9 February 2024

ఇస్లాం వ్యభిచారం, వివాహేతర సంబంధాలను నిషేధిస్తుంది Islam forbids adultery, extramarital liaisons

 


ఈ రోజుల్లో, వ్యభిచారం లేదా వివాహ ఒప్పందం లేకుండా లైంగిక సంబంధాలు కలిగి ఉండటం అనేది సాధారణమైనది. అన్ని అబ్రహమిక్ మతాలలో  వ్యభిచార౦ నిషేధించబడినది.   అయినప్పటికీ, వ్యభిచారం, అక్రమ  లైంగిక సంబంధాలకు పాల్పడేవారు  తమ చర్యను సమర్థించుకోవడానికి అనేక తార్కిక కారణాలను చెప్పవచ్చు. వ్యభిచారానికి పాల్పడే చాలా మంది వ్యక్తులు తమ జీవసంబంధ అవసరాలను తీర్చుకోవడానికి ఇది సహజమైన మార్గం అని అంటారు.

ఇస్లామిక్ బోధనలలో, వ్యభిచారం, వివాహేతర సంబంధాలు నిషేది౦పబడినవి. దివ్య ఖురాన్, హదీత్  మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం/షరియా  వ్యభిచార౦o మరియు వివాహేతర సంబంధాలు వాటి పర్యవసానాలు మరియు వాటిని నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలను వివరించును.  

నైతిక దృక్కోణం నుండి, ఇస్లాం వ్యభిచారాన్ని ఘోరమైన పాపంగా మరియు వివాహం యొక్క పవిత్ర బంధాన్ని ఉల్లంఘించేదిగా పరిగణిస్తుంది., వ్యభిచారాన్ని ఖండిస్తూ, దివ్య ఖురాన్ "వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి. అదొక సిగ్గుమాలిన చేష్ట , బహు చెడ్డ మార్గం అన్నది.- 17:32. వ్యబిచారము, వివాహేతర సంబంధాలను   నిషేధించడం ద్వారా అనైతిక ప్రవర్తనను నిరోధించడంలో ఇస్లాం క్రియాశీల స్వభావాన్ని చూపుతుంది

ఇస్లామిక్ బోధనలు వ్యక్తిగత ప్రవర్తనలో పవిత్రత, విశ్వసనీయత మరియు స్వీయ-నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. వ్యభిచారం అనేది నమ్మక ద్రోహం, వైవాహిక ప్రమాణాల ఉల్లంఘన మరియు కుటుంబ పవిత్రతను దెబ్బతీసే విధ్వంసక శక్తిగా పరిగణించబడుతుంది. వివాహం యొక్క పవిత్రతను నిలబెట్టడం ద్వారా, ఇస్లాం స్థిరత్వం మరియు సామరస్యాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది.

ఇస్లాం పశ్చాత్తాపం (తౌబా) మరియు విమోచన repentance (Tawbah) and redemption భావనను కూడా నొక్కి చెబుతుంది. నిష్కపటమైన పశ్చాత్తాపం, క్షమాపణ మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణకు దారి తీస్తుంది. దివ్య ఖురాన్ విశ్వాసులకు అల్లాహ్ కరుణ మరియు దయగలవాడని, చిత్తశుద్ధితో తన వైపు తిరిగే వారి నుండి పశ్చాత్తాపాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడని హామీ ఇస్తుంది.

నమ్రత, పవిత్రత మరియు వైవాహిక విశ్వసనీయతను ప్రోత్సహించడంతోపాటు వ్యభిచారానికి వ్యతిరేకంగా ఇస్లాం నివారణ చర్యలను సూచిస్తుంది. ఇస్లాం ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడానికి బలమైన కుటుంబ సంబంధాలను, బహిరంగ సంభాషణను మరియు జీవిత భాగస్వాముల మధ్య పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.

"ఆయన  సూచనలలోనే  ఒకటి ఏమిటంటే, ఆయన స్వయంగా మీ జాతి నుండి మీ కోసం జంటలను (భార్యలను) సృస్తించాడు.- వారి ద్వారా మీరు సుఖపడాలని. ఇంకా ఆయన మీ మద్య ప్రేమానురాగాలను, దయార్ధతను పొందుపరిచాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే జనులకు పలు సూచనలు ఉన్నాయి."-దివ్య ఖురాన్  (30:21)

కుటుంబాన్ని కలిగి ఉండటం మరియు దానికి విధేయత చూపడం సమాజం సురక్షితమైన ప్రదేశంగా ఉండటానికి సహాయపడుతుంది. అల్లాహ్ (SWT) వివాహం చేసుకోవడాన్ని మరియు ఇతరులను వివాహం చేసుకోవడానికి సహాయం చేయడాన్ని నొక్కి చెప్పాడు.

ఇస్లామిక్ భోధనలు మానవ జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి మరియు ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక మెరుగుదలలను సాధించగల జీవిత నైపుణ్యాలను కూడా అందిస్తాయి.

 

No comments:

Post a Comment