26 July 2024

సమాజ అవసరాల దృష్ట్యా కాలానుగుణంగా మారుతున్న ఉర్దూ లైబ్రరీలు

 


దేశంలో ఉర్దూ భాష యొక్క ప్రస్తుత స్థితి, తరచుగా మాట్లాడే భాషగా మాత్రమే కాకుండా, ముస్లింలతో మాత్రమే అనుబంధించబడిన భాషగా భావించబడుతుంది.  ఉర్దూ చదివే తక్కువ మంది పాఠకుల హాజరు ఉర్దూ లైబ్రరీల స్థితి పై ప్రభావం చూపింది. క్రమేపి ఉర్దూ లైబ్రరీలు పోటీ పరీక్షల పుస్తకాలను అందించడం ప్రారంభించినవి.

దేశంలోని వివిధ ప్రాంతాలలోని ఉర్దూ లైబ్రరీలు చదివే పాఠకుల సంఖ్య క్షీణిస్తున్నందున, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను జోడించడం ద్వారా ప్రస్తుతం అనేక ఉర్దూ లైబ్రరీలు మనుగడ సాగిస్తున్నవి.

1978లో స్థాపించబడిన అలంబజార్ ఉర్దూ లైబ్రరీ ప్రధానంగా రాష్ట్రంలోని ఉర్దూ మాట్లాడే ముస్లిం సమాజం అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయబడినది. సమీపం లోని స్థానిక ఉర్దూ మీడియం హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు అవసరాలను తీర్చడానికి లైబ్రరీ స్థాపించబడింది. అలంబజార్ ఉర్దూ లైబ్రరీ లో పెద్ద సంఖ్య లో ఉర్దూ నవలలు మరియు ఉర్దూ పుస్తకాల యొక్క పెద్ద సేకరణ కలదు.

కాలక్రమేణా muslim మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లుగా అలంబజార్ ఉర్దూ లైబ్రరీ లో పాఠకులను ఆకర్షించేందుకు అకడమిక్ యూనిట్‌ను ఏర్పాటు చేయబడినది.. మెడికల్ మరియు ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం ITI, NEET మరియు ఇతర సారూప్య పరీక్షలతో సహా అనేక రకాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కలవు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు మరియు బ్యాంకులు, రైల్వేలు మరియు ఇతర పరీక్షల కోసం సిద్ధమయ్యే పుస్తకాలను అందించడం జరుగుతుంది.

అక్టోబర్ 1891లో బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి ఖాన్ బహదూర్ ఖుదా బక్ష్ చే ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ, ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించబడింది, ప్రారంభంలో లైబ్రరీ లో 4,000 మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి, వాటిలో 1,400 అతని తండ్రి నుండి వారసత్వంగా పొందబడ్డాయి. భారత ప్రభుత్వం ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీని 1969లో పార్లమెంటరీ చట్టం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించింది.

పాట్నాలో గల, ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ని భారతదేశం మరియు వెలుపల నుండి పండితులు సందర్శించి దాని యొక్క విస్తారమైన మాన్యుస్క్రిప్ట్‌ల సేకరణ-సూఫీ సాహిత్యం, కవిత్వం, పర్షియన్ సాహిత్యం, చరిత్ర మరియు సూక్ష్మ చిత్రాలను అధ్యయనం చేస్తారు. ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ లో మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల పుస్తకాలు 1600 మరియు 1700సవత్సరాల నాటివి కలవు..

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల తయారీపై ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ దృష్టి సారించింది. ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ, మెడికల్ మరియు ఇంజినీరింగ్ రంగాలకు సంబంధించిన పోటీ పరీక్షల మెటీరియల్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది మరియు దీని కోసం ఒక విభాగాన్ని కేటాయించింది. లైబ్రరీలోని  ది కర్జన్ రీడింగ్ రూమ్ ను పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇష్టపడతారు.

రాంపూర్ రజా లైబ్రరీ, 1774లో నవాబ్ ఫైజుల్లా ఖాన్ చే స్థాపించబడినది. నవాబ్ మరియు అతని వారసులు విద్వాంసులు, ఉలేమాలు, కవులు, చిత్రకారులు, కాలిగ్రాఫర్లు మరియు సంగీత విద్వాంసులను ఆదరించారు. . లైబ్రరీలో అరబిక్, పర్షియన్, పాష్టో, సంస్కృతం, ఉర్దూ, హిందీ మరియు టర్కిష్‌తో సహా వివిధ భాషలలో మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి.

ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ మరియు రాంపూర్ రజా లైబ్రరీ రెండూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద కేంద్ర నిధులు పొందుతున్నాయి.

1939లో స్థాపించబడిన, భోపాల్‌లోని ఇక్బాల్ లైబ్రరీ లో పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యువ తరంలో ఉర్దూ పట్ల క్షీణిస్తున్న ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా మరియు  ఉర్దూ పరిరక్షణ కోసం ఇక్బాల్ లైబ్రరీ పనిచేస్తుంది.

ఇక్బాల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ లో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లను అందుబాటులోకి తేవడం జరిగింది. పోటీ పరీక్షలకు సంబంధించి లక్షకు పైగా పుస్తకాలను సేకరించడం ద్వారా ఇక్బాల్ లైబ్రరీ తన పాఠకుల సంఖ్యను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తోంది.

హైదరాబాద్‌లో ఉర్దూను ప్రోత్సహించడానికి ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1930లలో ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ (ఉర్దూ సాహిత్య సంస్థ) డక్కాని సాహిత్యవేత్త మరియు సాహిత్య చరిత్రకారుడు ముహియుద్దీన్ ఖాద్రీ జోరేచే స్థాపించబడింది..  తరువాత దాని వ్యవస్థాపకులు దానిని లైబ్రరీగా మార్చి  కొన్ని కోర్సులను ప్రారంభించారు.  

ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ సంస్థలో చారిత్రక ఉర్దూ వార్తాపత్రికల సేకరణతో పాటు పురాతన ఉర్దూ, అరబిక్ మరియు పర్షియన్ మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి. ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ లైబ్రరీలో అరుదైన ఉర్దూ పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌ల భారీ సేకరణ మరియు డక్కని ఉర్దూ మాన్యుస్క్రిప్ట్‌ల తొలి సేకరణలు  ఉన్నాయి మరియు ఇది దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధకులను ఆకర్షిస్తుంది. రేఖతా ఫౌండేషన్ ద్వారా ఇదారా పుస్తకాలను డిజిటలైజ్ చేయబడినవి.

ఉర్దూ లైబ్రరీలు కొన్ని నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటున్నవి.  ఉన్నాయి. ఉర్దూ లైబ్రరీలను సామాన్య  ప్రజలు సాధారణంగా సందర్శించరు. పరిశోధకులు మరియు పండితులు మాత్రమే ఈ లైబ్రరీలను సందర్శిస్తారు పాఠకుల సంఖ్యను పెంచే సాంకేతికతలు, పోటీ పరీక్షల కోసం చదివే గదులు మరియు పోటీ పరీక్షల గురించి పుస్తకాలు అందుబాటులోనికి తీసుకు రావలసి ఉన్నది. "లైబ్రరీలకు ప్రజలను ఆకర్షించడానికి మరియు పుస్తకాలను అందించడానికి మార్గాలను కనుగొనాలి. ఈ లైబ్రరీలు తమ మౌలిక సదుపాయాలను విస్తరించి  మరియు డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టాలి.

 

 

 

 

.  

No comments:

Post a Comment