29 February 2024

ప్రపంచంలోని 3వ అతిపెద్ద మసీదు 'డ్జామా ఎల్-జజైర్' అల్జీరియాలో ప్రారంభించబడింది World’s 3rd largest mosque ‘Djamaa El-Djazair’ inaugurated in Algeria

 


అల్జీర్స్:

అల్జీరియా ప్రెసిడెంట్ అబ్దెల్మద్జిద్ టెబ్బౌన్ Abdelmadjid Tebboune దేశ రాజధాని అల్జీర్స్‌లో ప్రపంచంలోని 3వ అతిపెద్ద మసీదు 'డ్జామా ఎల్-జజైర్ Djamaa El-Djazair’ ను ప్రారంభించి, ఆరాధకులకు తెరిచారు.

ఉత్తర ఆఫ్రికా దేశం యొక్క మెడిటరేనియన్ తీరప్రాంతంలోని అల్జీర్స్ గ్రాండ్ మసీదు స్థానికంగా 'డ్జామా ఎల్-జజైర్ Djamaa El-Djazair’  అని పిలువబడుతుంది,  రంజాన్‌కు ముందు ప్రారంభించబడింది.

అబ్దెల్‌మద్జిద్ టెబౌన్ మసీదును ప్రారంభించి విశ్వాసుల కోసం తెరిచినప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఇస్లామిక్ పండితులు మరియు మతపెద్దలు హాజరయ్యారు.

చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (CSCEC), చే నిర్మించబడిన అల్జీర్స్ యొక్క గ్రేట్ మసీదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మినార్‌ (265 మీటర్లు (869 అడుగులు) ని కలిగి ఉంది మరియు మసీదులో సుమారు 120,000 మంది ప్రజలు కూర్చునే అవకాశం ఉంది.

$800m కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించబడిన మస్జిద్  అరబ్ మరియు ఉత్తర ఆఫ్రికా అలంకరణలను కలిగి 27.75 హెక్టార్లు (దాదాపు 70 ఎకరాలు)లో  విస్తరించి ఉంది. మస్జిద్ లో మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ సివిలైజేషన్, కల్చరల్ సెంటర్ మరియు లెక్చర్ హాల్ ఉన్నాయి.మసీదులో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్ మరియు ఒక మిలియన్ పుస్తకాలను కలిగిన లైబ్రరీ కూడా ఉంది. ఇస్లామిక్ సైన్సెస్ కోసం హయ్యర్ స్కూల్ కూడా ఉంది, ఇందులో స్టడీ రూమ్‌లు మరియు ప్రయోగశాలలు ఉన్నాయి.

 

 

No comments:

Post a Comment