30 August 2019

అఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ Ahmad Shaw Durrani The Ruler of Afganisthan




ఇతనిని  అహ్మద్  ఖాన్ అబ్దాలీ, అమాద్ షా అబ్దాలీ అని కూడా పిలుస్తారు.
ఇతని పూర్తి పేరు అహ్మద్ షా అబ్దాలి  దుర్-ఎ- దుర్రాన్(Ahmad Shah Abdali Dur-e-Durran)
 Image result for ahmad shah abdali

అహ్మద్ షా దుర్రానీ ముల్తాన్, పంజాబ్ [ప్రస్తుత  పాకిస్తాన్‌], లేదా హెరెట్ [ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌)లో1722? లో జన్మించినాడు  మరియు అక్టోబర్ 16/17, 1772, టోబా మారిఫ్, ఆఫ్ఘనిస్తాన్ లో మరణించినాడు.

అఫ్ఘనిస్తాన్ రాజ్య స్థాపకుడు మరియు అతని సామ్రాజ్యం అము దర్యా (పురాతన ఆక్సస్ నది) నుండి హిందూ మహాసముద్రం వరకు మరియు ఖోరాసన్ నుండి కాశ్మీర్, పంజాబ్ మరియు సింధ్ వరకు విస్తరించినది. అతను తన రాజ్య మరియు ప్రభుత్వ అధిపతిగా సంపూర్ణ అధికారం కల్గి  పౌర మరియు సైనిక విషయములలో పూర్తి  నియంత్రణను కలిగి ఉన్నాడు దానితో పాటు అంతరంగిక మరియు విదేశీ వ్యవహారాల పై  పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు.  షాకు పరిపాలనలో ప్రముఖ ఆఫ్ఘన్ తెగలనుండిఎంపిక చేయబడిన   ఒక ప్రధానమంత్రి మరియు తొమ్మిదిమంది  జీవితకాల సలహాదారుల మండలి సహాయపడింది.

ఇతను కులీన సదాజాయ్ (Sadōzai) వంశస్తుడు  మరియు ప్రసిద్ద అఫ్ఘాన్ అబ్దాలీ తెగకు చెందిన మొహమ్మద్  జమాన్ ఖాన్ యొక్క రెండవ కుమారుడు. అహ్మద్ పర్షియాకు చెందిన నాదిర్ షా ఆధ్వర్యంలో అబ్దాలీ అశ్వికదళ సమూహానికి నాయకత్వం వహించాడు మరియు నాదిర్ షా హత్య అనంతరం ఆఫ్ఘన్ ముఖ్యులు సబ్యులుగా ఉన్న లోయా జిర్గా లేదా గిరిజన పెద్దల సమావేశం అతనిని “షా” గా ఎన్నుకొన్నారు.

 1747 వ సంవత్సరంలో, అహ్మద్ షా దుర్రానీని ఆఫ్ఘన్ తెగల రాజుగా పట్టాభిషేకం చేశారు, అప్పుడు దుర్రానీ వయసు 25 సంవత్సరాలు. కందహార్ లో అతని పేరు మీద నాణేలు ముద్రించ బడినవి మరియు కందహర్ ను అతను తన రాజధానిగా  ఏర్పాటు చేసుకొన్నాడు. దుర్రానీ దుర్-ఇ-దుర్రానీ  లేదా పెర్ల్ ఆఫ్ పెర్ల్స్ అనే పేరు  తో ప్రసిద్దుడు. అది అతనికి నాదర్ షా ఇచ్చిన బిరుదు (అతను చెవిలో ముత్యాల చెవి రింగ్  ధరించేవాడు.), అలాగే అతను మొత్తం అబ్దాలి తెగ పేరును దుర్రానీగా మార్చాడు.

పొరుగున ఉన్న అసమర్ధ పాలకుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను జయించటానికి బయలుదేరిన అతను 1747 మరియు 1748 మధ్య, ఘజ్నిని జయించాడు మరియు కాబూల్ వరకు మరియు తరువాత పెషావర్ వరకు ముందుకు పోయాడు. 1749 నాటికి దుర్రానీ మరియు అతని సైన్యం పంజాబ్, సింధ్ మరియు కాశ్మీర్లను నియంత్రిoచ సాగాయి. 1757 నాటికి, దుర్రానీ ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని నియంత్రిస్తాడు.

1747 మరియు 1769 మధ్య, షా తొమ్మిది సార్లు భారతదేశంపై దాడి చేశాడు (మరియు దోచుకున్నాడు). అతడు మరియు అతని సైన్యం డిల్లి , ఆగ్రా, మధుర మరియు బృందావన్ నగరాల ను దోచుకొన్నారు కాని అతనికి ఆ  ప్రాంతాలను పరిపాలించాలనే ఉద్దేశ్యం లేదు.

ఈ సమయంలో, అతను అప్పటి మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా కుమార్తె అయిన హజ్రత్ బేగంను వివాహం చేసుకున్నాడు. దుర్రానీకి నలుగురు కుమారులు, సులేమాన్ మీర్జా, తైమూర్ షా ,సికందర్ మరియు పర్వేజ్.  తైమూర్ షా అతని తరువాత రాజు అయ్యాడు.  

దుర్రానీ ఆఫ్ఘనిస్తాన్లోని పష్తున్ తెగల సైన్యాలలో ఫిరంగిదళాలను ప్రవేశపెట్టినాడు మరియు సైన్యాన్ని ఒక "వృత్తి" గా రుపొందిoఛినాడు. అతని గతం కారణంగా మరియు అతను పాలించిన విధానం కారణంగా అతను మంచి ఆదరణ పొందిన నాయకుడు అయ్యాడు. విబిన్న ఆఫ్ఘన్ తెగల మద్య  సామరస్యాన్ని తెచ్చి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్కు పునాదిని  వేసినాడు. ఇస్లాంను అవిశ్వాసులలో  వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడు.

"అతను ఒక పెద్దల మండలిని ఒక సైనిక పాఠశాలను, మొదటి ఆఫ్ఘన్ పోస్టల్ సేవను మరియు మొదటి పత్రికా ప్రచురణను    స్థాపించాడు. అతని సైన్యం 40,000 మందితో కూడి బలంగా ఉంది, అతను "విస్తృత మనస్సు మరియు సానుభూతి వైఖరి" కలిగి ఉన్నాడు. అని స్కాటిష్ చరిత్రకారుడు మౌంట్‌స్టూవర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ దుర్రానీ గురించి రాశాడు.

అతని తన కుమారుడు తైమూర్ ను పంజాబ్ వైస్రాయ్ గా నియమించినాడు మరియు తైమూర్ భారతదేశ నామక చక్రవర్తి 2వ ఆలంగిర్ కుమార్తె ను  వివాహం చేసుకున్నాడు.  

1758 లో సిక్కులు, మొఘలులు మరియు మరాఠాల బలం తైమూర్ ను తరిమికొట్టారు, కాని 1759-61లో అహ్మద్ షా మరాఠాలను పంజాబ్ నుండి తుడిచిపెట్టి, వారి పెద్ద సైన్యాన్ని డిల్లి కి ఉత్తరాన ఉన్న పానిపట్ వద్ద మూడవ పానిపట్ యుద్ధంలో (జనవరి 14, 1761). ఓడించినాడు.  1760లలో అతను సిక్కులను అణిచివేసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించాడు, కాని అతని సామ్రాజ్యం లో తీవ్రమైన తిరుగుబాటులు జరిగినవి దానితో అతను పంజాబ్ సిక్కులపై నియంత్రణను కోల్పోయాడు.

1770 ల ప్రారంభంలో, "క్యాన్సర్” పిడితుడు అయ్యాడు మరియు అతను తన జీవితంలోని చివరి పదేళ్ళు కాబూల్ నుండి గడిపాడు, అక్కడ నుండి తన దేశీయ మరియు విదేశీ వ్యవహారాలను నిర్వహించెవాడు. జూన్ 1773 లో దుర్రానీ చివరకు క్యాన్సర్తో హెరాత్ ప్రావిన్స్‌ లోని ముర్ఘాలో యాభై సంవత్సరాల వయసులో మరణించాడు. అతన్ని కందహార్‌లోని ఒక   సమాధిలో ఖననం చేశారు.

దుర్రానీ కవిత్వం

అహ్మద్ షా దుర్రాని  కవి, అతడు తన స్థానిక పాష్టో బాష లో మరియు  పెర్షియన్ భాషలో కవితలు వ్రాశాడు:అతను రాసిన అత్యంత ప్రసిద్ధ పాష్టో పద్యం లవ్ ఆఫ్ ఎ నేషన్:

 

 

 

 

 

 

 

 

 

 

 
















28 August 2019

బఖ్త్ ఖాన్ (Bakht Khan)



 సిపాయిల తిరుగుబాటు 1857లేదా భారత ప్రధమ స్వాత్రంత సమర యుద్ధం లో భారత్ తరపున సైన్యాధ్యక్షుడు (కమాండర్-ఇన్-చీఫ్ గా) వ్యవరించినాడు



Image result for bakth khan 

బఖ్త్ ఖాన్ యూసఫ్‌జాయ్ (Bakht Khan 179713 మే 1859)  నాటి మొఘల్ సామ్రాజ్యం ఆధీనం లో ఉన్న బిజ్నోర్, రోహిల్‌ఖండ్ లో 1797 లో జన్మించినాడు. మొదట్లో ఇతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో  సుబేదార్ గా పనిచేసినాడు.బెంగాల్ హార్స్ ఆర్టిల్లరీలో 40 సంవత్సరాల పాటు పని చేసినాడు. పిదప సిపాయిల తిరుగుబాటు (మొదటి భారత స్వతంత్ర సమర యుద్ధం    1857) లో మొఘల్ చక్రవర్తి ఆధ్వర్యంలోని  భారత స్వాతంత్ర్య సమరయోధుల సేన కు  కమాండర్-ఇన్-చీఫ్   గా వ్యవరించినాడు..

బఖ్త్ ఖాన్ (Bakht Khan) (179713 మే 1859) ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857లేదా భారత ప్రధమ స్వాత్రంత సమర యుద్ధం   లో  భారత్ తరపున సైన్యాధ్యక్షుడు (కమాండర్-ఇన్-చీఫ్ గా) వ్యవరించినాడు

జీవిత కథ
బఖ్త్ ఖాన్ యూసఫ్జాయ్ తెగకు చెందిన రోహిల్లా చీఫ్ నజీబ్-ఉల్-దౌలా కుటుంబానికి చెందిన పష్తూన్ (పక్తూన్). అతను రోహిల్‌ఖండ్‌లోని బిజ్నోర్‌లో జన్మించాడు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో సుబేదార్ గా పనిచేసాడు.అయ్యాడు, బెంగాల్ గుర్రపు ఫిరంగిదళంలో నలభై సంవత్సరాల అనుభవాన్ని పొందాడు మరియు మొదటి ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో పనిచేసాడు. ఒక బ్రిటిష్ కల్నల్ అతన్ని "చాలా తెలివైన వ్యక్తిత్వం కల వాని”గా అభివర్ణించాడు. అతను 1859 లో నేటి పాకిస్తాన్లోని బునర్లో(Buner) మరణించాడు.
తిరుగుబాటు
ఈస్ట్ ఇండియా కంపని పందికొవ్వు (పంది కొవ్వు) తో గ్రీజు చేసిన రైఫిల్ తూటాలను ప్రవేశపెట్టడం తో దానికి వ్యతిరేకంగా భారతీయ  సిపాయిలు  తిరుగుబాటు చేయడంతో 1857 నాటి భారతీయ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. పందికొవ్వు (పంది కొవ్వు) తో గ్రీజు చేసిన రైఫిల్ తూటాలు  ముస్లిం సైనికుల మత విశ్వాసాలను  బాధపెట్టినవి  మరియు శాఖాహార హిందూ సైనికులను కించపరిచింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా డిల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుబాటు వేగంగా వ్యాపించింది.

బరైలీలో తిరుగుబాటు చెలరేగడంతో, దానిలో పాల్గొన్న సిపాయిలు సుబేదార్ బహదూర్ ఖాన్ ను జనరల్ గా ఎన్నుకున్నారు. మీరట్‌లో జరిగిన తిరుగుబాటు గురించి విన్న బఖ్త్ ఖాన్ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సైన్యానికి మద్దతుగా డిల్లి కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 1857 జూలై 1 న బఖ్త్ ఖాన్ పెద్ద సంఖ్యలో రోహిల్లా సిపాయిలతో డిల్లి కి వచ్చే సమయానికి డిల్లి నగరాన్ని అప్పటికే తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నాయి మరియు మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ ను భారత చక్రవర్తిగా ప్రకటించారు.

బఖ్త్ ఖాన్ నేతృత్వంలోని బరేలీ బ్రిగేడ్‌లో బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ యొక్క నాలుగు రెజిమెంట్లు మరియు ఒక   అశ్వికదళం, ఆర్టిలరీ ఉన్నాయి. ఈ గణనీయమైన సైనిక దళం డిల్లి ని ముట్టడించిన బ్రిటిష్ వారిని ఆశ్చర్య పరిచినది మరియు డిల్లి చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను ఆకట్టుకొన్నది. చక్రవర్తిని కలవడానికి బఖ్త్ మరియు అతని అధికారులు పిలవబడినారు.
  
చక్రవర్తి పెద్ద కుమారుడు మీర్జా మొఘల్. అతనిని మిర్జా జహిరుద్దీన్ అని కూడా పిలుస్తారు, అతనికి చీఫ్ జనరల్ బిరుదు ఇవ్వబడింది, కాని ప్రిన్స్ మిర్జా మొఘల్ కు సైనిక అనుభవం లేదు. కొత్తగా పునరుద్ధరించబడిన మొఘల్ రాజవంశం ఇప్పటికే నగరంలో ఉన్న తిరుగుబాటు సిపాయిల తో దోపిడీ మరియు క్రమశిక్షణ సమస్యలను ఎదుర్కొంటుంది.

అలాంటి తరుణంలో బఖ్త్ ఖాన్ తన బలగాలతో కలిసి డిల్లి కి రాకతో నాయకత్వ స్థానం మెరుగుపడింది. బఖ్త్ ఖాన్ యొక్క పరిపాలనా సామర్థ్యాలు త్వరగా స్పష్టమయ్యాయి, మరియు చక్రవర్తి బహాదుర్ షా, బఖ్త్ ఖాన్ కు నిజమైన అధికారాన్ని మరియు సాహెబ్-ఎ-ఆలం బహదూర్ లేదా లార్డ్ గవర్నర్ జనరల్ బిరుదునిచ్చి తన సేనలకు ముఖ్య అధిపతిగా నియమించాడు. మిర్జా జహిరుదిన్ లేదా మీర్జా మొఘల్ ఇప్పటికీ కమాండర్-ఇన్-చీఫ్ అయినప్పటికీ, బఖ్త్ ఖాన్ సిపాయి దళాలకు వర్చువల్ కమాండర్.

భఖ్త్ ఖాన్ అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు, వాటి పట్ల తక్షణ శ్రద్ధ చూపవలసి వచ్చింది. మొదటి సమస్య ఆర్థిక సమస్య. దాన్ని పరిష్కరించడానికి అతను పన్నులు వసూలు చేయడానికి చక్రవర్తి నుండి అధికారం పొందాడు. రెండవ సమస్య సరఫరా యొక్క లాజిస్టికల్ సమస్య.  ఇది సమయం గడిచేకొద్దీ ముఖ్యంగా  సెప్టెంబరు 1857 లో బ్రిటిష్ దళాలు నగరంపై దాడి చేసినప్పుడు మరింత తీవ్రంగా మారింది. బ్రిటిష్ వారు నగరంలో చాలా మంది గూడాచారులు మరియు ఏజెంట్లను కలిగి ఉన్నారు మరియు వారు బహదూర్‌పై నిరంతరం లొంగిపోవడానికి ఒత్తిడి తెస్తున్నారు డిల్లి చుట్టూ పరిస్థితి వేగంగా దిగజారింది; తగిన తర్ఫీదు లేని కారణంగా బహాదుర్ షా సేనలు బలహీన పడ్డాయి. తిరుగుబాటుదారుల సంస్థాగత,సరఫరా మరియు సైనిక బలగం  లోపాలను బఖ్త్ ఖాన్ నాయకత్వం భర్తీ చేయలేకపోయింది,

1857 జూన్ 8 న డిల్లి పై ముట్టడి జరిగింది. సెప్టెంబర్ 14, బ్రిటిష్ వారు కాశ్మీరీ గేటుపై దాడి చేశారు. ఢిల్లీ ఆంగ్లేయుల వశమయింది. మరియు బహదూర్ షా 1857 సెప్టెంబర్ 20 న బఖ్త్ ఖాన్ అభ్యర్ధనలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి లొంగిపోయే ముందు హుమయూన్ సమాధికి పారిపోయారు. చక్రవర్తిని అరెస్టు చేశారు మరియు బ్రిటీష్ పౌరుల ఊచకోతలో పాల్గొన్న మొఘల్ రాకుమారులు ఉరితీయబడ్డారు. బహదూర్ షా జాఫర్‌ను దేశద్రోహ ఆరోపణలపై విచారించి, బర్మాలోని రంగూన్‌కు బహిష్కరించారు, అక్కడ అతను 1862 లో మరణించాడు.

బఖ్త్ ఖాన్ డిల్లి ని విడిచిపెట్టి తిరుగుబాటు దారులతో చేతులు కలపడానికి లక్నో మరియు షాజహాన్ పూర్ కు బయలుదేరాడు. 13 మే 1859 తీవ్రమైన గాయాల వల్ల వీరస్వర్గం పొందాడు. అతన్ని స్వాత్ యొక్క భాగమైన నాన్సర్ స్మశానవాటిక (నేటి పాకిస్తాన్) లో  ఖననం చేశారు

స్వాత్ చరిత్ర విషయాలలో ఒక నిపుణుడు, యుద్ధం కోల్పోయిన తరువాత అతను స్వాత్ వద్దకు వచ్చాడని మరియు తన జీవితాంతం స్వాత్(SWAT) యొక్క అఖుండ్ (Akhund) రక్షణలో గడిపాడని పేర్కొన్నాడు.

































.