26 November 2023

భారత రాజ్యాంగ దినోత్సవ౦- నవంబర్ 26

 




రాజ్యాంగం అనగా ప్రభుత్వం  యొక్క విధానం. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు విధానాలూ పొందుపరచబడి వుంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనునది శరీరమైతే, రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం

ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా... రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం (National Law Day)గా కూడా జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారతదేశం,. రాజ్యాంగాన్ని దత్తత (adoption) చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ... రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది

భారత ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం లభించేలా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను ప్రజలకు రక్షణ కవచాలుగా మార్చారు. జీవించే హక్కు, చట్టం అందరికీ సమానం, రక్షణ హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి నిరోధించడం, మత స్వేచ్ఛ, అణగారిన వర్గాల రక్షణ, హక్కులకు భంగం కలిగితే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఆశ్రయించే హక్కును ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించింది. 

భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు. అన్నింటి కంటే రాజ్యాంగమే గొప్పది. 

రాజ్యాంగంలో అవతారిక/పీఠిక/ప్రవేశిక  ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షనూ ప్రకటించుకున్నారు. అవతారిక/పీఠిక/ప్రవేశిక  రాజ్యంగ లక్ష్యాలను వివరిస్తుంది. రాజ్యాంగానికి హృదయం లాంటిది. భారత రాజ్యాంగం ఈ అవతారిక/పీఠిక/ప్రవేశికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు.

అవతారిక/పీఠిక/ప్రవేశిక  రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. అవతారిక/పీఠిక/ప్రవేశిక  భారతియులమైన  మేము, మాకోసం రాజ్యాంగాన్ని  సమర్పించుకొంటున్నాము అనే భావాన్ని వ్యక్తికరించినది. భారరతియులకు స్వేఛ్చ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం, న్యాయాలను ప్రసాదించినది

భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:

న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం;

స్వేచ్ఛ - ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;

సమానత్వం - హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;

సౌభ్రాతృత్వం - వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ;

మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము.

2015 నవంబర్ 19న... కేంద్ర ప్రభుత్వం... నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ... గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... 2015 అక్టోబర్ 11న ముంబైలో... సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ (Dr.B.R.Ambedkar) విగ్రహానికి పునాది రాయి వేస్తూ... ఈ ప్రకటన చేశారు. 2021లో... అంబేద్కర్‌ 131వ జయంతి జరిగింది. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది వరకు నవంబర్ 26న లా డే (law day)గా జరుపుకునేవారు. నవంబర్ 26న రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

నవంబర్ 26న కాలేజీలు, యూనివర్శిటీల్లో రాజ్యాంగంపై ప్రసంగాలు, డిబేట్లు నిర్వహిస్తారు. అలాగే... మాక్ పార్లమెంట్ వంటివి కూడా జరుపుతారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఈ రోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది సమాజం పట్ల వారిలో సేవానిరతిని పెంపొందిస్తారు.

విదేశాల్లో కూడా భారతీయులు రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని భారత విదేశాంగ శాఖ కోరింది. వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.

 

 

 

 

 


No comments:

Post a Comment