3 July 2023

ప్రొఫెసర్ డా. హసన్ కో నకతా Prof. Dr. Hassan Ko Nakata

 



ప్రసిద్ధ జపనీస్ ముస్లిం పండితుడు మరియు మేధావి అయిన  ప్రొఫెసర్ డాక్టర్ హసన్ కో నకటా చాలా మంది జపనీయులను ఇస్లాం వైపు నడిపించారు.

డా. నకాటా జపాన్లోని ఒకాయమాలో 1960లో జన్మించారు. డా. నకాటా 1979లో ఇస్లాం స్వీకరించాడు మరియు విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఇస్లాంను అభ్యసించిన తర్వాత "హసన్" అనే పేరును స్వీకరించాడు.

డా. కో నకాటా గత ముప్పై సంవత్సరాలుగా భోధనా వృత్తిలో ఉన్నారు.  కో నకాటా టోక్యో విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ అధ్యయనాల విభాగం నుండి పట్టభద్రుడయ్యాడు, 1992-1996లో కైరో విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ తత్వశాస్త్రంలో PhD పూర్తి చేసారు. 2003లో డా. కో నకాటా దోషిషా విశ్వవిద్యాలయంలో థియాలజీ ఫ్యాకల్టీలో చేరాడు. డా. కో నకాటా 2003-2008 వరకు దోషిషా విశ్వవిద్యాలయంలో ఏకధర్మ మతాల Monotheistic Religions ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ సెంటర్కు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు.

డా. నకాటా అనేక ఇస్లాం పుస్తకాలు మరియు విద్యా సంబంధ గ్రంథాలను ప్రచురించారు మరియు అనువదించారు, డా. నకాటా ఒక సమాజ కార్యకర్త మరియు జపాన్ ముస్లిం అసోసియేషన్ డైరెక్టర్ల బోర్డులో కూడా ఉన్నారు.

 

No comments:

Post a Comment