21 March 2016

బహుజన సమాజ విప్లవ నాయకుడు మాన్య శ్రీ కాన్షి రాం



గత మార్చ్ 15 న కాన్షి రాం జన్మదినోత్సవం

దళిత, బహుజన విప్లవ నాయకుడు మాన్య శ్రీ కాన్షి రాం. దేశ  రాజకియాలలో పెను మార్పులు తెచ్చి బహుజనులకు రాజ్యాధికారం కల్పించి భారత దేశ రాజకీయ చిత్ర పటాన్ని మార్చిన ఘనత మాన్య శ్రీ కాన్షి రాం కు దక్కుతుంది. మాన్య శ్రీ కాన్షి రాం చనిపొయి దశాబ్దం గడిచినది కాని బహుజన నాయుకుడిగా దేశ రాజకీయాలపై అతను  ప్రసరించిన ప్రభావంను అతని  అనుచరులు, సమర్ధకులు  చివరికి అతని వ్యతిరేకులు కూడా  విస్మరించ జాలరు.

మాన్య శ్రీ కాన్షి రాం ఉత్తర భారత దేశం లో బహుజనులు-దళితుల, వెనుక బడిన, అణగారిన వర్గాల తిరుగు లేని నాయకుడు. అతడు తన జీవీతాంతం పై వర్గాల రాజకీయ అధికార ప్రాప్తి కోసం రాజి లేని  పోరాటం సాగించినాడు.  చిన్న తనం నుండి  సమాజ మార్పు కోసం, రాజకీయాలలో అధికార మార్పు కోసం కంకణం దాల్చినాడు. సైకిల్ పై  విస్తృతం గా దేశ వ్యాప్తం గా పర్యటించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ను ప్రచారం చేసి దళితులకు  రాజకియ అదికారం కోసం పాటు పడినాడు.


 కాన్షి రామ్ మొదట్లో DS4, BAMCEF  తరువాత బహుజన సమాజ పార్టి ని స్థాపించినాడు. ఆతరువాత బహేన్ మాయావతి దానికి నాయకత్వం వహించి ఉత్తర ప్రదేశ్ కుల రాజకీయాలను కూకటి వేళ్ళతో ద్వంసం చేసి ముఖ్య మంత్రి అయినది.

పంజాబ్ లో జన్మించిన శ్రీ కాన్షి రాం ఉత్తర ప్రదేశ్ ను తన రాజకీయ కేంద్రం గా నిర్ణయిoచుకొన్నారు. ఇతర దళిత నాయకుల వలే కాంగ్రెస్ మరి  ఎ ఇతర రాజకీయ పక్షానికి దాసోహం అనలేదు. 

సంపద, వివాహం, ఇంటిని విడిచి ఫులే-అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు తన జీవితం ను అంకితం  చేసిన ధీశాలి శ్రీ కాన్షి రాం . దళితులకు శతాబ్దాల వారిగా జరుగుతున్న అన్యాయం, అసమానతల పట్ల శ్రీ కాన్షిరాం తన అసంతృప్తిని, బాధ ను ఆక్రోశం వేల్లుబుచ్చారు. తిలక్,తరాజు ఔర్ తల్వార్ కో మారో అనే నినాదం అగ్రవర్ణాల వారిని కోపానికి గురిచేసింది. కాని కాన్షి రామ్ తన ప్రచారం చేత బహుజన సమాజ్ పార్టి ని దేశ ప్రధాన రాజకీయ పక్షం గా నిలబెట్టారు. 

మొదట్లో సమాజ్ వాది పార్టి తో పిదప కాంగ్రెస్ తో జత కట్టి బ.స.పా ఉత్తర ప్రదేశ్ లోదళితుల పాలిటి  అతి ముఖ్యమైన రాజకీయ పార్టి గా అవతరించినది.  ముస్లిం ల సమర్ధన కుడా పొందినది. కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్న సామజిక అసమానతలు అధికం గా గల ఉత్తర ప్రదేశ్ లో బ.స.పా. అధికారం లోకి రావడం తో దళితులకు రాజకీయ అధికారం లబించినది.
పంజాబ్ లో 1934 మార్చ్ 15న  రామ్దాసియా (ramdasia)కుటుంబం లో కాన్షి రాం జన్మించారు.  అతని శిష్యురాలు బహెన్ మాయావతి యు.పి. లో రెండు సార్లు ముఖ్య మంత్రి పదవిని పొందినారు.

భారత దేశ దళిత చరిత్ర లో శ్రీ కాన్షి రామ్ బహుజనులకు రాజ్యాధికార సాధన లో సాదించిన విజయం మరుపు రానిది.        

No comments:

Post a Comment