29 August 2021

జపాన్ లో ముస్లిములు

 


-



.

.

 

జపాన్ లో 1970 లోరెండు మసీదులు ఉండేవి కాని ఇప్పుడు 200 కంటే ఎక్కువ  కలవు జపాన్ లో ఇస్లాం పునాదులు 8 వ శతాబ్దం లో ప్రారంభమైనవి. మేఇజి కాలం లో (Meiji period 1868-1890) చురుకుగా ఇస్లామిక్ దేశాలతో ముఖ్యం గా అతోమన్ సామ్రాజ్యం మరియు మద్య ప్రాచ్య దేశాలతో వర్తక,వాణిజ్యాలు ప్రారంభం అయినవి. భారతీయ వర్తకులు మరియు ఇండో-మలై నావికులు జపాన్ రేవు పట్టణాలు అయిన యోకోహమా మరియు కొబ్ లో పనిచేసేవారు.

రష్యన్ విప్లవంనుండి  తప్పించుకున్న తతార్ ముస్లిం వలస వాదులు  1930 లో జపాన్లో అతిపెద్ద  ముస్లిం సముదాయం గా రూపొందారు  మరియు 1938 లో ఒరిజినల్ టోక్యో మసీదును  స్థాపించారు.

అనధికార లెక్కల ప్రకారం జపాన్ లో 70 వేల నుంచి ఒక లక్షా ఇరవై వేల వరకు ముస్లింలు కలరు. వారిలో 10% మంది జపాన్ వారు. జపాన్ లో ప్రవాస కార్మికులు ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లింలు అధిక సంఖ్య లో ఉన్నారు.

టోక్యో కామి (camii)లేదా టోక్యో మసీదు ఒక అద్భుతమైన కట్టడం. టర్కిష్ పద్దతిలో నిర్మితమైన ఈ కట్టడం యోయోగి ఉహర(YoyogiUehara) ప్రాంతం లో  నివాస అపార్ట్ మెంట్ వరుసల మద్య దాగి ఉంది.మసీదు ప్రస్తుత అవతారం నిర్మాణం 2000 లో పూర్తయ్యింది, కానీ మసీదు కు  అతి పెద్ద చరిత్ర ఉంది. 1930 లో జపాన్ గణనీయమైన నివాస ముస్లిం జనాభా ను చవిచూసింది మరియు అనేక మసీదులను  ఏర్పాటు చేయడం  జరిగింది.

ఈ మసీదు ను జపాన్ లో అత్యంత ప్రముఖ మసీదు గా మరియు జపాన్ ప్రభుత్వ ఆర్ధిక సహాయం లేకుండా ,జపనీస్  ఆర్ధిక కంపెనీలు, అతి ముఖ్యంగా మిట్సుబిషి ఆర్ధిక  సహాయం తో నిర్మించిన మస్జిద్ గా హన్స్ మార్టిన్ క్రామెర్, (హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో జపనీస్ స్టడీస్ ప్రొఫెసర్ మరియు జపాన్ లో మతం మీద నిపుణుడు) భావించినాడు. దాని ప్రారంభ వేడుకలకు  జపాన్ మరియు ఇస్లామిక్ వరల్డ్ నుండి ఉన్నతాధికారులు  మరియు దౌత్యవేత్తలు హాజరయ్యారు

.టోక్యో కామి(camii) కు జపనీస్ ప్రభుత్వం మద్దతు లేదు కాని ఇది (మసీదు ను) టర్కిష్ ప్రభుత్వం  నిధులను ఉపయోగించి పునర్నిర్మించబడింది. ఇది  మతపరమైన వేదిక మరియు దీనియందు వివాహ కార్యక్రమాలు,జాతి-సాంస్కృతిక కార్యక్రమాలు,ఫ్యాషన్ షోలు నాటకాలు, ప్రదర్శనలు మరియు సమావేశాలు నిర్వహించ బడును.

నేగాయ(Nagoya) మసీదు 1931 లో మరియు కోబే (KOBE)మసీదు 1935 లో భారతీయ ముస్లిం వలసదారులు నిర్మించారు.

టోక్యో కామి (Camii)నుండి దూరంగా ఒక చిన్న సందు లో పాలరాయితో  అలంకరించబడిన యువి (Yuai) ప్రాంతం లో డాక్టర్ ముసా ఓమర్ ఇంటర్నేషనల్ స్కూల్  ఉంది. పాఠశాలపిల్లలు తో నిండి ఉంటుంది.  శనివారం నాడు   పాఠశాల అందు  ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు వివిధ కార్యకలాపాలు మరియు తరగతులు నిర్వహించాబడుతాయి. పాఠశాల  ప్రస్తుతం శనివారం మాత్రమే నిర్వహింపబడి కరాటే మరియు నగీషీ, ఇస్లామిక్ స్టడీస్ మరియు అరబిక్ తరగతులనిర్వహించడం జరుగుతుంది. 

పాఠశాల ను ద్వితీయ ప్రపంచయుద్దం తరువాత 1966లో  ఏర్పాటుచేయబడిన  జపాన్ ఇస్లామిక్ సెంటర్ (ICJ), నడుపుతుంది. సౌదీ రాయబారి సలహాదారు మరియు రెండుసార్లు జపాన్ లో సుడాన్ రాయబారిగా పనిచేసిన  ఓమర్ పాఠశాల ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.

నేడు జపాన్ లో 200 మస్జిద్లు మరియు అనేక తాత్కాలిక ఇస్లామిక్ ప్రార్ధనా మందిరాలు కలవు. టోక్యో మస్జిద్, ఒమర్ పాఠశాల,జపాన్ ఇస్లామిక్ సెంటర్ ఆధునిక జపాన్ ఇస్లామిక్ చరిత్ర లో ముఖ్యమైన అంతర్భాగాలు.

ఆధారం: అల్-జజీరా

 

 

 

 






 

..


..
 

 

 

 

లంచం (Bribery)

 



లంచం (Bribery) ఇవ్వడం మరియు తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు.

బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం డబ్బుల రూపంలో గానీ లేదా బహుమతుల రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలుఆస్తి రూపంలోఓటు, లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని 'లంచగొండి' అంటారు.

లంచం పై  ప్రముఖుల అభిప్రాయాలు:

·        ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం(SC) పేర్కొంది.

·        "మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే,సగం మంది మధ్యస్థంగా ఉంటారు.ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోవడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడపవలసి వచ్చింది.నేను చిన్న వయసులో ఉన్నప్పుడు- అవినీతి పరుడిని హీనంగా చూసేవారు.నాడు అవినీతి పరుల పట్ల సమాజానికి తృణీకార భావన ఉండేది. అదిప్పుడు లేదు. సమాజం వారిని ఆమోదిస్తున్నది, డబ్బు ఉంటే గౌరవంగా చూస్తున్నారు, ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు.మన దేశంలో ఇంకా నూటికి 20 మంది నిజాయితీ పరులున్నారు.వీరు ఏ ప్రలోభాలకూ లొంగని వారు. వారికి అంతరాత్మ అంటూ ఉంది "--- ప్రత్యూష్ సిన్హా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(EX-CVC)

·        "అవినీతి మొత్తం సామాజిక జీవనంలో భాగమైపోయింది.అవినీతి ఉద్యోగులను గుర్తించి త్వరిత గతిన దోషులను శిక్షించే విధానాలు చేపట్టాలి"ప్రణాళికా సంఘం(P.C)

·        "ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందడం, జనన మరణాల ధృవపత్రాలు తెచ్చుకోవడం, నివా స ధృవీకరణ, పాస్‌పోర్టు, భూమి హక్కులు వంటి పత్రాలు పొందడం వంటి వి తేలికగా, ముడుపులతో పని లేకుండా సాగాలి"జాతీయ నాలెడ్జ్ కమిషన్ .(NKC)

·        "ఎన్నికల వ్యవస్థతో ముడిపడిన అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి"పాలనా సంస్కరణల కమిషన్(ARC)

 

విబిన్న మతాల అబిప్రాయం 

 

భాగవతం

వ్యాప్తిన్ జెందక,వగవక,

ప్రాప్తించిన లేశమైన పదివేల నిచున్

దృప్తింజెందని మనుజుఁడు

సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే? ---- పోతన భాగవతం అష్టమ స్కంధము ౫౭౩

 

బైబిల్ ప్రకారం:

·        న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును (సామెతలు 17:23)

·        లంచము పుచ్చుకొనువాని దృష్టికి లంచము మాణిక్యమువలె నుండును. (సామెతలు 17:8)

·        లంచము పుచ్చుకొనకూడదు. లంచము, దృష్టిగలవారికి గుడ్డితనము కలుగజేసి, నీతిమంతులమాటలకు అపార్దము చేయించును. (నిర్గమ 23:8)

·        లంచము పుచ్చుకొనకూడదు. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును (ద్వితీయోపదేశకాండము 16:19)

ఇస్లాం ప్రకారం

·        ఇస్లాంలో ప్రకారం లంచం తీసుకోవడం తాజిర్ నేరాల (ta'azir crime) కిందకు వస్తుంది. నేర తీవ్రత బట్టి వీటికి జైలు శిక్ష లేదా కొరడా దెబ్బలు కొట్టాలని షరియా చట్టం చెబుతోంది.

·        ఒకరిధనాన్ని ఒకరు కాజేయకండి. అధికారులకు లంచం ఇవ్వకండి  (దివ్య ఖురాన్ 2:188)

హదీసుల ప్రకారం:

·        1– ప్రవక్త (స) ఇలా అన్నారు, 'లంచం గురించి జాగ్రత్త వహించండి, ఇది నిజంగా అవిశ్వాసం మరియు లంచగొండి స్వర్గం యొక్క సువాసనను కూడా చూడడు.' [బీహార్ అల్-అన్వర్, వి. 104, పే. 274, నం. 12]

·        2- ప్రవక్త (స),ఇలా అన్నారు: 'అల్లాహ్ యొక్క శాపం లంచo ఇచ్చేవాడు, లంచం తీసుకొనేవాడు మరియు  మరియు వారి మధ్య ఏజెంట్ మీద ఉంది.' [కాన్జ్ అల్-ఉమ్మల్,నo. 1508]

·        3- ఖురాన్ లో అల్లాహ్ ఆదేశం గురించి ఇమామ్ అలీ (ఇలా) ఇలా అన్నారు: "చట్టవిరుద్ధoగా తినేవారు" ఎవరెంటే -' తోటి సోదరుడి అవసరాన్ని నెరవేర్చిన వ్యక్తి మరియు ఆతరువాత అతని నుండి బహుమతిని స్వీకరి౦చేవారు..' –బీహార్ అల్-అన్వర్, వాల్యుం. 104, పే. 273, నం. 5]

 

 

·        4- ఇమామ్ అల్-సాదిక్ (a.s.), 'న్యాయమూర్తిగా లేదా పాలకుడిగా ఉండి లంచాలు స్వీకరించడం అల్లాహ్‌పై అవిశ్వాసానికి సమానం.' [అల్-కాఫీ, వాల్యూం . 7, పే. 409, నం. 2]

·        5. లoచం ఇచ్చేవాడినీ పుచ్చుకునేవాడినీ మరియు మధ్యవర్తిని అల్లాహ్ శపించాడని మహమ్మదు ప్రవక్త (స)చెప్పారు (దావూద్ :1595)

 

 

 

జలియన్ వాలాబాగ్ మారణకాండ: హిందువులు, ముస్లింలు, సిక్కులు కలిసి తమ జీవితాలను త్యాగం చేశారు

 




జలియన్‌వాలా బాగ్ మారణకాండ, భారతదేశంలో వలస పాలకులచే అమాయకులను అత్యంత కర్కశంగా ఊచకోత కోయడానికి సంకేతంగా ఉన్నప్పటికీ, అది దేశంలో మత సామరస్యానికి సంకేతంగా నిలిచింది.. హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు అమృత్‌సర్ మరియు ఏకీకృత పంజాబ్‌లోని ఇతర నగరాల్లో నిరసనల్లో భాగంగా ఉన్నారనే వాస్తవం నిజానికి చాలా మందికి తెలియదు.

అవిభాజిత పంజాబ్‌లోని మూడు ప్రధాన వర్గాలు బ్రిటిష్ ఆక్రమణ శక్తులను ఎదిరించడానికి ఒకే శరీరం వలె ఏకీభవించగలవని రుజువు చేసారు.  

దేశమంతటా, ముఖ్యంగా ఆనాటి పంజాబ్‌ ప్రావిన్సు లో, నిరసనలు వాస్తవానికి 1919 లో రౌలత్ చట్టానికి వ్యతిరేకం గా జరిగినవి. .  దేశంలో అన్ని వర్గాల ప్రజలు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు కారణమయ్యారు. ముఖ్యంగా పంజాబ్ అంతటా నిరసనలు తీవ్రంగా ఉన్నాయి

జనరల్ రెజినాల్డ్ డయ్యర్, అమృత్ సర్ యొక్క కసాయి అని కూడా పిలువబడే వ్యక్తి, వందలాది మంది మరణానికి సంబంధించిన మారణకాండను పర్యవేక్షించాడు.

అశాంతికి కారణమేమిటి?

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సైఫుద్దీన్ కిచ్లీవ్, ఒక ప్రఖ్యాత న్యాయవాది, మరొక స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు మరియు సమర్థవంతమైన హోమియోపతి డాక్టర్ సత్య పాల్‌తో పాటు అరెస్టు చేయబడ్డారు.

అరెస్ట్‌లకు కొన్ని రోజుల ముందు, హిందూ పండుగ అయిన రామ నవమిలో, హిందువులు మరియు ముస్లింలు ఒకే పాత్రల నుండి నీరు, పాలు మరియు షెర్బెత్  తాగారు. వేలాది మంది "హిందూ-ముసల్మాన్ కి జై" నినాదాలు చేశారు. ("హిందువులు మరియు ముస్లింలకు విజయం!")

పంజాబ్ ప్రావిన్స్ నుండి అగ్రశ్రేణి స్వాతంత్ర్య సమరయోధులను అరెస్టు చేసిన తరువాత, 10 ఏప్రిల్ 1919 న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అవాంఛనీయ బలప్రదర్శనను ఆశ్రయించిన వలసవాద శక్తులు శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరిపారు, అనేక మందిని చంపినారు., హింసాత్మక సంఘటనలు జరిగినవి.

బాధితులు అన్ని వర్గాలకు చెందినవారు

వలస శక్తి ద్వారా దేశంలో జరిగిన అత్యంత దారుణ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి పేరును మీరు విశ్లేషిస్తే, వారు దేశంలో నివసిస్తున్న అన్ని వర్గాలకు చెందినవారని మీరు గ్రహిస్తారు. హిందువులు మరియు సిక్కులతో పాటు డజన్ల కొద్దీ ముస్లిం బాధితులు స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముస్లిం నాయకుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ కిచ్లీ 17 ఏళ్లుగా మహాత్మాగాంధీ లేదా పీటీ జవహర్‌లాల్ నెహ్రూల కంటే ఎక్కువగా వివిధ జైళ్లలో గడిపినట్లు గుర్తుంచుకోవాలి..

తన పుస్తకంలో, ఫ్రీడమ్ ఫైటర్, FZ కిచ్లీవ్ FZ Kitchlew ఇలా అంటాడు, "బహిరంగ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు, సమావేశం యొక్క ఉద్దేశ్యం ప్రధానంగా వారి నాయకుడు డాక్టర్ కిచ్లేవ్ అరెస్టుకు నిరసనగా, మరియు రెండవది ప్రజల మనోభావాలను చల్లబరచడానికి మరియు నగరంలో శాంతిని పునరుద్ధరించండం. ఈ చారిత్రాత్మక సమావేశానికి అమృత్‌సర్ నడిబొడ్డున ఉన్న ఒక పబ్లిక్ పార్క్ జలియన్‌వాలా బాగ్ వేదిక అయ్యింది..

 జలియన్ వాలా బాగ్ మూడు వైపులా ఎత్తైన గోడలతో ఉంది, ఇది పక్కనే ఉన్న ఇళ్లకు  సరిహద్దులను ఏర్పరుస్తుంది. ఏకైక నిష్క్రమణ/exit మార్గం గుండా అనేక మంది వ్యక్తులు ఒకేసారి బయటకు వెళ్ళే అవకాశంలేదు.. ఈ సమావేశం ఏప్రిల్ 13 న షెడ్యూల్ చేయబడింది, కానీ అదే రోజు ప్రభుత్వం అమృత్‌సర్‌లో కర్ఫ్యూ అమలు చేసింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది జాతీయవాద కార్యకర్తలు సమావేశాన్ని వాయిదా వేయాలని సూచించారు, అయితే అప్పటికే స్థానిక కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్న లాలా హన్స్ రాజ్ మల్హోత్రా, తప్పనిసరిగా సమావేశాన్ని నిర్వహించాలని పట్టుబట్టారు, ఎందుకంటే సమీప పట్టణాల ప్రజలు ఇప్పటికే భారీ సంఖ్యలో తరలిరావడం ప్రారంభించారు. జలియన్ వాలా బాగ్ వద్దకు  అన్ని వర్గాల ప్రజలు వచ్చారు, కొందరు కాలినడకన, కొందరు గాడిద బండ్లపై మరియు కొంతమంది తమ గుర్రపు బండ్లలో వచ్చారు.

FZ కిచ్లీవ్ FZ Kitchlew ఇలా అంటాడు, “ఆ ఏప్రిల్ ఉదయం వాతావరణం పండుగగా ఉండేది. హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు అందరూ కలిసి పరస్పర ప్రేమ మరియు ఐక్యతను ప్రదర్శించారు. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడి, సమావేశం కోసం ఎదురుచూస్తున్నప్పుడు వారి చుట్టూ చేరి చుట్టూ ఆడుకున్నారు. ఈ అందమైన రోజు భయానకంగా మారుతుందని వారికి తెలియదు- ఎప్పటికీ మర్చిపోలేని విషాదం అది . సుమారు 30,000 మంది ప్రజలు బాగ్‌లో గుమిగూడారు. డాక్టర్ కిచ్లీ యొక్క భారీ ఛాయాచిత్రం ఖాళీ కుర్చీపై ఉంచబడింది. భారీ జనసమూహం నిరంతరం 'కిచ్లెవ్ కో రహా కరో (విడుదల కిచ్ల్యూ) అని అరుస్తోంది.

. అకస్మాత్తుగా ప్రవేశద్వారం వద్ద బ్రిటిష్ జనరల్ డైర్ నేతృత్వంలో 150 మంది సైనికులు కనిపించారు, మరియు గుంపును చెదరగొట్టడానికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే సైన్యం బయలుదేరింది. మూడు నిమిషాల వ్యవధిలో సాయుధ ప్రజలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపాలని ఆర్డర్ ఇవ్వబడింది.

ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల యొక్క ఖచ్చితమైన సంఖ్య నిజంగా తెలియదు, ప్రభుత్వం మారణహోమం లేదా ప్రమాద గణాంకాల గురించి వివరాలను సేకరించడంలో పెద్దగా ఆసక్తి చూపలేదు, అనవసర హత్యలను విచారించిన సేవా సమితి సొసైటీ తరువాత చెప్పింది జనరల్ డైర్ నేతృత్వంలోని సైన్యం జరిపిన కాల్పుల్లో దాదాపు 379 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత, హంటర్ కమిషన్ కూడా మరణ సంఖ్య ఈ సంఖ్యకు దగ్గరగా ఉందని మరియు గాయపడిన వారి సంఖ్య మరణ సంఖ్య కు కనీసం మూడు రెట్లు ఉందని చెప్పారు. ఈ మారణకాండ చిన్న పిల్లలు మరియు పిల్లలను కూడా విడిచిపెట్టలేదు. చనిపోయినవారిలో కనీసం 42 మంది యువకులు ఉన్నారని, అతి పిన్న వయస్కుడికి కేవలం 7 నెలల వయస్సు ఉందని ఒక పరిశోధనా నివేదిక కనుగొంది.

 

దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వ్యక్తుల పేర్లను పరిశీలించిన  కత్రి నుండి కైష్త్ వరకు, కాశ్మీరీల నుండి బ్రాహ్మణుల వరకు, ముస్లింల నుండి సిక్కులు, హిందువుల వరకు మరియు పసిపిల్లల నుండి టీనేజర్ల వరకు, అందరూ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. పిరికి బ్రిటిష్ సైన్యం అత్యంత అనాగరిక రీతిలో ఊచకోత కోసిన వారిలో కనీసం యాభై మంది ముస్లింలు.

ఏప్రిల్ 13, 1919 న జలియన్‌వాలా వద్ద జరిగిన నిర్విరామ కాల్పుల సమయంలో మొత్తం 59 మంది ముస్లింలు షహీద్ అయ్యారు.

 

డాక్టర్ సైఫుద్దీన్ కిచ్ల్యూ, బ్రిటిష్ వారు దేశాన్ని విభజించినప్పుడు హృదయ విదారకంగా ఉన్నారు. నిరాశతో, అతను అమృత్‌సర్‌ను విడిచిపెట్టి, ఢిల్లీలో స్థిరపడ్డాడు మరియు ప్రజా జీవితం నుండి తనకు  తాను రిటైర్ అయ్యారు.

డాక్టర్ సైఫుద్దీన్ కిచ్ల్యూ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ను  జలియన్‌వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క జీవిత ధర్మకర్తలుగా చేసింది.