11 December 2013

15 వ లోక సభ లోని ముస్లిం ఎం.పి. లు కొన్ని విశేషాలు

 క్రిందటి సంచికలలో భారత దేశం లోని వివిధ రాష్ట్రాలలోని ముస్లిం మంత్రులు, అదేవిదంగా ముస్లిం శాసన సబ్యుల సంఖ్య ను గురించి తెలుసుకొన్నాము. ఈ సంచికలో  దేశంలో కల్లా అత్యున్నత శాసనసభ ఐనా లోక సభ అనగా ప్రస్తుత 15 వ లోక్ సభ లోని ముస్లిం సబ్యుల సంఖ్య పై కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకొందాము. త్వరలో మనదేశం లో 16వ లోక్ సభ కు 2014 లో  సార్వత్రిక ఎన్నికలు జరగ పోతున్నాయి.. ఇటువంటి పరిస్తుతులలో  15 వ లోక్ సభ లో ఎంతమంది ముస్లిం సబ్యులు కలరో ఒకసారి పరిశీలించుదాము.

 

          భారత దేశాజనాభాలో ముస్లింల శాతం 15-20% వరకు ఉంది.వారి  జనాభా నిష్పత్తి ప్రకారం అయితే  లోక్ సభలో ఉండ వలసిన ముస్లిం సబ్యుల సంఖ్య 72. కానీ ప్రస్తుత లోక్ సభ అనగా 15 వ లోక్ సభ లోని మొత్తం ముస్లిం సబ్యుల సంఖ్య  30. ముస్లిం లోక్ సభ సబ్యులలో ప్రముఖులు సలాఉద్దీన్ ఒవైసీ, సల్మాన్ ఖుర్షీద్,మహమ్మద్ అజరుద్దీన్, E. అహ్మెద్, షానవాజ్ హుస్సైన్, ఫరూక్ అబ్దుల్లా, మహమ్మద్ హమీదుల్లా సయీద్ ముఖ్యులు.


          పార్టీల వారీగా చూస్తే వీరిలో 11మండి కాంగ్రెస్స్-ఐ కు, నేషనల్ కాన్ఫరెన్సు కు 4గురు, బి.ఎస్.పి. కు 4 గురు, తృణమూల్ కాంగ్రెస్స్ కు 3, ముస్లిం లీగ్ కు ఇరువురు, ఎం.ఐ.ఎం.కు ఒకరు, అస్సామ్ యునైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ కు ఒకరు, జనతా దాల్ యునైటెడ్ కు 1, డి.ఎం.క.కు ఒకరు, సి‌పి‌ఐ‌ఎం కు ఒకరు, బి.జే.పి.కు ఒకరు మొత్తం 30 మంది కలరు.


          ఇక రాష్ట్రాల వారీగా పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ నుండి ఒకరు, అస్సామ్ నుంచి ఇద్దరు, బీహార్ నుంచి ముగ్గురు, జమ్ము-కాశ్మీర్ నుంచి నలుగురు, కేరళ నుంచి 3గురు, తమిళ నాడు నుంచి రెండు, యూ.పి. నుంచి ఏడుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి 7గురు, లక్షద్వీపాలనుంచి ఒకరు మొత్తం 30 మంది ఎన్నికైనారు.


          ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభ లలో 1952, తరువాత తిరిగి 2009 లోనే అన్నీ మతాలకు చెందిన  స్త్రీ సబ్యుల సంఖ్య 59 కు చేరింది.
            15 వ లోక్ సభ లోని మొత్తం 30 మంది లోక్ సభ ముస్లిం సబ్యులలో 27 మంది పురుషులు, 3 స్త్రీలు కలరు. ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభలలో ముస్లిం స్త్రీ సబ్యుల సంఖ్య 3 సార్లు మాత్రమే 3కు చేరింది. 15 వ లోక్ సభ లో ఎన్నికైన మహిళా ముస్లిం సబ్యలు వరుసగా తబసుమ్ బేగమ్(యూ.పి.-బి.ఎస్.పి.),కైసర్ జహాన్(యూ.పి.-బి.ఎస్.పి),మౌసమ్ నూర్(పశ్చిమ బెంగాల్ -కాంగ్రెస్-ఐ)
          వీరి ముగ్గురులో మౌసమ్ అత్యంత చిన్న వయసును అనగా కేవలం 27 సం. ల వయసును కలిగినది మరియు ముగ్గురులో ఆమె అంత్యంత అధిక విద్యావంతురాలు. ఆమె ఎల్‌ఎల్‌బి కలకత్తా విశ్వవిద్యాలయము నుండి పూర్తిచేసినది. ఆమె  బెంగాల్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ ఘని ఖాన్ చౌదరి కుటుంబం నుండి వచ్చినది. తబసుమ్ (39స.లు)10వ తరగతి, కైసర్ జహాన్(35 స. లు ) 8వ తరగతి వరకు చదివిరి.
          విచారకరమైన విషయం ఏమిటంటే ముస్లిం మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య ఎప్పుడు 3 కు మించలేదు.
6,8,15 వ లోక్ సభ లలో ముస్లిం మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య అత్యధికంగా 3 మాత్రమే.
1,4,5,9,10,12 లోక్ సభలలో అసలు ముస్లిం  మహిళా లోక్ సభ సబ్యులే లేరు.
2,3,7 లోక్ సభలలో ఇరువురు చొప్పున ముస్లిం మహిళా సబ్యులు ఎన్నికైనారు.
11,13,14 లోక్ సభలలో  ఒకరు చొప్పున  ముస్లిం మహిళా సబ్యులు ఎన్నికైనారు
ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభ లలో మహిళా సబ్యుల సంఖ్య 549 కాగా అందులో ముస్లిం మహిళా సభ్యులా సంఖ్య 18 మాత్రమే.  


 

 

 

 



No comments:

Post a Comment