26 November 2014

శరీర అవయవములను పోలిన ఫలములు- ఆరోగ్య రక్షణ లో వాటి పాత్ర.


శరీరఆరోగ్యమును కాపాడుటలో ఫలముల పాత్ర ఎంతైనా ఉంది. ప్రతి దినము క్రమము తప్పకుండా ఫలములను భుజించిన శరిర ఆరోగ్యం కాపాడబడును.  “An apple a day keeps the  doctor away” అను సామెత ఉండనే ఉంది. ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్య వరం ఫలములు. కొన్ని ఫలముల ఆకృతులను పరిశిలించిన అవి మన శరీరములోని కొన్ని అవయవములను పోలిఉండును.  మన శరీర ఆరోగ్యమును కాపాడే కొన్ని ఫలములను, శరీర భాగములను పోలిన వాటి ఆకృతులను, వాటి ఉపయోగాములను పరిశిలించేదము.
క్యారెట్ ముక్కను అడ్డముగా కోసిన అది మానవ నేత్రమును పోలిఉండును. క్యారెట్ ముక్కలను భుజించిన అవి కళ్ళకు రక్తము అధికముగా ప్రసరించునట్లు చేయును ముఖ్యం రేచీకటి ని పారద్రోలును.నైట్ విజన్ పెంచును.  పెద్దవయస్సు వారికీ వచ్చే కంటి దోషాలను నివారించును.క్యారెట్ లోని బీటా-కరోతిన్ వలన క్యారెట్ కు ఆరంజ్ రంగు వచ్చెను.

టమాట పండు ను  అడ్డముగా కోసిన అది ఎరుపు రంగు లో ఉండి నాలుగు గదులు కలిగిఉండును. మన శరీరం లోని గుండె కుడా నాలుగు కవాటములు కలిగిఉండును.   టమాటో లోని లైకోపిన్ (lycopine) గుండె కు శుబ్రమైన రక్తమును అందించును.

గ్రేప్స్  (నల్ల ద్రాక్ష grapes) ఊపిరితిత్తులను పోలి ఉందును. ఉపిరి తిత్తులు అల్వెఒలి (అల్వెఒలి)అనే కణజాలం తో నిండి ఉండును. ఈ కణజాలం ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తమునకు చేరునట్లు చేయును. తాజా ద్రాక్ష ను తిన్న ఊపిరి తిత్తుల కాన్సర్  (lung cancer)రాకుండా చేయును. ద్రాక్ష విత్తనాలు అలేర్జి ద్వారా వచ్చే ఆస్తమాను తగ్గించును.
  
 
అక్రోట్(walnut) చిన్న  మేదడును పోలిఉండును. ఇది మెదడు కణాల మద్య ప్రసారాలను పెంచును. మతిమరపును పోగొట్టును. అల్జిమీర్ వ్యాధిని తగ్గించును.

 బీన్స్ మూత్రపిందాలను పోలి ఉండును మరియు బీన్స్ మూత్రపిండాల పనిని మెరుగు పరుచును.బీన్స్ ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్,విటమిన్లను కలిగి ఉందును.సంతులిత ఆహరం లో భాగంగా బీన్స్ ను భుజించిన శరీరం ఆరోగ్యంగా ఉందును. ..


ఆకుకూరలు ఎముకల నిర్మాణమును పోలియుండును. ఎముకలకు పటిష్టత కల్పించును. ఎముకలు 23% సోడియం కలిగి ఉందును. ఆకు కూరలలో సోడియం అధికంగా ఉందును.ఆకుకూరలు మానవ అస్థిపంజరం కు దృడత్వం కల్పించును.

వెన్న పండు మరియు పియర్; ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది స్త్రీ గర్భాశయమును పోలిఉండును మరియు గర్భాశయమునకు బలమును ఇచ్చును. వారమునకు ఒక అవోకాడో ఫలము (వెన్నపండు) తిన్న గర్భ హార్మోనులను సమన్వయపరిచి గర్భాశయ కాన్సర్ ను నివారించును.

ఫిగ్స్ (అత్తి పళ్ళు) ఇవి గింజలను అధికముగా కలిగి ఉండును. పురుష వీర్యమును వృద్ది పరచి పురుష వీర్య కణముల సంఖ్యను పెంచును

చిలకడ దుంప : ఇది క్లోమ గ్రంధి  (పాంక్రియాస్) ను పోలి మధుమేహమును నియంత్రి౦చును. క్లోమము (పాంక్రియాస్) పనిని మెరుగుపరచును. వీటిలో బీటా కరోతిన్ అధికముగా ఉండి శరీరం లోని కణములను శిధిలము కాకుండా, క్లోమము (పాంక్రియాస్) దెబ్బతినకుండా, కాన్సర్ రాకుండా కాపాడును. 

ఆలివ్స్: ఇది  ఆరోగ్యమును కాపాడి ఒవరీస్  సక్రమముగా పనిచేయునట్లు చూడును. ఆలివ్ ఆయిల్ అధికముగా తీసుకొన్న వారిలో గర్భాశయ కాన్సర్ ప్రమాదం 30% వరకు తగ్గును. కాన్సర్ కారక జీన్స్ ను తగ్గించును.
ఆరంజ్ ఇతర సిట్రస్ జాతికి చెందిన ఫలాలు:  . ఇవి స్త్రీ యొక్క పాల గ్రంధులు (మామరి గ్లాన్డ్స్) ను పోలి ఉందును మరియు వక్షం యొక్క ఆరోగ్యానికి మరియు వక్షం లోని లింపుల కదలికకు తోడ్పడును. వీటిలో ఉండే లిమోనోయిడ్స్ బ్రెస్ట్ కాన్సర్ రాకుండా కాపాడును మరియు కోలన్ కాన్సర్, పాంక్రియాస్ కాన్సర్, లివర్ కాన్సర్, లుకేమియా మొదలగు అన్ని రకాల కాన్సర్ లను ఎదుర్కొనును.

అరటి పండు:  ఇది పెదవులను(lips) పోలి ఉందును దీనిని  తినుటవలన సంతోషం కలుగును. ఇది త్రైతోఫాన్ (tryptophan) అనే ప్రోటీన్ ను కలిగి ఉందును మరియు అరటి పండు జిర్ణమైనప్పుడు మొదడు లోని కణములను చైతన్య పరుచును మరియు నిరాశ(depression) కు ముఖ్య ఔషదం గా పనిచేయును   
ఉల్లిపాయ: ఇది శరిరములోని ఎర్ర రక్త  కణజాలమును పోలి ఉందును. ఉల్లిపాయ శరీరంలోని అన్ని భాగముల నుండివ్యర్ధమును తొలగించును. కన్నీటిని తెప్పించి కంటి ని శుబ్రపరచును.
అల్లం : ఇది ఉదరమును పోలిఉండి జీర్ణక్రియకు తోడ్పడును. ఉదర సంబంధ వ్యాధులను నివారించును. పేగుల లోని (bowel)గడ్డల పెరుగుదలను తగ్గించును..
కుక్కగొడుగులు: వీటిని సగంగా కోసిన ఇవి మానవుని చెవిని పోలియుండును. కుక్కగొడుగులు శ్రవణ సామర్ద్యం ను పెంచును వీటిలో విటమిన్ డి అధికంగా ఉండును మరియు మెదడుకు శబ్దమును అందించు  చెవి లోని మూడు చిన్నఎముకలకు బలము ఇచ్చును.
బ్రోకాలి: బ్రోకలీ పైన ఉండే ఆకుపచ్చని టిప్స్ కాన్సర్ సెల్ల్స్ ను పోలి ఉందును. ఇది ప్రొటెస్ట్ కాన్సర్ తగ్గుదలకు ఉపయోగ పడును. దీనిని వారం పాటు భుజించిన ప్రొటెస్ట్ కాన్సర్ 45% వరకు తగ్గును.
జిన్సెంగ్ వెళ్ళు: ఇవి  మానవ శరీర ఆకృతిని పోలిఉండును అన్ని రోగములకు నివారణగా పని చేయును.



ఎర్ర ద్రాక్ష రసం :  ఇది మానవ రక్తం ను పోలి ఉందును.ఎర్ర ద్రాక్ష రసం అంటి-ఆక్సిడెంట్స్ మరియు పోలి ఫేనోల్స్ కలిగి రక్తం రూపం లో ఉందును. దీనిని సేవించిన రక్తం లోని చెడు కొలస్త్రాల్ ను తగ్గించి గుండె నొప్పి రాకుండా కాపాడును. రక్తం గడ్డ కట్టుటను తగ్గించును.
 క్లామ్స్: (నత్త గుల్ల) :ఇవి పురుష వృషణాలను పోలి ఉంది పురుష ప్రత్యోత్పత్తి అవయములకు బలము నిచ్చును. వీటిలో ఫోలిక్ ఆసిడ్ మరియు జింక్ అధికముగా ఉండి పురుషులలో విర్యమును వృద్ది పరుచును



అల్మొండ్స్:  ఇవి కంటి ని పోలి కంటి కి ఆరోగ్యమును ఇచ్చును. ఇందులో విటమిన్ –ఇ  అధికముగా ఉండి చర్మమునకు, వెంట్రుకలకు, కళ్ళకు శక్తిని ఇచ్చును. కొలస్త్రాల్ ను తగ్గించును. అంటి-ఆక్సిడెంట్ గా పనిచేసి వార్ధక్యము త్వరగా రాకుండా చేయును మరియు కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను తగ్గించును.  
ఆలుచిప్ప (OYSTERS ) ఇది స్త్రీ యోని ని పోలిఉండును. వీటిలో ఎమినో ఆసిడ్ లు అధికంగా ఉండి సెక్స్ హార్మోనులు టేస్తో స్తేరోనే (testosternone) మరియు ఈస్ట్రోజెన్  లెవెల్స్ పెంచును. స్త్రీలకు ఈస్ట్రోజెన్ ఉపయోగకరం.

మిరపకాయ: ఇది పురుషావయమును పోలిఉండును. రక్త ప్రసరణను పెంచును. 






16 November 2014

మలాలా యూసఫ్‌జాయ్ -2014 నోబెల్ శాంతి బహుమతి సంయుక్త విజేత

వాయువ్యపాకిస్తాన్ లోని మింగోరా లో  12-07-1997 న జన్మించిన మలాలా యూసఫ్‌జాయ్   ఫస్తున్ తెగ కు చెందిన సున్ని ముస్లిం బాలిక. ఈమె తండ్రి పేరు జియాఉద్దిన్ యూసఫ్‌జాయ్     తల్లి పేరు తూర్పెకై యూసఫ్‌జాయ్. ప్రముఖ పస్తూన్ కవయిత్రి, పోరాటయోధురాలు మెయివాండ్ మలాలా పేరులోని మలాలాను ఆమె తండ్రి జియావుద్దీన్ కూతురికి పెట్టారు. యూసఫ్‌జాయ్ స్వాత్ లోయలో ప్రముఖ తెగ. మలాలా అంటే అర్థం – బాధాసర్పద్రష్ట అని అర్ధం అత్యంత పిన్న వయసులో(17 సంవత్సరాలు) 2014 నోబెల్ శాంతి  బహుమతి సంయుక్తంగా గెలుచుకున్న పాకిస్థాన్ సాహస బాలిక గా  మలాలా యూసఫ్  జాయ్ చరిత్ర సృష్టించారు. కేనడా దేశం ఇమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి సత్కరించనుంది.
అత్యంత పిన్న వయస్సు లో నోబుల్ బహుమతి గెల్చుకొన్న ఏకైక బాలిక మాలాల. స్త్రీ/బాలిక  విద్య సమర్దుకురాలు, సఖరోవ్ ప్రైజ్ విజేత,సిమోన్ డి బ్యురోర్ ప్రైజ్ (2013)మరియు పాకిస్తాన్ జాతీయ యువ శాంతి ప్రైజ్(2011) విజేత. నోబెల్ విజేత డెస్మండ్ టిటు.ఈమెను అంతర్జాతీయ పిల్లల శాంతి ప్రైజ్ కు నామినేట్ చేసెను అంతటి పురస్కారం పరిశీలనకు ఎంపికైన పిన్న వయస్కురాలు మలాలాయే. నాటికి ఆమె వయసు పదిహేనేళ్లు. రెండేళ్ళ క్రితం పాక్‌లో బాలికల విద్యా హక్కు కోసం పోరాటం సాగిస్తున్న తరుణంలో తాలిబాన్ల దాడి లో తీవ్రం గా గాయపడిన ఈమె కోలుకున్న అనంతరం మలాలా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హాంలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ అక్కడే విద్యాభ్యాసం చేస్తోంది.
మానవ హక్కుల/స్త్రీ విద్య/బాలికల విద్యా  సమర్దుకురాలుగా ప్రపంచవ్యాప్త పేరుగాంచినది. ప్రపంచ ప్రముఖ యుక్తవయస్కురాలుగా(టీనేజర్) ఈమెను దుష్ వెల్ కిర్తించెను. ఐ యాం మాలాల అని ఈమె పేరున బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ ఐక్యరాజ్య సమితి పిటిషన్ ప్రారంబించినాడు. ఈ యువతి సాహసంపై పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాట్లాడుతూ మలాలా ఒక వ్యక్తికాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు. ఆమె ధైర్యం, తెగింపును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడి గెలుపు సాధిస్తామని చెప్పారు.
పాకిస్థాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర "ఐయామ్ మలాలా" పేరిట పుస్తక రూపంలో రానుంది. ప్రస్తుతం మలాలా వయస్సు పదిహేనేళ్లు. ఈ చిన్నారి తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను 'ఐయామ్ మలాలా'(నేను మలాలా) అన్న పేరుతో ఆమె ఈ పుస్తకాన్ని రాయనుంది.
మలాలా ఆశయం వైద్యవృత్తి. 2008 సెప్టెంబర్‌లో పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చిన ఉపన్యాసం లో  మలాలా వేసిన ప్రశ్న చదువుకోవడానికి నాకు ఉన్న హక్కుని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?’మలాలా స్వాత్‌లోయ అనుభవాలను మలాలా గుల్ మకాయ్’ (జొన్న పువ్వు అని అర్థం) అనే మారుపేరుతో డైరీ రూపంలో బీబీసీ కోసం ఉర్దూలో రాసింది.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో, అంత విప్లవాత్మకం కూడా.
ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడటానికి రాలేదని సమితి సభలో మలాలా చెప్పింది. ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడేందుకు ఇక్కడ నిలబడ్డానుఅని ప్రకటించింది.
మలాలా మీద ఒక ఆగంతకుడు కాల్పులు జరిపాడు. బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు మలాలా గెలిచింది. ఈ ఉదంతం విన్న వెంటనే బిగ్గరగా ఏడవాలనిపించిందిఅని వ్యాఖ్యానించింది మడోనా. ఆ రోజు లాస్ ఏంజెలిస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాడిన హ్యూమన్ నేచర్అన్న పాటను మలాలాకు అంకితం చేసింది.
ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ వెంటనే ఒక వ్యాసం రాసింది. టీనా బ్రౌన్‌తో కలిసి పాకిస్థాన్ బాలికల చదువు కోసం విరాళాలు సేకరించి పంపాలని జోలీ నిర్ణయించింది. హక్కుల కోసం వీరోచిత పోరాటం చేసిన బాలిక మలాలా అని హిల్లరీ క్లింటన్ ఒక సభలో ప్రశంసించారు. లారా బుష్ వాషింగ్టన్ పోస్ట్పత్రికలో ఒక వ్యాసం రాసింది. నాజీల దురాగతాల గురించి రహస్యంగా డైరీ రాసి చరిత్ర ప్రసిద్ధికెక్కిన యానీ ఫ్రాంక్‌తో మలాలాను పోల్చింది లారా.
ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాన్ని కోల్పోయిన 5,70,00,000 బాలబాలికల తరఫున 40 లక్షల మంది సంతకాలు చేసిన మహజరును ఉపన్యాసం తరువాత సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌కి మలాలా అందచేసింది. ఒక్క పాకిస్థాన్‌లోనే చదువుకు నోచుకోని బాలబాలికలు 50 లక్షలు. ఇప్పుడు స్వాత్‌లోయలో ప్రతి బాలిక గొంతు విప్పుతోంది. ఇక్కడ ప్రతి బాలిక మలాలాయే అని సీఎన్‌ఎన్ విలేకరి ఎదుట బాలికలంతా ముక్తకంఠంతో చెప్పారు.

సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శమని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుష్టకార్యాలకు పాల్పడుతున్నారని నిష్కర్షగానే చెప్పింది. కానీ ఆ ఉపన్యాసంలో ఆమె ప్రపంచ పెద్దలను ఉద్దేశించి పలికిన మాట చరిత్రాత్మకం.

సర్దార్ వల్లభభాయి పటేల్ -భారత దేశఉక్కు మనిషి(ఐరన్ మాన్ అఫ్ ఇండియా)

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ' ఉక్కు మనిషి ' గా గుర్తుకొస్తారు. భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న నాల్గవ సంతానంగా గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్ర చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు.

1928 లో బార్డోలీ లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు . విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి,కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పని చేసారు. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు.
భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. . అంబేద్కర్ ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటు లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడ అతనే ప్రతిపాదించాడు.
స్వాతంత్రానంతరం జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను మరియు ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు. స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించినాడు.
భారతదేశ తోలి ప్రధాని కావలసిన వ్యక్తి. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి(congress presidency) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష పదవితో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు. గాంధీ 16 రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి సరైన వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. 16లో 13 రాష్ట్రాల ప్రతినిధులు వల్లభాయి పటేల్ పేరును ప్రతిపాదించారు. కాని గాంధీ కోరికపై ప్రధాని పదవిని వదులుకొని నెహ్రు ని ప్రధానిని చేసినారు గాంధీ చెప్పిన మాటకు కట్టుబడి తన ప్రధాని పదవిని నెహ్రూకు త్యాగం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. 
1991లో భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు భారత రత్న  బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
ఐక్యతా  విగ్రహం
ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహాన్ని(statue of unity) మన భారత దేశంలో నిర్మిస్తున్నారు. లిబర్టి విగ్రహం ఎత్తు 93 మీ. కాని దీనికి రెండింతల ఎత్తు పటేల్ విగ్రహ నిర్మాణ ఏర్పాట్లు గుజరాత్ లోని  అహ్మదాబాద్ లో ప్రారంబించారు. సర్దార్ సరోవర్ డ్యాం కి మూడు కి.మీ. దూరంలో ఉన్న సాదుభేట్ లో 182 మీ. విగ్రహాన్ని నిర్మిస్తున్నారు.
పటేల్ పేరు మీద సంస్థలూ మరియు స్మారకాలు
·       అహ్మదాబాదు సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాదు మొదలగునవి.






.