12 November 2024

భారతదేశంలో ముస్లిం జనాభా- అపోహలు మరియు వాస్తవికత Muslim Population in India: Myth and Reality

 



 

మాజీ చీఫ్  ఎలక్షన్ కమీషనర్ ఎస్ వై ఖురైషీ రచించిన "ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా The Population Myth: Islam, Family Planning and Politics in India " అనే కొత్త పుస్తకం భారతదేశంలోని ముస్లిం జనాభా గురించి అపోహలు మరియు వాస్తవికతను చర్చిస్తుంది.

"ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా" అనే పుస్తకం భారతదేశంలోని ముస్లిం జనాభా గురించి అనేక "అపోహలను"తొలగిస్తుంది.


భారత దేశం లోని ముస్లిం జనాభా పై అపోహలు:

Ø మొదటి అపోహ:

ముస్లింలు చాలా మంది పిల్లలను ఉత్పత్తి చేస్తారు మరియు భారతదేశంలో జనాభా విస్ఫోటనానికి పూర్తిగా బాధ్యత వహిస్తారు.

తులనాత్మక డేటా ప్రకారం హిందువుల కుటుంబ నియంత్రణ డేటా 54.4%, ముస్లింల కుటుంబ నియంత్రణ డేటా 45.3%.

హిందువులలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 2.13% ముస్లింలలో  మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 2.61%.

హిందువుల కంటే ముస్లింలు వారి సామాజిక-ఆర్థిక స్థితి కారణంగా చాలా వెనుకబడి ఉన్నారు. ముస్లింల సామాజిక-ఆర్థిక ప్రొఫైల్ మెరుగుపడటంతో, అంతరం కూడా తగ్గుతుంది.


Ø రెండోవ అపోహ:

భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుదల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తోంది.

1951లో భారతదేశ జనాభా నిష్పత్తి  ముస్లింలలో 9.8% నుండి 2011లో 14.2%కి పెరిగింది, అయితే ఇది 60 ఏళ్లలో 4.4% పెరిగింది.

హిందువుల జనాభా 84.2% నుండి 79.8%కి క్షీణించడం జరిగింది.  

ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబిస్తున్నారు  మరియు వారి జనాభా పెరుగుదల రేటు హిందువుల కంటే వేగంగా క్షీణించడం జరుగుతుంది.  

ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుదల fertility rate జరిగింది. ముస్లింలు మరియు హిందువుల మధ్య పిల్లల సంఖ్యలో అంతరం కేవలం ఒక బిడ్డకు తగ్గింది.

కుటుంబ నియంత్రణకు ఇస్లాం వ్యతిరేకం కాదు. "హమ్ దో హమారే బరాహ్" అనేది ముస్లింలలో జనాభా విస్ఫోటనం గురించి సృష్టించిన అపోహ మాత్రమె..


Ø మూడోవ అపోహ:

భారతదేశంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి హిందూ జనాభాను అధిగమించేందుకు ముస్లింలు వ్యవస్థీకృత కుట్ర చేస్తున్నారని ఆరోపణ. దానికి ఆధారాలు లేవు. అది కేవలం ప్రాపగండా/"ప్రచారం మాత్రమె.


Ø నాల్గోవ అపోహ:

ముస్లింలు స్వతహాగా బహుభార్యత్వం కలిగి ఉంటారు, ఎందుకంటే వారి మతం వారికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.

భారతదేశంలోని అన్ని వర్గాలలో బహుభార్యత్వం ఉందని 1975లో ప్రభుత్వ అధ్యయనంలో తేలింది.

భారతదేశంలోని అన్ని వర్గాలలో ముస్లింలలో  బహుభార్యత్వం తక్కువ.

లింగ నిష్పత్తి (1,000 మంది పురుషులకు 924 మంది స్త్రీలు మాత్రమే) కాబట్టి ముస్లిం బహుభార్యాత్వం భారతదేశంలో గణాంకపరంగా సాధ్యం కాదు. అంతేకాకుండా, బహుభార్యత్వం అనేది వ్యక్తి యొక్క ఆర్థిక సంపదకు సంబంధించినది. భారత దేశం లో ముస్లింలు చాలా పేదవారు,

ముస్లింలు బహుభార్యత్వం వహిస్తున్నారని అనేది  కేవలం మీడియా ప్రచారం మాత్రమే.

 

తల్లితండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళని స్మరించుకోవడం Remembering Our Parents After They Pass

 



తల్లిదండ్రుల పట్ల దయ చూపడం విశ్వాసి పై ఉన్న ప్రధాన కర్తవ్యాలలో ఒకటి అని చెప్పబడింది.

·       దివ్య ఖురాన్ లో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: నీ ప్రభువు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు అతనిని తప్ప మరెవరినీ ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రుల యెడల ఉత్తమ రీతిలో వ్యవరించండి. వారిలో ఒకరు లేదా వారిద్దరూ గాని నీ ముందరే వృద్ధాప్యం పొందినట్లయితే, వారిని విసుగ్గా ఛీ, ఛీ అనకండికసురుకోకు.వారితో మంచిగా  మాట మాట్లాడండి. (అల్-ఇస్రా: 23)

తల్లిదండ్రుల పట్ల అన్ని రకాల దయ చూపాలి. తల్లిదండ్రుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా సూచించబడిన పెద్ద పాపం. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చేయడం చాలా గొప్పది, అందువల్ల ఈ దయను చెడుగా తిరిగి ఇవ్వడం ఒక భయంకరమైన బహుమతి.

అటువంటి వ్యక్తి చేయవలసింది ఏమిటంటే, అల్లాహ్‌ను క్షమాపణ అడగడం మరియు చేసినదానికి చింతించడం. అదనంగా, అతను చనిపోయిన తల్లిదండ్రుల కోసం వేడుకోవడం మరియు వారి కోసం దానధర్మాలు చేయడం మొదలైనవి చేయవలయును.

తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతలు, వారి మరణంతో ఆగిపోవు; మనం జీవించి ఉన్నంత కాలం అవి కొనసాగుతాయి.

·       ఇమామ్ అల్-బుఖారీ తన ప్రసిద్ధ రచన అల్-అదాబ్ అల్-ముఫ్రాద్‌లో ఈ విధంగా ఉదహరించినాడు. "ఒక వ్యక్తి ప్రవక్త(స) వద్దకు ఇలా అడిగాడు, "నా తల్లితండ్రుల మరణానంతరం వారి పట్ల దయతో నేను ఏదైనా చేయవలసి ఉందా?" ప్రవక్త(స) ఇలా సమాధానమిచ్చారు, “అవును, మీరు చేయవలసిన నాలుగు విషయాలు ఉన్నాయి: వారి తరపున అల్లాహ్‌ను ప్రార్థించడం మరియు క్షమాపణ అడగడం, వారి వాగ్దానాలను నెరవేర్చడం, వారి స్నేహితులను గౌరవించడం మరియు వారి బంధుత్వ సంబంధాలను పెంపొందించడం…”

తల్లితండ్రుల మరణానంతరం వారి సంబంధికులతో, స్నేహితులతో సంబంధ బాంధవ్యములను కోనసాగించ వలయును.

11 November 2024

ప్రతి 5.73 లక్షల మంది ముస్లింలలో ఒక IAS/IPS అధికారి మాత్రమే Only One IAS/IPS Officer Among Every 5.73 Lakh Muslims

 

న్యూఢిల్లీ –

గత ఏడున్నర దశాబ్దాలుగా,  సివిల్ సర్వీసెస్ పరీక్షలలో (సిఎస్‌ఇ CSE) దేశంలోని అతిపెద్ద మైనారిటీవర్గం అయిన ముస్లింల భాగస్వామ్యం మరియు వారి విజయాల శాతం సంతృప్తికరంగా లేవు అని కొత్త పుస్తకం 'ముస్లిమ్స్ ఇన్ ఇండియా - ఫేక్ నేరేటివ్స్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్ Muslims in India – Fake Narratives versus Ground Realities' లో పొందుపరచిన గణాంకాల ప్రకారం తెలుస్తుంది.

భారత దేశం లో ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే CSE లో ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)లో ప్రతిష్టాత్మకమైన స్థానాలకు ఎంపిక అవుతారు.

ప్రతి సంవత్సరం, 10 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు CSE ప్రిలిమ్స్‌కు హాజరవుతారు, వీరిలో ఒక శాతం లేదా 10,000 మంది మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం తుది ఎంపికల సంఖ్య దాదాపు 1,000+ ఉంటుంది.

భారతదేశంలో బ్రిటిష్ రాజ్ సమయంలో అక్టోబర్ 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఇది లండన్‌లో మొదటిసారిగా ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) పరీక్షలను నిర్వహించింది. 1869 వరకు, 16 మంది భారతీయులు ICS పరీక్షలకు హాజరయ్యారు, కానీ ఒకరు మాత్రమే విజయం సాధించగలిగారు. 1914నాటి  ఐసిఎస్‌(ICS)  అధికారుల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే భారతీయులు.

1855 మరియు 1899 మధ్య, 14 మంది ICS అధికారులు ఉన్నారు, ఇందులో కాన్పూర్‌కు చెందిన ఒక ముస్లిం ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అబ్దుల్లా యూసుఫ్ అలీ (ఏడవ ర్యాంక్ హోల్డర్) 1914లో రాజీనామా చేశారు. 1900 నుండి 1947 వరకు, మొత్తం 40 మంది ICS అధికారులలో మొహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ ఒక్కరే ముస్లిం.

స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, 980 మంది ICS అధికారులలో 101 మంది ముస్లింలు, 25 మంది భారతీయ క్రైస్తవులు, 13 పార్సీలు మరియు 10 మంది సిక్కులు ఉన్నారు.

స్వాతంత్ర్యం తరువాత, ICS స్థానంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) వచ్చింది. IAS అధికారుల యొక్క మొదటి బ్యాచ్ 1948లో రిక్రూట్ చేయబడింది, ICS అధికారుల సంఖ్య 242గా ఉంది.

 1958లో కేవలం ఇద్దరు ముస్లింలు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు, (1993-94లో భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక ముస్లిం క్యాబినెట్ సెక్రటరీ అయిన జాఫర్ సైఫుల్లాతో సహా).

యూపీఎస్సీలో చైర్మన్లు, సభ్యులుగా ముస్లింల ప్రాతినిధ్యం అల్పం. మొత్తం 32 మంది ఛైర్‌పర్సన్‌లలో ముగ్గురు మాత్రమే ముస్లింలు - డాక్టర్ ఎఆర్ కిద్వాయ్ (1973-79), జెఎమ్ ఖురేషి (1996-98), మరియు డాక్టర్ ఎస్ఆర్ హషీమ్ (2005-06).

UPSC సభ్యులలో 16 మంది ఇప్పటి వరకు ముస్లింలు., 2027 మరియు 2030 మధ్య పదవీకాలం ముగియనున్న ప్రస్తుతం ఉన్న ఆరుగురు సభ్యులలో ముస్లిం లేరు.

యూపీఎస్సీ 162 మంది అధికారులలో పరీక్షల డైరెక్టర్ ఇమ్రాన్ ఫరీద్‌తో సహా నలుగురు ముస్లింలు మాత్రమే ఉన్నారు.

జస్టిస్ సచార్ కమిటీ, మొత్తం 8,827 మంది అధికారుల (IAS, IPS మరియు IFS) పౌర సేవల జాబితాను విశ్లేషించిన తర్వాత, వారిలో ముస్లింలు కేవలం 3.2 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

·       2006లో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ముస్లింలు కేవలం 2.2 శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం 4,790 మంది ముస్లిం ఐఏఎస్ అధికారులు 108 మంది ఉన్నారు.

·       2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింల జనాభా 13.43 శాతం. ఆ ప్రమాణం ప్రకారం, దేశంలో ప్రతి 5.73 లక్షల మంది ముస్లింలలో ఒక IAS లేదా IPS అధికారి ఉన్నారు, ప్రతి 1.08 లక్షల మంది ముస్లిమేతరులలో ఒకరు IAS లేదా IPS అధికారి ఉన్నారు ఉన్నారు.

జూన్ 2014లో దేశంలోని 8,417 మంది IAS మరియు IPS అధికారులలో ముస్లింలు 3.46 శాతం ఉన్నారని వెల్లడైంది

మొదట్లో దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ముస్లిం ఐఏఎస్ అధికారులు ఎంపిక కాగా  ఈమధ్య అనగా 2000 నుంచి జమ్మూ కాశ్మీర్ మరియు కేరళ ఎక్కువ మంది ముస్లిం అధికారులు ఎంపిక అవుతున్నారు.

·       జనవరి 2014 ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రకారం ముస్లిం అభ్యర్థుల తక్కువ స్థాయి భాగస్వామ్యమే తక్కువ ప్రాతినిధ్యానికి మూల కారణం

1958 మరియు 2021 మధ్య కాలంలో 686 మంది ముస్లిం అభ్యర్థులు CSE కు తుది జాబితాలో చోటు పొందారు..

·       1971, 1972, 1975 మరియు 1976 సంవత్సరాల్లో CSE జాబితాలలో ముస్లింలు ఎవరూ లేరు.

·       1973, 1981, 1983 మరియు 1998లో ఒక్క ముస్లిం మాత్రమే జాబితాలో చేరగలిగారు.

·       1972 నుండి 2023 వరకు, CSEలో 54 మంది టాపర్‌లు ఉన్నారు. వారిలో ముగ్గురు ముస్లిములు కలరు. టాపర్ జాబితాలో మొదటి ముస్లిం 1978లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జావేద్ ఉస్మానీ. 1987లో బీహార్‌కు చెందిన అమీర్ సుభానీ టాపర్స్ క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన షా ఫైసల్‌ 22 సంవత్సరాలు తరువాత  2009 లో టాపర్ అయినాడు..

·       1951 నుండి 2020 వరకు ఏడు దశాబ్దాలలో, మొత్తం 11,569 IASలలో 411 మంది ముస్లింలు.

·       1948లో ప్రారంభమైన IPSకి మొత్తం 4,344 మందిలో ముస్లింలు 151 మంది ఉన్నారు.

·       1966లో ప్రారంభమైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) 2,151లో మొత్తం 35 మందిని కలిగి ఉంది.

·       2023లో మూడు సర్వీసుల్లోని(IAS,IPS, IFS) 11,959 మంది అధికారుల్లో 366 మంది ముస్లింలు ఉన్నారు

  

సివిల్ సర్వీసెస్ పరీక్షలలో (CSE) ముస్లింల పనితీరు

Performance of Muslims in Civil Services Examinations (CSE)

సంవత్సరం
Year


ఎంపికైన అభ్యర్థుల మొత్తం సంఖ్య

Total Number of Candidates Selected

ఎంపికైన మొత్తం ముస్లింఅభ్యర్థుల సంఖ్య


Total Number of Muslims Selected

1958

64

2

1971

35

0

1972

59

0

1973

116

1

1974

75

5

1975

65

0

1976

92

0

1977

212

6

1978

45

2

1979

50

2

1980

DNA

డేటా అందుబాటులో లేదు

Data Not Available

1981

126

1

1982

167

5

1983

235

1

1984

233

6

1985

214

4

1986

216

6

1987

178

5

1988

249

15

1989

246

13

1990

298

9

1991

217

8

1992

157

3

1993

147

2

1994

131

2

1995

91

8

1996

81

3

1997

76

3

1998

55

1

1999

56

2

2000

93

6

2001

427

9

2002

286

డేటా అందుబాటులో లేదు

Data Not Available

2003

413

9

2004

475

11

2005

422

11

2006

474

17

2007

734

27

2008

791

32

2009

791

31

2010

875

21

2011

920

31

2012

998

30

2013

1122

34

2014

1236

30

2015

1078

38

2016

1236

52

2017

1099

51

2018

990

28

2019

829

42

2020

761

31

2021

685

27

 

Source: క్లారియన్ ఇండియా, తేదీ 10-11-2024.