర్‌లో ఆటగాడిగా మాత్రమే కాకుండా నిర్వాహకుడు మరియు మేనేజర్‌గా కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. రామ‌న్ సుబ్బ రో చొరవ కారణంగా, ఇంగ్లీష్ క్రికెట్ ఆధునిక దృక్పథాన్ని పొందింది.

రామ‌న్ సుబ్బ రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్ర ప్రదేశ్‌లోని బాపట్లకు చెందినవారు. పంగులూరి వెంకట సుబ్బారావు యుకె వెళ్లి అక్కడ స్థిరపడి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టిన రామ‌న్ సుబ్బ రో సర్రే కౌంటీలోని స్ట్రీథమ్ పట్టణంలో పుట్టి అక్కడే పెరిగాడు. UKలో పాఠశాలలో పేరు యొక్క స్పెల్లింగ్ రావ్ నుండి రోగా మారింది మరియు అది అధికారిక౦గా నిల్చినది.  

రామ‌న్ సుబ్బ రో మంచి ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మరియు పార్ట్-టైం బౌలర్‌గా మారాడు. తన సామర్థ్యం మరియు ప్రతిభతో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ జట్టు కి రామ‌న్ సుబ్బ రో ఎంపిక కావడం జరిగింది

1953లో రామ‌న్ సుబ్బ రో నార్తాంప్టన్‌షైర్‌కు మారడానికి ముందు సర్రే కౌంటీ తరపున రెండు సీజన్లు ఆడాడు. 1958లో రామ‌న్ సుబ్బ రో నార్తాంప్టన్‌షైర్‌ కౌంటీకి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు మరియు సర్రేపై ప్రశంసనీయమైన ట్రిపుల్ సెంచరీని చేశాడు.

రామ‌న్ సుబ్బ రో నార్తాంప్టన్‌షైర్‌ తరువాత టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిద్యం వహించాడు.  రామ‌న్ సుబ్బ రో సహచరులలో ఫ్రెడ్ ట్రూమాన్, కోలిన్ కౌడ్రే, పీటర్ మే, కెన్ బారింగ్టన్, బ్రియాన్ స్టాథమ్ మరియు టోనీ లాక్ ఉన్నారు. రామ‌న్ సుబ్బ రో ఇంగ్లండ్ తరపున ఆడిన 13 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు మరియు 1961లో విజ్డెన్ యొక్క క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత క్రికెట్ నుండి రిటైర్ అయాడు

కానీ రామ‌న్ సుబ్బ రో ఇతర మార్గాల్లో క్రికెట్‌తో సంబంధం కొనసాగించాడు. తరువాత సంవత్సరాల్లో, సర్రే ఛైర్మన్‌గా పనిచేశాడు మరియు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డు (TCCB) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు మరియు ICC చేత మ్యాచ్ రిఫరీగా నియమించబడ్డాడు. మ్యాచ్ రిఫరీగా రామ‌న్ సుబ్బ రో 160 మ్యాచ్‌లకు పనిచేసాడు. పర్యవేక్షించాడు.

1981-82లో ఇంగ్లండ్ జట్టు భారతదేశంలో పర్యటించినప్పుడు, రామ‌న్ సుబ్బ రో ఇంగ్లండ్ జట్టు కు మేనేజర్‌గా వచ్చారు. బాపట్ల పర్యటించాడు. బాపట్ల లో ఘనంగా సన్మానించబడ్డాడు. ఇంగ్లిష్ క్రికెట్‌ను మార్చింది

రామన్ సుబ్బ రో ఇంగ్లిష్ క్రికెట్‌ను చాలా రకాలుగా మార్చేశాడు. ప్రస్తుత ECBకి ముందున్న TCCBని ఏర్పాటు చేసిన వ్యక్తులలో రామన్ సుబ్బ రో ఒకడు. ఇంగ్లీషు క్రికెట్‌పై పాత మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కి ఉన్న పట్టును సడలించడానికి రామన్ సుబ్బ రో సహాయం చేశాడు.

ప్రసిద్ధ ఓవల్ మైదానానికి (1971లో ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది) కొత్త జీవితాన్ని అందించడంలో రామన్ సుబ్బ రో ప్రముఖ పాత్ర పోషించాడు. రామన్ సుబ్బ రో 1988లో సేవ్ ది ఓవల్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు మరియు కొత్త స్పాన్సర్‌లను కనుగొని ఓవల్ మైదానానికి ఆర్థిక పరిపుష్టి సంపాదించగలిగాడు.

రామన్ సుబ్బ రో చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచాడు. రామన్ సుబ్బ రో కి భార్య అన్నే, కుమార్తె మిచెల్, కుమారుడు అలిస్టర్, ఎనిమిది మంది మనవరాళ్లు మరియు ఒక మనవడు ఉన్నారు.

కల్నల్ ఇష్రత్ అహ్మద్ Col Ishrat Ahmed

 





నువా,రాజస్థాన్:

కల్నల్ ఇష్రత్ అహ్మద్ భారత ఆర్మీలో మీరట్‌లోని ఆర్డినెన్స్ ఆర్మీ యూనిట్ కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి  ముస్లిం మహిళ.

కల్నల్ ఇష్రత్ కయామ్‌ఖాని ఉన్నత విద్యా స్థాయి కలిగి  సైనిక, పరిపాలన మరియు పోలీసు సేవలలో రాణించిన కమ్‌ఖాయాని ముస్లిం సమాజానికి చెందినవారు.

కల్నల్ ఇష్రత్ అహ్మద్ రాజస్థాన్‌లోని జుంఝును జిల్లాలోని నువా గ్రామంలోని ప్రముఖ ముస్లింకుటుంబానికి చెందినవారు. భారతీయ ముస్లిం సమాజం నుండి ఒక మహిళ ఇంతటి  ఉన్నత స్థానానికి చేరుకోవడం పట్ల గర్వంగా ఉంది.

కల్నల్ ఇష్రాత్ అహ్మద్,  కల్నల్ జాకీ అహ్మద్ కుమార్తె మరియు బ్రిగేడియర్ సాకిబ్ హుస్సేన్ సోదరి. ఐజీపీ లియాఖత్ అలీ ఖాన్ కూడా కల్నల్ ఇష్రాత్ అహ్మద్ కుటుంబం నుంచే వచ్చారు.

కల్నల్ ఇష్రత్ అహ్మద్  కుటుంబం పరిపాలనలో ఉన్నత స్థానాలకు చేరుకున్న అనేక మంది పౌర సేవకులను కలిగి ఉంది.

కమ్‌ఖాయాని బిద్రి సమాజం కల్నల్ ఇష్రత్ అహ్మద్  సాధించిన ఘనత పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినది.  "సమాజం ఇష్రత్ అహ్మద్  కుటుంబాన్ని చూసి గర్విస్తోంది" అన్నది.

 

-అవాజ్ ది వాయిస్ సౌజన్యం తో