30 August 2024

ఇస్లాంలో గురువు స్థానం The status and role of teachers in Islam

 


ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన మరియు విలువైన వృత్తులలో ఉపాద్యాయ వృత్తి ఒకటి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పవిత్ర ఖురాన్‌లో ఇలా అన్నాడు: మేము మీ మధ్య ఒక ప్రవక్తను స్వయంగా మీలో నుండే పంపాము. అతను మా సూక్తులను మీకు చదివి వినిపిస్తున్నాడు.మీమ్మల్లి పరిశుద్దపరుస్తున్నాడు. మీకు గ్రంధాన్ని భోదిస్తున్నాడు. వివేకాన్ని నేర్పుతున్నాడు. మీకు తెలియాన్ని ఎన్నో విషయాలను భోదిస్తున్నాడు.” (ఖురాన్, 2:151).

దివ్య ఖురాన్ యొక్క పై ఆయత్ ప్రకారం, పవిత్ర గ్రంథం ఖురాన్, జ్ఞానం మరియు ఈ ప్రపంచంలోని ప్రజలకు తెలియని విషయాల గురించి బోధించడానికి ప్రవక్త(స) పంపబడ్డారు.

ఇస్లాంలో ఉపాధ్యాయుల కు ఎంతో గౌరవం ఉంది. వారు జ్ఞానం యొక్క సంరక్షకులుగా మరియు వ్యక్తుల యొక్క నైతిక, ఆధ్యాత్మిక మరియు మేధో వృద్ధిని రూపొందించే మార్గదర్శకులుగా చూడబడతారు.

ఇస్లాంలో ఉపాధ్యాయులను గౌరవంతో పరిగణిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు: "నేను కేవలం గురువుగా మాత్రమే పంపబడ్డాను" (ఇబ్న్ మాజా). ఇది ఇస్లామిక్ సమాజంలో ఉపాధ్యాయుల గొప్ప స్థానాన్ని నొక్కి చెబుతుంది.

దివ్య ఖురాన్ కూడా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది, "తెలిసిన వారు తెలియని వారితో సమానమా?" (ఖురాన్ 39:9). పై ఆయత్ జ్ఞానాన్ని కలిగి ఉన్న మరియు ప్రసాదించే వారి ఉన్నత స్థితిని పరోక్షంగా అంగీకరిస్తుంది.

ఉపాధ్యాయులు జ్ఞానం యొక్క సంరక్షకులుగా పరిగణించబడతారు. దివ్య ఖురాన్ లో నేర్చుకోవడం మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అనేకసార్లు వివరించబడినది.. ముహమ్మద్ ప్రవక్త(స) కూడా ఇలా అన్నారు, "మీలో ఉత్తములు ఖురాన్ నేర్చుకుని దానిని బోధించేవారే" (బుఖారీ). ఈ హదీథ్ బోధనలో నిమగ్నమై ఉన్నవారికి, ముఖ్యంగా మతపరమైన జ్ఞానంలో ఉన్నవారికి అపారమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది.

ఇస్లామిక్ సంప్రదాయంలో, గురువు సద్గుణ౦ మరియు నైతికత యొక్క రోల్ మోడల్‌.. విద్యార్థుల ఆధ్యాత్మిక మరియు నైతిక వికాసంలో మార్గనిర్దేశం చేయడంతో గురువు ప్రభావం అపారమైనది. ఉపాధ్యాయుల పాత్ర మరియు ప్రవర్తన చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే వారు తమ విద్యార్థులకు అందించే సద్గుణ మరియు నైతిక సూత్రాలకు సజీవ ఉదాహరణలుగా చూడవచ్చు.

ఇస్లాంలో ఉపాధ్యాయుని ప్రధాన పాత్ర జ్ఞానాన్ని అందించడం. ఇందులో మతపరమైన మరియు ప్రాపంచిక జ్ఞానం రెండూ ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్(స) జ్ఞానాన్ని వెతకడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, "జ్ఞానాన్ని వెతకడం ప్రతి ముస్లింపై ఒక బాధ్యత" (ఇబ్న్ మాజా). అందువల్ల జీవితంలోని అన్ని అంశాలను కలిగి ఉన్న విద్యను అందించడం ద్వారా ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారు.

ఇస్లాంలో ఉపాధ్యాయులు నైతిక మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందజేస్తారు.  ఉపాధ్యాయులు తమ విద్యార్థుల పాత్ర మరియు విశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు, విద్యార్థుల మంచి ముస్లింలుగా మరియు సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారడానికి సహాయపడతారు.

ఇస్లామిక్ విద్య విమర్శనాత్మక ఆలోచన మరియు వివేకాన్ని పెంపొందించడానికి ప్రోత్సహిస్తుంది. దివ్య ఖురాన్ మరియు హదీసుల యొక్క లోతైన అర్థాలను అర్థం చేసుకోవడంలో మరియు వారి దైనందిన జీవితంలో ఇస్లామిక్ సూత్రాలను అన్వయించడంలో విద్యార్థులకు సహాయం చేయడం ఉపాధ్యాయుల బాధ్యత.

న్యాయం మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించే బాధ్యత ఇస్లాంలో ఉపాధ్యాయులకు ఉంది. ఇస్లామిక్ బోధనలు న్యాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి మరియు ఉపాధ్యాయులు తమ విద్యార్థులలో న్యాయ విలువను పెంచుతారు.. ఇతరుల పట్ల వారికి ఉన్న హక్కులు మరియు బాధ్యతల గురించి విద్యార్ధులకు బోధించడం మరియు సమాజానికి సానుకూలంగా సహకరించేలా వారిని ప్రోత్సహించడం ఉపాధ్యాయులు చేస్తారు..

గురువు ఇస్లాం లో తండ్రిగా పరిగణించబడతాడు. ప్రవక్తలందరూ ప్రవక్త ముహమ్మద్‌(స)కు ముందు పంపబడిన ఉపాధ్యాయులు. ప్రవక్త(స) మానవాళికి గొప్ప గురువు కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో, ఖురాన్ బోధనలను మన దైనందిన జీవితంలో ఎలా అమలు చేయాలో మరియు అనేక ఇతర విషయాలను బోధి౦చారు..

ఇస్లాం జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముస్లింలను జ్ఞానాన్ని పొందాలని మరియు నేర్చుకోవాలని ఆదేశించాడు. ఇస్లాం జ్ఞానాన్ని అన్వేషించడంపై మరియు జ్ఞానాన్ని అందించిన వారికి గౌరవం ఇవ్వడంపై కూడా నొక్కి చెబుతుంది.

ఇస్లాంలో ఉపాధ్యాయులకు అత్యున్నత స్థానం ఉంది. పవిత్ర  ఖురాన్‌లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: "మీలో విశ్వాసపాత్రులైన వారిని మరియు జ్ఞానాన్ని సంపాదించిన వారిని అల్లాహ్  ఉన్నత స్థానాలకు చేర్చుతాడు".(ఖురాన్, 58:11)

28 August 2024

డా. చౌదరి వలీ మొహమ్మద్ (1886-1968): జీవితం మరియు రచనలు Dr. Chaudhary Wali Mohammad (1886-1968): Life and Contributions

 

డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ ఆగస్టు 18, 1886న ఫీరోజ్‌పూర్ పంజాబ్‌లో జన్మించారు. చౌదరి వలీ మొహమ్మద్ పంజాబ్‌లోని లాహోర్ కళాశాల నుండి B.Sc. మరియు M.Sc. డిగ్రీల పొందినాడు. . 1907లో  MAO కళాశాల అందు భౌతిక శాస్త్రానికి సంబంధించిన తొలి ఉపాధ్యాయులలో ఒకరిగా చేరాడు. 1908 లో వలీ మొహమ్మద్‌ను MAO కాలేజ్ మేనేజ్‌మెంట్ ఫిజిక్స్‌లో ఉన్నత చదువుల కోసం ఆఘాఖాన్ స్కాలర్‌షిప్ క్రింద  ఇంగ్లండ్‌కు పంపింది. చౌదరి వలీ మొహమ్మద్ కేంబ్రిడ్జ్ అందు నేచురల్ సైన్స్‌లో ట్రిపోస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. చౌదరి వలీ మొహమ్మద్ ఆ తరువాత, 1912 లో గోట్టింగెన్ విశ్వవిద్యాలయం (జర్మనీ) నుండి డాక్టరేట్ పొందాడు.

1912లో అలీఘర్‌కు తిరిగి వచ్చిన తర్వాతడాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ 1912-1919 మధ్య కాలంలో భౌతికశాస్త్ర విభాగానికి ప్రొఫెసర్‌గా మరియు హెడ్‌గా పనిచేశాడు. డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్‌లోని MAO కళాశాల ప్రిన్సిపాల్‌గా కొంతకాలం అంటే మార్చి 1919 నుండి మే 1919 వరకు పనిచేశాడు.

అక్టోబరు 1919లోడాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ భారత ప్రభుత్వ విద్యా శాఖలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో సభ్యుడు మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, డాకా విశ్వవిద్యాలయం మరియు నాగ్‌పూర్ విశ్వవిద్యాలయాల బిల్లులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు.

1921లోడాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ లక్నో విశ్వవిద్యాలయంలో మొదటి ప్రొఫెసర్ మరియు ఫిజిక్స్ విభాగాధిపతిగా 1945 వరకు పనిచేశాడు. 1943లో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ స్థాపనకు నియమించబడిన ప్రణాళికా సంఘం సభ్యులలో ఒకరుగా పనిచేసాడు.. 1946 లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా కొద్ది కాలం పాటు నియమించబడ్డాడు..

డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల ప్రయోజనం కోసం ఒక పెద్ద ట్రస్ట్‌ను స్థాపించాడు మరియు యూరప్‌లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు మరియు ఇన్‌స్టిట్యూట్‌లలో మరియు మన దేశంలోని ఇతర ప్రాంతాలలో పరిశోధన చేసే యువ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం MAO కాలేజీలో కార్పస్ ఫండ్‌ను స్థాపించాడు,. లక్నో యూనివర్శిటీలో ఎమ్మెస్సీ-ఎలక్ట్రానిక్.లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థికి ఎవెలిన్ వలీ మహ్మద్ గోల్డ్ మెడల్‌ను కూడా ప్రారంభించాడు.

విభజన తరువాతడాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ 1948లో లండన్‌కు వలస వెళ్లి అక్కడ సైన్స్ విద్య కోసం పనిచేశాడు. 1957లో,డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ వివిధ బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో సైన్స్, టెక్నాలజీ మరియు మెడిసిన్‌లో ఉన్నత పరిశోధనలను అభ్యసించే  విద్యార్థుల కోసం  ఎడిత్ ఎవెలిన్ వలీ ముహమ్మద్ ట్రస్ట్‌ను స్థాపించాడు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం కు  తన ఆస్తి- ఇల్లు వలి మంజిల్ మరియు నదీమ్ తరిన్ హాల్ ఉన్న భూమి మరియు అరుదైన తన పుస్తకాలు విరాళంగా ఇచ్చాడు.

డైనమిక్ ఫిజిక్స్ టీచర్ మరియు అడ్మినిస్ట్రేటర్‌గా ఉండటమే కాకుండాడాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ లైబ్రరీ వ్యవహారాలపై కూడా చాలా ఆసక్తిని కనబరిచాడు. డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్‌లో ఉన్నప్పుడు, లిట్టన్ లైబ్రరీ కు లైబ్రేరియన్‌గా పనిచేశాడు. లక్నో యూనివర్శిటీలో, ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ విస్తరణకు కృషి చేయడంతో పాటు టాగోర్ లైబ్రరీగా పిలువబడే ఆధునిక లైబ్రరీని ఏర్పాటు చేశాడు. ఆల్ ఇండియా లైబ్రరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ స్పెక్ట్రోస్కోపీ, మాగ్నెటో-ఆప్టిక్స్ మరియు వైర్‌లెస్ ఆపరేషన్లలో నైపుణ్యం కలిగి ఉన్నారు. లిట్రో మౌంటు స్పెక్ట్రోగ్రాఫ్‌తో స్పెక్ట్రల్ లైన్‌ల హైపర్‌ఫైన్ స్ట్రక్చర్‌పై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ పరిశోధన చేసినాడు. భారతీయ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులో వైర్‌లెస్‌ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్. అయానోస్పిరిక్ రిఫ్లెక్షన్‌పై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ పరిశోధన కోసం AMU ఫిజిక్స్ విభాగంలో తక్కువ-పవర్ మీడియం-వేవ్ రేడియో ట్రాన్స్‌మిటర్‌ ఏర్పాటు  చేయబడినది. 

డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ (INSA) యొక్క ఫౌండేషన్ ఫెలో. డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ అలీఘర్‌లోని సర్ సయ్యద్ యొక్క 'సైంటిఫిక్ సొసైటీ' పునరుద్ధరణకు కూడా పనిచేశాడు మరియు 1907-1908 మరియు 1914-1915 సెషన్‌లలో వరుసగా సైంటిఫిక్ సొసైటీ, అలీఘర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. 1914లో డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ MAO కాలేజీలో ఫోటోగ్రాఫిక్ సొసైటీని కూడా ప్రవేశపెట్టాడు.

డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ సైంటిఫిక్ సొసైటీ వేదిక ద్వారా భౌతిక శాస్త్రంలోని వివిధ అంశాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. 1908 జూన్ 24న స్ట్రాచీ హాల్‌లోని MAO కళాశాల విద్యార్థుల కోసం X-కిరణాలపై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ ఉపన్యాస౦  ఇచ్చినాడు.  1925లో, అలహాబాద్ విశ్వవిద్యాలయం యొక్క ఫెలో గా, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విద్య యొక్క స్థితిని విమర్శనాత్మకంగా మూల్యాంకనం చేస్తూ డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ఒక బుక్‌లెట్ కూడా రాశారు.

డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ 1917లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1917లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సెషన్‌లో డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ చేసిన అధ్యక్ష ప్రసంగం టిమ్-ఉల్-మ్రయా-వా-అల్ మనజీర్' Tim-ul-Mraya-wa-al Manazir పేరుతో 1918లో అలీఘర్ ఇన్‌స్టిట్యూట్ ప్రెస్, అలీఘర్ ద్వారా ప్రచురించబడింది.. భౌతికశాస్త్రంపై డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ వ్యాసం ఉక్దా కైనాత్ బజారియా ఇల్మ్-ఎ-హయ్యర్ Uqda Kainat Bazariya Ilm-e-Hayyar’ ' జూన్ 1908లో అలీఘర్ మాసపత్రికలో వచ్చింది.

కేంబ్రిడ్జ్ విద్యావ్యవస్థపై డాక్టర్ వలీ మొహమ్మద్ యొక్క వ్యాసం 'కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకే దిల్చాస్ప్ హలత్ Cambridge University ke Dilchasp Halat’ ' 26 మే 1909న "అలీఘర్ ఇన్స్టిట్యూట్ గెజిట్"లో ప్రచురించబడింది. "అలీఘర్ ఇన్స్టిట్యూట్ గెజిట్‌లో వచ్చిన వలీ మొహమ్మద్ ఇతర వ్యాసాలు: 'విలాయత్ కే అఖ్బరత్ క్యోంకర్ చాప్తయ్ హై? – లండన్ కే మత్బత్ మే ఐక్ దిన్' (15 సెప్టెంబర్ 1909), 'సిక్కే కైసే మజ్రూబ్ హోతే హైన్ (22 సెప్టెంబర్ 1909), 'ఐక్ జపానీ ముదర్రిస్ కా దస్తూర్-ఉల్-అమల్ (22 సెప్టెంబర్ 1909), 'విలాయత్ మే అంద్బే బచ్చే కైసే పార్థే హైన్ -అంధే బచ్చన్ కే స్కూల్ మే ఐక్ దిన్' (29, సెప్టెంబర్ 1909) Wilayat ke Akhbarat Kyonkar Chaptay Hain? – London ke Matbat me Aik Din’ (15th September 1909), ‘Sikkay Kaise Mazroob hotay Hain (22nd September 1909), ‘Aik Japani Mudarris ka Dastoor-ul-Amal (22 September 1909), ‘Wilayat me Andbe Bacche kaise Parthe Hain-Andhe Bacchon ke School me Aik Din’ (29, September 1909).. అలీగఢ్ కాలేజ్ కే మౌజూదా హలత్ Aligarh College ke Maujooda Halatఅనే వ్యాసం 16 మార్చి 1919న అలీఘర్ ఇన్‌స్టిట్యూట్ గెజిట్‌లో వచ్చింది. డాక్టర్చౌదరి వలీ మొహమ్మద్ 24 జూన్ 1968న అలీఘర్‌లో మరణించాడు.


రిఫరెన్స్:

1. అలీఘర్ ఇన్‌స్టిట్యూట్ గెజిట్ (23 సెప్టెంబర్ 1908, 26 మే 1909, 6 ఫిబ్రవరి 1918, మరియు 4 నవంబర్ 1915),

2. అలీఘర్ మాసపత్రిక (జూన్ 1908)

3. డాక్టర్ చౌదరి వలీ మొహమ్మద్ కాలేజ్ కే పెహ్లే హిందుస్థానీ ప్రిన్సిపాల్ ఔర్ మబీర్-ఎ- తబయ్యత్ చే డాక్టర్ అసద్ ఫైసల్ ఫరూఖీ, ఫికర్-ఓ-నాజర్, అలీఘర్ జూన్ 2021

4. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ కంట్రిబ్యూషన్స్ అండ్ అచీవ్‌మెంట్స్, డ్యూటీ సొసైటీ, అలీఘర్, 1989.

5. ది నైన్ ఫ్యాకల్టీ జెమ్స్ ఆఫ్ లక్నో యూనివర్సిటీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, నవంబర్ 16, 2019.

6. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వెబ్‌సైట్, Insaindia.res.in సావనీర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, 2012

7. ఇండియన్ లైబ్రరీ క్రోనాలజీ బై PSG కుమార్, అలైడ్ పబ్లిషర్స్ ఢిల్లీ, 2000

8. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వలీ మొహమ్మద్ మరణానికి సంతాపం, 8 సెప్టెంబర్ 1968 ముస్లిం యూనివర్సిటీ గెజిట్

References

1. Aligarh Institute Gazette (23 September 1908, 26 May 1909, 6 February 1918, and 4th November 1915),

2. Aligarh Monthly (June 1908)

3. Dr. Chaudhary Wali Mohammad College Ke Pehle Hindustani Principal Aur Mabir-e- Tabayyat by Dr. Asad Faisal Farooqui, Fikr-o-Nazar, Aligarh June 2021

4. Aligarh Muslim University Contributions and Achievements, Duty Society, Aligarh, 1989.

5. The Nine Faculty Gems of Lucknow University, Times of India, November 16, 2019.

6. Website of Indian National  Science Academy, Insaindia.res.in Souvenir Department of Physics,  Aligarh Muslim University, 2012

7. Indian Library Chronology by PSG Kumar, Allied Publishers Delhi, 2000

8. University Mourns Professor Wali Mohammad’s death, 8 September 1968 Muslim University Gazette

 

27 August 2024

ఇస్లాం మీద బెర్ట్రాండ్ రస్సెల్ Bertrand Russell on Islam

 



పాశ్చాత్యులు సైన్స్ మరియు ఫిలాసఫీ రంగంలో ముస్లింల సహకారాన్ని కొనియాడారు. పాశ్చాత తత్వవేత్త రస్సెల్ తన ప్రసిద్ధ రచన హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీలో సైన్స్, ఫిలాసఫీ, ఎకానమీ, కళ, కవిత్వం మరియు వైద్యరంగాలలో  ఇస్లాం మరియు ముస్లిం నాగరికత యొక్క సహకారాన్ని బహిరంగంగా అంగీకరించారు..

ఇస్లామిక్ బోధనల వెనుక ఉన్న తర్కం గురించి మాట్లాడుతూ రస్సెల్ క్రైస్తవ పిడివాదంతో పోలిస్తే ఇస్లాంను అభినందిస్తున్నాడు:ప్రవక్త (స) యొక్క మతం సాధారణ ఏకేశ్వరోపాసన.  అది క్రైస్తవ  ట్రినిటీ లేదా క్రైస్తవ వేదాంతశాస్త్రం అంత సంక్లిష్టంగా లేదు. దైవప్రవక్త (స) తనను తానూ దైవంగా భావించలేదు లేదా ఆయన అనుచరులు అలాంటి వాదన చేయలేదు.  చెక్కిన చిత్రాల graven images పై యూదుల నిషేధాన్ని ముహమ్మద్ ప్రవక్త(స) పునరుద్ధరించారు  మరియు వైన్ వాడకాన్ని నిషేధించారు. ఇస్లాం వ్యాప్తి కోసం సాధ్యమైనంత ఎక్కువ ప్రపంచాన్ని జయించడం విశ్వాసుల కర్తవ్యం, కానీ క్రైస్తవులు, యూదులు లేదా జొరాస్ట్రియన్లను హింసించకూడదు. "పుస్తక/గ్రంధ  ప్రజలు", అని ఖురాన్ క్రైస్తవులు, యూదులను,అగ్ని ఆరాధకులను గౌరవంగా    పిలుస్తుంది..

ఇస్లాం తీసుకువచ్చిన రక్తరహిత విప్లవానికి గొప్ప నివాళులు అర్పిస్తూ, ప్రపంచంలోని అరాచక వాతావరణంలో ఇస్లాం క్రమాన్ని order నెలకొల్పినదని రస్సెల్ పేర్కొన్నాడు: "ఎక్కువ తీవ్రమైన పోరాటం లేకుండా వారు సామ్రాజ్యాలను  స్వాధీనం చేసుకున్నందున, తక్కువ విధ్వంసం జరిగింది మరియు పౌర పరిపాలన దాదాపుగా మారలేదు. పర్షియాలో మరియు బైజాంటైన్ సామ్రాజ్యంలో పౌర ప్రభుత్వం అత్యంత వ్యవస్థీకృతమైంది.

ఖలీఫా హరున్ రషీద్ గొప్పతనాన్ని వివరిస్తూ రస్సెల్ ఇలా అన్నాడు:-హరున్-అల్-రషీద్ (మ. 809), చార్లెమాగ్నే మరియు ఎంప్రెస్ ఐరీన్‌ల సమకాలీనుడు మరియు అరేబియన్ నైట్స్ ద్వారా అందరికీ సుపరిచితుడు. హరున్-అల్-రషీద్ ఆస్థానం లగ్జరీ, కవిత్వం మరియు విజ్ఞానానికి ఒక అద్భుతమైన కేంద్రం; అతని ఆదాయం అపారమైనది; అతని సామ్రాజ్యం జిబ్రాల్టర్ జలసంధి నుండి సింధు వరకు విస్తరించింది. అతని సంకల్పం సంపూర్ణమైనది; వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది, తూర్పు మరియు పడమరల మధ్య ఖాలిఫేట్/ఇస్లామిక్ సామ్రాజ్యం  ఒక కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది

ముస్లింల ఆర్థిక శాస్త్ర సహకారాన్ని వివరిస్తూ, వ్యాపార వృత్తికి ఇస్లాం లో ఉన్న గౌరవ స్థితిని రస్సెల్ ప్రశంసించాడు: "అపారమైన సంపదను కలిగి ఉండటం వలన చైనా నుండి పట్టు మరియు ఉత్తర ఐరోపా నుండి బొచ్చు వంటి ఖరీదైన వస్తువులకు డిమాండ్ ఏర్పడటమే కాకుండా, ముస్లిం సామ్రాజ్యం యొక్క విస్తారమైన పరిధి, అరబిక్ బాష వ్యాప్తి వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా వాణిజ్యం ప్రోత్సహించబడింది. అరబిక్ ప్రపంచ వ్యాపార భాషగా మారింది  మరియు ముస్లిం నైతిక వ్యవస్థలో వ్యాపారికి ఉన్నతమైన హోదాను కేటాయించారు; ప్రవక్త (స) స్వయంగా ఒక వ్యాపారి అని మరియు మక్కా తీర్థయాత్ర సమయంలో వ్యాపారాన్ని మెచ్చుకున్నారని రస్సెల్ గుర్తు చేసుకున్నారు."

ముస్లిముల వాణిజ్యం, అరబ్బులు రోమన్లు ​​మరియు పర్షియన్ల నుండి వారసత్వంగా పొందిన గొప్ప రహదారులపై ఆధారపడింది మరియు వారు వాటిని  అభివృద్ధి చేసారు. అయితే, క్రమంగా, ఇస్లామిక్ సామ్రాజ్యం - స్పెయిన్, పర్షియా, ఉత్తర ఆఫ్రికా మరియు ఈజిప్ట్ గా విడిపోయి, అవి పూర్తి లేదా దాదాపు పూర్తి స్వాతంత్ర్యం పొందాయి. నీటిపారుదల వ్యవస్థను  వారు అబివృద్ది చేసారు . అరబ్ నీటిపారుదల పనుల ద్వారా నేటికీ స్పానిష్ వ్యవసాయం లాభాలను పొందుతోంది.

రస్సెల్ ప్రకారం ముస్లింలు  ప్లేటో యొక్క ఆదర్శవాదం కంటే అరిస్టాటిల్ యొక్క వాస్తవికతకు ఎక్కువ మొగ్గు చూపారు. "ముస్లిం ప్రపంచం యొక్క విలక్షణమైన సంస్కృతి,సిరియాలో ప్రారంభమైనప్పటికీ, తూర్పు మరియు పాశ్చాత్య అంత్య ప్రాంతాలు, పర్షియా మరియు స్పెయిన్లలో చాలా త్వరగా అభివృద్ధి చెందింది. సిరియన్లు, ఆక్రమణ సమయంలో, అరిస్టాటిల్ యొక్క ఆరాధకులు. అరబ్బులు గ్రీకు తత్వశాస్త్ర జ్ఞానాన్ని మొదట సిరియన్ల నుండి పొందారు, అందువలన, మొదటి నుండి, వారు ప్లేటో కంటే అరిస్టాటిల్‌  జ్ఞానమునే ముఖ్యమైనదిగా భావించారు.. కిండి (d. ca. 873), అరబిక్‌లో మొదటిసారిగా తత్వశాస్త్రాన్ని రచించాడు మరియు స్వయంగా అరబ్ అయిన ఏకైక తత్వవేత్త, ఎనిడ్స్ ఆఫ్ ప్లాటినస్ యొక్క భాగాలను అనువదించాడు మరియు కిండి తన అనువాదాన్ని ది థియాలజీ ఆఫ్ అరిస్టాటిల్ పేరుతో ప్రచురించాడు.

అరబ్బులు కేవలం గ్రీకు శాస్త్రాలకు మాత్రమే పరిమితం కాలేదు భారతీయ శాస్త్రాల నుండి కూడా ప్రయోజనం పొందారు. రస్సెల్ విజ్ఞానం పట్ల ప్రారంభ ముస్లింల విశ్వవ్యాప్త యోగ్యతను ఆమోదించాడు:పర్షియాలో, ముస్లింలు భారతదేశంతో పరిచయం కలిగి ఉన్నారు. వారు ఎనిమిదవ శతాబ్దంలో ఖగోళ శాస్త్రంలో తమ మొదటి జ్ఞానాన్ని సంస్కృత రచనల నుండి పొందారు. 830లో, సంస్కృతం నుండి గణిత మరియు ఖగోళ శాస్త్ర పుస్తకాల అనువాదకుడు అయిన ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారాజ్మీ అరబిక్ లో అనువదించిన ఒక పుస్తకము  పన్నెండవ శతాబ్దంలో అల్గోరిట్మి డి న్యూమెరో ఇండోరమ్ పేరుతో Algoritmi de numero Indorum పేరుతో తిరిగి లాటిన్‌లోకి అనువదించబడినది.  ఈ పుస్తకం నుండి పాశ్చాత్యులు   మొదట "అరబిక్" సంఖ్యలను  నేర్చుకొన్నారు. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారాజ్మీ బీజగణితంపై ఒక పుస్తకాన్ని రాశారు, దీనిని పాశ్చాత్య దేశాల్లో పుస్తకం గా పదహారవ శతాబ్దం వరకు ఉపయోగించారు."

ఇస్లాం పెర్షియన్ నాగరికతను మార్చింది మరియు తద్వారా గొప్ప మేధోపరమైన ఆధ్యాత్మిక మరియు కళాత్మక వికాసానికి మార్గం సుగమం చేసింది:"పదమూడవ శతాబ్దంలో మంగోలుల దండయాత్ర వరకు పర్షియన్ నాగరికత మేధోపరంగా మరియు కళాత్మకంగా ఉన్నత స్థాయిలో ఉంది, మంగోలుల దండయాత్ర నుండి అది కోలుకోలేదు. కవి మరియు గణిత శాస్త్రజ్ఞుడు అయిన ఒమర్ ఖయ్యామ్, 1079లో క్యాలెండర్‌ను సంస్కరించాడు. పర్షియన్లు గొప్ప కవులు: షహనామా రచయిత ఫిర్దౌసీ (సుమారు 941), హోమర్‌తో సమానమని ఫిర్దౌసీని చదివిన వారు చెప్పారు. సూఫీ తత్వవేత్తలు, నియోప్లాటోనిక్ స్వభావం కలవారు. ముస్లింల తత్వశాస్త్రం సంపూర్ణమైన విధానం మరియు సహజ శాస్త్రాలను గొప్ప తాత్విక ఆదర్శాలతో మిళితం చేసింది:

అరబిక్ తత్వవేత్తలు, రసవాదం, జ్యోతిషశాస్త్రం, ఖగోళశాస్త్రం మరియు జంతుశాస్త్రంలో ఆసక్తిని కలిగి ఉంటారు, ఇద్దరు మహమ్మదీయ తత్వవేత్తలు, ఒకరు పర్షియన్ అవిసెన్నా మరియు రెండోవారు  స్పెయిన్‌ కు చెందిన అవెర్రోస్. వీరిలో మొదటివారు  మహమ్మదీయులలో, రెండవవారు  క్రైస్తవులలో ప్రసిద్ధమైనారు..

అవిసెన్నా (ఇబ్న్ సినా) (980-1037) బొఖారా ప్రావిన్స్‌లో జన్మించాడు; ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో అవిసెన్నా మొదట ఖివా, తరువాత ఖొరాస్సాన్ వెళ్ళాడు. కొంతకాలం ఇస్పాహాన్‌లో వైద్యం మరియు తత్వశాస్త్రం బోధించాడు; తర్వాత అవిసెన్నా టెహరాన్‌లో స్థిరపడ్డాడు. అవిసెన్నా తత్వశాస్త్రంలో కంటే వైద్యంలో మరింత ప్రసిద్ధి చెందాడు. పన్నెండవ నుండి పదిహేడవ శతాబ్దం వరకు, అవిసెన్నా ఐరోపాలో వైద్యానికి మార్గదర్శకంగా ఉపయోగించబడ్డాడు.

అవిసెన్నా ఒక ఎన్సైక్లోపీడియా రచయిత, తన లాటిన్ అనువాదాల ద్వారా పశ్చిమ దేశాలలో ప్రభావం చూపాడు. అవిసెన్నా మనస్తత్వశాస్త్రం అనుభావిక ధోరణి empirical tendency ని కలిగి ఉంది. అవిసెన్నా తత్వశాస్త్రం అరిస్టాటిల్‌కు దగ్గరగా ఉంది 

క్రైస్తవ ప్రపంచం లో అవర్రోస్ గ పిలువబడే ఇబ్న్ రష్ద్ 1128 C.E. లో స్పెయిన్లోని కార్డోవా లో జన్మించాడు. అవర్రోస్ ప్రపంచంలోని  గొప్ప ఆలోచనాపరులు మరియు శాస్త్రవేత్తలలో ఒకడు. .  అవర్రోస్ అరిస్టాటిల్ రచనల పై మరియు ప్లేటో యొక్క "ది రిపబ్లిక్" పై వ్యాఖ్యానాలు చేశాడు. తరువాత క్రైస్తవ విద్యావేత్తల వలె, అవర్రోస్ సార్వత్రిక సమస్యలను చర్చించాడు. అవి విషయాలకు పూర్వం అని ప్లేటో చెప్పారు

 అరిస్టాటిల్‌కు రెండు అభిప్రాయాలు ఉన్నాయి, ఒకటి అతను ఆలోచిస్తున్నప్పుడు మరియు మరొకటి అతను ప్లేటోతో విబేదిస్తున్నప్పుడు . ఇది వ్యాఖ్యాతగా అరిస్టాటిల్‌ స్థానాన్ని స్థిరపరుస్తుంది. అవిసెన్నా ఒక సూత్రాన్ని కనిపెట్టాడు, దీనిని అవెరోస్ మరియు అల్బెర్టస్ మాగ్నస్ పునరావృతం చేశారు: "ఆలోచన రూపాల్లో సాధారణతను తెస్తుంది"Thought brings about the generality in forms."

ముస్లింలు మరియు పశ్చిమ దేశాలు ఇద్దరూ ముస్లింల యొక్క అద్భుతమైన గతం యొక్క పై వివరణలను గమనించాలి.