1 February 2024

హిజాబ్ ఇస్లామిక్ స్త్రీ విముక్తికి, అబ్యుదయానికి సాధనం

 


 

హిజాబ్ ముస్లిం స్త్రీల అణచివేతకు చిహ్నం కాదు అది వారి స్వీయ నియంత్రణ, శక్తిని ప్రదర్శించే సాధనం. ఇస్లాం పట్ల పాశ్చాత్య ప్రపంచం అమితాసక్తి ని ప్రదర్శించే వాటిలో ముఖ్యమైనది హిజాబ్ (జుట్టు ను కప్పిపుచ్చడానికి ఒక మహిళ యొక్క తల చుట్టూ చుట్టిన  ఒక కండువా) - ఇస్లామిక్ చిహ్నాలలో ముసుగు (Veiling) అనేది "మహిళల ఆస్తి "  గా మారింది.

 

పశ్చిమ స్త్రీవాద భావాల పట్ల ముస్లిం మహిళల  తిరస్కారం లో హిజాబ్  అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా మారింది. నేడు చదువుకున్న అనేకమంది ఇస్లామిక్ మహిళలు హిజాబ్ ను ఆధునికతకు వ్యతిరేకoగా ఉపయోగిస్తున్నారు.హిజాబ్ ఇస్లామిక్ ఫెమినిజం కు మారుపేరుగా  మత అద్యయనం  తో సహా స్త్రీ యొక్క జీవిత అన్నిరంగాలలో ప్రవేశం పొందినది.

 

పశ్చిమ స్త్రీవాదుల ప్రకారం హిజాబ్ స్వేచ్ఛ చిహ్నం కాదు అణచివేతకు గుర్తు. ఇస్లాం మహిళలను చట్ట  ప్రకారం మరియు సంస్కృతి సంప్రదాయం ప్రకారం రెండవ తరగతి పౌరులు గా చూస్తుంది. వెస్ట్రన్ మీడియా వార్తా కథనాలు  లేదా సర్వేలు లేదా అధ్యయనాలు పరిశిలించిన ముస్లిం స్త్రీ హిజాబ్ ధారణ లో కన్పిస్తుంది.

 

పశ్చిమ పరిశోధకుల అభిప్రాయాలకు విరుద్ధంగా హిజాబ్ ముస్లిం మహిళల స్వయం నియంత్రణ, శక్తి చూపించే ఒక మార్గంగా ఉంది. ఆసుపత్రులు మరియు గ్రంథాలయాల్లో పని చేసే బాగా చదువుకున్న మహిళలు కూడా దానిని ధరిస్తున్నారు.

 

హిజాబ్ ను ముస్లిం మహిళలు తమ మగవారి అదిక్యత కు గుర్తుగా గాక తమ స్త్రీవాద ఆదర్శాలు పెంపొందించటానికి గుర్తుగా వాడతారు. అనేక మంది  ముస్లిం మహిళలు హిజాబ్ ను వారి దేహా నియంత్రణ మరియు పురుషాదిక్యత కు సవాలుగా స్వీకరిస్తారు.  ఆధ్యాత్మికత కు చిహ్నం గా ధరిస్తారు. హిజాబ్ పేద వర్గాల స్త్రీలకు  ఒక కవచం లాంటిది. నేడు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్టాత్మక విద్యా కోర్సులు అబ్యసిస్తున్న అత్యంత ప్రకాశవతమైన ముస్లిం అమ్మాయిలు కూడా దానిని ధరిస్తున్నారు. హిజాబ్ పై అంక్ష ప్రతికూల పలితాలు ఇచ్చి వారు ఇతరులతో  కలవనీయకుండా చేసి  వారిని ఇంటికే పరిమితం చేస్తుంది.

 

ప్రవక్త ముహమ్మద్(స) "ప్రతి మతం కు ఒక ముఖ్య లక్షణం ఉంది మరియు ఇస్లాం యొక్క ముఖ్య లక్షణం వినయం(modestry)" అని అన్నారు.

 

ఇస్లాం లో వినయము స్త్రీ-పురుషులు ఇరువురికి  ఒక ఆభరణం అని చెబుతుంది. నిజానికి, ప్రవక్త (స)ప్రవర్తనా పరం గా వ్యక్తి యొక్క వినయసారం గా వర్ణించబడినారు. దివ్య ఖురాన్ విశ్వాసులను తమ చూపు క్రిందకు మరలించుకోమని, తమ శీలాన్ని కాపాడుకొమ్మని అది వినయానికి లక్షణం అని చెబుతుంది. అది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తించుతుంది. (Q 24: 30-31)

 

ఇస్లాం కు ఆవిర్భావానికి ముందు కూడా మహిళ యొక్క వేషధారణ చారిత్రాత్మకంగా వినయం మరియు స్థానిక ఆచారాలను ప్రతిబిoచును. “హయా” అనే అరబిక్ పదం కు వినయం అని అర్ధం.  ఈ పదం భాషాపరంగా జీవితం (హయత్) కు సంభందించినది. ముస్లిం విద్వాంసుల దృష్తి లో ఈ రెండు  అరబిక్ పదలకు మద్య  ఒక సన్నిహిత సంబంధం ఉంది. వినయము, ఆత్మ కు  ఆధ్యాత్మిక జీవనం  ఇచ్చే గుణం.

 

ఆధ్యాత్మిక జీవితం మరియు వినయం మధ్య సంబంధం ఉంది. ఆoతరంగికముగా వ్యక్తి తన లోపల దేవుని పట్ల వినయం కలిగి ఉండాలి. బాహ్యంగా తన గౌరవాన్ని పెంపొందించే విధంగా మరియు ఇతరుల గౌరవాన్ని పంపొందించే విధంగా దుస్తులు, మాటలు లేదా ప్రవర్తన లో వినయం కలిగి ఉండాలి. అంతరంగికంగా  వినయం దేవుని పట్ల  విధేయతను పెంచును. బాహ్య విధేయత అంతరంగిక విధేయతను పెంచును మరియు బాహ్య విధేయత ఆంతరంగిక విధేయతకు  అత్యవసరం.

 

విధేయత (మోడెస్టీ) ఇస్లాం లోనే కాక ఇతర ఏకేశ్వరవాద మతాల లో కూడా ఉంది. ఉదాహరణకు ఆధునిక మరియు  సనాతన యూదు మహిళలు వారి జుట్టు కవర్ చేయడానికి విగ్గులు  ధరిస్తారు. సన్యాసినులు వారి మత ప్రతిష్ఠితమైన చిహ్నంగా అపోస్తోలింక్స్ (apostolniks)ధరిస్తారు. ఎపిస్కోపల్ చర్చ్ మహిళలు చర్చికి వెళ్ళేటప్పుడు  టోపీలు ధరిస్తారు.

 

దివ్య ఖుర్ఆన్ ప్రకారం ఆదర్శ సమాజం యొక్క సామాజిక మరియు నైతిక విలువలను  ముస్లిం స్త్రీ-పురుషులు ఇరువురు ఆచరించాలి మరియు స్త్రీ-పురుషులకు సమాన న్యాయం ఉండాలి.  దివ్య ఖురాన్ ప్రకారం స్త్రీలు  గౌరవం మరియు మర్యాదతో కూడిన జీవతం గడపాలి మరియు స్త్రీ తమ  వ్యక్తిత్వం ను కాపాడుకోవాలి కాని లైంగికతను  ప్రదర్శించ రాదు.

 

హిజాబ్ అనునది స్త్రీలకు కేవలం వస్త్రం యొక్క భాగము లేదా ధిక్కరణ యొక్క చిహ్నంకాదు అది    సృష్టికర్త వారికి ప్రసాదిoచిన స్వీయ శుద్దీకరణ మరియు భగవంతుని చేరుటకు ఒక మార్గం. అది వినయం పెంపొందించుటకు ఒక సాధనం. హిజాబ్ మహిళ యొక్క భక్తి భావానికి ఒక నిజమైన ఉదాహరణ.

 

ముస్లిం మహిళలు ధరించే హిజాబ్ ఇస్లాం యొక్క బోధనలను తెల్పును. వెస్ట్ లో హిజాబ్ ధరించే మహిళ ఇతర మహిళలతో సమానంగా హక్కులు మరియు అవకాశాలు పొందవలయును. ఇస్లాం మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించవలయును మరియు భగవంతునితో వారి వ్యక్తిగత  సానిద్యం కొరకు అది తోడ్పడును. స్త్రీలకు   వ్యక్తిగత స్వతంత్రం మరియు  పురోభివృద్ది కొరకు హిజాబ్ ధరించే స్వేచ్చ  ఉండవలయును. హిజాబ్ అణిచివేతకు చిహ్నం కాదు. గౌరవాన్ని పెంపొందించే చిహ్నం.

 

.


No comments:

Post a Comment