ఆజాద్ హింద్ ఫౌజ్, లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) అనేది అర్జీ హుకుమత్-ఇ-ఆజాద్ హింద్ Arzi Hukumat-i-Azad Hind లేదా ఫ్రీ ఇండియా యొక్క తాత్కాలిక ప్రభుత్వం యొక్క సైనిక దళం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
నేతాజీ సుభాస్ చంద్ర బోస్ నేతృత్వంలోని ఫ్రీ ఇండియా యొక్క తాత్కాలిక ప్రభుత్వానికి
ఇప్పుడు మన వద్ద ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లాగానే,
దాని
స్వంత కరెన్సీ నోట్లను ముద్రించే కేంద్ర బ్యాంకు ఆజాద్ హింద్ నేషనల్ బ్యాంక్ ఉంది.
ఆజాద్ హింద్ నేషనల్ బ్యాంక్ జపాన్ మరియు
జర్మనీ వంటి మిత్రదేశాల గుర్తింపు పొందింది..
1000,
5000మరియు
10,000
డినామినేషన్ల తో ఆజాద్ హింద్ నేషనల్ బ్యాంక్ కరెన్సీలు జారీ చేసింది.
ఆజాద్ హింద్ నేషనల్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ
నోట్లపై ఆనాటి ప్రముఖ భారత జాతీయ నాయకులు అయిన మహాత్మా గాంధీ,
జవహర్‌లాల్
నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరియు భారత జాతీయ సైన్యం మహిళా అధికారిణి లక్ష్మీ సెహగల్ చిత్రాలు కలవు.
బర్మాలోని సంపన్న భారతీయ వ్యాపారి అయిన అబ్దుల్ ఘని విరాళంగా అందించిన
డబ్బుతో 5 ఏప్రిల్ 1944న సుభాష్ చంద్రబోస్ చేత ఆజాద్ హింద్
నేషనల్ బ్యాంకు స్థాపించబడింది. ఎస్‌ఏ అయ్యర్‌కు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.
No comments:
Post a Comment