30 October 2024

మొఘల్ యువరాణి గుల్బదన్ బేగం(1523-1603) జీవిత విశేషాలు Biography of Mughal princess Gulbadan Begum(1523 -1603)

 

మొఘల్ రాజవంశ స్థాపకుడు చక్రవర్తి బాబర్ యొక్క ప్రియమైన కుమార్తె. మొఘల్ యువరాణి గుల్బాదన్ బేగం (1523 – 1603) ఆరేళ్ల వయసులో, తన మొఘల్ బంధువులతో కలిసి ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నుండి ఆగ్రాకు ఖైబర్ పాస్ మీదగా కష్టతరమైన ప్రయాణం చేసింది. ఆగ్రా లో గుల్బాదన్ బేగం తండ్రి బాబర్  కొత్త రాజధానిని స్థాపించారు..

ఆగ్రాలో, గుల్బాదన్ బేగం తన ప్రియమైన తండ్రి బాబర్ వద్ద కొత్త దేశం హిందూస్థాన్‌లో పెరుగుతుంది. కొంతకాలానికి బాబర్ జీవితం అకస్మాత్తుగా ముగుస్తుంది. బాబర్ అకాల మరణం గుల్బాదన్‌కు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. బాబర్ కుమారుడు వారసుడు అయిన గుల్బాదన్‌ సవతి సోదరుడు హుమాయూన్‌ సింహాసనాన్ని అధిష్టి౦చుతాడు.

పాలన చేపట్టిన హుమాయున్ అనేక తిరుగుబాట్లు ఎదుర్కొంటాడు. బీహార్ ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా సూరి1539లో చౌసాలో మరియు 1540లో కనౌజ్‌లో హుమాయూన్‌ను ఓడించి, హుమాయున్ ను ఆఫ్ఘనిస్తాన్‌ లో ఆశ్రయం పొందేటట్లు చేస్తాడు.. హుమాయున్ తో పాటు కాబూల్‌కు తరలిన గుల్బదన్‌, హుమాయున్ ఆగ్రాను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్లీ హిందుస్థాన్‌కు తిరిగి వస్తుంది.  

భారతదేశం నుండి బహిష్కరించబడిన సంవత్సరాలలో, హుమాయున్ వివాహా౦ హమిదాతో జరుగుతుంది. హుమాయున్ భార్య హమిదా మొఘల్ వారసుడు అక్బర్‌కు జన్మనిస్తుంది మరియు గుల్బాదన్‌కు సన్నిహిత స్నేహితురాలు కూడా అవుతుంది.

అక్బర్ సింహాసనాన్ని అధిష్టి౦చటం గుల్బాదన్ వ్యక్తిగత జీవితంలో మార్పును సూచిస్తుంది. గుల్బాదన్ తన ప్రారంభ జీవితంలో, తోటలు మరియు గుడారాలలో నివసించింది మరియు స్వేచ్ఛగా ప్రయాణించేది. అక్బర్ చక్రవర్తి అయిన తరువాత మొఘల్ స్త్రీలు ఫతేపూర్ సిక్రీలోని అంతఃపురంలోని పరివేష్టిత గృహాలకు పంపబడ్డారు. అక్బర్, చక్రవర్తి మేనత్త గుల్బదన్‌ అంతఃపురంలో సీనియర్ సలహాదారుగా ఎంతో గౌరవించబడినది.

అక్బర్‌ను గుల్బదన్ అంతఃపుర స్త్రీలతో కలిసి మక్కా మరియు మదీనాకు పవిత్ర తీర్థయాత్రకు వెళ్లేందుకు అనుమతించమని అభ్యర్థిస్తుంది. ప్రయాణం. మొదట, మొఘల్ దళం ఓడరేవు నగరమైన సూరత్‌కు చేరుకుంటుంది, అక్కడ వారు షిప్పింగ్ మార్గాలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్న పోర్చుగీస్  వారి అనుమతి తో రెండు మొఘల్ నౌకలు హజ్ తీర్థయాత్రకు బయలుదేరాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మరియు ఎర్ర సముద్రం మీదుగా తీర్థయాత్ర ప్రయాణం జెడ్డా ఓడరేవుకు చేరుకోని అక్కడి నుండి మొదట మక్కాకు తరువాత మదీనాకు చేరుకుంటుంది.

గుల్బదన్ మరియు ఆమె సహచరులు హజ్ పూర్తి చేసిన తర్వాత హిందుస్థాన్‌కు తిరిగి రారు, మదీనా పరిసరాల్లో ఉంటారు. కొంత సమయం తరువాత, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్III గుల్బాదన్ మరియు ఆమె బృందానికి బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తాడు. సముద్రం ద్వారా తిరుగు ప్రయాణంలో, గుల్బదన్ ఓడ ధ్వంసానికి గురవుతుంది, అయితే గుల్బదన్ ప్రాణాలతో బయటపడి ఏడెన్‌లో ఆశ్రయం పొందుతుంది.

హాజీ లేదా ఇస్లామిక్ విశ్వాసం యొక్క మూలస్తంభాలలో ఒకటైన ప్రవక్త జన్మస్థలానికి తీర్థయాత్ర చేసిన వ్యక్తిగా పురుషులు మరియు స్త్రీలు  గౌరవించేలా గుల్బదన్ గౌరవం పొందినది. ఫతేపూర్ సిక్రీలో స్థిరపడిన తర్వాత, గుల్బదన్ ను అక్బర్ హుమాయున్ జీవితచరిత్ర స్కెచ్ రాయమని ఆదేశించాడు. గుల్బదన్ ఈ పనిని చాలా చక్కగా పూర్తి చేసింది. . గుల్బదన్ పుస్తకం భారతదేశంలో మొఘల్ యుగంలో జీవిత స్థితి గురించి వివరించిన అత్యుత్తమ ప్రాథమిక మూల పత్రం.

 బ్రిటీష్ మ్యూజియంలో గుల్బాదన్ రాసిన అహ్వల్-ఇ-హుమాన్ బాద్షా (హుమాయున్ బాద్షా యుగంలో పరిస్థితులు) లేదా హుమాయున్-నామా అనే పుస్తక౦ కాపి కలదు.  

ఒట్టోమన్, టర్కీ, ఇరాన్ మరియు భారతదేశ ముస్లిం పరిపాలనలో ఒక మహిళ రాసిన ఏకైక గద్య రచన హుమాయున్-నామా. గుల్బదన్ భారతదేశంలోని ప్రారంభ మొఘల్ జీవితానికి గొప్ప సాక్షి మరియు చరిత్రకారిణి కూడా .

భారతదేశం మరియు ప్రపంచంలోని ఇరవై ఒకటవ శతాబ్దపు మహిళలు స్ఫూర్తిని పొందగలిగే అసాధారణ జీవిత చరిత్ర హుమాయున్-నామా ను అందించడంలో గుల్బదన్ విజయం సాధించినది. .

No comments:

Post a Comment