21 April 2024

తెనాలి పాత బస్టాండ్ ప్రాంతం లోని రఘోత్తమరాయ_సత్రం కథా కమామీషు.

 



... 

ఒక శతాబ్దం వెనక తెనాలి అంటే ప్రస్తుతం ఉన్న గంగానమ్మ పేట మరియు దాని పరిసర ప్రాంతాలు...అప్పటికే బ్రిటిష్ వారు నిర్మించిన రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ. ప్రస్తుతం ఈ సత్రం ఉన్న ప్రాంతం లో ఒక నీటి మడుగు, దాని చుట్టూ తాటి తోపు ఉండేవట. కాస్త చీకటి పడ్డాక ఎవరన్నా రైలు దిగి వెళ్తుంటే, ఈ తాటి తోపు దగ్గర దారి దొంగలు అటకాయించి దోచుకునే వారట. 

అప్పట్లో తెనాలి లో బారిష్టరు పూర్తిచేసి, మంచి ప్రాక్టీస్ ఉన్న లాయరు శ్రీ మతుకుమల్లి రఘోత్తమ రాయ శాస్త్రి గారు ఈ సమస్యని ఎలాగైనా తొలగించాలని అనుకున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న మారిస్ అనే ఆంగ్లేయుని కలిసి అక్కడ ఏదన్నా ఒక సత్రం లాంటిది కట్టిస్తే, రాత్రి పూట రైలు దిగి వచ్చే వాళ్లకి సౌకర్యంగా ఉంటుంది, దొంగల భయం తప్పుతుంది అని విన్నవించారట.

 అప్పుడు ఆ ఇంగీష్ దొర, అక్కడ మీకు ఎంత కావాలంటే అంత స్థలం గజానికి దమ్మిడీ చొప్పున చెల్లించి తీసుకుని, అభివృద్ధి చేసుకోండని చెప్పారట. శాస్త్రి గారు అందుకు ఒప్పుకుని, తూర్పున పడవల కాలువ, పడమర రైలు పట్టాలు, ఉత్తరాన దాదాపు ప్రస్తుతం ఓవర్ బ్రిడ్జ్ ఉన్న ప్రదేశం, దక్షిణాన కొత్త వంతెన ఉన్న ప్రాంతం హద్దులుగా ఉన్న భూమిని దొర చెప్పినట్టుగానే గజానికి దమ్మిడీ చొప్పున చెల్లించి తీసుకున్నారట. 

ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ తన సన్నిహితులకు గజం కాణీ చొప్పున ఇచ్చారట శాస్త్రిగారు.  అలా అప్పట్లో స్థలాలు తీసుకున్న వాళ్ళల్లో ప్రస్తుతం తురగా వాళ్ళు, కల్లూరి వాళ్ళు, లక్కరాజు, రేటూరి ఇంటి పేరు గల బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు  కొంతమంది మాత్రం ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్నారు. మిగిలినవాళ్లు చాలా మంది కాలక్రమంలో ఇతరులకు అమ్ముకున్నారు. 

మారిస్ దొర ఇచ్చాడు కాబట్టి ఆయన గౌరవార్ధం ఆ ప్రాంతానికి 'మారీసు పేట' అని పేరు పెట్టి, తాటి తోపుని కొట్టించి అక్కడ ఒక పెద్ద సత్రం కట్టించారు రఘోత్తమ రాయ శాస్త్రి గారు... ఆయన పేరుతోనే ఈ సత్రాన్ని రఘోత్తమరాయ సత్రం అంటారు...  అప్పటి నించి ఆ ప్రాంతం అభివృద్ధి చెంది, నివాసయోగ్యంగా తయారయింది........  ఓవర్ బ్రిడ్జ్ డౌన్ లో పాత బస్టాండ్ ప్రాంతం గుంటూరు స్టాప్ వెనకాల

No comments:

Post a Comment