5 July 2024

ముస్లిం సంఘ సంస్కర్త హమీద్ దల్వాయ్ యొక్క అరుదైన ఇంటర్వ్యూ Rare Interview of Muslim Social Reformer Hamid Dalwai

 


 

ది వైర్ స్టాఫ్, 23/మే/2023


1973లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ముస్లిం సత్యశోధక్ సమాజ్ వ్యవస్థాపకుడు హమీద్ దల్వాయ్ తన నమ్మకాలు మరియు తన రాజకీయాల మూలాల గురించి మాట్లాడాడు.

రామచంద్ర గుహ రాసినమేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా పుస్తకంలో హమీద్ దల్వాయి పేరు చాలా మంది యువకులకు పరిచయం చేయబడింది . హమీద్ దల్వాయి "చివరి ఆధునికవాది" గా సూచించబడ్డాడు. హమీద్ దల్వాయి జర్నలిస్ట్, సంఘ సంస్కర్త మరియు ట్రిపుల్ తలాక్  రద్దు కోసం భారతదేశములో మొదటి నిరసన మార్చ్ నిర్వహించిన వ్యక్తి .

దల్వాయి 46 వర్ధంతి సందర్భంగా, ది వైర్ దల్వాయి విశేషమైన సహకారాన్ని వివరిస్తుంది మరియు దల్వాయి ప్రస్తుత భారతదేశాన్ని ఏ విధంగా భావించి ఉంటాడో తెలియజేస్తుంది. మరణించే నాటికి దల్వాయి వయసు కేవలం 44 సంవత్సరాలు మాత్రమే.

ముస్లిం సమాజంలో ఉర్దూ భాష యొక్క ఆధిపత్యానికి  మరియు ట్రిపుల్ తలాక్  భావనకు వ్యతిరేకంగా ప్రగతిశీల సంస్కరణలను దల్వాయి సమర్థించారు. ఏకీకృత సెక్యులర్ సివిల్ కోడ్ ను కూడా దల్వాయి సమర్ధించడం గమనించదగ్గ విషయం.

దల్వాయి మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని మిర్జోలి, చిప్లూన్ గ్రామానికి చెందినవాడు. 14 సంవత్సరాల వయస్సులో, దల్వాయి రాష్ట్ర సేవా దళ్లో సభ్యుడు అయ్యాడు. ప్రారంభ సంవత్సరాలలో దల్వాయి ప్రజాస్వామ్య సోషలిజం, లౌకికవాదం, శాస్త్రీయ హేతుబద్ధత మరియు జాతీయ అహంకారం వంటి ఆదర్శాల పట్ల మొగ్గు చూపాడు. ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే తమ ఆదర్శాలకు అచంచలమైన నిబద్ధత కలిగి కట్టుబడి ఉంటారు మరియు దల్వాయి ఆలాంటి అసాధారణ వ్యక్తులలో ఒకరు.

దల్వాయి తన ప్రారంభ సంవత్సరాల్లో, సోషలిస్ట్ కార్యకలాపాలలో   పాల్గొన్నాడు మరియు ఆచార్య ఆత్రే యొక్క వార్తాపత్రికమరాఠాలో  పాత్రికేయుడిగా కూడా పనిచేశారు . కాలంలోనే దల్వాయి ఇంధాన్  ( ఇంధనం ) అనే నవలను రచించాడు, దీనిని దిలీప్ చిత్రే ఆంగ్లంలోకి అనువదించారు.

క్రమంగా సాంఘిక సంస్కరణల వైపు మరలడం తో దల్వాయి సాహిత్య కార్యకలాపాలు వెనకబడ్డాయి.. ఏకపక్ష బహుభార్యత్వం arbitrary polygamy మరియు ముస్లిం సమాజంలోని మహిళలపై బలవంతంగా విడాకులు forced divorces రుద్దడం వంటి సమస్యలతో దల్వాయి తీవ్రంగా కలత చెందాడు. ఏప్రిల్ 18, 1966 దల్వాయి ఒక ముఖ్యమైన, నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించినాడు. ఆ నిరసన ప్రదర్సన లో   విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ  మనోవేదనలను ధైర్యంగా వినిపించారు  ఇది కాలంలో ఒక సాహసోపేతమైన నిరసన.

దల్వాయ్,  జ్యోతిబా ఫూలే యొక్క సత్యశోధక్ సమాజ్ నుండి ప్రేరణ పొందిముస్లిం సత్యశోధక్ సమాజ్అనే సంస్థను స్థాపించాడు. దల్వాయ్ మరియు అతని భార్య, మెహ్రున్నీసా దల్వాయి ఎల్లప్పుడూ కలిసే ఉండేవారు. మెహ్రునిస్సా ఆత్మకథ ఒక సామాజిక కార్యకర్త మరియు సంస్కర్త జీవితం ఎంత కష్టతరమో వివరిస్తుంది. నిరసన ఉద్యమాలలో తలెత్తిన ఉద్రిక్తతలు మరియు సనాతన ముస్లిం సమాజం నుండి తన భర్త హమీద్  దల్వాయ్ ఎదుర్కొన్న బెదిరింపులను కూడా మెహ్రునిస్సా తన ఆత్మకథ లో  వివరిస్తుంది.

మెహ్రున్నీసా 2017లో పూణేలో మరణించింది. హమీద్ దల్వాయ్ గురించి వివిధ వ్యక్తులు రాసిన 13 మరాఠీ కథనాల సంకలనం అయిన యాంగ్రీ యంగ్ సెక్యులరిస్ట్ అనే పుస్తకాన్ని మెహ్రున్నీసా ప్రచురించింది. “యాంగ్రీ యంగ్ సెక్యులరిస్ట్ పుస్తకంలో హమీద్ దల్వాయ్తో అరుదైన, సులభమైన మరియు సంక్షిప్త  ఇంటర్వ్యూ కూడా ఉంది. 1973లో మనోహర్ వారపత్రిక లో ఆగస్ట్ 26, 1973లో ప్రచురితమైన దళ్వాయి ఇంటర్వూ ఆనాటి రాజకీయాలు, కమ్యూనిజం, మత ఛాందసవాదం తదితర అంశాల గురించి దళ్వాయి ఆలోచనా విధానాన్ని చక్కగా వివరిస్తుంది..

జీషన్ కస్కర్ ద్వారా మరాఠీ ఒరిజినల్ నుండి అనువదించబడిన ఇంటర్వ్యూని క్రింద చదవండి.


 

యూనిఫాం సివిల్ కోడ్ డిమాండ్ చేస్తూ నిరసనకు నాయకత్వం వహిస్తున్న  హమీద్ దల్వాయ్..

·       అశోక్ పరబ్ (జోగేశ్వరి): కులాంతర వివాహంపై మీ నిజాయితీ అభిప్రాయాలు ఏమిటి?

కులాంతర వివాహం చేసుకోవాలనుకునే వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతినివ్వాలి. వివాహం అనేది వ్యక్తిగత విషయం, ఇతరులు ఇందులో  జోక్యం చేసుకోకూడదని నేను భావిస్తున్నాను.

నేను 'నిజాయితీ' గా నా అభిప్రాయాలను ప్రకటిస్తున్నాను.ఇందులో ప్రత్యేకంగా నిజాయతీ అని ప్రకటించాల్సిన అవసరం లేదు.

·       రమేష్ ఉదారే (ముంబయి): "విగ్రహారాధన చేసే వ్యక్తిని నాశనం చేయండి." ఖురాన్లో ఇలాంటి ప్రకటన ఉందా?

మీరు చెప్పినట్లుగా ప్రకటన లేదు. కానీ విగ్రహారాధన చేసేవారిపై పన్ను విధించాలని ఒక ప్రకటనలో ఉంది. ప్రకటనే జిజియా పన్నుకు ఆధారమైనది. ( జిజ్యా పన్ను చారిత్రాత్మకంగా ఇస్లామిక్ చట్టం ద్వారా పాలించబడే రాజ్యం లోని శాశ్వత ముస్లిమేతరలపై   (ధిమ్మీ ) ఆర్థిక ఛార్జీల రూపంలో విధించబడింది . )

కానీ ప్రశ్న ఏమిటంటే ఖురాన్లో ఏమి వ్రాయబడింది లేదా ఏమి వ్రాయబడలేదు?, అనేది కాదు, నేటి కాలంలో మనం మానవ సంబంధాలను ఎలా కొనసాగించాలనుకుంటున్నాము? మీరు దాదాపు ప్రతి మతంలోనూ సామాజిక సమానత్వ ఆలోచనలకు [వ్యతిరేకమైన] ప్రకటనలను గమనిస్తారు.. మనుస్మృతి కూడా మహిళలకు, అట్టడుగు వర్గాల వారికి సమాన హక్కులు కల్పించలేదు. ఆధునిక భారతీయ సమాజం మనుస్మృతి మరియు ఖురాన్ ఆలోచనలపై ఆధారపడి ఉండదు. భారతీయ సమాజ అభివృద్ధి దాని పౌరులందరికీ సమానత్వంపై ఆధారపడి ఉంటుందని హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ అర్థం చేసుకోవడం చాలా అవసరం

·       ప్రకాష్ భగవత్ (యావత్మాల్): మతపరమైన అల్లర్లకు ప్రధానంగా బాధ్యులు ఎవరు?

అనేక సార్లు మతపరమైన అల్లర్లకు హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ బాధ్యులు.

·       ఏఆర్ కస్తూరె (గుల్తెకడి): భారతదేశం వెలుపల ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

సంబంధాలు కొన్ని చోట్ల మంచిగా ఉన్నవి  మరికొన్ని చోట్ల చెడ్డగా  ఉన్నవి. ఉదాహరణకు, ఇండోనేషియాలో, క్రైస్తవులు, బౌద్ధులు మరియు హిందువులు మైనారిటీలు, కానీ అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు లేవు. మలేషియా, టర్కీ, లెబనాన్, ట్యునీషియా మొదలైన ఇతర దేశాలలో  ముస్లిమేతరులు మైనారిటీగా ఉన్నారు మరియు శాంతియుతంగా జీవిస్తున్నారు. అరబ్బులు మరియు యూదులు కొన్ని అరబ్ దేశాలలో హింసను ఎదుర్కొ౦టున్నారు. పాకిస్థాన్లో సిక్కు, హిందూ మైనారిటీలు తగ్గిపోయారు. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కల్పించారు.

·       మహ్మద్ సమీ కాంట్రాక్టర్ (ఔరంగాబాద్): మిమ్మల్ని మీరు ముస్లింగా భావిస్తున్నారా? అవును అయితేనమాజ్ , ఉపవాసంఖురాన్ మరియు ఖయామత్  రోజు గురించి మీ అభిప్రాయలు ఏమిటి ?

నేను ప్రార్థన చేయను, ఉపవాసం కూడా ఉండను.. కాని నేను ముస్లింనే, ఎందుకంటే నేను భారతీయ ముస్లిం కుటుంబంలో పుట్టాను.

·       బాల్ జంభేకర్ (వసాయి): మీ రాజకీయ గురువు ఎవరు? మరి మీకు  కూడా బాల్ థాకరే లాగా బాడీగార్డ్స్ ఉన్నారా?

నాకు నేనే రాజకీయ గురువును. బాడీగార్డులకు డబ్బు ఎక్కడిది?

·       గులాం అహ్మద్ (ఔరంగాబాద్): మహారాష్ట్రలోని ముస్లింలలో 10% మాత్రమే మరాఠీని అర్థం చేసుకోగలరు మరి  మీరు మరాఠీలో ఎందుకు రాయాలని ఎంచుకుంటున్నారు?

మహారాష్ట్ర ముస్లింలలో తొంభై శాతం మంది మరాఠీని అర్థం చేసుకుంటారు. పట్టణ ప్రాంతాల్లోని మిగిలిన 10% ముస్లింలు ఉర్దూ సరిగా అర్థం చేసుకోలేరు. వారి ఉర్దూ ఎక్కువగా మరాఠీ మిశ్రమంగా ఉంటుంది లేదా సాధారణ ముంబై యాసతో నిండి ఉంటుంది.

గులాం అహ్మద్భాయ్, నేను మరాఠీలో ఎందుకు రాస్తానో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకొంటా?

·       సుధీర్ కుమార్ ఆచార్య (కళ్యాణ్): సామాజిక వికాస కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల సహకారం లభించిందా?

అవును, వివిధ మార్గాల్లో. అయితే మీరు ముందుగా 'కుటుంబం' అంటే ఏమిటో నిర్వచించాలి. నా కుటుంబం యొక్క చాలా బాధ్యతను నా భార్య పంచుకుంటుంది, ఎందుకంటే ఆమె కూడా డబ్బు సంపాదించడానికి పని చేస్తుంది. ఇది కూడా ఒక రకమైన మద్దతు అని నేను భావిస్తున్నాను,.

·       స్వామిప్రసాద్ పండిట్ (పింప్రి): ఒక సృజనాత్మక రచయిత రాజకీయాల్లోకి రావడం వల్ల ఎంత మేలు జరిగింది? మీరు లోతైన, సరళ రచయిత; రోజుల్లో మీరు అలా రాయడం వదిలేశారా?

రాజకీయాల వల్ల నాకు ఎంత మేలు జరిగిందో మీరే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. రోజుల్లో నాకు తగినంత విశ్రాంతి లేదు, సరళంగా వ్రాయడానికి. నేను కూడా చింతిస్తున్నాను., త్వరలోనే  నేను సరళంగా  రాయడం ప్రారంభిస్తాననే అనే భరోసా ఇస్తున్నాను.

·       మీనాక్షి తాట్కే (పుణె): మీ కుటుంబం - ముఖ్యంగా మీ తల్లి, తండ్రి, భార్య మరియు పిల్లలు - మతంపై మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారా?

అంగీకరించరు. అలాగే, వారు అంగీకరించాలని నేను పట్టుబట్టను. వారు తమ అభిప్రాయాలను నాపై బలవంతం చేయకూడదు. ప్రతి ఒక్కరికి వారి మతాన్ని ఎంచుకునే హక్కు ఉండాలి, అది నేను నమ్ముతాను. ఇలాగే ఇంట్లో ప్రజాస్వామ్య స్వేచ్ఛను తీసుకొచ్చి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా అభ్యాసాన్ని ప్రయత్నించాలి.

·       షేక్సిరాజ్అహ్మద్‌ (సంషేర్పూర్‌): ముస్లిం జనాభా ఎక్కువగా గ్రామాల్లో నివసిస్తున్నప్పుడు సత్యశోధక్ఉద్యమం పట్టణ ప్రాంతంలోనే ఎందుకు ఉంది?

అన్ని ఉద్యమాలు నగరాలలో ఉద్భవించాయి, తరువాత వాటిని గ్రామీణ ప్రాంతాలు అనుసరిస్తాయి. మా ఉద్యమం ఇప్పుడే మొదలైంది. ఇది పెరిగే కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరిస్తుంది. మీ ప్రశ్నకు సమాధాన౦ లబించినదని  ఆశిస్తున్నాను.

·       విశ్వాస్ డిగ్గికర్ (ఉమర్గా): రాజకీయాల్లో 'మంచి' వ్యక్తులు ఆర్థికంగా పటిష్టంగా ఉండటం చాలా అరుదు, అందుకే నేను అడుగుతున్నాను, మీ జీవనోపాధి ఏమిటి?

నాకు CIA (అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్), KGB (రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్), క్రిస్టియన్ మిషనరీలు, RSS, జన్ సంఘ్ మరియు ఇందిరా గాంధీ నుండి నిధులు లభిస్తాయని చాలా మంది ముస్లిం మతవాదులు నమ్ముతారు.

మరోవైపు, నేను పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్ అని, యాహ్యా ఖాన్ మరియు జుల్ఫికర్ అలీ భుట్టో నుండి నాకు నిధులు లభిస్తున్నాయని భావించే కొందరు హిందూత్వవాదులు ఉన్నారు.

నిజమేమిటంటే - నేను 'ఇండియన్ సెక్యులర్ సొసైటీ'లో పూర్తికాల సభ్యుడిని, నా జీవనోపాధికి సొసైటీ నుండి తగినంత జీతం పొందుతాను. అలాగే, నా భార్య పని చేస్తుంది మరియు నేను ముంబై సబర్బన్ ప్రాంతంలో రెండు గదుల చాల్లో నివసిస్తున్నాను. మేము మా కార్యక్రమాల కోసం విరాళాలు మరియు కొంతమంది ప్రకటనదారులను పొందడం ద్వారా సమాజానికి ఆర్థికంగా సహాయం చేస్తాము.

విశ్వాసరావ్, మీకు నాపై విశ్వాసం (విశ్వాసం) ఉందని నేను ఆశిస్తున్నాను మరియు మీరు నేను ఇచ్చిన సమాధానం ఆధారంగా నా జీవనోపాధి గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

·       వ్యంకటేష్ లిగ్డే (ముంబయి): ఇందిరాగాంధీ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ను ఎందుకు అమలు చేయడం లేదు? 'ముస్లిం ఓట్ల కోసం ముస్లింల షరియత్లో ఎలాంటి మార్పులు చేయము ' అని కాంగ్రెసోళ్లు అంటున్నారు. ఇది నిజమా?

మీరు రెండు ప్రశ్నలు అడిగారు. మీరు మొదటి ప్రశ్న ఇందిరాగాంధీని అడిగితే   బాగుంటుందని నా అభిప్రాయం. మూకుమ్మడి ఓటు గురించి మీ అభిప్రాయం నిజమే, కాంగ్రెస్ నాయకులు మాత్రం 'ముస్లిం చట్టంలో ప్రస్తుతం మార్పులు చేయబోము' అని అంటున్నారు. 'ముస్లిం చట్టం' మరియు 'ప్రస్తుతం' అనేవి కాంగ్రెసోళ్లకు  రెండు చాలా కీలకమైన సంక్షిప్త పదాలు. భారతదేశంలో ముస్లింల కోసం ముస్లిం చట్టం ఉంది, షరియత్ కాదు. సౌదీ అరేబియా తప్ప మరే దేశంలోనూ షరియత్ లేదు. మరియు 'ప్రస్తుతం చట్టం చేయను' అంటే 'సమయం వచ్చినప్పుడు చేస్తాము' అని నేను బావిస్తున్నాను..

·       సుబోధ్ వి. తర్వాల్ (ఖేడ్, రత్నగిరి): ఇస్లాం ప్రజాస్వామ్యం మరియు సమానత్వాన్ని ప్రోత్సహించే మతం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

మతమూ ప్రజాస్వామ్యాన్ని లేదా సమతావాదాన్ని ప్రోత్సహించదు. విషయంలో ఇస్లాం మినహాయింపు కాదు. మతాలు ఆధ్యాత్మికత ఆధారంగా సమాజాన్ని నిర్మిస్తాయి. అవన్నీ మధ్యయుగానికి చెందినవి, అయితే ప్రజాస్వామ్యం, సమానత్వం, ఇవన్నీ ఆధునిక యుగం యొక్క భావనలు. సమాజంలో సంస్కృతి అభివృద్ధికి మతం ప్రాతిపదిక కాదనే విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి.

·       దిగంబర్ పాఠక్ (అమరావతి): మీరు ఎప్పుడూ హిందూ-ముస్లిం సమానత్వం గురించి రాస్తారు, మాట్లాడతారు, కానీ నేటి విద్యావంతులైన ముస్లింలు భారతదేశంపై ప్రేమ చూపడానికి సిద్ధంగా లేరని అనేక  సందర్భాలు చూపిస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

నేను అభిప్రాయం ఇస్తాను? చదువుకున్న ముస్లిం వర్గం భారతదేశం పట్ల ప్రేమను కనబరచదని చూపించే అనేక సందర్భాలను మాత్రమే నేను ఎత్తి చూపాను. మీరు నా అభిప్రాయంపై,  నా అభిప్రాయం చెప్పమని అడుగుతున్నారు! ప్రశ్నను  తేలికగా తీసుకోన్న౦దుకు మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలి.

 

·       వినోద్ వి. తాంబ్రే (నాసిక్): బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు?

బంగ్లాదేశ్కు ఇప్పుడే స్వేచ్ఛ లభించింది మరియు విముక్తి యుద్ధంలో అది చాలా హింసను చూసింది. అందుకే అక్కడ ప్రస్తుత వాతావరణం అస్థిరంగా కనిపిస్తోంది. ఆర్థిక పునర్నిర్మాణంలో వేగం పెరిగింది. నెమ్మదిగా కానీ నిలకడగా, దేశం రాజకీయంగా స్థిరంగా మారుతుంది మరియు భారతదేశంతో మంచి సంబంధాలను కొనసాగిస్తుంది, అదే నాకు అనిపిస్తుంది.

·       శ్యామ్కాంత్ కులకర్ణి (మాలేగావ్): మీరు హిందూ మతంలోకి మారాలనుకుంటున్నారా?

మహ్మద్ సమీ కాంట్రాక్టర్ ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను పుట్టుకతో ముస్లింని, సంప్రదాయం ప్రకారం భారతీయుడిని.. అందువల్ల, నేను మంచి మనిషిగా ఉండాలని భావిస్తున్నాను. ఎందుకంటే మతం ఇప్పుడు కాలపు తెర వెనుకకు వెళ్లిపోయిందని నేను భావిస్తున్నాను.

శ్యాంకాంతరావు గారు, ప్రస్తుతానికి నన్ను మనిషిగా ఉండనివ్వండి. నన్ను హిందూ-ముస్లిం వివాదం లోకి లాగకండి.

·       సుల్భా బకరే (అమరావతి): మీరు మీ పనిలో తరచుగా నిరాశ, అవమానాలు మరియు విచారాన్ని ఎదుర్కొంటున్నారు మరియు అలాంటి సమయాల్లో మనిషికి సహాయక వ్యవస్థ అవసరం. మీ సహాయక వ్యవస్థ ఎవరు?

నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. ఇది మంచి ఆలోచన, నేను ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను.

·       అనిల్ చానఖేకర్: ముస్లిం మధ్యతరగతిలో మేధావుల కొరత ఉన్న ముస్లిం సమాజంలో మేధో విప్లవం చాలా కష్టం. సామాజిక అభివృద్ధిని తీసుకురావడానికి మీ మార్గాలు ఏమిటి?

ముస్లిం సత్యశోధక్ మండల్ యొక్క ప్రధాన పని అటువంటి మేధో సామర్థ్యాలు కలిగిన వ్యక్తులను అభివృద్ధి చేయడం.

·       గణేష్ పరశురామ్ బావర్కర్ (దోనివాడే): మీరు ముల్లా-మౌలావీల ముందు ఇలాంటి కొత్త, రాడికల్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా మీ ప్రాణాలకు ప్రమాదం ఉందని భయపడుతున్నారా?

నేను భయపడి ఉంటే నేను చేస్తున్న పనిని చేస్తానని మీరు అనుకుంటున్నారా?

 

No comments:

Post a Comment