24 May 2023

2022 UPSC సివిల్ సర్విస్ ఎక్జామినేషన్/CSE ఫలితం: పరీక్షలో విజయం సాధించిన ముస్లిం అభ్యర్థుల జాబితా UPSC CSE result 2022: list of Muslim candidates who cracked the exam

 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2022 ఫలితాలను ప్రకటించింది. టాప్ 10 UPSC టాపర్‌ల జాబితాలో, ఒక ముస్లిం అభ్యర్థి స్థానం సంపాదించారు.

తుది జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం 933 మంది అభ్యర్థుల్లో 30 మంది అభ్యర్థులు ముస్లిం వర్గానికి చెందినవారు.

UPSC CSE 2022లో మొదటి నాలుగు  ర్యాంకులు ప్రతిభావంతులైన మహిళలు పొందారు.

ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలవగా, గరిమా లోహియా రెండో స్థానంలో, ఉమా హరితి ఎన్‌ మూడో స్థానంలో నిలిచారు.

UPSC పరీక్షలో అర్హత సాధించిన ముస్లిం అబ్యర్దుల జాబితా :

 1. వసీం అహ్మద్ భట్ (ఆల్ ఇండియా ర్యాంక్-7)

2. ముస్కాన్ దాగర్ (AIR-72)

3. నవీద్ అహ్సన్ భట్ (AIR-84)

4. అసద్ జుబెర్ (AIR-86)

5. అమీర్ ఖాన్ (AIR-154)

6. రుహాని (AIR-159)

7. అయేషా ఫాతిమా (AIR-184)

8. షేక్ హబీబుల్లా (AIR-189)

9. జుఫిషన్ హక్ (AIR-193)

10. మనన్ భట్ (AIR-231)

11. ఆకిప్ ఖాన్ (AIR-268)

12. మొయిన్ అహ్మద్ (AIR-296)

13. మహ్మద్ ఇదుల్ అహ్మద్ (AIR-298)

14. అర్షద్ ముహమ్మద్ (AIR-350)

15. రషీదా ఖాతూన్ (AIR-354)

16. ఐమన్ రిజ్వాన్ (AIR-398)

17. మొహమ్మద్ రిస్విన్ (AIR-441)

18. మొహమ్మద్ ఇర్ఫాన్ (AIR-476)

19. సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ (AIR-570)

20. ఖాజీ ఆయేషా ఇబ్రహీం (AIR-586)

21. ముహమ్మద్ అఫ్జెల్ (AIR-599)

22. ఎస్ మహమ్మద్ యాకూబ్ (AIR-612)

23. మొహమ్మద్ షాదా (AIR-642)

24.షుమైల చౌదరి (AIR703)

25.నిహల K. షరీఫ్(AIR706)

26.తస్కీన్ ఖాన్ (AIR-736)

27. మహమ్మద్ సిద్ధిక్ షరీఫ్ (AIR-745)

28. అఖిల B S (AIR-760)

29. Md బుర్హాన్ జమాన్ (AIR-768)

30. ఫాతిమా హరీస్ (AIR-774)

31. ఇరామ్ చౌదరి (AIR-852)

32. షెరిన్ షహానా T K (AIR-913) 

UPSCలో ముస్లింలు - గత సంవత్సరాల రికార్డు:

భారత దేశం లో ముస్లిం జనాభా 2011 సెన్సెస్ ప్రకారం:14.23%

·       2022 లో మొదటి 75 ర్యాంకులలో ముస్లిం అబ్యర్ధులు: 2

·       75-173 ర్యాంకులలో :3

·       2022 లో మొత్తం అబ్యర్దులలో ముస్లిం అబ్యర్దుల శాతం: 32/933=3.4%

· 2021 లో మొత్తం అబ్యర్దులలో ముస్లిం అబ్యర్దుల శాతం: 21/685=3.06% ఒక దశాబ్దంలో ముస్లిం అభ్యర్థుల అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదే.

·       2021లో మొదటి 100ర్యాంకులలో ముస్లిం అబ్యర్ధులు: సున్నా

·       2020సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE)లో మొత్తం 31 మంది ముస్లింలు ఉత్తీర్ణులయ్యారు.

·       2019లో 42 మంది ముస్లింలు ఉత్తీర్ణత సాధించగా,

·       2018లో కేవలం 27 మంది ముస్లింలు విజయం పొందారు.

·       2017లో విజయవంతమైన ముస్లిం అబ్యర్దుల సంఖ్య 50కి చేరింది

·       2016లో 52 మంది ముస్లింలు విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు,

·       2015లో 34 మంది ముస్లింలు విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు

·   2014లో మొత్తం 38 మంది ముస్లింలు విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు

·       2013లో మొత్తం 34 మంది ముస్లింలు ఉత్తీర్ణత సాధించారు.

·       2012లో 30 మంది ముస్లింలు ఉత్తీర్ణత సాధించారు, వారిలో నలుగురు టాప్ 100లో ఉన్నారు.

·       2011లో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 920 మందిలో 31 మంది ముస్లింలు ఉన్నారు.

·       2010లో విజయవంతమైన అభ్యర్థులలో 21 మంది ముస్లింలు ఉన్నారు,

· 2009లో విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో మొత్తం 31 మంది ముస్లింలు ఉన్నారు.

 

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2022 అంతిమ ఫలితాలలో విజయం పొందినవారిలో డిల్లి లోని జామియా మిలియా ఇస్లామీయ RCA లో శిక్షణ పొందినవారు  23మంది   ఉన్నారు.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2022 అంతిమ ఫలితాలలో విజయం పొందినవారిలో నలుగురు హజ్ కమిటి అఫ్ ఇండియా సివిల్ సర్విస్ కోచింగ్ క్లాసు కు చెందినవారు.

2022 లో ఎన్నికైన మొత్తం 933 అబ్యర్దులలో IAS/ఐఏఎస్ కు 180 మంది, IPS 200, IFS కు 38 మంది ఎన్నికైనారు.

సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ –Aకు 473మంది, గ్రూప్-Bకు 131మంది ఎన్నికైనారు.

జనరల్ కేటగిరి లో  345, EBCక్రింద 99, OBC క్రింద 263మంది,

SC కేటగిరి క్రింద154మంది, ST కేటగిరిలో 72 మంది ఎంపిక అయ్యారు.

2022 సివిల్స్  జూన్ 5, 2022న నిర్వహించబడిన ప్రిలిమినరీ పరీక్ష అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 16 నుండి 25 వరకు నిర్వహించబడే ప్రధాన పరీక్ష, లో పాల్గొన్నారు. ప్రధాన పరిక్షలో అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులపై అవగాహన మరియు అవగాహనను పరీక్షించే సమగ్ర వ్రాత పరీక్ష ఉంటుంది.

ప్రధాన పరీక్ష తర్వాత, ఫలితాలు డిసెంబర్ 6న ప్రకటించబడ్డాయి. ప్రధాన పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు చివరి దశకు - ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హులు.

మే 18న ముగిసిన ఇంటర్వ్యూ ప్రక్రియ తర్వాత, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్టకేలకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలను విడుదల చేసింది.

ఈ ఏడాది మొత్తం 933 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. సాధారణంగా యూపీఎస్సీ టాపర్లు చాలా మంది ఐఏఎస్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

UPSC అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల జాబితాను చూడవచ్చు

No comments:

Post a Comment