13 February 2024

ఇస్మాలియా యొక్క 'ఫ్రెంచ్ చర్చి' ఈజిప్టులో పర్యాటకులకు ఒక అద్భుతం Ismailia’s ‘French church’ a Marvel for Tourists in Egypt

 


కైరో:

ఈజిప్ట్‌లోని ఇస్మాలియా గవర్నరేట్‌లో ఉన్న సెయింట్ మార్క్ చర్చి నిర్మాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. కైరోకు తూర్పున 100 కి.మీ దూరంలో ఉన్న 160-సంవత్సరాల పురాతన సెయింట్ మార్క్ చర్చిని తరచుగా ఫ్రెంచ్ చర్చిగా పిలుస్తారు. సెయింట్ మార్క్ చర్చి,సూయజ్ కెనాల్,  నిర్మించిన ఫ్రెంచ్ ఇంజనీర్ ఫెర్డినాండ్ డి లెస్సెప్స్‌తో అనుబంధం కలిగి ఉంది.

ఫ్లోబేటర్ గాడ్, అనే కాప్టిక్ ఆర్కిటెక్చరల్ ఆర్ట్ పరిశోధకుడు, వివిధ విశ్వాసాల నుండి సందర్శకులను ఆకర్షించే ఒక నిర్మాణ కళాఖండంగా సెయింట్ మార్క్ చర్చిని వర్ణించారు. ఈజిప్ట్‌లోని సెయింట్ మార్క్ చర్చి, ఫ్రాన్స్‌లోని చర్చిని పోలి ఉండటంతో వారసత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు అద్భుతమైన పెయింటింగ్‌లు మరియు క్రీస్తు జన్మస్థలాన్ని సూచించే గుహను కలిగి ఉంది.

కాప్టిక్ కాథలిక్ డినామినేషన్‌తో అనుబంధంగా ఉన్న కేథడ్రల్ ఆఫ్ సెయింట్ మార్క్ నిర్మాణం, 1864 నాటి కళాత్మక విలువ మరియు చారిత్రక మూలాలను కలిగి ఉంది.

సూయజ్ కెనాల్ తవ్వేటప్పుడు, పనిచేస్తున్న కార్మికులకు ప్రార్థనా స్థలాలుగా ఇస్మాలియాలో మూడు చర్చిలు నిర్మించబడ్డాయి. 1865లో పెద్ద వరద ప్రమాదం ను కేథడ్రల్ ఆఫ్ సెయింట్ మార్క్ ఎదుర్కొన్నప్పటికి  నేటికి చర్చి బలంగా ఉంది.

ఈజిప్టు వారసత్వ పరిశోధకుడు అబ్దెల్‌మజిద్ అబ్దెలాజిజ్, 1924లో సెయింట్ మార్క్ చర్చి యొక్క విస్తరణ మరియు కొత్త భవనం నిర్మాణం  జరిగిందని పేర్కొన్నాడు.

నేడు, మతపరమైన సరిహద్దులను దాటి, సెయింట్ మార్క్ చర్చ్ సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. సెయింట్ మార్క్ చర్చ్ గొప్ప చరిత్ర మరియు నిర్మాణ వైభవాన్ని ప్రశంసించే వారందరినీ ఆకర్షిస్తోంది.

No comments:

Post a Comment