10 July 2023

నేతాజీ మరియు ఉబైదుల్లా సింధీ- ఇద్దరు జాతీయవాదుల కలయిక Netaji Subhas and Ubaidullah Sindhi: A Nationalist Alliance

 




నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ప్రతి భారతీయుడి  హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం రెండవ ప్రపంచ యుద్ధం (WWII) సమయంలో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యానికి నాయకత్వం వహించి ప్రవాసంలో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వo 'ఆజాద్ హింద్ సర్కార్'ను ఏర్పాటు చేసినాడు..

మొదటి ప్రపంచ యుద్ధం (WWI) సమయంలో రాజ మహేంద్ర ప్రతాప్ మరియు మౌలానా బర్కతుల్లా సహాయంతో మౌలానా ఉబైదుల్లా సింధీ ఆఫ్ఘనిస్తాన్‌లో స్వేచ్ఛా భారతదేశం యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి ప్రయత్నం జరిగిందని చాలా కొద్ది మందికి తెలుసు. విప్లవ జాతీయ సైన్యాన్ని సమీకరించే ప్రయత్నం కొంతమంది ద్రోహులచే లీక్ చేయబడింది మరియు భారతదేశం తన స్వేచ్ఛ కోసం మరో మూడు దశాబ్దాలు వేచి ఉండవలసి వచ్చింది.

నేతాజీ భారతదేశానికి నాయకత్వం వహించడానికి అత్యంత అనుకూలమైన వ్యక్తి అని భావించిన సీనియర్ భారతీయ విప్లవకారులు నేతాజీకి  మార్గనిర్దేశం చేశారని చాలా తక్కువ మందికి తెలుసు. WWI సమయంలో భారత సైనికుల తిరుగుబాటుకు ప్రణాళిక వేసిన రాష్ బిహారీ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకత్వాన్ని  నేతాజీకి అప్పగించారు. జపాన్ మరియు చైనాలలో, కాబూల్‌లో 1915లో ఏర్పడిన భారత ప్రవాస ప్రభుత్వ అధ్యక్షుడు రాజా మహేంద్ర ప్రతాప్, భారత స్వాతంత్ర్య పోరాటానికి ఈ జపాన్ మరియు చైనా దేశాల నుండి సహాయం కోసం చాలా సంవత్సరాలు ప్రచారం చేశారు.

వివిధ విప్లవ ఉద్యమాలలో చురుకైన పాత్ర వహించిన కారణంగా బ్రిటీష్ ప్రభుత్వం చే రాజకీయ బహిష్కరణ పొందిన  తర్వాత 1938లో మౌలానా ఉబైదుల్లా సింధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. రౌలట్ బిల్‌ను ప్రవేశపెట్టేటప్పుడు మౌలానా ఉబైదుల్లా సింధీ నిర్వహించిన విప్లవాత్మక కార్యకలాపాలు అటువంటి క్రూరమైన చట్టానికి అత్యంత ప్రముఖమైన కారణాలలో ఒకటిగా హైలైట్ చేయబడ్డాయి. WWI ముగింపు నుండి 1938 వరకు ఉన్న కాలంలో, ఉబైదుల్లా ఇటలీ, జర్మనీ, రష్యా మరియు అరబ్‌లకు వెళ్ళాడు, తద్వారా బ్రిటీష్ దళాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి ఉపయోగించబడే వ్యక్తుల నెట్‌వర్క్‌ను సృష్టించాడు.

ఉబైదుల్లా సింధీ, రాష్ బిహారీ బోస్, రాజా మహేంద్ర ప్రతాప్ మరియు WWI సమయంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన అనేక ఇతర విప్లవ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లో భారతదేశం మొత్తాన్ని ఏకం చేయగల నాయకుడు చూశారు. 

మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌల్వీ జహీరుల్ హక్‌కు రాసిన లేఖ ప్రకారం ఉబైదుల్లా సింధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పడు  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు తాను నేతాజీని విదేశాలకు పంపాలనుకుంటున్నట్లు చెప్పారు అని  గోలాం అహ్మద్ మొర్తజా తన బెంగాలీ పుస్తకం “చెపే రఖా ఇతిహాస్‌”లో ముద్రించారు.  భారత స్వాతంత్య్ర పోరాట భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు నేతాజీ మరియు ఉబైదుల్లా ఢిల్లీలో కలిశారని కూడా మౌలానా ఆజాద్ అబుల్ కలాం పేర్కొన్నారు.కొన్ని నెలల తర్వాత నేతాజీ మరియు ఉబైదుల్లా మళ్లీ కలకత్తా (కోల్‌కతా)లో కలుసుకున్నారని, అక్కడ ఉబైదుల్లా జపాన్ అధికారులకు ఇవ్వాల్సిన ముఖ్యమైన లేఖలు మరియు పత్రాలను బోసుకు అందజేసినట్లు లేఖ పేర్కొంది.

కోల్‌కతాలో నేతాజీ మరియు ఉబైదుల్లా మద్య జరిగిన సమావేశమును మరొక  స్వాతంత్ర్య సమరయోధుడు మరియు జమియత్ ఉలేమా నాయకుడు షా మహమ్మద్ ఉస్మాని ధృవీకరించారు.. కోల్‌కతాలో జమియాత్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉబైదుల్లా వచ్చిన విషయాన్ని ఉస్మానీ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమము ను  ఆపేందుకు ముస్లిం లీగ్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కోల్‌కతాలో 20 రోజులకు పైగా గడిపిన సమయంలోఉబైదుల్లా కనీసం రెండు సార్లు నేతాజీని కలిశారు. ఉబైదుల్లా కోల్‌కతాలో ఉన్నారని తెలుసుకున్న నేతాజీ, ఉబైదుల్లాను పరామర్శించడాన్ని బట్టి ఉబైదుల్లా పట్ల నేతాజీ కున్న గౌరవాన్ని తెలుసుకోవచ్చు.. 1939లో, నేతాజీ భారతదేశపు అత్యంత పెద్ద నాయకులలో ఒకరు.

 షా మహమ్మద్ ఉస్మాని ప్రత్యక్షకథనం ప్రకారం, ఉబైదుల్లా పాదాలను తాకి నేతాజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత నేతాజీ, ఉబైదుల్లాకు పూలమాల వేసారు. యువ నాయకుడిగా పూలమాల తనకంటే బోసుకు బాగా సరిపోతుందని చెబుతూ ఉబైదుల్లా బోసుకు పూలమాల వేశారు. దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించిన తర్వాత నేతాజీ వెళ్లిపోయారు. జమియాత్ కార్యక్రమం తర్వాత, నేతాజీ, ఉబైదుల్లా గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు, అక్కడ నేతాజీ, ఉబైదుల్లా భారతదేశాన్ని విముక్తి చేయడానికి అంతిమ పోరాటానికి సంబంధించిన ప్రణాళికలను మళ్లీ చర్చిoచారు.

1944లో ఉబైదుల్లా,  బ్రిటీష్ వారు, ముస్లిం లీగ్ మత రాజకీయాలు మరియు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి చివరకు విషప్రయోగం  ద్వారా హత్య చేయబడ్డారు.

భారతీయ విప్లవ ఉద్యమాలు అసంబద్ధమైన ప్రయత్నాలు కావు.1760 నాటి ఫకీర్-సన్యాసి తిరుగుబాటు నుండి 1946 నావికా తిరుగుబాటు వరకు జరిగిన సాయుధ పోరాటాలన్నింటినీ భారతీయులు అంతా ఒకటే మరియు మత సామరస్యం అనే గుచ్చం తో అనుసంధానించబడినవి.  

No comments:

Post a Comment