30 January 2016

మొదటి ప్రపంచ యుద్ధం లో 885.000 మంది ముస్లిం సైనికులు పోరాడినారు :

సుమారు  8,85,000 మంది ముస్లిం సైనికులు ఒక అధ్యయనం ప్రకారం,మొదటి  ప్రపంచ యుద్ధం లో పోరాడటానికి మిత్రరాజ్యాలచే  నియమించబడినారు.మొదటి ప్రపంచ యుద్ధంలో ముస్లిం సైనికుల  పాత్ర పై జరిగిన  కొత్త పరిశోధన ప్రకారం, మొదటి ప్రపంచ యుద్ధం లో మిత్రరాజ్యాల దళాలకు 8.5 లక్షల మంది ముస్లిం సైనికులు మద్దతు ఇచ్చారు. 
మొదటి ప్రపంచ యుద్ధంలో కనీసం 8,85,000 మంది ముస్లిం సైనికులను మిత్రరాజ్యాలు నియమించినట్లు ఇస్సా ఇస్లాం, బర్మింగ్హామ్ సిటీ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం లో లెక్చరర్,    కనుగొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం లో ముస్లిం సైనికుల ప్రమేయం పై మొట్టమొదటి ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు  ఆయన ఒక పత్రికా ప్రకటన లో తెలిపారు.

గతంలో సుమారుగా 400,000 ముస్లిం సైనికులు  యుద్ధ సమయంలో నియమించబడినట్లు  భావించారు.కానీ ఇస్సా ముస్లిం  యొక్క పరిశోధన ప్రకారం మరియు వ్యక్తిగత ఉత్తరాలు , చారిత్రక ఆర్చీవ్స్, సైనికదళ డైరీలు మరియు జనాభా గణన నివేదికల ద్వారా, ముందు కంటే రెట్టింపు సంఖ్య లో ముస్లిం సైనికులు నియమింప బడినట్లు  తెలిసింది.

మొత్తం 1.5 మిలియన్ భారతీయు సైనికులు మరియు 280,000 అల్జీరియన్స్, మొరాకో మరియు టునీషియా సైనికులు  మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రపక్షాల తరుపున  పోరాడారు అలాగే  ఆఫ్రికాలోని ఇతర భాగాల నుంచి కూడా సైనికులు రిక్రూట్ అయ్యారు అన్న దాంట్లో వాస్తవం ఉంది.
దాదాపు 3.7 మిలియన్ టన్నుల సరఫరా మరియు 1,70,000 కంటే ఎక్కువ జంతువులు యుద్ధ చర్యలకు మద్దతుగా భారతదేశం నుండి రవాణా చేశారు, అని ప్రకటన లో  తెలిపారు.
యుద్ధ ప్రయత్నంలో చేరటానికి  ముస్లింలు  అల్జీరియా, మొరాకో, ట్యునీషియా వంటి ప్రాంతాల నుండి నుండి వచ్చినారు మరియు కనీసం 89,000 ముస్లింలు ఫ్రెంచ్ లేదా బ్రిటీష్ కమాండ్ కింద మిత్రరాజ్యాల దళాల కోసం పోరాటం చేస్తూ  మరణించారు.
యుద్ధం లో వారి పాత్ర ఫ్రంట్ లైన్ సైనికులు, కందకం బిల్డర్ల మరియు కీలక వస్తువులు మరియు పదార్థాలు రవాణా గా ఉంది.

ఇస్సా ప్రకారం   బ్రిటిష్ సామ్రాజ్య సైనిక  నియామకాల లో కనీసం 20 శాతం ముస్లింలు ఉంటారని తేలింది మరియు భారతదేశం నుండి ఆర్ధిక మరియు పదార్ధల  సహకారం దాదాపు 479 మిలియన్ పౌండ్ల అని అది  - నేటి డబ్బు 20 బిలియన్ పౌండ్ల కు సమానం అని అన్నారు.
మాంచెస్టర్ లో ఉన్న బ్రిటిష్ ముస్లిం  హెరిటేజ్ సెంటర్ వద్ద ఉంచిన ఒక ప్రదర్శన కోసం “బలి కథలు” పేరిట యుద్ధం నుండి వ్యక్తిగత కథలు, పరిశోధన సమయంలో ఇస్సాముస్లిం  ఈ  గణాంకాలు కనుగొన్నాడు.

మేము తరచుగా వినే 4,00,000 సంఖ్య భారత సైన్యంలో ముస్లింలను  సూచిస్తుంది కాని అది 4,30,000 వరకు ఉంది అలాగే చాలా మంది ప్రజలు ఒక ముఖ్యమైన అంశం  అరబ్ సహకారం కుడా ఉంది అని  మర్చిపోయారు.Top of Form

"
ఉదాహరణకు, ఈజిప్ట్ ఒక్కటే ఒంటరిగా బ్రిటీష్ శిబిరాల లో  కనీసం 1,50,000 ఒంటె డ్రైవర్లు ను పంపి యుద్ధం లో దోహదపడింది, మరియు ఇతర ఆఫ్రికన్ ఉత్తర దేశాల నుండి   కనీసం 2,80,000 పురుషులు  ఫ్రెంచ్ దళాలకు సహాయపడినారు.
 “సంఖ్యలు తక్కువుగా అంచనా వేసినారు అని అనుకోoటునాను. అవి తక్కువలో తక్కువ అని  అనుకుంటున్నానుఅవి కొంచెం అధికంగా ఉండవచ్చు.” అని ఈసా ఇస్లాం అన్నారు.
బలిదానపు స్టోరీస్ ఒక 'శాశ్వత' ప్రదర్శన గా కనీసం ఒక సంవత్సరం పాటు  కార్యక్రమం గా ఉంటుంది.



No comments:

Post a Comment