మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎస్ వై ఖురైషీ రచించిన "ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా The Population Myth: Islam, Family Planning and Politics in India " అనే కొత్త పుస్తకం భారతదేశంలోని ముస్లిం జనాభా గురించి అపోహలు మరియు వాస్తవికతను చర్చిస్తుంది.
"ది పాపులేషన్ మిత్: ఇస్లాం,
ఫ్యామిలీ
ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా" అనే పుస్తకం భారతదేశంలోని ముస్లిం జనాభా
గురించి అనేక "అపోహలను"తొలగిస్తుంది.
భారత దేశం లోని ముస్లిం జనాభా పై అపోహలు:
Ø మొదటి
అపోహ:
ముస్లింలు చాలా మంది పిల్లలను ఉత్పత్తి
చేస్తారు మరియు భారతదేశంలో జనాభా విస్ఫోటనానికి పూర్తిగా బాధ్యత వహిస్తారు.
తులనాత్మక డేటా ప్రకారం హిందువుల కుటుంబ
నియంత్రణ డేటా 54.4%, ముస్లింల కుటుంబ నియంత్రణ డేటా 45.3%.
హిందువులలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR)
2.13%
ముస్లింలలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR)
2.61%.
హిందువుల కంటే ముస్లింలు వారి సామాజిక-ఆర్థిక స్థితి కారణంగా చాలా వెనుకబడి ఉన్నారు. ముస్లింల సామాజిక-ఆర్థిక ప్రొఫైల్ మెరుగుపడటంతో, అంతరం కూడా తగ్గుతుంది.
Ø రెండోవ
అపోహ:
భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుదల
జనాభా సమతుల్యతను దెబ్బతీస్తోంది.
1951లో
భారతదేశ జనాభా నిష్పత్తి ముస్లింలలో 9.8%
నుండి 2011లో
14.2%కి
పెరిగింది, అయితే ఇది 60
ఏళ్లలో 4.4%
పెరిగింది.
హిందువుల జనాభా 84.2%
నుండి 79.8%కి
క్షీణించడం జరిగింది.
ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులను
అవలంబిస్తున్నారు మరియు వారి జనాభా
పెరుగుదల రేటు హిందువుల కంటే వేగంగా క్షీణించడం జరుగుతుంది.
ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుదల fertility
rate
జరిగింది. ముస్లింలు మరియు హిందువుల మధ్య పిల్లల సంఖ్యలో అంతరం కేవలం ఒక బిడ్డకు
తగ్గింది.
కుటుంబ నియంత్రణకు ఇస్లాం వ్యతిరేకం
కాదు. "హమ్ దో హమారే బరాహ్" అనేది ముస్లింలలో జనాభా విస్ఫోటనం గురించి
సృష్టించిన అపోహ మాత్రమె..
Ø మూడోవ
అపోహ:
భారతదేశంలో రాజకీయ అధికారాన్ని
చేజిక్కించుకోవడానికి హిందూ జనాభాను అధిగమించేందుకు ముస్లింలు వ్యవస్థీకృత కుట్ర
చేస్తున్నారని ఆరోపణ. దానికి ఆధారాలు లేవు. అది కేవలం ప్రాపగండా/"ప్రచారం
మాత్రమె.
Ø నాల్గోవ అపోహ:
ముస్లింలు స్వతహాగా బహుభార్యత్వం కలిగి
ఉంటారు,
ఎందుకంటే
వారి మతం వారికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.
భారతదేశంలోని అన్ని వర్గాలలో
బహుభార్యత్వం ఉందని 1975లో ప్రభుత్వ
అధ్యయనంలో తేలింది.
భారతదేశంలోని అన్ని వర్గాలలో ముస్లింలలో
బహుభార్యత్వం తక్కువ.
లింగ నిష్పత్తి (1,000 మంది పురుషులకు 924 మంది స్త్రీలు మాత్రమే) కాబట్టి ముస్లిం బహుభార్యాత్వం భారతదేశంలో గణాంకపరంగా సాధ్యం కాదు. అంతేకాకుండా, బహుభార్యత్వం అనేది వ్యక్తి యొక్క ఆర్థిక సంపదకు సంబంధించినది. భారత దేశం లో ముస్లింలు చాలా పేదవారు,
ముస్లింలు బహుభార్యత్వం వహిస్తున్నారని
అనేది కేవలం మీడియా ప్రచారం మాత్రమే.
No comments:
Post a Comment