22 October 2024

ఢిల్లీలో మహిళలు నిర్మించిన ప్రముఖ మసీదులను Women Who Built Mosques in Delhi.

 



రాజధాని ఢిల్లీలో కూడా కొన్ని పురాతన మసీదులను మహిళలు నిర్మించారు. ఈ ఐకానిక్ స్మారక కట్టడాల్లో కొన్నింటి నిర్మాణ చరిత్రను తెలుసుకొందాము.

 

1.ముబారక్ బేగం మసీదు (రండి కి మసీదు)Mubarak Begum Masjid (Randi Ki Masjid):

రెండంతస్తుల ముబారక్ బేగం మసీదు - దీనిని రండి  కి మసీద్  అని కూడా పిలుస్తారు - ఇది ప్రశాంతతకు నిలయం. మస్జిద్ పై అంతస్తులో ప్రార్థనా మందిరం మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో టాయిలెట్లు ఉన్నాయి.

ముబారక్ బేగం మసీదు ను 1823లో పూణేకు చెందిన బీబీ మహరు తున్ ముబారక్-ఉల్-నిసా బేగం (ముబారక్ బేగం) నిర్మించారు, ముబారక్ బేగం బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి బ్రిటీష్ రెసిడెంట్‌గా ఉన్న జనరల్ డేవిడ్ ఆక్టర్లోనిని వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాం మతంలోకి మారింది.

బ్రిటిష్ అధికారి జనరల్ డేవిడ్ ఆక్టర్లోని13 మంది భార్యలలో ముబారక్ బేగం ఒకరు. 1825లో ఆక్టర్లోని మరణం తర్వాత, ముబారక్ బేగం 1857లో మొఘల్ కులీనుడిని వివాహం చేసుకుంది.

మొఘల్ కాలంలో, చాలా మంది మొఘల్ యువరాణులు మసీదులను నిర్మించారు.

2.సునేహ్రీ మసీదు Sunehri Masjid:

ముబారక్ బేగం మసీదు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖుద్సియా బేగం 1747లో నిర్మించిన సునేహ్రీ మసీదు ఉంది.

ఖుద్సియా బేగం అసలు పేరు ఉధమ్ బాయి, ఖుద్సియా బేగం ముహమ్మద్ షా రంగిలాను వివాహం చేసుకుంది. కాలక్రమేణా, ఖుద్సియా బేగం మొఘల్ పరిపాలన లో మన్సబ్దార్లను (సివిల్ లేదా మిలిటరీ అధికారులు వంటి ఉన్నత స్థాయి హోల్డర్) కూడా నియమించింది.

అహ్మద్ షా బహదూర్‌కు ఖుద్సియా బేగం 1748 నుండి 1754 వరకు రాజప్రతినిధిగా పనిచేసింది. ఖుద్సియా బేగం దాతృత్వం మరియు ప్రభావానికి ప్రసిద్ధి చెందినది.

3.ఖైరుల్ మనజిల్ మస్జిద్ Khairul Manazil Mosque:

పురానా క్విలా (పాత కోట)కి ఎదురుగా ఉన్న ఖైరుల్ మనజిల్ మసీదు, పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది

ఖైరుల్ మనజిల్ మస్జిద్ ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే రక్షించబడింది మరియు నిర్వహించబడుతుంది.

ప్రస్తుతం ఖైరుల్ మనజిల్ మసీదులో ప్రార్థనలు రోజుకు మూడు సార్లు జరుగుతాయి

ఖైరుల్ మసీదు మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క వెట్-నర్స్ అయిన మహమ్ అంగాచే నిర్మించబడినది మరియు ఢిల్లీలో ఒక మహిళచే నియమించబడిన మొదటి మసీదుగా నమ్ముతారు. మహమ్ అంగా వాస్తవ రీజెంట్‌గా మరియు యువ చక్రవర్తి రాజకీయ సలహాదారుగా పనిచేశారు.

4.  జీనత్-ఉల్-మసాజిద్ Zeenat-ul-Masajid:

జీనత్-ఉల్-మసాజిద్ 1700 ADలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు రెండవ కుమార్తె జీనత్-ఉన్-నిసాచే నిర్మించబడింది. జీనత్-ఉల్-మసాజిద్ ను ఘటా మసీదు అని కూడా పిలుస్తారు, జీనత్-ఉల్-మసాజిద్ మసీదు ఎత్తైన మినార్‌లు కలిగి ఉంది.

స్థానికులు జీనత్-ఉల్-మసాజిద్ మసీదును ఘటా మసీదు అని పిలుచుకుంటారు మరియు వారికి దాని అసలు పేరు తెలియదు.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన పాత ఢిల్లీలోని జామా మసీదు, జీనత్-ఉన్-నిసా మసీదుకు ప్రేరణగా పనిచేసిందని భావిస్తున్నారు.

జీనత్-ఉల్-మసాజిద్ మసీదు మంచి స్థితిలో ఉంది. మసీదు ఒక స్తంభంపై నిర్మించబడింది. ఇది మూడు పాలరాతి గోపురాలు మరియు ప్రార్థనా మందిరానికి తెరవబడే ఏడు వంపు ప్రవేశాలను కలిగి ఉంది. రెండు ఎత్తైన మినార్లు మసీదు ముందు భాగంలో ఉన్నాయి మరియు తెల్లని పాలరాయితో చేసిన అష్టభుజి మంటపానికి octagonal pavilion మద్దతుగా ఉన్నాయి.

మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో విజయం పొందిన బ్రిటిష్ వారు జీనత్-ఉన్-నిసా మసీదును మొదట బ్యారక్‌గా ఉపయోగించారు మరియు తరువాత బేకరీగా మార్చారు.

జీనత్-ఉన్-నిసా మసీదు చుట్టూ రకరకాల పూల మొక్కలు, ముఖ్యంగా గులాబీలు ఉన్నాయి.

5. ఫతేపురి మసీదు Fatehpuri Masjid:

ఫతేపురి మసీదు ఢిల్లీలో జామా మసీదు తర్వాత రెండవ అతిపెద్దది మరియు దీనిని 1650లో ఫతేపూర్ సిక్రీకి చెందిన చక్రవర్తి షాజహాన్ భార్యలలో ఒకరైన ఫతేపురి బేగం నిర్మించారు.

ఫతేపురి మసీదులో ఎర్ర ఇసుకరాయితో చేసిన డోమ్,  కలశం (విలోమ కమలం) fluted dome made of red sandstone with a kalash (inverted lotus)   కలిగి ఉంది.

ఫతేపురి మసీదు ప్రార్థనా మందిరంలో ఏడు వంపుల ప్రవేశాలతో సంప్రదాయ డిజైన్‌ను కలిగి ఉంది మరియు చుట్టూ మినార్‌లు ఉన్నాయి. మినార్లలో ఒకటి నిర్మాణంలో ఉంది.

 

మూలం: ది పెత్రియాట్/thepatriot.in by Mohd Shehwaaz Khan / Delhi NCR / డిసెంబర్ 08, 2022

No comments:

Post a Comment