కేరళలోని మలప్పురం జిల్లా శాంతాపురం గ్రామానికి చెందిన ఫాతిమా మసీదుకు, ముస్లిం మహిళలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఫాతిమా చేసిన కృషి వలన మహల్లు (పొరుగు) కమిటీల Mahallu (neighbourhood) committeesలో మహిళలను చేర్చిన మొదటి గ్రామంగా శాంతాపురం అవతరించినది.
మహల్లు కమిటీ అనేది ఒకటి లేదా అంతకంటే
ఎక్కువ మసీదుల చుట్టూ ఉన్న ప్రాంతంలోని ముస్లింల ప్రతినిధి సంస్థ. ప్రార్థన సమయం,
ఉపవాసం,
వివాహం,
విడాకులు
మరియు వారసత్వం వంటి విషయాలను నిర్ణయించడంలో మసీదుయొక్క మహల్లు కమిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి
మహల్లు కమిటీ లో స్త్రీలకు కూడా
ప్రాతినిద్యం కల్పించడం జరిగింది. 71 ఏళ్ల ఫాతిమా 2009లో
50
మంది తో కూడిన మసీదు మహల్లు కమిటీకి ఎన్నికైన మొదటి మరియు ఏకైక మహిళ.
శాంతాపురం గ్రామంలో,
వివాహం,
విడాకులు
మరియు ఇతర మతపరమైన విషయాలపై మొహల్లా సమితి ముస్లింలకు మార్గదర్శకాలను జారీ చేయడంలో
ముస్లిం మహిళలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు.
మలప్పురంలోని శాంతపురం తర్వాత కోజికోడ్
జిల్లాలోని ఊతయమంగళం, శివపురం గ్రామాలు కూడా తమ మహల్లు కమిటీలలో
మహిళలను చేర్చుకున్నాయి.
మహల్లు కమిటీలు కేరళలోని ముస్లింలకు ప్రత్యేకమైనవి మరియు అందులో మహిళలను చేర్చడం కూడా అంతే ప్రత్యేకమైనది.
కేరళలోని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం నుండి అందిన సమాచారం ప్రకారం, దాని పరిధిలోని 600 మసీదులలో 87 మసీదు కమిటీలలో మహిళా సభ్యులు ఉన్నారు.
మహల్లు కమిటీలు వివాహ కౌన్సెలింగ్ మరియు
స్వయం ఉపాధిలో పాల్గొంటున్నాయి. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన ఆడపిల్లల
పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే బాధ్యతను కూడా నిర్వహిస్తున్నాయి.. మహల్లు కమిటీ
లోని మహిళా సభ్యులు మహిళలకు విద్యను అందించడంలో సహాయం చేస్తారు. కోవిడ్ లాక్‌డౌన్
సమయంలో మతంతో సంబంధం లేకుండా మహల్లు కమిటీలు ప్రజలకు ఉచిత ఆహారం మరియు రోజువారీ
అవసరాలను అందించారు."
మహల్లు కమిటీ లోని చాలా మంది ముస్లిం
మహిళలు సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. మసీదు మహల్లు కమిటీలో
మహిళలను చేర్చిన ఫాతిమా అభిప్రాయం ప్రకారం "సమాజం
యొక్క లింగ సమస్యలను పరిష్కరించడం కోసం యువత మరియు విద్యావంతులైన మహిళలు ముందుకు
రావాలి. అప్పుడే మరింత మార్పు తీసుకురావచ్చు."
కేరళ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ ప్యానెల్ సభ్యురాలు షజనా మలత్ మాట్లాడుతూ, "మసీదు కమిటీలలో మహిళలను చేర్చడం లింగ సమానత్వం వైపు సానుకూల అడుగు, మసీదు మహల్లు కమిటీ యువ తరాలకు మంచి ఉదాహరణగా పనిచేస్తుంది.
1930వ దశకంలో కేరళలో మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశం మొదటిసారిగా తెరపైకి వచ్చింది. 1946లో మలప్పురంలోని ఒథాయ్ గ్రామంలోని మసీదులో మహిళలు తొలిసారిగా శుక్రవారం ప్రార్థనలకు హాజరయ్యారు. 1950లో కేరళ నిద్వత్ ముజాహిదీన్ Kerala Nidwat Mujahideen ఏర్పాటుతో మసీదుల్లోకి మహిళల ప్రవేశం డిమాండ్ పెరిగింది. ముజాహిద్ మరియు జమాతే ఇస్లామీ Mujahid and Jamaat-e-Islami సంస్థ మసీదులో మహిళలకు ప్రత్యేక స్థలాన్ని అందించాయి.
2015లో మసీదు కమిటీల్లో మహిళలను చేర్చాలని తీర్మానం చేశారు. కొన్ని మసీదులు మాత్రమే ఈ తీర్మానాన్ని అమలు చేశాయి. 2022లో మసీదులు, మసీదులు తమ కమిటీల్లో మహిళలను చేర్చుకోవాలని ఆదేశించపబడినది..
కేరళకు చెందిన ఫాతిమా ఉతి ముస్లిం
మహిళలకు మసీదుల తలుపులు తెరవడమే కాకుండా వారిని మొహల్లా కమిటి లో చేర్చింది.
దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు ఫాతిమాను
స్ఫూర్తిగా తీసుకోవాలి.
No comments:
Post a Comment