24 May 2024

పాలస్తీనాను మరిన్ని దేశాలు గుర్తించడం ఇజ్రాయెల్‌పై శక్తివంతమైన, నేరారోపణకు ప్రతీక Powerful, symbolic the recognition of Palestine by more nations is an indictment of Israel

 



వచ్చే వారం పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తించాలనే ఉద్దేశంతో ఐర్లాండ్, నార్వే మరియు స్పెయిన్ చేసిన ప్రకటన, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విస్మరించలేని అంతర్జాతీయ అభిప్రాయం యొక్క మరొక ముఖ్యమైన సంకేతం.

గత నెలలో, UN జనరల్ అసెంబ్లీలో, భారతదేశంతో సహా 143 దేశాలు పాలస్తీనా రాజ్యాన్ని UN భద్రతా మండలి గుర్తించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించాయి, కాని దానిని అమెరికా, UN భద్రతా మండలి లో వీటో చేసింది

ఈ వారం ప్రారంభంలో, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రాసిక్యూటర్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మరియు రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌లకు మరియు హమాస్ నాయకత్వానికి అక్టోబర్ 7 తర్వాత గాజాలో కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు ఇజ్రాయెల్‌లో 1,200 మందిని బలిగొన్న తీవ్రవాద దాడికి యుద్ధ నేరాలు క్రింద అరెస్టు వారెంట్ల కోసం దరఖాస్తుచేసాడు. 

గాజా లో "మారణహోమం" సాగించిన ఇజ్రాయెల్‌పై విచారణలో అదనపు చర్యల కోసం పిలుపునిస్తూ దక్షిణాఫ్రికా వేసిన పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం తీర్పును ప్రకటించినది.. రాఫా పై తక్షణమే దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించినది.

ఇజ్రాయెల్‌పై విమర్శలు గుప్పించిన మూడు దేశాల (ఐర్లాండ్, నార్వే మరియు స్పెయిన్) తాజా నిర్ణయం తో  వారు ఇప్పటికే పాలస్తీనా రాజ్యత్వాన్ని గుర్తించిన ఎనిమిది EU సభ్యులతో చేరారు. భూమిపై పరిస్థితిని భౌతికంగా మార్చకపోవచ్చు. కానీ ఐరిష్ ప్రధాని టావోసీచ్ సైమన్ హారిస్ ప్రకారం ఇజ్రాయెల్‌ ప్రత్యేకించి రాఫాపై జరిపిన  "అంతిమ  దాడి " కి వ్యతిరేకంగా శక్తివంతమైన రాజకీయ మరియు సంకేత విలువ కలిగిన చర్య" కావచ్చు.  

ఆచరణాత్మకంగా ప్రతి దేశం హమాస్ యొక్క ఉగ్రవాద దాడులను ఖండించినప్పటికీ,  వెస్ట్ బ్యాంక్‌లోని చట్టబద్ధమైన పాలస్తీనా ప్రభుత్వాన్ని విస్మరించడం పొరపాటు అని ఐరిష్ ప్రధాని హారిస్ అన్నారు.

"సుదీర్ఘమైన మరియు క్రూరమైన సంఘర్షణలో తిరోగమనంలో ఉన్న మితవాద శక్తులకు" మద్దతు ఇవ్వడమే పాలస్తీనా రాజ్య గుర్తింపు  చర్య లక్ష్యం అని నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ చెప్పారు.

 ఇజ్రాయెల్ కోసం ఉద్దేశించిన పేలుడు పదార్థాలతో కూడిన డానిష్-ఫ్లాగ్ ఉన్న ఓడకు పోర్ట్ సౌకర్యాలను స్పెయిన్ నిరాకరించిన తరువాత, పాలస్తీనా రాజ్య గుర్తింపు  చర్య ఇప్పుడు దృఢమైన విధానం అని స్పెయిన్ పేర్కొంది.  ప్రతిస్పందన గా  ఇజ్రాయెల్ దాని రాయబారులను ఆ యురోపియన్ దేశాల నుండి రీకాల్ చేయడం మరియు తన రాజధాని లోని ఆ మూడు దేశాల రాయబారులను వివరణ కోసం పిలిపించడం జరిగింది. 

సమీప భవిష్యత్తులో, దాదాపు ప్రపంచ ఏకాభిప్రాయం యొక్క అనేక సందేశాలు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని రఫా కోసం దాని ప్రణాళికలను పునరాలోచించటానికి, మరింత పౌర నష్టాలను ఆపడానికి మరియు గాజాలోకి మానవతా సహాయాన్ని ఉచితంగా అనుమతించడానికి ఉద్దేశించబడ్డాయి.

దీర్ఘకాలంలో, ఇది నెతన్యాహు కు "రెండు-రాజ్యాల  పరిష్కారం శాంతికి రోడ్ మ్యాప్ అని ప్రపంచం విశ్వసిస్తున్న విషయాన్ని గుర్తుచేయడానికి ఉద్దేశించబడింది. ఈ సందేశాలను పెడచెవిన పెట్టడం ద్వారా  నెతన్యాహు తన ఒంటరితనాన్ని మరింత పెంచుకుంటున్నారు మరి ముఖ్యంగా . అంతర్జాతీయ సమాజం నుండి, సానుభూతిని కోల్పోతున్నారు.

No comments:

Post a Comment