19 July 2023

719 మందిని చంపిన దుండగుడు 'ది గ్రేట్ స్ట్రాంగ్లర్' యొక్క మనోహరమైన కథ Fascinating tale of ‘The Great Strangler’—a thug who slayed 719 people

 

ఇది 19వ శతాబ్దంలో మధ్య మరియు దక్షిణ భారతదేశపు  స్థానిక జానపద కథలలో పేర్కొన్న థగ్గు దుండగుల  ముఠా యొక్క కథ.

థగ్గులు అనేవారు హైవే పై దోపిడీలు చేసే దుండగుల ముఠా. థగ్గు ముఠా సభ్యులు, హిందువులు మరియు ముస్లింలు. థగ్గులు దారి దొఫిడి లో బాగా శిక్షణ పొందిన తెగ. థగ్గులు భోవానీ దేవత నుండి ప్రేరణ పొందారు మరియు టుపౌనీ వంటి ఆచారాలు మరియు వేడుకలను పాటించేవారు

థగ్గులు ప్రయాణీకులుగా నటిస్తూ, విలువైన వస్తువులను తీసుకువెళ్ళే వ్యాపారులతో స్నేహంగా ఉంటారు మరియు మెరుగైన భద్రత మరియు రక్షణ పేరుతో తో వారిని ఒక నిర్దేశిత ప్రదేశానికి తీసుకువేళతారు. థగ్గులలోని నిపుణుడుయిన ఒక వ్యక్తి సోథా పని ప్రజలను మాటలతో మభ్యపెట్టడం.

దగ్గుల ఆపరేషన్ యొక్క స్థానం మరియు సమయం ముందుగా ప్రణాళిక చేయబడింది. సమాధులు తవ్వేందుకు ముందుగానే ఒక బ్యాచ్ దగ్గులను  పంపిస్తారు. “భుట్టోట్” అని పిలువబడే అనుమానాస్పద వ్యక్తి(ధగ్గు) బాధితుడి వెనుక చేతి రుమాలుతో  సిద్ధంగా ఉంటాడు. 'పాన్ లావో' వంటి కోడెడ్ సిగ్నల్ఇవ్వడం తో , భుట్టోటే బాధితుడు మెడ చుట్టూ కర్చీఫ్ బిగించి లాగుతాడు. కొద్దిసేపటిలో బాధితుడు నేలమీద పడి, ఊపిరాడక చనిపోతాడు., ధగ్గులు మృతదేహాలను సిద్ధంగా ఉన్న సమాధిలో పడవేసి, దోపిడీ చేస్తారు..

ధగ్గు దుండగులు దేశవ్యాప్తంగా ఎక్కువగా మధ్య మరియు దక్షిణ భారతదేశంలో తమ దోపిడీని కొనసాగించారు,. 19వ శతాబ్దం ప్రారంభం వరకు వలసవాద అధికారులకు ఈ సమస్య గురించి తెలియదు, ఎందుకంటే తెలివైన దగ్గు దుండగులు నేరానికి సంబంధించిన ఆధారాలను వదిలిపెట్టలేదు. వారికి  భూస్వాములు మరియు గ్రామ పెద్దల నిశ్శబ్ద మద్దతు మరియు ప్రోత్సాహాo ఉంది.

గవర్నర్-జనరల్, విలియం బెంటింక్, ధగ్గుల దుష్ట కార్యకలాపాలను అణిచివేసేందుకు బలమైన చర్యలను ప్రారంభించారు. 1830 మరియు 1840 మధ్య కాలంలో 400 మంది ధగ్గుదుండగులను ఉరితీశారు, 1000 మంది బహిష్కరణకు గురయ్యారు మరియు మరో 1000 మందిని జైలులో ఉంచడంతో అణచివేత కార్యక్రమం ప్రోత్సాహకరంగా సాగింది. ఇంకా 1800 మంది ధగ్గులు పరారిలో ఉన్నారు.

థగ్గుల ముఠా నాయకుడు, అమీర్ అలీ కథ:

అమీర్‌కు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు దగ్గు దుండగుల ముఠా అమీర్‌ తల్లిదండ్రులను హతమార్చింది. దగ్గు దుండగులు అనాథ అమీర్‌ని పెంచుకుని శిక్షణ ఇప్పించారు. అమీర్‌ పోకిరీగా ఎదిగాడు. అమీర్‌ యువకుడుగా ఉన్నప్పుడు  ఒంటరిగా కత్తితో పులిని చంపిన తర్వాత, దగ్గు దుండగుల ముఠాలో అమీర్ స్థాయి పెరిగింది

థగ్గుల ముఠా నాయకుడు అమీర్ అలీని సిటీ ఆఫ్ పర్ల్స్ ఆకర్షించినది. హైదరాబాద్ నగర అందం మరియు హుస్సేన్ సాగర్ ఆకర్షణ అమీర్ అలీ ని పిచ్చివాడిని చేసింది. చార్మినార్ మీదుగా మొహర్రం ఊరేగింపును వీక్షించిన అమీర్ అలీ ఆశ్చర్యపోయాడు,

అమీర్ అలీ మరియు అతని ధగ్గుల గ్యాంగ్ భారీ బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను స్థానిక దొంగలు ఒక యువ దృఢమైన ఫకీర్ ని  కాపలాగా ఉంచిన గుహలో దాచిపెట్టినట్లు నిఘా సేకరించారు. ఈ గుహ బేగంబజార్ మరియు కార్వాన్ మధ్య ఒక ప్రదేశంలో రెండు రాళ్ల గుట్టల మద్య ఉంది.. ముందుగా అమీర్ అలీ యొక్క ధగ్గు ముఠా సహచరుడు రహస్య స్థావరంలోకి ప్రవేశించి, ఫకీర్ తో స్నేహం చేయగలిగాడు మరియు నల్లమందుతో ఫకీరని నిద్రపుచ్చాడు. అమీర్ అలీ నిద్రపోతున్న ఫకీర్ మీద  కత్తి దూసాడు. కత్తి దెబ్బకి నిద్రపోతున్న ఫకీర్ లేచి కూర్చున్నాడు. ఒక్క క్షణంలో, అమీర్ కర్చీఫ్ తన పనిని పూర్తి చేసింది. అమీర్ అలీ మరియు ధగ్గుల ముఠా లోని  వ్యక్తులు విలువైన వస్తువులను దోపిడి చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

అమీర్ అలీ ని నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో నిర్భందించినది. అమీర్ అలీ దాదాపు 719 మంది పురుషులు మరియు స్త్రీలను గొంతు కోసి చంపినట్లు ఒప్పుకున్నాడు. అమీర్ అలీ మరియు సెల్-మేట్ జైలు నిర్భంధం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత అమీర్ అలీ ని ఒంటరి నిర్బంధానికి తరలించారు. అమీర్ అలీ 12 సంవత్సరాల సుదీర్ఘ జైలు శిక్ష అనుభవించాడు. తన తల్లిని చంపిన వ్యక్తితో సహా తోటి దుండగులను గుర్తించడంలో అధికారులకు సహాయపడటానికి అమీర్ అలీ అంగీకరించిన తర్వాత అమీర్ అలీ విడుదలయ్యాడు.

అమీర్ అలీ కథలో సాహసం, శృంగారం, ప్రతీకారం, విశ్వాసం మరియు తత్వశాస్త్రం మొదలగు అన్ని అంశాలు ఉన్నాయి. అమీర్ అలీ తన కార్యకలాపాల గురించి ఆఖరకు తన భార్యలకు  మరియు కుమార్తెకు తెలియకుండా తగు జాగ్రత్తలు  తీసుకొనేవాడు.

అమీర్ అలీ జీవితంలో చివరి దశ దుర్భరమైంది. అమీర్ అలీ భార్య కడు పేదరికంలో మరణించింది మరియు కుమార్తె 'మూలా' సంరక్షణలో ఉంచబడింది. అమీర్ అలీ తరువాతి సంవత్సరాలలో, తన కుమార్తెకు తెలియకుండానే కుమార్తెను ఒక్క క్షణం చూసేందుకు అధికారులచే అనుమతించబడ్డాడు. అమీర్ అలీ తన గతపు నీడ కుమార్తె జీవితాన్ని ప్రభావితం చేయకూడదనుకున్నాడు. కుమార్తె ఇతర అమ్మాయిలతో కలసి ఆడుకోవడం చూసి అమీర్ సంతోషించాడు.

బ్రిటీష్ ఇండియాలో నిజాం క్రింద దీవాన్‌గా పనిచేసిన ఫిలిప్ మెడోస్ టేలర్, దగ్గు ముఠా నాయకుడు  అమీర్ అలీ జీవితం మరియు సమయాలను తన కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్‌లో (మొదటిసారి 1840 A.D.లో ప్రచురించబడింది) లో డాక్యుమెంట్ చేశాడు.

 

No comments:

Post a Comment