25 August 2023

ఇస్లాం తోబుట్టువులకు హక్కులు మరియు బాధ్యతలు ఇస్తుంది Islam confers rights and gives responsibilities to siblings

 



కుటుంబ జీవితం లోని అన్ని అంశాలను ఇస్లాం వివరించును. ఇస్లామిక్ నీతి మరియు బోధనలు తోబుట్టువుల హక్కులు మరియు బాధ్యతలను వివరించును

ఇస్లాంలో తోబుట్టువులకు గల కొన్ని హక్కులు:

శుభాకాంక్షలు చెప్పడం, అస్సలాముఅలైకుమ్ అని పలకరించడం- ఇది అత్యంత సిఫార్సు చేయబడిన సున్నత్. ఇది తోబుట్టువుల మధ్య గల ప్రేమ మరియు సాన్నిహిత్యాన్ని పెంచును.

 మీకు ఎవరైనా గౌరవభావం తో సలాం చేస్తే అతనికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్దతిలో ప్రతి సలాం చెయ్యండి. లేదా కనీసం  ఆ విధంగానైనా చెయ్యండి. అల్లాహ్ ప్రతి దానికి లెక్క తీసుకొంటాడు (అన్-నిసా 4:86)

మన తోబుట్టువులు మార్గదర్శకత్వం కోసం మన వద్దకు వస్తే, మనం వారికి మార్గదర్శకత్వం అందించాలి. తోబుట్టువులకు  సలహా ఇచ్చే అధికారం మనకు ఉంది.

ఒక ముస్లిముకి  తన తోబుట్టువుల శవాన్ని ఖననం చేసే హక్కు ఉంది, ఇది చివరిసారి వారి పట్ల  మన శ్రద్ధ మరియు నివాళిని తెల్పును.  అదనంగా, దీనివలన ఒక హదీసులో చెప్పినట్లు  రెండు గొప్ప పర్వతాల వంటి గొప్ప ప్రతిఫలం లభించును. శవాన్ని ఖననం చేసిన వారికి రెండు ఖిరాత్‌ల బహుమతి లబించును.  ఖిరాత్ అంటే ఏమిటి?”: "రెండు గొప్ప పర్వతాల వంటిది." ( బుఖారీ మరియు ముస్లిం).

తగాదా తర్వాత శాంతి చేసుకోవడం అన్నదమ్ముల హక్కు. మనం జీవితాంతం కలిసి జీవించడానికి అల్లా సృష్టించిన తోబుట్టువులమే. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. కనుక మీ సోదరుల మద్య సంభందాలను సంస్కరించండి. అల్లాహ్ కు బయపడ౦డి, మీపై దయ చూపటం జరగవచ్చు.. (అల్-హుజురత్ 49:10)

అందరూ కలిసి అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. అయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పు తో నిండి ఉన్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్లి దానినుండి కాపాడాడు. అల్లాహ్ ఈ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు, బహుశా ఈ సూచనల ద్వారా సాఫల్యం సిద్దించే సరియైన మార్గం మీకు లబిస్తుందేమో అని.. (ఆల్-ఇమ్రాన్ 3:103)

తోబుట్టువులుగా, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మరియు మన తోబుట్టువులను ఎప్పుడూ ఒంటరిగా వదిలివేయకూడదు. ఒకే సమస్యను పంచుకునే తోబుట్టువులను కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది మరియు ఉమ్మడిగా చేయడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. .

తోబుట్టువులు తప్పు చేయవచ్చు మరియు పాపం చేయవచ్చు. మనం ఓపిక పట్టాలి మరియు వారిని క్షమించాలి లేకుంటే తోబుట్టువులతో మన సంబంధం చెడిపోతుంది.

No comments:

Post a Comment