28 November 2023

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా(1895-1987) – ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు & సంపాదకుడు, పబ్లిషర్ అల్ – మోమిన్ Mohammad Yahya(1895-1987)– Founder All India Momin Conference & Editor, Publisher Al – Momin

 

 

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా 22 ఫిబ్రవరి 1895న అల్ హాజ్ అల్తాఫ్ హుస్సేన్ & మరియం బీబీ దంపతులకు జన్మించాడు. మొహమ్మద్ యాహ్యా చిన్నతనం లోనే తల్లిని కోల్పోయాడు మరియు అమ్మమ్మ- ముత్తాత వద్ద పెరిగాడు. చాలా కాలం క్రితమే మొహమ్మద్ యాహ్యా  కుటుంబం బీహార్ నుండి వలస వచ్చి  కోల్‌కతా లోని తాంతి బాగ్‌లో స్థిరపడ్డారు, ఈ ప్రాంతంలో ప్రధానంగా జోలాహా (బెంగాలీ భాషలో నేత పనివారి) జనాభా ఉంది. 

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా ప్రారంభ విద్యాభ్యాసం మదర్సా దారుల్ హుదా (తంతి బాగ్)లో మరియు కోల్‌కతాలోని చారిత్రక మదరసా అలియా నుండి మాధ్యమిక విద్యను పూర్తి చేశాడు

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా 1918లో మదర్సా అలియా నుండి గ్రాడ్యుయేషన్ అయిన  తర్వాత బీహార్ షరీఫ్‌కు మారాడు. అక్కడ మొహమ్మద్ యాహ్యా ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉన్నాడు. మొహమ్మద్ యాహ్యా బీహార్‌లో ఉన్న సమయంలో  జోలాహా (అన్సార్‌ల)పై ఇతర కులాల ప్రజల అవమానకరమైన ప్రవర్తన మౌల్వీ మొహమ్మద్ యాహ్యా మనస్సుపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. 

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా విద్యార్థి జీవితం స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుకుగా ఉన్నాడు. బ్రిటిష్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలలో పాల్గొన్నాడు.

భావసారూప్యత కలిగిన వ్యక్తులు మరియు శ్రేయోభిలాషులతో, మౌల్వీ మొహమ్మద్ యాహ్యా ముస్లింల సంక్షేమం కోసం "ఇస్లాహ్ బిల్ ఫలాహ్“Islah Bil Falah " అనే సంఘాన్ని స్థాపించాడు. అణచివేతకు గురైన ముస్లింల వాణిని విన్పించడానికి ప్రయత్నాలు చేశారు. 

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా 1923లో "జామియాత్ అల్ మోమిన్"ని స్థాపించాడు, తరువాత దీనిని తరువాత ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ అని పిలిచారు. ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్ సంస్థ చాలా క్రియాశీల ఉద్యమం మారింది మరియు దాని అఖిల భారత సదస్సులు క్రమం తప్పకుండా జరిగేవి.

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా కోల్‌కతాలోని తాంతిబాగ్‌లోని అల్తాఫీ ప్రెస్నుండి అల్-మోమిన్‌పత్రిక ను ప్రారంభించారు. మౌల్వీ మొహమ్మద్ యాహ్యా స్వయంగా అల్-మోమిన్‌ఎడిట్ చేసి ప్రచురించారు. అల్-మోమిన్ బ్రిటీష్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పడినది  అయినప్పటికీ మౌల్వీ మొహమ్మద్ యాహ్యా అల్-మోమిన్‌పత్రిక ప్రచురించడం మరియు పంపిణీ చేయడం కొనసాగించినారు..

జోలాహా (అన్సార్స్) కమ్యూనిటీ యొక్క సామాజిక అభ్యున్నతిపై అల్-మోమిన్ప్రభావం కలదు మరియు  జోలాహా (అన్సార్స్) కమ్యూనిటీ లో చాలా ప్రజాదరణ పొందింది. అల్-మోమిన్‌అవిభక్త భారత దేశం అంతటా ప్రచారం పొందినది.దేశంలోని అన్ని మూలలకు చేరుకుంది.

మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన సమాచార కథనాలు, సైన్స్, కళలు, మానవుని మొత్తం అభివృద్ధి సంబంధిత సమాచార కథనాలుఅల్-మోమిన్‌లో ప్రచురింపబడేవి.

.జోలాహా (అన్సార్‌ల) మరియు అణగారిన వారి స్వరాన్ని వినిపించడానికి "తర్జుమాన్-ఎ-మోమిన్ అన్సార్", "నూర్ బాఫ్ జిందగీ", "హూర్", "మోమిన్ బదయున్" "అన్సారీ" "అల్-అన్సార్" (అమృతసర్), "మోమిన్ గెజెట్ – కాన్పూర్, “Tarjuman-e-Momin Ansar”, “Noor Baaf Zindagi”, “Hoor”, “Momin Badayun” “Ansari” “Al-Ansar” (Amritsar), “Momin Gazette – Kanpur” వంటి పత్రికలు ప్రారంభించారు.

డిసెంబరు 7, 2010లో ప్రొఫెసర్ . ఉజ్-జమాన్ అసద్ రచించిన అఖ్బర్-మష్రిక్ Akhbar- Mashrique”లో ప్రచురించబడిన కలామ్-ఎ-వహ్షత్ ఏక్ జైజా“Kalam-e-Wahshat Ek Jaiza” కథనాన్ని చదవడం ద్వారా అల్-మోమిన్ పత్రిక స్థాయి మరియు పండిత మరియు సాహిత్య నాణ్యత తెలుసుకోవచ్చు.

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా యొక్క సొంత పబ్లిషింగ్ హౌస్ అల్తాఫీ ప్రెస్రోజువారీ బెంగాలీ ఆజాద్మరియు వారపత్రిక మొహమ్మదిని కూడా ప్రచురించింది. అదనంగా, “అల్తాఫీ ప్రెస్మౌలానా అక్రమ్ ఖాన్ పర్యవేక్షణలో బెంగాలీ, ఉర్దూ మరియు పర్షియన్ భాషలలో పుస్తకాలను ప్రచురించేది. 

పవిత్ర ఖురాన్" యొక్క బెంగాలీ లో మొదటి అనువాదం "అల్తాఫీ ప్రెస్"లో మౌల్వీ మొహమ్మద్ యాహ్యా & మౌలానా అక్రమ్ ఖాన్ పర్యవేక్షణలో చేపట్టబడింది మరియు అది బెంగాలీ మాట్లాడేవారిలో బాగా ప్రాచుర్యం పొంది, అనేక ఎడిషన్స్ ప్రచురించబడ్డాయి

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా తన అరుదైన ఇస్లామిక్ పుస్తకాలు మరియు పుస్తకాల వితరణ ద్వారా కోల్‌కతాలోని తాంతి బాగ్ నూర్ అలీ లేన్‌లో హాజీ అబ్దుల్లా లైబ్రరీ(పూర్వపు దారుల్ హుదా)ని ఏర్పాటు చేయడం మరియు నిర్వహణ చేయడంలో కూడా సహాయం చేసారు. హాజీ అబ్దుల్లా లైబ్రరీ స్థాపించబడి 141వ సంవత్సరాలు అయింది  మరియు ఇస్లామిక్ పుస్తకాల నిధిగా పరిగణిo౦చ బడుతుంది. . భారతదేశం నలుమూలల నుండి మరియు విదేశాల నుండి పండితులు పరిశోధన కార్యక్రమం కోసం హాజీ అబ్దుల్లా లైబ్రరీ సందర్శిస్తారు..

హాజీ అబ్దుల్లా లైబ్రరీ లోని చాలా అరుదైన, మంచి ఇస్లామిక్ పుస్తకాలు  "మర్కజీ దారుల్ ఉలూమ్" బెనారస్‌కు విరాళంగా ఇవ్వబడ్డాయి..హాజీ అబ్దుల్లా లైబ్రరీ లో  రిఫరెన్స్ ప్రయోజనం కోసం అరుదైన ఇస్లామిక్ పుస్తకాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మౌల్వీ మొహమ్మద్ యాహ్యా తంతి బాగ్‌లోని జమియాత్ అహ్లే-హదీత్ యొక్క 5వ అమీర్ కూడా

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా మహిళలను చాలా ఉన్నతంగా భావించేవారు మరియు  ఎల్లప్పుడూ సమాన అవకాశాలపై నొక్కిచెప్పేవారు.. మహిళా రచయితలు వ్రాసిన కథనాలను, వ్యాసాలను అల్-మోమిన్ లో  ప్రత్యేకంగా ప్రోత్సహించి ప్రచురించేవారు

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా మొదటి  భార్య చాలా బాగా చదువుకున్న మహిళ. ఆమె 1900ల ప్రారంభంలో ఖాతున్ బిహారీఅనే కలం పేరుతో వ్యాసాలు రాసేది. ఆమె వ్యాసాలు ఆ కాలంలోని ప్రసిద్ధ పత్రిక తెహ్‌జిబ్-ఇ-నిస్వాన్లో క్రమం తప్పకుండా ప్రచురించబడేవి. ఖాతున్ బిహారీ ఉర్దూ, పర్షియన్ & అరబిక్ భాషలలో నిష్ణాతులు మరియు ఆ సమయంలోని వివిధ వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లలో వ్యాసాలు వ్రాసేవారు.

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా 1945లో ఉత్తర కోల్‌కతాలోని నార్కెల్‌దంగా ప్రాంతంలో నివసిస్తున్న అన్సారీ  ఇతర అణగారిన ముస్లింల మధ్య విద్య వ్యాప్తి కోసం.స్థాపించబడిన మోమిన్ హైస్కూల్ వ్యవస్థాపక ధర్మకర్తలలో ఒకడు

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా, అంజుమన్ ముఫిదుల్ ఇస్లాం, కలకత్తా ముస్లిం అనాథాశ్రమం, ఇస్లామియా హయ్యర్ సెకండరీ స్కూల్, ఇస్లామియా హాస్పిటల్, జూనియర్ హై మద్రాసా తాంతి బాగ్, అంజుమాన్ తలీమ్-ఓ-తరక్కీ Anjuman Mufidul Islam, Calcutta Muslim Orphanage, Islamia Higher Secondary School, Islamia Hospital, Junior High Madrasah Tanti Bagh, Anjuman Talim-O- Taraqqui మొదలైన ఇతర ముస్లిం సంస్థల జీవితకాల సభ్యుడు మరియు వాటితో సన్నిహితంగా ఉండేవాడు.

మౌల్వీ మొహమ్మద్ యాహ్యా హజ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, అప్పటి సౌదీ అరేబియా రాజు హిస్ ఎక్సెలెన్సీ అబ్దుల్ అజీజ్ ఇబ్న్ సౌద్, అతనికి "ది హానర్ ఆఫ్ అలీజియన్స్ The Honor of Allegiance " బైత్ Baith ఇచ్చారు.

మౌల్వీ మహమ్మద్ యాహ్యా 20/05/1987న పవిత్ర రంజాన్ మాసంలో 3 కుమారులు మరియు ఒక కుమార్తెను విడిచిపెట్టి స్వర్గధామానికి ప్రయాణమయ్యారు. .

No comments:

Post a Comment