17 November 2023

భారతీయ ముస్లింలు, మహిళా మత పండితులను ఎందుకు ప్రోత్సహించరు? Why Indian Muslims do not encourage women religious scholars?

 


ఇటీవల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కంట్రీస్ వారు  జెడ్డాలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఇన్ ఇస్లాం లో భారతదేశం నుండి ముస్లిం మహిళ ప్రతినిది ఎవరూ హాజరుకాలేదు.. బంగ్లాదేశ్ మరియు మొరాకో వంటి దేశాల మహిళా ప్రతినిధులు హాజరు అయ్యారు.  కాని ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన భారతదేశం నుండి ఎవరు హాజరు కాలేదు. ఇది ఆశ్చర్యం, విస్మయం కలిగించే  ఉదాహరణ. ఇది భారతీయ ముస్లిం మహిళల  యొక్క దుర్భర వాస్తవాన్ని ఎత్తి చూపింది

చంద్రయాన్-3లో పాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్త ఖుష్బూ మీర్జా, వ్యాపార దిగ్గజం షెహనాజ్ హుస్సేన్, సానియా మీర్జా, టెన్నిస్ స్టార్ అనేక ఇతర అద్భుతమైన భారతీయ ముస్లిం మహిళలు ఉన్నప్పటికీ మహిళలు సమర్థులు కాదని muslimభారత  ముస్లిం సమాజం నమ్ముతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది

భారతీయ చరిత్రలో  శక్తివంతమైన రాణులు, పాలకులు, యువరాణులు, సాహిత్య దిగ్గజాలు, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్తలు, క్రీడాకారులు, పండితులు, నటులు మరియు రచయితలు మొదలగు  బిన్న రంగాలలో రాణించిన ముస్లిం మహిళలు  కలరు.

ఇస్లాం, మహిళల స్వాతంత్ర్యం మరియు సాధికారత యొక్క ప్రాముఖ్యతను ఎంతగా నొక్కిచెప్పినప్పటికీ, ప్రబలంగా ఉన్న సామాజిక అపోహలు వారి అవకాశాలను పరిమితం చేసింది మరియు వేదాంతవేత్తలుగా, పండితులుగా లేదా ఇస్లామిక్ నిపుణులుగా సేవలందించే మహిళల సామర్థ్యాన్ని అణచివేసింది.

అల్లాహ్‌తో వారి సంబంధానికి సంబంధించినంతవరకు ఇస్లాంలో,స్త్రీపురుషుల మధ్య తేడా లేదు, ఎందుకంటే ఇద్దరికీ మంచి ప్రవర్తనకు ఒకే బహుమతి మరియు చెడు ప్రవర్తనకు ఒకే శిక్ష. లబిస్తుంది. దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: పురుషులకు  స్త్రీలకు ఉన్న హక్కులు అలాగే స్త్రీలకు  పురుషులపై గల హక్కులు  సమానంగా ఉంటాయి. (2:226)

దివ్య ఖురాన్, విశ్వాసులను ఉద్దేశించి, తరచుగా వారి విధులు, హక్కులు, ధర్మాలు మరియు యోగ్యతలకు సంబంధించి పురుషులు మరియు స్త్రీల సమానత్వాన్ని నొక్కి చెప్పడానికి 'విశ్వసించే పురుషులు మరియు మహిళలు' అనే పదాన్ని ఉపయోగిస్తుంది.

ఇస్లామిక్ చరిత్రలో, మహమ్మద్ ప్రవక్త(స) కాలం నాటికే సమాజంలోని వివిధ అంశాలలో మహిళలు కీలక పాత్రలు పోషించారు. హజ్రత్ ఖదీజా, హజ్రత్ ఆయిషా మరియు హజ్రత్ ఉమ్మె సల్మా వంటి ప్రవక్త(స) భార్యలు వివిధ రంగాలలో నిష్ణాతులు. ఈ వారసత్వం హజ్రత్ ఫాతిమా మరియు జైనాబ్ వరకు కొనసాగింది మరియు బాగ్దాద్‌లోని ఒక పాలకుడి భార్య అయిన జుబైదా, సూఫీ ఆధ్యాత్మికవేత్త రబియా బస్రీ వంటి ప్రఖ్యాత వ్యక్తులకు విస్తరించింది.

భారత ఉపఖండంలో, ఢిల్లీ సుల్తానేట్ పాలకురాలు-రజియా సుల్తానా ఉపఖండం యొక్క మొదటి మహిళా ముస్లిం పాలకురాలు మరియు ఢిల్లీ యొక్క ఏకైక మహిళా ముస్లిం పాలకురాలు; నూర్ జహాన్ బేగం-మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య మరియు, ప్రధాన నిర్ణయాలు తీసుకున్న చక్రవర్తి వెనుక ఉన్న నిజమైన శక్తి; జహాన్ అరా బేగం, మొఘల్ యువరాణి మరియు తరువాత మొఘల్ సామ్రాజ్యం యొక్క పాద్షా బేగం; ఫాతిమా షేక్, భారతీయ ముస్లిం అధ్యాపకురాలు మరియు సంఘ సంస్కర్త మరియు అనేక మంది ఇతరులు, పాలన నుండి విద్యావేత్తల వరకు వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసిన అసాధారణమైన ముస్లిం మహిళలకు సాక్ష్యంగా నిలుస్తారు.

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బేగం హజ్రత్ మహల్, అబాదీ బేగం, బీబీ అమాతుస్ సలామ్, హజ్రా బేగం మరియు బేగం అనిస్ కిద్వాయ్ ముస్లిం సమాజంచే గుర్తించబడ్డారు మరియు ఆరాధించబడ్డారు. అయితే, స్వాతంత్ర్యం తర్వాత,ముస్లిం సమాజ  తిరోగమన మనస్తత్వం మహిళలకు అవకాశాలను తగ్గించింది. విద్యకు పరిమిత ప్రాప్యతతో గృహనిర్వాహకుల homemakers పాత్రకు వారిని పరిమితం చేసింది. మహిళలు పితృస్వామ్య మనస్తత్వానికి లోనవుతున్నారని, వారిని ప్రాథమిక సంరక్షకులుగా మరియు గృహిణులుగా పరిగణిస్తున్నారని సుప్రీంకోర్టు ఇటీవల ఎత్తి చూపింది.

 వ్యక్తిగత చట్టాలు లింగ సమానత్వానికి సంబంధించిన వివాదాలలో చిక్కుకున్నాయి, ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా లింగ అసమానతను పెంపొందించిందని విమర్శించబడినది. భారతదేశంలోని ముస్లిం మహిళల దురదృష్టకర స్థితి ఉసుల్-ఉల్-ఫిఖ్‌ Usul-ul-fiqh పై అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడింది.. వాస్తవానికి, ఉసుల్-ఉల్-ఫిఖ్  యొక్క అవగాహన వలన  ముస్లిం పర్సనల్ లా మహిళలకు  సమాన హక్కులు కల్పిస్తుంది అని తెలుస్తుంది...

.కొందరు ఉలేమాలు మదర్సాలలో అబ్బాయిల విద్య కోసం వాదించారు, బాలికలను నిర్లక్ష్యం చేశారు. ఆధునిక మరియు సహ-విద్య ఇస్లాంలో అనుమతించబడదని తప్పుడు కథనాన్ని ప్రచారం చేశారు. ఆధునిక విద్య ఇస్లామిక్ విలువలకు విరుద్ధమని లేదా ముస్లిం మహిళలకు పనికిరాదని కొందరు పేర్కొన్నారు. కొంతమంది సాంప్రదాయ ఉలేమా ముస్లిం బాలికలకు ప్రత్యేకంగా మతపరమైన విద్యను అందించాలని వాదించారు.

భారతదేశంలోని అనేక మంది ముస్లిం మహిళలు తమ స్వతంత్ర గుర్తింపులను స్థాపించడంలో మరియు దేశానికి మరియు ప్రపంచానికి గణనీయమైన కృషి చేయడంలో విజయం సాధించారు. అయినప్పటికీ, ఏ ముస్లిం సంస్థ లేదా ఇస్లామిక్ పండితులు వారి విజయాలకు చురుకుగా మద్దతు ఇవ్వకపోవడం నిరుత్సాహకరం.

మహిళల సమాన భాగస్వామ్యాన్ని అనుమతించే మరియు ప్రోత్సహించే ఇస్లామిక్ సూత్రాలు ఉన్నప్పటికీ, భారతీయ సమాజం, ముఖ్యంగా మతపరమైన సంస్థలు, మహిళా నాయకత్వాన్ని పెంపొందించడంలో మరియు అర్హులైన వారికి అవకాశాలను అందించడంలో విఫలమయ్యాయి.

భారతదేశంలోని ముస్లిం మహిళలు అతి తక్కువ చదువుకున్న వారిలో ఉన్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతీయ ముస్లిం మహిళలు ఇక్కడ వెనుకబడి ఉండటం కొంత బాధాకరం. యునెస్కో ప్రకారం, భారతదేశంలో మహిళల అక్షరాస్యత రేటు 62.8%. మత సమూహాలలో, భారతదేశంలోని ముస్లింలు అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగి ఉన్నారు. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU), జామియా మిలియా ఇస్లామియా మరియు హమ్దార్ద్ యూనివర్సిటీ వంటి సంస్థలు తమ మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌ను నియమించుకోవడానికి ఒక శతాబ్దం పట్టింది. జామియా మిలియా ఇస్లామియాలో కేవలం ఐదు సంవత్సరాల క్రితం మహిళా వైస్-చాన్సలర్ నియామకం జరిగింది. .

పురాతన భారతదేశంలోని స్త్రీలు చాలా శక్తివంతమైన స్థానాలను కలిగి ఉన్నారు. స్త్రీ అనే పదానికి "శక్తి" మరియు "బలం" అని అర్ధం.

ఒక పురాతన చైనీస్ సామెత, "స్త్రీలు ఆకాశo౦ లో సగం ".

స్త్రీలలో దైవత్వ ప్రతిబింబాన్ని చూసిన ప్రముఖ సూఫీ ముస్లిం కవి రూమీ (జలాల్ అద్-దీన్ ముహమ్మద్ బాల్ఖీ) ఇలా వ్రాశాడు, “స్త్రీ దేవుని కిరణం. ఆమె భూసంబంధమైన ప్రియమైనది కాదు: ఆమె సృజనాత్మకమైనది, సృష్టించబడలేదు.

ఒక మహిళ తన భావాలను వ్యక్తీకరించడానికి మరియు సృజనాత్మకంగా ఉండటానికి ఒక వేదికను ఇవ్వండి మరియు ఆమె తన ప్రాంతాన్ని మరియు ప్రపంచాన్ని మారుస్తుంది!

ఇస్లామిక్ స్కాలర్‌షిప్ రంగంలో ముస్లిం మహిళా నాయకత్వ అభివృద్ధిని ప్రోత్సహించే వాతావరణ౦ సృష్టించబడాలి.

 

No comments:

Post a Comment