అనుభూతి మరియు నొప్పి యొక్క భావం
మెదడుపై ఆధారపడి ఉంటుందని చాలా కాలంగా భావించారు. అయితే చర్మంలో నొప్పి గ్రాహకాలు
ఉన్నాయని ఇటివల కనుగొనబడింది. ఈ నొప్పి గ్రాహకాలు లేకుండా, ఒక వ్యక్తి
నొప్పిని అనుభవించలేడు.
నొప్పిపై దివ్య ఖురాన్ లోని ఈ క్రింది ఆయత్ పరిశీలించండి: “నిశ్చయంగా మా సూచనలను తిరస్కరించిన వారిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు కాలిపోయినప్పుడల్లా, మేము వారి చర్మాలను మార్చి వేరే చర్మాలను సృస్తిస్తాము. వారు ఆ శిక్షను చవిచుస్తూ ఉండేందుకు! నిశ్చయముగా దేవుడు సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు. (దివ్య ఖురాన్ 4:56)
తన సందేశాన్ని తిరస్కరించే వ్యక్తులకు అల్లాహ్ చెబుతాడు, వారు నరకంలో ఉన్నప్పుడు మరియు వారి చర్మాలు కాలిపోయినప్పుడు (అందువల్ల వారు ఎటువంటి నొప్పిని అనుభవించలేరు), అతను వారికి కొత్త చర్మాలను ఇస్తాడు, తద్వారా వారు నొప్పిని అనుభవిస్తూనే ఉంటారు.
నొప్పి చర్మంపై ఆధారపడి ఉంటుందని దివ్య
ఖురాన్ స్పష్టం చేస్తుంది. చర్మంలో నొప్పి గ్రాహకాల యొక్క ఆవిష్కరణ జీవశాస్త్రములో
ఇటీవలి నవీనతమ ఆవిష్కరణ.
No comments:
Post a Comment