10 September 2023

పూణే లో యూదు వ్యాపారి విరాళం తో నిర్మించిన సాసూన్ హాస్పిటల్ Sassoon Hospital, a Jewish merchant’s enduring gift to Pune

 


డేవిడ్ సాసూన్,  సాసూన్ హాస్పిటల్ ద్వారా, "పూనాలోని నిరు పేదల ఆరోగ్య అవసరాలను తీర్చాలని" కోరుకున్నాడు మరియు సాసూన్ హాస్పిటల్ నిర్మించడానికి అయ్యిన డబ్బులో సగానికి పైగా విరాళంగా ఇచ్చాడు.

అక్టోబరు 8, 1863, అప్పటి బొంబాయి గవర్నర్ హెన్రీ బార్టెల్ ఫ్రెరే పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌కు బాగ్దాదీ యూదు వ్యాపార ప్రముఖుడు బారన్ డేవిడ్ సాసూన్ సమక్షంలో శంకుస్థాపన చేశారు.

ఫ్రెరే తన ప్రసంగంలో, ప్రభుత్వ సంస్థ స్థాపన కోసం రూ. 1.88 లక్షల విరాళం అందించిన అప్పటి-71 ఏళ్ల సాసూన్ దాతృత్వాన్ని ఉదారంగా ప్రశంసించారు

 సాసూన్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాపారి సాసూన్ మాట్లాడుతూ, "నా జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి పూర్తిగా సాకారం అవుతుంది అని అన్నాడు.

పూణేలో గార్డెన్ రీచ్ ప్రాంతం లో నివాసం ఉన్న డేవిడ్ సాసూన్, సన్స్ & కంపెనీ యొక్క యజమాని సాసూన్, ఆసుపత్రి పని పూర్తికాకముందే నవంబర్ 1864లో మరణించాడు

"వెస్ట్రన్ ఇండియా యూదు కమ్యూనిటీకి అధిపతి, మరియు ప్రపంచవ్యాప్త ఖ్యాతి గడించిన యూదు వ్యాపారి డేవిడ్ సాసూన్, అనారోగ్యంతో పూనా నగరంలో మరణించారు... బొంబాయి  అత్యంత శక్తివంతమైన, సంపన్నుడు,. ప్రజా స్ఫూర్తి మరియు దయగల పౌరుని కోల్పోయింది అని ఒక ఆంగ్ల వార్తాపత్రికలో సంస్మరణ వ్రాయడింది.

బాగ్దాద్ పాలకుడి అధికారిక కోశాధికారి official treasurers కుటుంబంలో 1793లో జన్మించిన డేవిడ్ బెన్ సాసూన్ 1830లలో దావూద్ పాషా పాలనలో తన కుటుంబంతో కలిసి బాగ్దాద్ నగరాన్ని విడిచిపెట్టి బస్రా చేరుకున్నాడు. 1832లో, డేవిడ్ బెన్ సాసూన్ తన కుటుంబాన్ని బొంబాయి నగరానికి మార్చాడు.

సాసూన్ బొంబాయిని తన నివాసంగా మార్చుకున్నకాలం లో బొంబాయి యూరప్ నుండి భారతదేశానికి ప్రవేశ ద్వారం మరియు పశ్చిమ మరియు మధ్యప్రాచ్య దేశాల నుండి అనేక మంది వ్యాపారులు వాణిజ్య౦ కోసం  బొంబాయి నగరానికి చేరుకున్నారు.

సాసూన్ ఆంగ్ల వస్త్రాలు మరియు ఓరియంటల్ వీవ్స్ యొక్క ఇండో-పర్షియన్ వాణిజ్యం ప్రారంభించాడు. సాసూన్ తన వర్తకాన్ని విస్తరించడానికి పర్షియా మరియు బాగ్దాద్‌లో తన పరిచయాలను ఉపయోగించాడు మరియు త్వరలో మార్కెట్లో పెద్దవ్యాపారి అయ్యాడు..

బొంబాయి భారతదేశానికి గేట్‌వే మాత్రమే కాదు, చైనాకు గేట్‌వే అని సాసూన్ గ్రహించాడు. సాసూన్ నూలు, బంగారం మరియు ముఖ్యంగా నల్లమందు వ్యాపారం చేయడం ద్వారా చైనా మరియు ఫార్ ఈస్ట్‌తో వ్యాపారం చేయడం ప్రారంభించాడు మరియు వ్యాపారం లో  పెద్దఎత్తున లాభాలు సాధించాడు. 1854 నాటికి, డేవిడ్ సాసూన్ లక్షాధికారిగా పరిగణించబడ్డాడు

సాసూన్ సంస్థ కలకత్తా, షాంఘై, కాంటన్, హాంకాంగ్, యోకోహామా మరియు నాగసాకిలలో శాఖలను విస్తరించి నల్లమందు, బట్టలు మరియు పత్తి నూలు వ్యాపారంలో గుత్తాధిపత్యాన్నిపొందినది. సాసూన్ బ్రిటీష్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు.

సాసూన్ బొంబాయిలో సాసూన్ లైబ్రరీ మరియు రీడింగ్ రూమ్, ఇండస్ట్రియల్ అండ్ రిఫార్మేటరీ ఇన్‌స్టిట్యూషన్, క్లాక్ టవర్ మరియు మాగెన్ డేవిడ్ సినాగోగ్‌తో సహా అనేక సంస్థలను నిర్మించడానికి పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా అందించాడు.

పూణేలో, ప్రస్తుతం నివారాగా పిలవబడే పూనా ఇన్‌ఫర్మ్ ఆశ్రమం Infirm Asylum మరియు స్థానికంగా లాల్ దేవల్ అని పిలువబడే ఓహెల్ డేవిడ్ సినగోగ్‌ని నిర్మించడానికి సాసూన్  ఆ కాలం  లో రూ. 50,000 విరాళంగా ఇచ్చాడు.

సాసూన్ 1863లో పూణేలో పబ్లిక్ హాస్పిటల్  సాసూన్ జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడలిచాడు.  - ఇది ఈ ప్రాంతంలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా కొనసాగుతోంది. సాసన్ జనరల్ స్థాపనకు ముందు, పూణేలోని ఏకైక ఆసుపత్రి సివిల్ హాస్పిటల్, కేవలం 50 మంది రోగులకు మాత్రమే వసతి కల్పించే సామర్థ్యం ఉంది.

1862 చివరలో ది ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం, సాసూన్ "పూనాలోని పేదల ఆరోగ్య కోరికలను తీర్చడానికి సాసన్ జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించమని ప్రభుత్వం ముందు ప్రపోజల్ ఉంచాడు.సాసన్ జనరల్ ఆసుపత్రి నిర్మాణం యొక్క మొత్తం వ్యయం రూ. 3,10,060గా నిర్ణయించబడింది, సాసూన్ తన విరాళంగా రూ. 1,88,000 అందించాడు.

సాసన్ జనరల్ ఆసుపత్రి 1867లో ప్రారంభించబడినప్పుడు, ఆసుపత్రిలో 144 మంది రోగులు ఉన్నారు, అత్యవసర సమయాల్లో, వరండాలలో అదనంగా 60 మంది వ్యక్తులకు వసతి కలదు..

"ఇంగ్లీష్ గోతిక్ శైలిలో ఉన్న సాసన్ జనరల్ ఆసుపత్రి భవనం, దాని భారీ క్లాక్ టవర్‌తో చాలా గంభీరమైన రూపాన్ని కలిగి ఉంది. ఇది రెండు అంతస్తులను కలిగి ఉంది,

సాసూన్ జనరల్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో, గవర్నర్ ఫ్రెరే యూదు వ్యాపారి సాసన్ దాతృత్వాన్ని మరియు ఉన్నత విద్య కోసం తన కుమారులలో కొందరిని యూరప్‌కు పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.

సాసూన్ అరబిక్ కాకుండా హీబ్రూ, పర్షియన్ మరియు టర్కిష్ భాషలలో నిష్ణాతుడు  మరియు భారతదేశానికి వలస వచ్చిన తర్వాత, హిందుస్తానీలో కమ్యూనికేట్ చేయడం నేర్చుకున్నాడు. సాసన్ తన విరామ సమయాన్ని గ్రంథాల అధ్యయనానికి కేటాయించాడు

సాసూన్‌ చాలా పొడవుగా ఉండి ఓరియంటల్ వస్త్రాలు మరియు తలపాగా ధరించేవాడు. సాసూన్‌ నవంబర్ 1864లో మరణించినప్పుడు, సాసూన్‌కు  ఆరుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు. పూణేలోని ఓహెల్ డేవిడ్ సినగోగ్ ప్రాంగణంలో సాసూన్‌ అంత్యక్రియలు జరిపి సమాధి చేశారు.

ససూన్ మనవడు జాకబ్, ససూన్ చిన్న కుమారుడు ఎలియాస్ డేవిడ్ 1906లో రూ. 2 లక్షలు విరాళంగా అందించి, యూరోప్ రోగులకు మరియు యూదు కమ్యూనిటీకి చెందిన వారి కోసం ప్రత్యేకంగా ఒక కొత్త విభాగాన్ని స్థాపించడం ద్వారా సాసూన్ జనరల్ హాస్పిటల్ ని విస్తరించారు. అప్పటి బాంబే గవర్నర్ లార్డ్ లామింగ్టన్ ఈ భవనానికి పునాది రాయి వేశారు.

నవంబర్ 1878లో, సాసూన్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్‌లో ఒక మెడికల్ స్కూల్ ప్రారంభించబడింది, అది తరువాత BJ మెడికల్ కాలేజీగా అభివృద్ధి చెందింది

సాసూన్ జనరల్ హాస్పిటల్ పూణే ప్రజలకు, ముఖ్యంగా 1897లో ప్రారంభమైన ప్లేగు మహమ్మారి సమయంలో వైద్య సేవలను అందించింది. 1924 జనవరిలో లో పూణే నగరంలోని ఎరవాడ జైలులో మహాత్మా గాంధీ   అపెండిక్స్‌ను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆసుపత్రి కూడా ఇదే.

"ప్రస్తుతం, కనీసం 2,000 మంది రోగులు ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లో మరో 200-220 మంది అడ్మిషన్‌లతో పాటు రోజూ రిపోర్ట్ చేస్తున్నారు" అని సాసూన్ జనరల్ హాస్పిటల్ మరియు BJ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ చెప్పారు. " ఆర్థికంగా బలహీనమైన మరియు ప్రతిభావంతులైన విద్యార్థులు గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం ఇక్కడకు వస్తారు.

ప్రస్తుతం, రెండు వారసత్వ భవనాలు - డేవిడ్ సాసూన్ మరియు జాకబ్ సాసూన్ భవనాలు - పునరుద్ధరణలో ఉన్నాయి. నవంబర్ 2022లో పనులు ప్రారంభమయ్యాయి మరియు డేవిడ్ సాసూన్ హాస్పిటల్ భవనం పునరుద్ధరణ పనులకు రూ. 14.7 కోట్లు మరియు జాకబ్ సాస్సూన్ భవనానికి రూ. 9 కోట్లు ఖర్చు చేస్తారు.

No comments:

Post a Comment