12 September 2023

ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క భారతదేశపు అతిపెద్ద దాత, ధోరాజీ హబీబ్ షేత్ India’s biggest donor of Azad Hind Fauj, Dhoraji’s Habib Sheth

 


 

మహాత్మా గాంధీ మరియు సర్దార్ పటేల్‌తో విభేదాలు నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడటానికి దారితీసింది, జూలై 6, 1944న బోస్ తన రాగూన్ Ragoon రేడియో ప్రసారంలో మహాత్మా గాంధీని జాతిపిత అని పిలిచిన మొదటి వ్యక్తి. నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) యొక్క సుప్రీం కమాండర్.

ధోరాజీకి చెందిన. మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ  బర్మా రాజధాని రంగూన్ కి వలస వెళ్లి అక్కడ ప్రముఖ వ్యాపారవేత్తగా రూపొందారు. . హబీబ్ షేత్ అని పిలువబడే మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ, నేతాజీకి అత్యంత సన్నిహితుడు మరియు యూసుఫ్ మర్ఫానీ 1944లో రూ. 1 కోటి నగదు మరియు రూ. 3 లక్షల విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చాడు, వీటన్నింటి నేటి విలువ దాదాపు రూ. 500 కోట్లు. యూసుఫ్ మర్ఫానీ బర్మాలోని ఇతర గుజరాతీలను కూడా INAకి విరాళాలు ఇచ్చేలా చేశాడు. యూసుఫ్ మర్ఫానీ తొలి విరాళంతో ఆజాద్ హింద్ బ్యాంక్ స్థాపించబడింది.

చరిత్రకారుల ప్రకారం  INA మొదటి దాతలలో మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ ఒకడు మరియు  నేతాజీ మర్ఫానీ కి సేవక్-ఇ-హింద్ పతకాన్ని ప్రదానం చేయడం జరిగింది..

INA లో నేతాజీ సహచరులు  మార్ఫానీ యొక్క సహకారాన్ని ప్రశంసించారు. నేతాజీ మేనల్లుడు మరియు హార్వర్డ్ చరిత్ర ప్రొఫెసర్ సుగత బోస్ ప్రకారం కోటీశ్వరుడు నుండి అయిన పకిర్ అయిన మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ తన మొత్తం సంపద కోటి మూడు లక్షల రూపాయలను ఆజాద్ హింద్ ఉద్యమానికి విరాళంగా ఇచ్చాడు. 1944లో రంగూన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లి ఒక వెండి ట్రేలో వజ్రాలు మరియు ఆభరణాలు, ఆస్తుల టైటిల్ డీడ్‌ల కట్టను ఉంచి, వెండి ట్రే ని నేతాజీకి అందజేశారు. నేతాజీ సేవక్-ఎ-హింద్ అనే పతకాన్ని మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ కి పిన్ చేసారు.

ఐఎన్‌ఎ,  INA కు సహకరించిన గుజరాతీ ముస్లిం మార్ఫానీ ఒక్కరే కాదు. సూరత్‌కు చెందిన గులాం హుసేన్ ముస్తాక్ రందేరి,  INA లో రిక్రూటింగ్ అధికారి.

1943లో నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని, ఆజాద్ హింద్ బ్యాంకును ఏర్పాటు చేశారు. తరువాత, జూలై 9, 1944 న జరిగిన భారీ సమావేశంలో, నేతాజీ మొత్తం సమీకరణ total mobilisation’.కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేతాజీ పిలుపుకు మార్ఫానీ ప్రతిస్పందించి, తన వద్ద ఉన్నదంతా త్యాగం చేసి, INA చరిత్రలో 'మొత్తం సమీకరణ' అధ్యాయంలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాడు

యూసుఫ్ మార్ఫానీ తన మొత్తం ఆస్తికి సంబంధించిన టైటిల్ డీడ్‌ల మూటతో పాటు ఒక వెండి ప్లేట్‌ నిండా  బంగారు ఆభరణాలు మరియు నగదు, మొత్తం విలువ రూ. 1 కోటి 3 లక్షల (ప్రస్తుత విలువ ప్రకారం రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా) నేతాజీకి అందజేశారు. నేతాజీ నీ మార్ఫానీ రెండు జతల INA యూనిఫాం అందించాలని మరియు INA పూర్తికాల వాలంటీర్‌గా పనిచేయడానికి అనుమతించాలని అభ్యర్థించారు.

యూసుఫ్ మర్ఫానీ కుమారుడు నూర్ మహ్మద్ హబీబ్, యూసుఫ్ మర్ఫానీ యొక్క 'పూర్తి త్యాగం' పట్ల సంతోషిస్తూ, నేతాజీ ఇలా వివరించాడు, "సోదరా, ప్రజలు తమ విధులను గుర్తించడం ప్రారంభించినందుకు నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను... ప్రజలు అన్నింటిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హబీబ్ షేత్ చేసిన పని అభినందనీయం మరియు మాతృభూమికి సేవ చేయడానికి అతనిని అనుకరించే వారు ప్రశంసనీయం. నేతాజీ మార్ఫానీని ఆజాద్ హింద్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్‌గా ఉండమని కోరారు. మాతృభూమి స్వాతంత్ర్య పోరాటంలో మార్ఫానీ పాల్గొన్నారు..

హబీబ్ యూసుఫ్ సేథ్ మరియు అతని భార్య హజారాబాయి అలీ మహ్మద్‌కు ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు

యూసుఫ్ మార్ఫానీ ముగ్గురు కుమార్తెలలో ఒకరైన ఫాతిమాబాయి తన భర్తతో కలిసి న్యూయార్క్‌కు వెళ్లింది. మరో ఇద్దరు కుమార్తెలు ఆయేషా, మరియం అంతకుముందే చనిపోయారు.

ధోరాజీ ప్రజలు స్వాతంత్ర్య ఉద్యమంలో యూసుఫ్ మార్ఫానీ సహకారం మరియు పోషించిన పాత్ర గురించి గర్వంగా భావిస్తారు. ధోరజిలో రోడ్డుకు ఆ మహానుభావుడి పేరు పెట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) కోసం బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో. తన మొత్తం సంపదను విరాళంగా ఇచ్చిన గుజరాత్ లోని ధోరాజీ లో జన్మించిన మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ పేరు గుజరాత్ లోని ధోరాజీ లోని ఒక రోడ్డుకు పేరు పెట్టండి అని అంజుమన్-ఇ-ఇస్లాం, మెమన్ మోతీ జమాత్, ధోరాజీ అధ్యక్షుడు హాజీ ఆఫ్రోజ్‌భాయ్ లక్కడ్‌కుట్ట, స్థానిక జర్నలిస్ట్ నయన్ కుహాదియాతో,  కలసి నేతాజీ భారత ప్రధాన మంత్రి మరియు భారత హోంమంత్రి  కు విజ్ఞప్తి చేసారు.

No comments:

Post a Comment