12 February 2024

ఆధునిక విద్యను మదారిస్ సిలబస్‌లో చేర్చాలి-ఇస్లామిక్ పండితులు Modern education must be included in Madaris’ syllabi, assert Islamic scholars

 

మదర్సా ఎడ్యుకేషన్ సిలబస్‌ పాఠ్యాంశాల్లో. గణితం, సైన్స్, కంప్యూటర్లు, సాంకేతిక విద్య మరియు ఇతర ఆధునిక విద్యను చేర్చాలని భారతదేశానికి చెందిన ప్రసిద్ధ ఇస్లామిక్ పండితులు అభిప్రాయపడినారు.

మదారీస్ (ఇస్లామిక్ పాఠశాలలు) యొక్క విద్యా వ్యవస్థ మరియు పాఠ్యాంశాలను ఆర్థిక శాస్త్రంతో అనుసంధానించాలి. మత సంస్థలు ఆర్థిక శాస్త్రంతో అనుసంధానించబడినప్పుడు గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు మరియు గణిత శాస్త్రవేత్తలు జన్మిస్తారు.. దేశవ్యాప్తంగా ఉన్న మదారీలను నిర్వహించే అధికారులు విద్యార్థులను మతపరమైన మరియు సమకాలీన విద్యతో సన్నద్ధం చేస్తూ వారి మేధో మరియు విద్యా శిక్షణపై శ్రద్ధ వహించాలి.

మదరసా విద్యార్థులు అరబిక్‌తో పాటు ఇతర భాషలను నేర్చుకునేందుకు, ప్రావీణ్యం పొందేలా మదారీస్‌ యాజమాన్యాలు కృషి చేయాలి. మతపరమైన, సమకాలీన మరియు సాంకేతిక విద్యలతో కూడిన పాఠ్యాంశాలను మదరసా విద్యార్థులు పట్టుదల, అంకితభావంతో చదవాలి.. మదరసా యాజమాన్యాలు, ముస్లిం సమాజ  సంక్షేమానికి కృషి చేయాలి..

 మదరసాలు మతపరమైన అధ్యయనాలు, ఖురాన్ మరియు హదీసులు, ఇస్లామిక్ న్యాయశాస్త్రం, జీవిత చరిత్ర మరియు చరిత్ర, అరబిక్, ఉర్దూ భాష మరియు సాహిత్యంతో పాటు ఆధునిక శాస్త్రాలు, భౌగోళిక శాస్త్రం, గణితం, ఇంగ్లీష్ మరియు హిందీలను నేర్చుకోవాలి.  మదరసా పాఠ్యాంశాల్లో. విద్యార్థులు జీవితంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆధునిక విద్య సబ్జెక్టులు చేర్చబడాలి.  ఇందుకోసం సాంకేతిక విద్యను సక్రమంగా నిర్వహించడం జరగాలి..

మదరసా విద్యార్ధులు ఇతర పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులతో పాటు ఆధునిక విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి అర్హులు అయ్యేటట్లు శిక్షణ ఇవ్వాలి. .

 

No comments:

Post a Comment