న్యూఢిల్లీ
–
గత ఏడున్నర దశాబ్దాలుగా, సివిల్ సర్వీసెస్ పరీక్షలలో (సిఎస్ఇ CSE) దేశంలోని అతిపెద్ద మైనారిటీవర్గం అయిన ముస్లింల భాగస్వామ్యం మరియు వారి విజయాల శాతం సంతృప్తికరంగా లేవు అని కొత్త పుస్తకం 'ముస్లిమ్స్ ఇన్ ఇండియా - ఫేక్ నేరేటివ్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్ Muslims in India – Fake Narratives versus Ground Realities' లో పొందుపరచిన గణాంకాల ప్రకారం తెలుస్తుంది.
భారత దేశం లో ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే CSE లో ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)లో ప్రతిష్టాత్మకమైన స్థానాలకు ఎంపిక అవుతారు.
ప్రతి సంవత్సరం, 10 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు CSE ప్రిలిమ్స్‌కు హాజరవుతారు, వీరిలో ఒక శాతం లేదా 10,000 మంది మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం తుది ఎంపికల సంఖ్య దాదాపు 1,000+ ఉంటుంది.
భారతదేశంలో బ్రిటిష్ రాజ్ సమయంలో అక్టోబర్ 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఇది లండన్‌లో మొదటిసారిగా ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) పరీక్షలను నిర్వహించింది. 1869 వరకు, 16 మంది భారతీయులు ICS పరీక్షలకు హాజరయ్యారు, కానీ ఒకరు మాత్రమే విజయం సాధించగలిగారు. 1914నాటి ఐసిఎస్(ICS) అధికారుల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే భారతీయులు.
1855
మరియు 1899
మధ్య, 14
మంది ICS అధికారులు
ఉన్నారు, ఇందులో
కాన్పూర్‌కు చెందిన ఒక ముస్లిం ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అబ్దుల్లా యూసుఫ్ అలీ
(ఏడవ ర్యాంక్ హోల్డర్) 1914లో
రాజీనామా చేశారు. 1900
నుండి 1947
వరకు, మొత్తం
40
మంది ICS అధికారులలో
మొహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ ఒక్కరే ముస్లిం.
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, 980 మంది ICS అధికారులలో 101 మంది ముస్లింలు, 25 మంది భారతీయ క్రైస్తవులు, 13 పార్సీలు మరియు 10 మంది సిక్కులు ఉన్నారు.
స్వాతంత్ర్యం తరువాత, ICS స్థానంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) వచ్చింది. IAS అధికారుల యొక్క మొదటి బ్యాచ్ 1948లో రిక్రూట్ చేయబడింది, ICS అధికారుల సంఖ్య 242గా ఉంది.
1958లో కేవలం ఇద్దరు ముస్లింలు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు, (1993-94లో భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక ముస్లిం క్యాబినెట్ సెక్రటరీ అయిన జాఫర్ సైఫుల్లాతో సహా).
యూపీఎస్సీలో చైర్మన్లు, సభ్యులుగా ముస్లింల ప్రాతినిధ్యం అల్పం. మొత్తం 32 మంది ఛైర్పర్సన్లలో ముగ్గురు మాత్రమే ముస్లింలు - డాక్టర్ ఎఆర్ కిద్వాయ్ (1973-79), జెఎమ్ ఖురేషి (1996-98), మరియు డాక్టర్ ఎస్ఆర్ హషీమ్ (2005-06).
UPSC సభ్యులలో
16
మంది ఇప్పటి వరకు ముస్లింలు., 2027 మరియు 2030 మధ్య పదవీకాలం ముగియనున్న ప్రస్తుతం ఉన్న
ఆరుగురు సభ్యులలో ముస్లిం లేరు.
యూపీఎస్సీ 162 మంది అధికారులలో పరీక్షల డైరెక్టర్ ఇమ్రాన్ ఫరీద్‌తో సహా నలుగురు ముస్లింలు మాత్రమే ఉన్నారు.
జస్టిస్ సచార్ కమిటీ, మొత్తం 8,827 మంది అధికారుల (IAS, IPS మరియు IFS) పౌర సేవల జాబితాను విశ్లేషించిన తర్వాత, వారిలో ముస్లింలు కేవలం 3.2 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
· 2006లో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ముస్లింలు కేవలం 2.2 శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం 4,790 మంది ముస్లిం ఐఏఎస్ అధికారులు 108 మంది ఉన్నారు.
· 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింల జనాభా 13.43 శాతం. ఆ ప్రమాణం ప్రకారం, దేశంలో ప్రతి 5.73 లక్షల మంది ముస్లింలలో ఒక IAS లేదా IPS అధికారి ఉన్నారు, ప్రతి 1.08 లక్షల మంది ముస్లిమేతరులలో ఒకరు IAS లేదా IPS అధికారి ఉన్నారు ఉన్నారు.
జూన్
2014లో
దేశంలోని 8,417
మంది IAS మరియు
IPS అధికారులలో
ముస్లింలు 3.46
శాతం ఉన్నారని వెల్లడైంది
మొదట్లో
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ముస్లిం ఐఏఎస్ అధికారులు ఎంపిక
కాగా ఈమధ్య అనగా 2000 నుంచి జమ్మూ కాశ్మీర్ మరియు కేరళ ఎక్కువ
మంది ముస్లిం అధికారులు ఎంపిక అవుతున్నారు.
· జనవరి 2014 ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రకారం
ముస్లిం అభ్యర్థుల తక్కువ స్థాయి భాగస్వామ్యమే తక్కువ ప్రాతినిధ్యానికి మూల కారణం
1958
మరియు 2021
మధ్య కాలంలో 686
మంది ముస్లిం అభ్యర్థులు CSE కు తుది జాబితాలో చోటు పొందారు..
· 1971, 1972, 1975 మరియు 1976 సంవత్సరాల్లో CSE జాబితాలలో ముస్లింలు ఎవరూ లేరు.
· 1973, 1981, 1983 మరియు 1998లో ఒక్క ముస్లిం మాత్రమే జాబితాలో
చేరగలిగారు.
· 1972 నుండి 2023 వరకు, CSEలో 54 మంది టాపర్లు ఉన్నారు. వారిలో ముగ్గురు ముస్లిములు కలరు. టాపర్ జాబితాలో మొదటి ముస్లిం 1978లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జావేద్ ఉస్మానీ. 1987లో బీహార్‌కు చెందిన అమీర్ సుభానీ టాపర్స్ క్లబ్లో చోటు దక్కించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన షా ఫైసల్ 22 సంవత్సరాలు తరువాత 2009 లో టాపర్ అయినాడు..
· 1951 నుండి 2020 వరకు ఏడు దశాబ్దాలలో, మొత్తం 11,569 IASలలో 411 మంది ముస్లింలు.
· 1948లో ప్రారంభమైన IPSకి మొత్తం 4,344 మందిలో ముస్లింలు 151 మంది ఉన్నారు.
· 1966లో ప్రారంభమైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
(IFS) 2,151లో
మొత్తం 35
మందిని కలిగి ఉంది.
· 2023లో మూడు సర్వీసుల్లోని(IAS,IPS, IFS) 11,959 మంది అధికారుల్లో 366 మంది ముస్లింలు ఉన్నారు
సివిల్ సర్వీసెస్ పరీక్షలలో (CSE)
ముస్లింల
పనితీరు
Performance of Muslims in Civil Services Examinations (CSE)
సంవత్సరం |
Total
Number of Candidates Selected |
ఎంపికైన మొత్తం ముస్లింఅభ్యర్థుల
సంఖ్య
|
1958 |
64 |
2 |
1971 |
35 |
0 |
1972 |
59 |
0 |
1973 |
116 |
1 |
1974 |
75 |
5 |
1975 |
65 |
0 |
1976 |
92 |
0 |
1977 |
212 |
6 |
1978 |
45 |
2 |
1979 |
50 |
2 |
1980 |
DNA |
డేటా అందుబాటులో లేదు Data
Not Available |
1981 |
126 |
1 |
1982 |
167 |
5 |
1983 |
235 |
1 |
1984 |
233 |
6 |
1985 |
214 |
4 |
1986 |
216 |
6 |
1987 |
178 |
5 |
1988 |
249 |
15 |
1989 |
246 |
13 |
1990 |
298 |
9 |
1991 |
217 |
8 |
1992 |
157 |
3 |
1993 |
147 |
2 |
1994 |
131 |
2 |
1995 |
91 |
8 |
1996 |
81 |
3 |
1997 |
76 |
3 |
1998 |
55 |
1 |
1999 |
56 |
2 |
2000 |
93 |
6 |
2001 |
427 |
9 |
2002 |
286 |
డేటా అందుబాటులో లేదు Data
Not Available |
2003 |
413 |
9 |
2004 |
475 |
11 |
2005 |
422 |
11 |
2006 |
474 |
17 |
2007 |
734 |
27 |
2008 |
791 |
32 |
2009 |
791 |
31 |
2010 |
875 |
21 |
2011 |
920 |
31 |
2012 |
998 |
30 |
2013 |
1122 |
34 |
2014 |
1236 |
30 |
2015 |
1078 |
38 |
2016 |
1236 |
52 |
2017 |
1099 |
51 |
2018 |
990 |
28 |
2019 |
829 |
42 |
2020 |
761 |
31 |
2021 |
685 |
27 |
Source: క్లారియన్ ఇండియా, తేదీ 10-11-2024.
No comments:
Post a Comment