28 August 2022

సేక్ డీన్ మహ్మద్ (1759 - 1851)

 


సేక్ డీన్ మహ్మద్ (1759 - 1851) ఒక ఆంగ్లో-ఇండియన్ యాత్రికుడు, రచయిత, సర్జన్ మరియు పారిశ్రామికవేత్త. సేక్ డీన్ మహ్మద్ పాశ్చాత్య ప్రపంచానికి ప్రారంభ ఐరోపాయేతర వలసదారులలో ఒకడు. సేక్ డీన్ మహ్మద్ ఐరోపాకు భారతీయ వంటకాలు మరియు షాంపూలను పరిచయం చేశాడు, సేక్ డీన్ మహ్మద్ ఐరోపా లో చికిత్సా మసాజ్‌ను అందించాడు.

1759లో పాట్నాలో జన్మించిన సేక్ దిన్ మహ్మద్ తండ్రి ఈస్టిండియా కంపెనీలో పనిచేసేవారు. షాంపూలో వాడే రసాయనాల గురించి సేక్ దిన్ మహ్మద్ తెలుసుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత, 10 సంవత్సరాల వయస్సులో, షేక్‌ దిన్ మహ్మద్ ను వింగ్ కెప్టెన్ గాడ్‌ఫ్రే ఇవాన్ బేకర్ దత్తత తీసుకున్నాడు.భారతదేశం మరియు ఇంగ్లాండ్ మధ్య సాంస్కృతిక సంబంధాలపై పని చేయడం ద్వారా సేక్ తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు.

సేక్ డీన్ మహ్మద్ మంచి రచయిత. సేక్ డీన్ మహమ్మద్ ఆంగ్లంలో పుస్తకాన్ని ప్రచురించిన మొదటి మొదటి భారతీయ రచయితకూడా. 1794లో, సేక్ డీన్ మహమ్మద్ “ది ట్రావెల్స్ ఆఫ్ డీన్ మహమ్మద్” అనే  తన ప్రయాణ పుస్తకాన్ని ప్రచురించాడు,. సేక్ దిన్ మొహమ్మద్ యొక్క ట్రావెల్స్ పుస్తకం చెంఘిజ్ ఖాన్, తైమూర్ మరియు మొఘల్ చక్రవర్తి బాబర్ యొక్క ప్రశంసలతో ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలోని అనేక ముఖ్యమైన నగరాలు మరియు స్థానిక భారతీయ రాచరిక రాజ్యలతో సైనిక సంఘర్షణల శ్రేణిని వివరిస్తుంది.పుస్తకంలోని భాగాలు 18వ శతాబ్దం చివరిలో వ్రాసిన ఇతర యాత్రా కథనాలతో తీవ్రంగా విభేదించబడ్డాయి.

1809లో లండన్‌లోని పోర్ట్‌మన్ స్క్వేర్‌లో షేక్ దిన్ మొహమ్మద్ క్లబ్‌ను స్థాపించాడు మరియు దానికి 'హిందుస్తానీ డైనర్ మరియు హుక్కా స్మోకింగ్ క్లబ్' అని పేరు పెట్టారు. భారతదేశం నుండి ఇంగ్లండ్‌కు వెళ్లిన వారిలో షేక్‌ ఒకరు. 1812లో దివాలా కారణంగా రెస్టారెంట్ ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత మూసివేయబడింది. రెస్టారెంట్ యొక్క కొత్త యజమానులు తరువాత దానిని హిందుస్తానీ కాఫీ హౌస్ పేరుతో మరో 20 సంవత్సరాల పాటు నడిపారు, కానీ అది 1833లో మళ్లీ మూసివేయబడింది.

రెస్టారెంట్‌ను తెరవడానికి ముందు, షేక్ దిన్ మొహమ్మద్ లండన్‌లో నబోబ్ బాసిల్ కొక్రాన్ కోసం పనిచేశాడు, షేక్ దిన్ మొహమ్మద్ పోర్ట్‌మన్ స్క్వేర్‌లోని తన ఇంటిలో ప్రజల ఉపయోగం కోసం ఆవిరి స్నానాన్ని ఏర్పాటు చేశాడు మరియు దాని వైద్యం ప్రయోజనాలను ప్రచారం చేశాడు. షేక్ ఐరోపాలో షాంపూని ప్రవేశపెట్టాడు.

1784లో, బేకర్ కుటుంబంతో కలిసి సేక్ దీన్ మొహమ్మద్, కార్క్ (ఐర్లాండ్)కి వెళ్లారు. అక్కడ ఆంగ్ల భాషను మెరుగుపరచడానికి స్థానిక పాఠశాలలో చదివాడు. ఈ సమయంలో సేక్ దీన్ మొహమ్మద్, అందమైన ఐరిష్ అమ్మాయి జేన్ డాలీతో ప్రేమలో పడ్డాడు. కుటుంబం వారి సంబంధాన్ని వ్యతిరేకించింది, అందువలన ఈ జంట 1786లో వివాహం చేసుకోవడానికి మరొక నగరానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రొటెస్టంట్లు, ప్రొటెస్టంట్లు కానివారిని వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం, కాబట్టి  సేక్ దీన్ మొహమ్మద్ మతం మారాడు. సేక్ దీన్ మొహమ్మద్ మరియు అతని భార్య జేన్ కు ఏడుగురు పిల్లలు. షేక్ దిన్ మొహమ్మద్ 1851లో బ్రైటన్‌లోని 32 గ్రాండ్ పరేడ్‌లో మరణించాడు. అతన్ని బ్రైటన్‌లోని సెయింట్ నికోలస్ చర్చిలో ఖననం చేశారు.

ఒక ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిని బ్రిటీష్ పోలీసులు జైలుకు తరలించడానికి స్వారీ గుర్రాన్ని తీసుకువచ్చారు

 


జమీల్ అహ్మద్ ఖాన్  కుటుంబ సబ్యులు


 బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించారు. భారత  ప్రజలను, వనరులను మరియు సంపదను దోపిడీ చేశారు. అయితే అసాధారణమైన సాహసం, పరాక్రమం మరియు స్ఫూర్తితో మాత్రుభూమిని విముక్తి చేసిన, భారత స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో ఒకడైన జమీల్ అహ్మద్ ఖాన్ కథ మనకు ఎంతో ధైర్యం, భావోద్వేగం మరియు దేశభక్తితో నిండిన  స్ఫూర్తినిస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలోని బెత్రా గ్రామానికి చెందిన జమీల్ అహ్మద్ ఖాన్ ఒక తీవ్రమైన, బహిరంగ బ్రిటిష్ వ్యతిరేక కార్యకర్త.  జమీల్ ఖాన్  అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పరిగణించబడిన అనేక విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. జైలు శిక్ష అనేది   భార్య తట్టుకోలేదని ఆమె వేరొకరితో వివాహం చేసుకోవడానికి విడాకులు తీసుకున్నాడు.

బ్రిటీష్ పోలీసులు జమీల్ ఖాన్ ను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు, జమీల్ అహ్మద్ ఖాన్ తన్న చేతికి సంకెళ్ళు వేయడానికి నిరాకరించాడు, "నా మాతృభూమిని విముక్తి చేసే పోరాటంలో ఖైదీగా ఉండటం గౌరవం, కానీ నేను చేతికి సంకెళ్ళు వేయవద్దు. నేను జైలుకు వెళ్తాను. అది గుర్రం మీద మాత్రమే ఎందుకంటే అది నాకు శిక్ష కాదు, కానీ వేడుక మరియు ఆనందం. ఫలితంగా, బ్రిటిష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ఒక గుర్రాన్ని తీసుకువచ్చారు  మరియు అతనిని జైలుకు తరలించారు..

జమీల్ అహ్మద్ ఖాన్ ఏకైక కుమార్తె, శ్రీమతి జబ్బరున్నీసా కు నలుగురు కుమారులు వారు వరుసగా జలాల్ అహ్మద్ ఖాన్ (1984లో సౌదీ అరేబియాలోని మక్కాలో మరణించారు), నియాజ్ అహ్మద్ ఖాన్, నిసార్ అహ్మద్ ఖాన్, ఫయాజ్ అహ్మద్ ఖాన్ మరియు ఇద్దరు కుమార్తెలు రజియా మరియు జరీనా.

ఇటివల  75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా బెతారా లో సుల్తాన్‌పూర్ జిల్లా ఉన్నతాధికారులు జమీల్ అహ్మద్ ఖాన్ యొక్క జీవించి ఉన్న బంధువులను సందర్శించి, వారి పూర్వీకుల కృషికి గుర్తింపుగా ప్రమాణ పత్రాన్ని అందించారు.

 

 

 

రాణి అబ్బక్క: పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలను ఏకం చేసిన రాణి

 



రాణి అబ్బక్క చౌతా ప్రస్తుత దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ ప్రావిన్స్ నుండి వచ్చిన మొదటి తుళువ రాణి. రాణి అబ్బక్క, పోర్చుగీస్ విదేశీ సైన్యానికి  వ్యతిరేకంగా విభిన్న విశ్వాసాల ప్రజలను ఏకం చేసిన  శక్తిగా  పేరుగాంచింది. రాణి అబ్బక్క, కోస్తా కర్ణాటకలోని వ్యూహాత్మక ప్రాంతాలను కలిగి ఉన్న తుళునాడును పాలించిన చౌతా రాజవంశానికి ప్రాతినిధ్యం వహించింది.

 

పోర్చుగీసు దళాలు గోవాలో తమ పాలనను స్థాపించిన తర్వాత, మంగళూరు, ఉల్లాల్ ఓడరేవులను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించారు. భర్తను విడిచిపెట్టి తిరిగి తండ్రి వద్దకు వచ్చిన వీర రాణి అబ్బక్క నాలుగు దశాబ్దాలపాటు పోర్చుగీసు దాడులను తిప్పికొడుతూ సైన్యాన్ని ముందుండి నడిపించింది.

రాణి అబ్బక్క ధైర్యవంతురాలైన  అగ్రశ్రేణి మహిళా యోధులలో ఒకరిగా పరిగణించబడుతుంది. అబ్బక్క మేనమామ తిరుమలరాయ,  అబ్బక్కను  ఉల్లాల్ రాణిగా పట్టాభిషేకం చేశాడు. అబ్బక్క,  లక్ష్మప్ప అరస బంగార్రాజుIIని వివాహం చేసుకుంది. అయితే వారి వివాహం చాలా కాలం కొనసాగలేదు దాoతో  రాణి అబ్బక్క ఉల్లాల్ కు  తిరిగి వచ్చింది

ఉల్లాల్,  సంపన్నమైన ఓడరేవు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉంది. దీనిపై పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటీష్ వారి ద్రుష్టి పడింది. ఉల్లాల్ కైవసం చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న విదేశీ శక్తులను వ్యతిరేకంగా స్థానిక పెద్దలు తమ బేధాలను విడిచి ఏకమయ్యారు.

రాణి అబ్బక్క, తన పాలన లో   హిందువులు, జైనులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. 16వ శతాబ్దంలో రాణి అబ్బక్క పాలనలో, హిందువులు మరియు ముస్లింలు భుజం భుజం కలిపి నిలబడినందున, కర్ణాటక కోస్తా ప్రాంతం మొత్తం జాతి ఐక్యత మరియు సమగ్రతకు ఒక ఉదాహరణగా నిలిచింది.

రాణి అబ్బక్క యొక్క విడిపోయిన భర్త ఆమెపై తీవ్ర పగ పెంచుకున్నాడు. పోర్చుగీస్ వారు 1555 నుండి 1568 వరకు ఉల్లాల్‌పై దాడులు చేశారు.

ఉల్లాల్ పట్టుబడిన తరువాత, రాణి అబ్బక్క ఒక మసీదులో ఆశ్రయం పొందింది. రాణి అబ్బక్క తన సైన్యo తో  పోర్చుగీసు వారి పై దాడిని ప్రారంభించింది. రాణి అబ్బక్క సైన్యం పరాక్రమంతో పోరాడి జనరల్ జోవో పీక్సోటోను చంపింది, ఆ తర్వాత పోర్చుగీస్ వారు వెనక్కి తగ్గవలసి వచ్చింది.

రాణి అబ్బక్క బీజాపూర్ సుల్తాన్ మరియు కాలికట్ (కేరళ) పాలకులతో మైత్రిని ఏర్పరచుకుంది. అయితే చివరకు రాణి అబ్బక్క ను పోర్చుగీస్ సైన్యం బంధించి జైలుకు పంపింది.

రాణి అబ్బక్క  జైలులో కూడా తిరుగుబాటు చేసి పోరాడి మరణించిందని జానపద కథలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ స్థానిక కళారూపమైన యక్షగానం ద్వారా ఆమె కథ చెప్పబడింది.

అబ్బక్క ధైర్యసాహసాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం వీర రాణి అబ్బక్క ఉత్సవాన్ని నిర్వహిస్తారు మరియు అబ్బక్క పేరు మీద అవార్డులు అందజేస్తారు. 2003లో భారత తపాలా శాఖ రాణి అబ్బక్కపై ప్రత్యేక కవర్‌ను జారీ చేసింది. దివంగత అబ్బక్క రాణి కాంస్య విగ్రహాలు ఉల్లాల్ మరియు బెంగళూరులో స్థాపించబడ్డాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGSకి రాణి అబ్బక్క పేరు పెట్టారు.

ప్రస్తుతం హిందూ-ముస్లిం ఘర్షణలతో వార్తల్లో నిలుస్తున్న కర్నాటక ఒకప్పుడు ఏకమై విదేశీ ఆక్రమిత శక్తుల దాడులను తిప్పికొట్టింది. హిందువులు, ముస్లింలు మరియు జైనులు ఐక్యంగా ఉన్నందున విదేశీ శత్రువులు స్థానిక రాజ్యాలను నాశనం చేయలేకపోయారు. ఉమ్మడి శత్రువుపై భిన్న విశ్వాసాల ప్రజలు ఏకమయ్యే రోజు కోసం దేశభక్తులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

లేడీ ఎవెలిన్ ముర్రే (జైనాబ్ కొబోల్ద్): హజ్ చేసిన మొదటి బ్రిటిష్-ముస్లిం మహిళ Lady Evelyn Murray (Zainab Cobbold) : The first British-Muslim woman to perform Hajj

 



 

1351AH/(1933AD)న లేడీ ఎవెలిన్ ముర్రే(జైనాబ్ కొబోల్ద్)  బ్రిటిన్ లో   జన్మించి హజ్ చేసిన మొదటి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించినది. తనను తాను ముస్లింగా ప్రకటించుకున్న తర్వాత, లేడీ ఎవెలిన్ తన పేరును జైనాబ్ కొబోల్ద్ గా మార్చుకుంది.

సనాతన క్రైస్తవ కుటుంబo లో జన్మించిన లేడీఎవెలిన్ ఇస్లాం ధర్మం సరైనది మరియు అత్యంత ఆచరణాత్మకమైన మతం అని నమ్మినది. లేడీ ఎవెలిన్ ఇస్లాం యొక్క సారాంశాన్ని నిజంగా అర్థం చేసుకుంది మరియు దేవుని ఏకత్వాన్ని ధృవీకరించింది మరియు తరువాత హజ్ కోసం పవిత్ర నగరమైన మక్కాకు వెళ్లాలని నిర్ణయించుకుంది

జైనాబ్ (లేడీ ఎవెలిన్) హజ్ యాత్ర సుదీర్ఘoగా కొనసాగింది.  మొదట జైనాబ్(లేడీ ఎవెలిన్) సూయెజ్ (ఈజిప్ట్‌ లోని ఒక నగరం)కి రైలులో ప్రయాణించింది మరియు అక్కడ మశూచి మరియు కలరా టీకాలు వేయించుకోంది. తర్వాత జైనాబ్ (లేడీ ఎవెలిన్) ఒక ఫెర్రీ ద్వారా జెడ్డాకు వెళ్ళింది. ఫెర్రీ, జెడ్డా చేరుకోవడానికి దాదాపు నాలుగు రోజులు పట్టింది

 హజ్ చేయడానికి అనుమతి కోరుతూ సౌదీ అరేబియా రాజుకు ముందుగా జైనాబ్ (లేడీ ఎవెలిన్) లేఖ రాసింది. సౌది అరేబియా రాజు అబ్ద్ అల్ అజీజ్, జైనాబ్  (లేడీ ఎవెలిన్) కథ మరియు ఇస్లాం (శాంతి మతం)కి తిరిగి రావడం పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. జైనాబ్‌కు హజ్ చేసే అధికారం మంజూరు చేయబడింది.జైనాబ్ మినా నుంచి అరాఫత్‌కు కారులో ప్రయాణించింది.

తరువాత, మస్జిద్ అల్ హరామ్‌కు చేరుకున్న తర్వాత, జైనాబ్(లేడీ ఎవెలిన్)  తన భావాలను ఈ క్రింది విధంగా వివరిస్తుంది: నేను మక్కా మసీదులో ఉన్నాను మరియు కొన్ని సెకన్లపాటు దాని యొక్క అద్భుతం కారణంగా నేను నా పరిసరాలను మర్చిపోయాను. యాత్రికులు తెల్లటి పాలరాతిపై నడుస్తున్నాము.దాని పైకప్పు యాభై అడుగుల ఎత్తులో ఉంది ఇంత అద్భుతమైనది నేనెప్పుడూ ఊహించలేదు.... అల్లాహ్ యొక్క ఇల్లు [కాబా] దృశ్యాన్ని వివరించడానికి నాకు మాటలు రావటం లేదు. మతపరమైన ఉత్సాహంతో నేను ఆధ్యాత్మిక ఔన్నత్యం యొక్క బలమైన తరంగంలో చిక్కుకున్నట్లు భావించాను…”

జైనాబ్(లేడీ ఎవెలిన్)  తల్లితండ్రులు జైనాబ్ చిన్నతనంలో అల్జీరియాలో ఉన్ననందువలన జైనాబ్ అరబిక్ అనర్గళంగా మాట్లాదేది  మరియు అరబిక్ భాషపై మంచి పట్టు సాధించినది..

జైనాబ్ తన తరువాతి రోజులను ఇస్లాం బోధిస్తూ గడిపింది. ఆమె పుస్తకం "పిల్‌గ్రిమేజ్ టు మక్కా" హజ్ యాత్ర యొక్క పురాతన రికార్డు.

జైనాబ్(లేడీ ఎవెలిన్)  మరణం తరువాత, జైనాబ్ ను స్కాట్లాండ్‌లోని ఆమె ఎస్టేట్ సమీపంలోని కొండపై ఖననం చేశారు. జైనాబ్ (లేడీ ఎవెలిన్) సమాధి మక్కాకు ఎదురుగా ఈ క్రింది పదాలతో రాయబడి ఉంది: అల్లాహు నూర్-ఉస్-సమావతి వల్ ఆర్ద్ ” (“అల్లాహ్ స్వర్గం మరియు భూమికి కాంతి వంటివాడు. ")

 

 

27 August 2022

భారత ఉపఖండo (బంగ్లాదేశ్‌)లో జన్మించిన ఫహ్మిదా అజీమ్ పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది.

 


భారత ఉపఖండం లోని బంగ్లాదేశ్‌లో జన్మించి USAలో పనిచేస్తున్న ఇలస్ట్రేటర్ మరియు రచయిత్రి ఫహ్మిదా అజీమ్ ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీవిభాగంలో 2022 పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. 2022 పులిట్జర్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన నలుగురు జర్నలిస్టులలో ఫహ్మిదా అజీమ్  ఒకరు. ఇతరులు ఆంథోనీ డెల్ కల్, జోష్ ఆడమ్స్ మరియు వాల్ట్ హికీ. ఇన్‌సైడర్ ఆన్‌లైన్ మ్యాగజైన్ కోసం “ఉయ్ఘర్‌లపై చైనీస్ అణచివేత” పై చేసిన పనికి గాను  వారికి ఈ గౌరవం లభించింది. నేను చైనీస్ ఇంటర్న్‌మెంట్ క్యాంప్‌ను తప్పించుకున్నానుఅనే శీర్షికతో రూపొందించిన రచనకి ఫహ్మిదా అజీమ్ ఇలస్ట్రేషన్స్ సమకూర్చారు. ఫహ్మిదా అజీమ్ బంగ్లాదేశ్‌లో జన్మించింది, కానీ ప్రస్తుతం USAలోని సీటెల్‌లో పని చేస్తోంది.

ఫహ్మిదా అజీమ్ చిన్నతనంలో తన కుటుంబ సభ్యులతో USAకి వెళ్లి వర్జీనియాలో పెరిగింది. ఫహ్మిదా అజీమ్ VCUarts నుండి ఫైన్ ఆర్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఫహ్మిదా అజీమ్ రచనలు చాలా వరకు డిజిటల్ మీడియాలో ఉన్నాయి, అయితే ఫహ్మిదా అజీమ్ యాక్రిలిక్ పెయింట్స్, గౌచే మరియు ఇంక్ వంటి పాత ఫ్యాషన్ సాంప్రదాయ మాధ్యమాలతో కూడా పనిచేస్తుంది. ఫహ్మిదా అజీమ్ చేసే  కళ ప్రధానంగా గుర్తింపు మరియు స్వయంప్రతిపత్తి యొక్క ఇతివృత్తాలకు సంబంధించినది.

బంగ్లాదేశ్ నుండి పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న రెండవ వ్యక్తి ఫహ్మిదా అజీమ్. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థుల చిత్రాల కోసం రాయిటర్స్ ఫోటోగ్రాఫర్‌ల బృందంలో భాగంగా ఫీచర్ ఫోటోగ్రఫీకి 2018లో బహుమతిని గెలుచుకున్న మహమ్మద్ పోనీర్ హొస్సేన్ మొదటి వ్యక్తి..

ఇన్‌సైడర్ అనేది ఒక అమెరికన్ ఆన్‌లైన్ మీడియా సంస్థ.  అంతకుముందు ఇది బిజినెస్ ఇన్‌సైడర్ గా పిలువబడేది. ఇన్‌సైడర్ తరచుగా ఫహ్మిదా అజీమ్ యొక్క రచనలను చిత్రకారిణిగా మరియు స్టోరీ టెల్లర్‌గా ప్రచురించింది. ఫహ్మిదా క్రియేషన్స్ “గుర్తింపు, సంస్కృతి మరియు స్వయంప్రతిపత్తి” ఇతివృత్తాలపై దృష్టి సారించాయి.

తన వెబ్‌సైట్‌లో, ఫహ్మిదా అజీమ్ మానవ బొమ్మలను గీయడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. అసాధారణమైన జీవితాన్ని గడుపుతున్న నిజమైన వ్యక్తులను చిత్రించడమే తన లక్ష్యమని చెప్పింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫహ్మిదా అజీమ్ "సమీరా సర్ఫ్స్"లో తన పనికి గాను గోల్డెన్ కైట్ అవార్డును గెలుచుకుంది. ఈ పుస్తకాన్ని రుఖ్సన్నా గైడ్రోజ్ రాశారు మరియు పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో నివసించే సమీరా అనే 11 ఏళ్ల రోహింగ్యా శరణార్థి అమ్మాయి, సర్ఫింగ్‌లో శాంతి మరియు ఆనందాన్ని పొందటం  కథ యొక్క మూలవస్తువు.

 “ముస్లిం స్త్రీలు అన్ని చోట్ల " , "అమీరాస్ పిక్చర్ డే" మరియు "సమీరా సర్ఫ్స్“Muslim Women Are Everything” , “Amira’s Picture Day” and “Samira Surfs " మొదలగు ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిన పుస్తకాలలో ఫహ్మిదా యొక్క ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి". ఫహ్మిదా అజీమ్ “ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ, ఇన్‌సైడర్, సైంటిఫిక్ అమెరికన్, ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్, ది న్యూ హ్యుమానిటేరియన్ మరియు ఇతర ప్రచురణలలో ఎడిటింగ్ పనిచేసింది.. ప్రస్తుతం ఫహ్మిదా అజీమ్ తన తొలి సోలో గ్రాఫిక్ నవల “మెగా మేఘా”ను ప్రచురించే  ప్రచురణ సంస్థ స్కొలాస్టిక్ గ్రాఫిక్స్ కోసం పని చేస్తోంది

ఉయ్ఘర్‌లపై చైనీస్ అణచివేతకు సంబంధించిన శక్తివంతమైన. సన్నిహిత కథనాన్ని చెప్పడానికి గాను గ్రాఫిక్ రిపోర్టేజ్ మరియు కామిక్స్ మాధ్యమాన్ని ఉపయోగించి సమస్యను విస్తృత ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు గాను ఫహ్మిదా అజీమ్, పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారని పులిట్జర్ అవార్డుకు సంబంధించిన సైటేషన్  పేర్కొంది.

తన వెబ్‌సైట్‌లో ఫహ్మిదా అజీమ్ తన పెయింటింగ్‌లలో కొన్నింటిని పోస్ట్ చేసింది, అందులో ఒకటి సినీ నటి కాజోల్ మరియు మరొకటి ఎర్తా కిట్- అమెరికన్ గాయని, నటి, హాస్యనటి, నర్తకి మరియు కార్యకర్త. ఎర్తా కిట్ అత్యంత విలక్షణమైన గాన శైలికి మరియు వియత్నాం యుద్ధం పట్ల బహిరంగంగా వ్యతిరేకతకు ప్రసిద్ధి చెందింది.  నిహారి అనే వంటకం యొక్క పెయింటింగ్ కూడా ఉంది (ఈ వంటకం భారత ఉపఖండంలో ప్రసిద్ధి చెందిన మాంసం ఆధారిత వంటకం). వ్యక్తులు కాకుండా, ఫహ్మిదా అజీమ్ ఆహార చిత్రాలను కూడా చిత్రించడానికి ఇష్టపడుతుంది.

2009 నాటి ఇరాన్ అధ్యక్ష ఎన్నికల తరువాత జైలులో ఉన్న ఇరానియన్ ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు మైనర్‌లుగా ఉన్నప్పుడు చేసిన నేరాలకు మరణశిక్ష పడిన ఖైదీల తరపున ప్రాతినిధ్యం వహించిన ఇరాన్ న్యాయవాది నస్రిన్ సోటౌదేహ్ ఆధారంగా ఫహ్మిదా అజీమ్ వేసిన మరొక పెయింటింగ్. నస్రిన్ సోటౌడే యొక్క ఈ పెయింటింగ్ ది న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించబడింది.

ఫహ్మిదా అజీమ్ యొక్క ఇతర ప్రచురించబడిన రచనలలో “ఫాస్టింగ్ ఫర్ రంజాన్, ముస్లిం గ్రీఫ్ అండ్ ఐడెంటిటీ ఆఫ్టర్ క్రైస్ట్‌ చర్చ్, మరియు ప్రివెంటింగ్ స్టూడెంట్ సూసైడ్” అనే ఇలస్త్రేషన్స్ ఉన్నాయి. ఫహ్మిదా అజీమ్ ఇలస్త్రేషన్స్ విలక్షణమైన శైలి మరియు కొన్ని సాధారణ లక్షణాలను కలిగి ఉంటాయి, వీటిని ఫహ్మిదా అజీమ్ యొక్క స్వంత వ్యక్తిగత మార్క్  గా  గుర్తించవచ్చు.  

భారత ఉపఖండంలో జన్మించిన ఫహ్మిదా అజీమ్ అనే చిత్రకారిణి తన బృందంతో కలిసి పులిట్జర్ అవార్డుతో సత్కరించడం హర్షణీయం. అంతర్జాతీయ పురస్కారాలు మరియు గుర్తింపు కోసం ఈ ప్రాంతం నుండి మరింత ప్రతిభావంతులైన చిత్రకారులు మరియు చిత్రకారిణిలకు  ఇది స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరింత మంది యువతీ యువకులు ఫహ్మిదా అజీమ్ అడుగుజాడలను అనుసరించడాన్ని మనం చూడవచ్చు.

26 August 2022

సయ్యద్ హసన్ ఇమామ్, భారతదేశపు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు1871-1933

 

సయ్యద్ హసన్ ఇమామ్ 1871 ఆగస్టు 31న పాట్నా జిల్లాలోని న్యూరా గ్రామంలో జన్మించారు. సయ్యద్ హసన్ ఇమామ్ తండ్రి పేరు సయ్యద్ ఇమ్దాద్ ఇమామ్ మరియు అన్నయ్య పేరు సర్ అలీ ఇమామ్. TK ఘోష్ అకాడమీ నుండి ప్రారంభ విద్యను పూర్తి చేసిన తర్వాత, సయ్యద్ హసన్ ఇమామ్ పాట్నా కాలేజియేట్ స్కూల్‌లో చేరాడు. అక్కడ  అనారోగ్యo కారణంగా  మెడికల్ సలహాపై ఆరా లోని ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. అక్కడ సయ్యద్ హసన్ ఇమామ్ సచ్చిదానంద్ సిన్హాను కలిశారు. కొన్ని రోజుల తరువాత, 1887లో, సయ్యద్ హసన్ ఇమామ్ తిరిగి పాట్నాకు వచ్చి కాలేజియేట్ స్కూల్‌లో తిరిగి చేరాడు. సయ్యద్ హసన్ ఇమామ్ కు ఇంగ్లీషు భాషపై మంచి పట్టు ఉన్న కారణంగా  ప్రిన్సిపాల్ అతనిని పాట్నా కళాశాల డిబేటింగ్ సొసైటీలో పాల్గొనమని ప్రోత్సహించాడు.

హసన్ ఇమామ్ 24 జూలై 1889న న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లండ్‌లోని మిడిల్ టెంపుల్‌కి వెళ్లాడు. అక్కడ లైబ్రరీలో  పుస్తకాలు  చదువుతూ ఎక్కువ సమయం గడిపెవారు. ఈ సమయంలో సచ్చిదానంద్ సిన్హా కూడా లా చదవడానికి ఇంగ్లండ్ వచ్చారు. ఇద్దరూ రూమ్-మేట్స్ మాత్రమే కాదు; లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో ప్రొఫెసర్ హెన్రీ చరిత్ర ఉపన్యాసాలకు కూడా హాజరు అయ్యే వారు.

హసన్ ఇమామ్,  దాదాభాయ్ నౌరోజీ నేతృత్వం వహించిన  ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క కార్యదర్శిగా పనిచేసారు. హసన్ ఇమామ్,  మజరుల్ హక్ స్థాపించిన లండన్‌లోని  అంజుమన్ ఇస్లామియా అనే ఈ సంస్థకు కార్యదర్శిగా కూడా ఉన్నారు. విలియం డిగ్బే వేల్స్‌ను సందర్శించినప్పుడు, హసన్ ఇమామ్,  విలియం డిగ్బే వ్యక్తిగత కార్యదర్శిగా చాలా నెలలు పనిచేసారు.

1891లో బ్రిటిష్ పార్లమెంట్ కు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దాదాభాయ్ నైరోజీ విజయంలో హసన్ ఇమామ్ ముఖ్యమైన పాత్ర పోషించారు మరియు 1892లో భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు కలకత్తా హైకోర్టులో ఎన్రోల్  తర్వాత పాట్నాలో నివసించడం ప్రారంభించారు. త్వరలో హసన్ ఇమామ్ చాలా ప్రసిద్ధ న్యాయవాదిగా పరిగణించబడ్డాడు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో  కేసులపై వాదించాలని హసన్ ఇమామ్ కు పిలుపులు వచ్చేవి.  

హసన్ ఇమామ్ పాట్నా మునిసిపాలిటీ మరియు జిల్లా బోర్డు సభ్యుడు కూడా. 1910లో హసన్ ఇమామ్,  పాట్నా నుండి కలకత్తాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. హసన్ ఇమామ్ సామర్థ్యాన్ని చూసి, అప్పటి బెంగాల్ ప్రధాన న్యాయమూర్తి లారెన్స్ జెంకిన్స్, న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించమని హసన్ ఇమామ్‌ను ఆహ్వానించారు; హసన్ ఇమామ్ ఏప్రిల్ 1911లో అంగీకరించాడు. హసన్ ఇమామ్ 5 మార్చి 1916 వరకు కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగాడు. హసన్ ఇమామ్ కలకత్తా నుండి పాట్నా హైకోర్టుకు బదిలీ చేయబోతున్నారు, అయితే బీహార్ గవర్నర్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు, అప్పుడు హసన్ ఇమామ్ రాజీనామా చేసి మళ్లీ న్యాయవాద వృత్తిని చేపట్టారు. పాట్నా హైకోర్టు 6 మార్చి 1916న స్థాపించబడింది మరియు అదే  రోజున హసన్ ఇమామ్ పాట్నా హై కోర్ట్ లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు; పాట్నా హై కోర్ట్ లో హసన్ ఇమామ్ ప్రాక్టీస్ అతని మరణం వరకు కొనసాగింది.

న్యాయవాద వృత్తి  ద్వారా, హసన్ ఇమామ్ చాలా కీర్తితో పాటు  చాలా డబ్బు సంపాదించాడు. హసన్ మంజిల్ మరియు రిజ్వాన్ కాజిల్” వంటి విలాసవంతమైన భవనాలను నిర్మించడమే కాకుండా, హసన్ ఇమామ్ అలీఘర్ మరియు బనారస్  లోని  ప్రసిద్ధ సంస్థలకు విరాళాలు ఇవ్వడం కొనసాగించాడు. పాట్న లోని బీఎన్ కాలేజీ కి ప్రతి ఏటా వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చేవాడు మరియు  పేద విద్యార్థులకు ఆర్ధిక  సహాయం చేసేవాడు.

హసన్ ఇమామ్ 1903లో, బాద్షా నవాబ్ రిజ్వీ జనానా పాఠశాల స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించాడు మరియు దాని కార్యదర్శి అయ్యాడు. హసన్ ఇమామ్ ప్రేరణతో, టెకారి మహారాజ్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని మహిళల విద్య కోసం ఏర్పరచిన  వక్ఫ్‌ కు ఇచ్చాడు.హసన్ ఇమామ్ టెకారీ బోర్డులో గౌరవనీయమైన సభ్యుడు అయ్యాడు; అలాగే బాలికల విద్య కోసం అనేక పథకాలను సూచించారు.

1911లో, హసన్ ఇమామ్ అలీఘర్ కాలేజీకి ట్రస్టీ అయ్యారు; మరియు దాని కోసం నిధులు సేకరణ నిమిత్తం, కమిటీని ఏర్పాటు చేసి బీహార్‌లోని చాలా పట్టణాలను సందర్శించారు.  బీహార్‌లోని విద్యావంతులు  'ది బిహారీ' అనే సంస్థను ఏర్పాటు చేసారు,  హసన్ ఇమామ్ దీనికి అధ్యక్షుడయ్యాడు.

హసన్ ఇమామ్ ప్రత్యేక బీహార్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడారు. 1905లో బెంగాల్ రాష్ట్ర విభజనకు ప్రత్యేక బీహార్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న చాలా మంది నాయకులు మద్దతు ఇచ్చారు; వారిలో హసన్ ఇమామ్ కూడా ఒకరు. 1906లో ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపించబడింది.  మజరుల్ హక్‌తో పాటు హసన్ ఇమామ్ కూడా అక్కడ ఉన్నారు.

హసన్ ఇమామ్ 1908లో, కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు మద్రాసు వెళ్ళాడు మరియు అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత, 1909లో సోనేపూర్‌లో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని స్థాపించారు మరియు హసన్ ఇమామ్ దాని మొదటి అధ్యక్షుడయ్యాడు మరియు అదే సంవత్సరం నవంబర్‌లో గయాలో జరిగిన  బీహార్ స్టూడెంట్ కాంగ్రెస్  నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించాడు.

1911 డిసెంబరులో, కలకత్తాలో కాంగ్రెస్ సమావేశం జరిగింది, హసన్ ఇమామ్ అందులో పాల్గొనడమే కాకుండా, తదుపరి సమావేశాన్ని బీహార్‌లో నిర్వహించడానికి ఆహ్వానం ఇచ్చారు. 1912లో, కాంగ్రెస్ సెషన్ బీహార్, బంకీపూర్‌లో జరిగింది, అందులో మునుపటి సెషన్‌ల కంటే ఎక్కువ మంది ముస్లింలు హాజరు అయ్యారు దీని ఖ్యాతి కూడా  హసన్ ఇమామ్ కు దక్కుతుంది.  

హసన్ ఇమామ్ 1916లో హోంరూల్ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. హసన్ ఇమామ్ 1917లో బీహార్ ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహించాడు మరియు గాంధీజీ 1917 ఏప్రిల్‌లో బీహార్‌కు వచ్చినప్పుడు, హసన్ ఇమామ్, గాంధీజీ కి  పూర్తి మద్దతు ఇచ్చారు.

1918 ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1 వరకు బొంబాయిలో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది, దీనికి సయ్యద్ హసన్ ఇమామ్ అధ్యక్షత వహించారు. 1918 సంవత్సరంలో, సెర్చ్‌-లైట్ అనే జాతీయవాద ఆంగ్ల వార్తాపత్రికను తీసుకురావడంలో హసన్ ఇమామ్ ముఖ్యమైన పాత్ర పోషించారు; ఈ వార్తాపత్రికకు మొదటి సంపాదకుడు సయ్యద్ హైదర్ హుస్సేన్.

6 ఏప్రిల్ 1919, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పాట్నాలో భారీ సమ్మె జరిగింది, ఆ సమ్మె లో హిందూ-ముస్లిములు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు,  దుకాణదారుల నుండి రైతుల వరకు సమ్మెలో పాల్గొన్నారు. హసన్ ఇమామ్ అధ్యక్షతన ఖిలా మైదాన్‌లో పెద్ద పెద్ద నాయకులంతా సమావేశమయ్యారు.

1920లో, ఖిలాఫత్ మరియు సహకార ఉద్యమం లో హసన్ ఇమామ్  చురుకుగా పాల్గొన్నారు. 1921లో, ఖిలాఫత్ ఉద్యమాన్ని ఒక ముగింపుకు తీసుకురావడానికి హసన్ ఇమామ్ అధ్యక్షతన భారతీయుల ప్రతినిధి బృందం ఇంగ్లాండ్ వెళ్ళింది. సహకార ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు, ఎల్లప్పుడూ ఇంగ్లీష్ డ్రెస్ లో      ధరించే  హసన్ ఇమామ్ ఖాదీ దుస్తులు ధరించడం ప్రారంభించాడు.1921లో బీహార్ ఒరిస్సా లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యాడు మరియు దాని మొదటి ఎన్నికైన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

1923లో, లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క నాల్గవ అసెంబ్లీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సయ్యద్ హసన్ ఇమామ్ జెనీవా వెళ్ళాడు. 1927లో బీహార్‌లో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అదే సమయంలో, సయ్యద్ హసన్ ఇమామ్ 1930 శాసనోల్లంఘన ఉద్యమంలో స్వయంగా పాల్గొనడమే కాకుండా, హసన్ ఇమామ్  భార్య మరియు కుమార్తె కూడా అందులో చురుకుగా పాల్గొన్నారు; వీరిపై బ్రిటిష్ వారు జరిమానా కూడా విధించారు. స్వదేశీ లీగ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

19 ఏప్రిల్ 1933, 62 సంవత్సరాల వయస్సులో, బీహార్‌లోని షహాబాద్ జిల్లాలోని జప్లా అనే గ్రామంలో సయ్యద్ హసన్ ఇమామ్ మరణించారు.