న్యూఢిల్లీ –
రచయిత మహమ్మద్ అబ్దుల్ మన్నన్ “భారతదేశంలో ముస్లింలు – గ్రౌండ్ రియాలిటీ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ – అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్మెంట్” అనే పుస్తకంలో భారత దేశం లో ముస్లిం ప్రాతినిధ్యానికి సంబంధించి డేటాను సేకరించారు.
"యూనియన్ గవర్నెన్స్ లెవెల్స్‌లో
ముస్లింలకు ఇది చరిత్రలో అత్యల్ప ప్రాతినిధ్యం" అని రచయిత మహమ్మద్ అబ్దుల్
మన్నన్ అన్నారు.
రచయిత మహమ్మద్ అబ్దుల్ మన్నన్ 1990ల
తర్వాత తాజా "ఎ నేషన్ ఇన్ డిసెంట్ - ఇండియా"తో సహా 12 పుస్తకాలను
రచించారు.
భారతదేశంలోని ముస్లింలు దాదాపు ప్రతి
సామాజిక-ఆర్థిక డొమైన్/రంగంలో అత్యంత అధ్వాన్నమైన అల్ప ప్రాతినిధ్యాన్ని కలిగి
ఉన్నారు
· ప్రధానమంత్రి కార్యాలయంలోని 52 మంది అధికారులలో ముస్లింలు ఒక్కరు లేరు మరియు ప్రస్తుత క్యాబినెట్‌లో ముస్లిం మంత్రులెవరూ లేరు.
·
1977లో పీఎంఓ (PMO) ఏర్పాటైన తర్వాత దాని
అధికారుల్లో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవటం చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు,
1961లో
బిజినెస్ రూల్స్ అలోకేషణ్ allocation of business rules ద్వారా పీఎంఓ
(PMO) ప్రభుత్వంలో భాగంగా పరిగణించబడింది. ఒరిజినల్ గా 1947లో
పీఎంఓ
(PMO) ప్రధానమంత్రి సెక్రటేరియట్ (PMS)లో భాగంగా
ఏర్పాటు చేయబడింది.
·
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ
శాఖకు చెందిన 115 మంది అధికారులలో మరియు సహకార మంత్రిత్వ
శాఖ Ministry of Cooperation
కు చెందిన 49
మంది అధికారులలో ఒకరు ముస్లింగా ఉన్నారు.
·
54 కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు 93
డిపార్ట్‌మెంట్‌లలో సెక్రటరీ స్థాయి నుండి క్రిందికి మొత్తం 11131
మంది అధికారులు ఉన్నారు, అందులో 178
మంది ముస్లింలు".
·
ఆరు మంత్రిత్వ శాఖలు మరియు 11
శాఖలు మొత్తం 506 అధికారులలో ముస్లింలు లేరు
మరియు కేవలం ఇద్దరు ముస్లింలు మాత్రమే ఉన్నత స్థాయి
కార్యదర్శులు.
రాజకీయ ప్రాతినిధ్య విషయానికి వస్తే,
·
ఎన్నికైన 60,693
మంది ఎమ్మెల్యేలలో 3198 మంది ముస్లింలు,
9430
మంది లోక్‌సభ ఎంపీలలో 527 మంది మాత్రమే ముస్లింలు,
2176
మంది రాజ్యసభ సభ్యుల్లో 329 మంది ముస్లింలు
ఉన్నారు.
·
529 మందిలో 57
మంది ముస్లింలు మాత్రమే గవర్నర్‌లుగా నియమితులయ్యారు.
·
మొత్తం 539
మంది ముఖ్యమంత్రులలో కేవలం 10 మంది ముస్లింలు
మాత్రమే
·
నగరాల్లోని మొత్తం 1919 మేయర్లలో 80 మంది ముస్లింలు ఉన్నారు
·
విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్లకు
సంబంధించి, సెంట్రల్ యూనివర్సిటీలలో 1017
మందిలో 62
మంది వీసీలు ముస్లింలు కాగా
·
రాష్ట్ర విశ్వవిద్యాలయాల 8633
మంది వీసీలలో 219 మంది ముస్లింలు ఉన్నారు.
·
మొత్తం 13951
జిల్లా సెషన్ జడ్జీలలో 721 మంది ముస్లింలు.
1990ల
నుండి ప్రతి సామాజిక-ఆర్థిక డొమైన్/రంగం లో 200
మిలియన్ల-బలమైన ముస్లిం కమ్యూనిటీ అల్ప ప్రాతినిద్యం లో ఉంది.
·
జూలై 2022
నుండి కేంద్ర ప్రభుత్వంలో ముస్లిం ప్రాతినిధ్యం లేదు,
ఇది
చరిత్రలో మొదటిసారి.
· భారతదేశం అంతటా ఉన్న 4123 శాసనసభ స్థానాలలో, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న స్థానాలు 450 మాత్రమె
· 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 65 స్థానాల్లో 25 శాతానికి పైగా ముస్లిం జనాభా కలిగి ఉన్నాయి
·
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని
100కి
పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఫలితాన్ని నిర్ణయిస్తాయి.
·
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన
రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 29 జిల్లాలు ముస్లిం
మెజారిటీ జిల్లాలు మరియు 137
అసెంబ్లీ స్థానాలలో ముస్లిం మెజారిటీ కలదు.
·
మధ్యప్రదేశ్‌లో కనీసం 22
స్థానాల్లో ముస్లిం ఓట్ల అంశం కీలకం.
·
గుజరాత్‌లోని 17
అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు.
·
బీహార్‌లో 40
లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, వాటిలో 34
స్థానాలను ముస్లిం ఓట్లు ప్రభావితం
చేయును.
మూలం: Clarion India, by Waquar Hasan, October
18th, 2024
No comments:
Post a Comment