10 November 2023

ఆఫ్ఘనిస్తాన్: విఫలమైన విదేశీ ఆక్రమణల చరిత్ర Afghanistan: A history of failed foreign occupations

 





ఆఫ్ఘనిస్తాన్‌ను 'సామ్రాజ్యాల స్మశానవాటిక' అని పిలుస్తారు.. ఆఫ్ఘనిస్తాన్‌ ఎన్నడూ విదేశీ శక్తిచే జయించబడని భూమి.

అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు చెంఘిజ్ ఖాన్ కాలం నుండి, చాలా మంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని పిలవబడే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. కాని తమ ఆశయ సాధనలో విజయవంతం కాలేదు.

.బ్రిటన్ సామ్రాజ్యం నుండి సోవియట్ రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ ఆశయ సాధనలో విఫలమైనారు.రష్యా యొక్క ఎర్ర సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో  ఒక దశాబ్దం గడిపింది మరియు ఓడిపోయి, నిరాశతో  సోవియట్ యూనియన్‌కు తిరిగి వచ్చి౦ది.

'సామ్రాజ్యాల స్మశానవాటిక'లో పరాజయం పొందిన  మరొక తాజా శక్తివంతమైన దేశం అమెరికా దాని నాటో మిత్రదేశాలు. అమెరికా దాని నాటో మిత్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్‌లో విఫలమైన ప్రపంచంలోని గొప్ప శక్తుల యొక్క సుదీర్ఘ జాబితాలో చేరాయి.

 సెప్టెంబరు 11, 2001 దాడుల నేపథ్యంలో అల్-ఖైదా-సంబంధిత తాలిబాన్ పాలనను కూల్చివేసిన తర్వాత US ఆఫ్ఘనిస్తాన్ లో $1tn ఖర్చు చేసింది. అయినప్పటికీ, రెండు దశాబ్దాల తరువాత, ఇస్లాంవాదులు మరోసారి అధికారంలోకి వచ్చారు. US దాని మిత్రదేశాల సేనలు  ఆఫ్ఘనిస్తాన్ ను విడవవలసిన పరిస్థితి వచ్చింది.

"పాలించాలనే లక్ష్యం ఉన్న  వలసవాద లేదా నియోకలోనియలిస్ట్ విదేశీ శక్తులకు స్మశానవాటిక" అని ఆఫ్ఘనిస్తాన్‌ గురించి రాజకీయ శాస్త్రవేత్త రోమైన్ మలేజాక్ అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల పై అభిప్రాయం వెలిబుచ్చుతూ మానవ శాస్త్రవేత్త థామస్ బార్‌ఫీల్డ్ ప్రకారం " విదేశీ ఆక్రమణదారులు  ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పరిపాలించలేక,  తమంతట తామే విడిచిపెట్టెలా అక్కడి ఆఫ్ఘన్ ప్రజలు సంఘర్షణ చేస్తారుఅని అన్నాడు..

ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధాలు(1839-1919):

ఇంపీరియల్ బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ ను, ఇండియా మరియు రష్యా మధ్య ఒక ముఖ్యమైన బఫర్‌గా చూసింది. దక్షిణాసియాపై దాడి చేయడానికి రష్యన్లు, ఆఫ్ఘనిస్తాన్‌ను ఉపయోగించుకుంటారనే భయంతో, బ్రిటీష్ వారు మొదటిగా పావులు జరిపారు. 1839లో ఆఫ్ఘానిస్తాన్ పై దాడి చేసి, విధేయుడైన స్థానిక పాలకుడిని స్థాపించారు. చివరకు ఈ చర్య వికటించి చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అభిప్రాయం లో బ్రిటన్ యొక్క "అత్యంత గొప్ప సామ్రాజ్య విపత్తు"గా ముగిసింది.

తన సామ్రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌ను చేర్చుకునేలా బ్రిటన్ చేసిన ప్రయత్నాలను, ఆఫ్ఘన్ తిరుగుబాటులు తిప్పికొట్టారు. 1842లో బ్రిటీష్ గతిలేక  తిరోగమించినది. .బ్రిటిష్  వారు దాదాపు 20,000 మంది సైనిక బలగాలను కాబూల్ నుంచి నిష్క్రమణ లో కోల్పోయారు..కేవలం  ఒక్క  బ్రిటిష్ సైనికుడు  ప్రాణాలతో తిరిగి వచ్చాడు. బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్‌ తో 1878 మరియు 1919లో మరో రెండు యుద్ధాలు చేసింది

సోవియట్ దండయాత్ర1979-89:

1978లో కమ్యూనిస్ట్ తిరుగుబాటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధంలో యుద్ధభూమిగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ లో  కొత్త పాలన యొక్క క్రూరత్వం తీవ్రమైన స్థానిక ప్రతిఘటనను రేకెత్తించింది.

మరిన్ని తిరుగుబాట్లు తరువాత  మరుసటి సంవత్సరం1979లో  సోవియట్ యూనియన్ దళాలు ఆఫ్ఘానిస్తాన్ ఆక్రమించినవి. యుఎస్ మరియు పాకిస్తాన్ మద్దతుతో, ముజాహిదీన్ అని పిలువబడే స్థానిక తిరుగుబాటుదారుల వ్యవస్థీకృత వర్గాలు సోవియట్‌లు మరియు ఆఫ్ఘన్ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జిహాద్ చేశారు.గెరిల్లా వ్యూహాలను ఉపయోగించిన ముజాహిదీన్ అని పిలువబడే స్థానిక తిరుగుబాటుదారులను సోవియట్ దళాలు ఓడించలేకపోయాయి

ఆ తర్వాత జరిగిన అంతర్యుద్ధం ఆఫ్ఘనిస్తాన్‌కు వినాశకరమైనది. అయినప్పటికీ సోవియట్‌ల యొక్క విస్తారమైన వనరులు ముజాహిదీన్‌లను అణిచివేసేందుకు సరిపోవని నిరూపించబడింది. ముజాహిదీన్‌ తమ గెరిల్లా వ్యూహాలతో సోవియెట్ రష్యా తీవ్ర నష్టం కల్గించారు. ఒక మిలియన్ ఆఫ్ఘన్లు చంపబడ్డారు మరియు మరో 4 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందారు. "

 ఒక శతాబ్దానికి ముందు బ్రిటిష్ వారికి పట్టిన గతి తమకు పట్టి౦దని  సోవియట్‌లు నిర్ధారణకు వచ్చారు: ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రత్యక్ష ఆక్రమణ కొన్ని స్వల్ప ప్రయోజనాల కోసం అధిక మొత్తం ను చెల్లించాలని అని సోవియెట్లు అర్ధం చేసుకొన్నారని " అని బార్‌ఫీల్డ్ రాశారు.

సోవియట్‌లు ఆఫ్ఘానిస్తాన్ విడిచిపెట్టిన తర్వాత, ముజాహిదీన్ వర్గాలు పరస్పరం కలహించుకోన్నాయి. చివరకు అందరిపై విజయం సాధించి తాలిబాన్లు రంగప్రవేశం చేసారు.

US మరియు నాటో దండయాత్ర 2001-21:

క్రూర పాలన,    మహిళల హక్కులను తుడిచిపెట్టడ౦ మరియు క్రూరమైన శిక్షలు విధించడం, ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం వంటి చర్యలు  తాలిబాన్లపట్ల   అంతర్జాతీయ వ్యతిరేకతను రేకెత్తించినవి.

9/11 కంటే ముందు ఒసామా బిన్ లాడెన్ మరియు అల్-ఖైదాకు ఆశ్రయం ఇవ్వడం వలన ప్రపంచo౦ ఆఫ్ఘనిస్తాన్ పై 'భయంకరమైన' ఆర్థిక ఆంక్షలు సిఫార్సు చేసింది.

ట్విన్ టవర్ దాడులు జరిగిన ఒక నెలలోనే, యుఎస్ ఆఫ్ఘానిస్తాన్ పై బాంబు దాడి చేయడం ప్రారంభించింది. పూర్తి స్థాయి దండయాత్రకు ముందు యుద్దభూమిలో తాలిబాన్లను మట్టుబెట్టడానికి స్థానిక వార్ లార్డ్స్ ను సమీకరించింది. డిసెంబర్ 2001 నాటికి తాలిబాన్ కూలిపోయింది, బిన్ లాడెన్‌తో కలిసి పర్వతాలకు పారిపోయింది.

అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తదనంతరం దేశాన్ని పునర్నిర్మించే ప్రణాళికలను ప్రకటించాడు. 2003లో అమెరికా రక్షణ కార్యదర్శి డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ "ప్రధాన పోరాటం" ముగిసిందని ప్రకటించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 శాంతి ఒప్పందంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి US దళాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు, డొనాల్డ్ ట్రంప్ వారసుడు జో బిడెన్ తరువాత బయలుదేరే తేదీ departure date ని నిర్ణయించారు.

కానీ తాలిబాన్ యొక్క తిరుగుబాటు తరువాత సంవత్సరాల్లో ఊపందుకుంది, US సైనిక ఉనికిని 100,000 కంటే ఎక్కువ మంది సైనికులకు పెంచడానికి అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రేరేపించారు. ఉపసంహరణ ప్రణాళికలు ఆలస్యం అయ్యాయి, తాలిబాన్ బలాన్ని కూడగట్టుకుంది. ఫిబ్రవరి 2020 శాంతి ఒప్పందంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి US దళాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తాలిబాన్ తీవ్ర హింసకు పర్యాయ పదంగా గా మారింది.

ప్రెసిడెంట్ జో బిడెన్, ఎప్పటికీ యుద్ధం అని పిలవబడే సమయంలో దేశీయ అలసటను దృష్టిలో ఉంచుకుని, అతి త్వరగా US బయలుదేరుతుందని ప్రకటించారు.

తాలిబాన్ మిగిలిన ప్రతిఘటనలను అధిగమించడానికి ముందు US ఉపసంహరణను కూడా పూర్తి చేయలేదు.

చరిత్రకారులు మరియు రాజకీయ శాస్త్రవేత్తలు US ఎలా మరియు ఎక్కడ తప్పు చేసిందని చాలా కాలంగా చర్చించుకుంటారు.

మలేజాక్  ప్రకారం - మునుపటి ఇతర శక్తుల మాదిరిగానే - యుఎస్ బలాన్ని ఉపయోగించి దేశాన్ని పునర్నిర్మించగలదని పొరపాటుగా నమ్మింది

 

-Financial times, సౌజన్యం తో

No comments:

Post a Comment