ఈ సంవత్సరం పద్మ అవార్డు గ్రహీతలలో మౌలానా వాహిద్దీద్దీన్ ఖాన్ ముఖ్యులు. వీరికి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం “ పద్మ విభూషణ్” లభించినది. మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ ఇంతకు ముందు 2000 లో పద్మ భూషణ్ మరియు 2009 లో “రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన సమ్మాన్” పొందారు. భారత జాతీయ జనజీవితం లో అయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం “పద్మ
విభూషణ్” బిరుదు తో ఆయనను సత్కరించినది.
ఒక ముస్లిం మంచి సమాజాన్ని సుసంపన్నం చేసే మంచి పౌరుడిగా ప్రవర్తిoచవలయును. సేవ, దాతృత్వం, శాంతి మరియు స్నేహం ద్వారా. మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ ఇస్లామిక్ సార్వత్రిక మానవ విలువలను వెలుగులోనికి తెచ్చారు,
ఇస్లాం అనగా శాంతి అని అర్ధం – ప్రతి ముస్లిం దైవిక సంకల్పానికి తన్ను తానూ సంపూర్ణంగా సమర్పించుకొని లౌకిక ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి కృషి చేయవలె, ముస్లింల వ్యక్తిగత మరియు సామూహిక ప్రవర్తన. శాంతియుతంగా ఉండవలె. ఇతర మతాలతో శాంతియుత సహజీవనం చేయగల ఇస్లాం ను మౌలానా వాహిద్దీద్దీన్ ఖాన్ ప్రచారం చేసినారు
శాంతి భావజాలం:
శాంతి భావజాలాన్ని ముస్లింలలో ప్రబోదించే సాంప్రదాయ పండితులలో మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ ఒకరు. ఇస్లాంను శాంతి యొక్క పూర్తి భావజాలంగా చూపించాలనే లక్ష్యంతో మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ న్యూ డిల్లి లో సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిట్యువాలిటిCentre for Peace
and Spiritualityను నడుపుతున్నారు. మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ “శాంతి యొక్క ప్రవక్త, ది ఏజ్ ఆఫ్ పీస్ మరియు ఇస్లాం మరియు ప్రపంచ శాంతి” వంటి పుస్తకాలను The Prophet of Peace, The Age of Peace, and Islam
and World Peace. రచించినారు..
ముహమ్మద్ ప్రవక్త (స)
జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం హుదైబియా ఒప్పందం (CE 628). తన మక్కన్ విరోధులతో ఎడతెగని యుద్ధానికి ముగింపు పలకడానికి, ప్రవక్త(స) వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది వారి అనుచరులకు ఇష్టం లేదు కానీ ప్రవక్త (స) శాంతిని నెలకొల్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ చర్య సత్పలితాలను తెచ్చింది మరియు శాంతిని నెలకొల్పింది.
త్వరలోనే ప్రవక్త (స) ప్రముఖ విరోధులు చాలా మంది ప్రవక్త(స)వైపుకు మరలారు మరియు కొన్ని సంవత్సరాల తరువాత, దివ్య ఖురాన్ లో ఫతాహ్ ముబిన్ (మానిఫెస్ట్ విజయం) గా పిలిచే మక్కా విజయం
సాధ్యమైనది.
మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ దివ్య ఖురాన్ లోని 41:34వ ఆయత్:“ప్రవక్తా!మంచీ మరియు చెడు ఒకటి కాదు. నీవు చెడును శ్రేష్టమైన మంచి
ద్వారా తొలగించు. అప్పుడు నీపట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడై
పోవటాన్ని నీవు గమనిస్తావు.” అందు నమ్మకం ఉంచారు.ఇస్లాం ధర్మం యొక్క రాజకీయ భావజాలం గా పై ఆయత్ ను
వివరించవచ్చు. మరియు మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ ఇస్లాం యొక్క పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ The Political
Interpretation of Islam లో దానిని చక్కగా వివరించారు..
సలహా మాటలు Words of counsel:
మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ బాధితుల వేదన సిండ్రోమ్ ఆందోళన మరియు హింస రాజకీయాలకు మూలమని గుర్తించాడు. తన పుస్తకం “ఇండియన్ ముస్లింలు: ది నీడ్ ఫర్ ఎ పాజిటివ్ అవుట్ లుక్” లో ముస్లింల ఆందోళన మరియు ఘర్షణకు వ్యతిరేకంగా వాదించాడు. మౌలానా తన తోటి ముస్లింలకు నైతిక అభ్యున్నతి మరియు సామాజిక-ఆర్ధిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మరియు స్వదేశీయుల సద్భావనను కోరాలని సలహా ఇచ్చారు.
రాజకీయ భావాలు:
1980 ల మధ్య నుండి మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ ముస్లిం గుర్తింపును దెబ్బతీసే అన్ని వివాదాస్పద సమస్యలపై సాధారణ ముస్లింల భావాలకు బిన్నంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దని మరియు ముస్లింలను హింస, ఉగ్రవాదాన్ని విడిచిపెట్టమని సలహా ఇచ్చారు. ముస్లిం వ్యక్తిగత చట్టానికి సంబంధించిన విషయాలలో సామాజిక సంస్కరణల కోసం చట్టo చేయడానికి కేంద్రానికి ఉన్న అధికార పరిధిని ఆయన పునరుద్ఘాటించారు. మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ సల్మాన్ రష్దీకి వ్యతిరేకంగా ఆయతుల్లా ఖొమేని యొక్క ఫత్వాను కూడా వ్యతిరేకించారు.
అదేవిధంగా బాబ్రీ మసీదుపై ముస్లింలు తమ వాదనను విరమించుకోవాలని సలహా ఇచ్చాడు. అతని భావాలు ఎంతవరకు సఫలం అయ్యాయి అనేదానికి సమకాలిన
చరిత్ర సాక్షం చెబుతుంది.
నేటి ప్లురల్, మల్టీ
కల్చరల్ మరియు లౌకిక ప్రపంచంలో ఇస్లాం ఘర్షణ
లేకుoడా శాంతియుతంగా ఇతర ధర్మాలతో సహజీవనం చేయగలదు అని మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ భావించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దివ్య ఖురాన్ కు చేసిన వ్యాఖ్యానం లో కూడా దీనిని గమనించ
వచ్చు. ఈ ఇద్దరు పండితులు ఇస్లాం యొక్క వ్యాఖ్యాన సంప్రదాయాన్ని సమకాలీన ప్రపంచానికి తగినట్లుగా నవీకరించడానికి ప్రయత్నించారు.
సారాంశం/ముగింపు:
అంతర్లీన ఐక్యత ఇస్లాంను అన్ని ఇతర ధర్మాలతో పెనవేసిందని ఆయన ఆన్నారు. మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ యొక్క ప్రయత్నాలు ఎంతవరకు విజయం పొందుతాయి అనేది
కాలమే నిర్ణయిస్తుంది. చాలా ఆలస్యం కావడానికి ముందే ఇది జరుగుతుందని మాత్రమే ఆశించవచ్చు.
No comments:
Post a Comment