31 January 2023

హైదరాబాద్ నిజాముల సంక్షిప్త చరిత్ర

 

 నిజాం ది సెవెంత్ హిజ్ ఎక్సల్టెడ్ హైనెస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 

హైదరాబాద్ దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమిలో ఒక పెద్ద రాచరిక రాజ్యంగా ఉండేది. భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత హైదరాబాద్ రాజ్యం స్వేచ్ఛా భారతదేశంలో విలీనమైంది. సెప్టెంబర్ 1948లో, భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై ఆపరేషన్ పోలో ప్రారంభించి హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసింది. నిజాం, హైదరబాద్ రాష్ట్రానికి రాజప్రముఖ్/గవర్నర్  గా నియమించబడినాడు.

హైదరాబాద్‌ను ఆసిఫ్ జా, నిజాం ఉల్ ముల్క్, భారతదేశంలోని చివరి మొఘల్ చక్రవర్తుల క్రింద గవర్నర్ (లేదా నిజాం)గా  పరిపాలించారు. బ్రిటీష్ పాలనలో, నిజాంలు ఒక పెద్ద రాజ్యాన్ని/ప్రాంతాన్ని  అంతర్గత స్వయంప్రతిపత్తితో పరిపాలించారు.

1911 నుండి 1948 వరకు పాలించిన నిజాం ది సెవెంత్ హిజ్ ఎక్సల్టెడ్ హైనెస్ His Exalted Highness మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  తన ప్రగతిశీల ఆలోచనలకు ప్రసిద్ధి చెందారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  విద్యను ప్రోత్సహించారు మరియు  మరణశిక్షను రద్దు చేశాడు. ఉస్మానియా  విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు, హైదరాబాద్ నగరాన్ని సుందరీకరించారు  మరియు ప్రతిభ ఆధారంగా సివిల్ సర్విస్ ను అభివృద్ధి చేశాడు.

7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  పాలన సమర్థులైన మంత్రులతో కొనసాగింది  మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి అనేక మంది ప్రతిభావంతులైన నిపుణులను పరిపాలన రంగం లో నియమించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  లౌకిక దృక్పథం కలిగి  పెర్షియన్ మరియు ఉర్దూ భాషలలో మంచి సాహిత్య అభిరుచిని కలిగి ఉన్నాడు.

7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  శక్తివంతమైన పాలకుడు. 7వ నిజాం 1926లో హైదరాబాదుపై బ్రిటీష్ పారామౌంట్ సమస్యపై బ్రిటిష్ వారితో, ముఖ్యం గా అత్యంత ప్రసిద్ధి చెందిన లార్డ్ రీడింగ్,  వైస్రాయ్‌ ఆఫ్ ఇండియా తో ఘర్షణ పడ్డాడు. ఘర్షణ తర్వాత, ఢిల్లీతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  పరిచయాలు తగ్గి మరియు అతని ఏకాంత ధోరణులు తెరపైకి వచ్చాయి

నిజానికి నిజాంకు మరో వైపు కూడా ఉంది. ప్రగతిశీల దృక్పథం ఉన్నప్పటికీ, నిజాం విమర్శలకు గురిచేసే కొన్ని వ్యక్తిగత ధోరణులను ప్రదర్శించాడు. తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనానికి తన ముస్లిం ప్రజలను సిద్ధం చేయడానికి నిజాం పెద్దగా కృషి చేయలేదు.  నిజాం తన కాలపు ప్రముఖ రాజ్యాంగ న్యాయవాది సర్ వాల్టర్ మాంక్టన్ సహాయంతో తన రాజ్యాంగ స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. నిజాం ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడు, కానీ చాలా నిరాడంబరంగా జీవించాడు మరియు తరచుగా నిర్లక్ష్యంగా, చిరిగిన దుస్తులు ధరించేవాడు.  సమకాలీన కథనాలలో నిజాం అనేది తన కాలంతో సంబంధం లేని ఏకాంత విపరీతమైన, నిరంకుశ పాలకుడిగా చిత్రీకరించే వ్యంగ్య చిత్రం. నిజాం తన పబ్లిక్ ఇమేజ్ పట్ల అజాగ్రత్తగా ఉన్నాడు మరియు పర్యవసానంగా చెడు ప్రెస్‌ను సంపాదించాడు.

చరిత్ర,  ఏడవ నిజాం పట్ల దయలేనిది. 7వనిజాం తన కాలం లో భారతదేశంలోని ప్రముఖ ముస్లిం యువరాజు.  ఒట్టోమన్ పాలక కుటుంబంతో పరిచయాల నుండి భారతదేశం మరియు పాకిస్తాన్‌లోని ప్రముఖ జాతీయ వ్యక్తులతో మరియు ఆనాటి కొన్ని ముఖ్యమైన సంఘటనలపై   స్పష్టమైన ముద్ర కలవాడు. టర్కీ కుచెందిన అబ్దుల్ మెజిద్ ది సెకండ్ కుటుంబాన్ని దశాబ్దాల పాటు నిజాం పోషించిన వైనం 20వ శతాబ్దపు ముస్లిం చరిత్రలో ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మక అన్వేషించదగిన నిదర్సనం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు, మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయిన వెంటనే కాలిఫేట్ రద్దు అనేది అత్యంత ప్రతీకాత్మకమైన సంఘటన. అబ్దుల్ మెజిద్ ది సెకండ్, నవంబర్ 1922లో, ఖలీఫాగా ప్రకటించబడ్డాడు. లౌకిక మరియు ఆధ్యాత్మిక స్వరంగా, ముస్లిం ప్రపంచంలో "ప్రవక్త వారసుడు"తో సహా ది షాడో ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్” అనే గొప్ప బిరుదులను కలిగి ఉన్నాడు. 1924లో కమల్ అటాటర్క్ కాలిఫేట్‌ను రద్దు చేసినప్పుడు, చివరి ఖలీఫా ప్రవాసంలోకి వెళ్లడం జరిగింది. ఖలీఫా పదివి రద్దుకు వ్యతిరేకంగా భారత దేశం తో సహా  ముస్లింలుఆందోళనలు చేసారు . బ్రిటిష్ పాలకులు ఖిలాఫత్ ఉద్యమాన్ని నియంత్రించడానికి చాలా కష్టపడ్డారు,

ఫ్రాన్స్‌లో ప్రవాసంలో ఉన్న ఖలీఫాకు 7వ నిజాం క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యక్తిగత దాతృత్వ చర్యను ప్రదర్శించాడు. కొన్ని సంవత్సరాల తరువాత, 7వ నిజాం తన ఇద్దరు పెద్ద కుమారుల తరపున, ఖలీఫా కుమార్తె మరియు మేనకోడలు కోసం ఒక వివాహ ప్రతిపాదనను పంపాడు. ఖలీఫా ఆ ప్రతిపాదనను ఆమోదించాడు.

వివాహాలు 1931లో ఫ్రాన్స్‌లోని నీస్‌లో జరిగాయి. వాటికి అబ్దుల్ మెజిద్II స్వయంగా హాజరు అయ్యారు, టర్కిష్ యువరాణి దుర్రుహ్‌సెహ్వర్ మరియు అందమైన యువరాణి నీలోఫర్ లకు  హైదరాబాద్‌ యువ రాకుమారులతో వివాహం చేజరిగింది నిజాంలకు ఒట్టోమన్ ఇంపీరియల్ హౌస్‌తో పొత్తుఏర్పడినది.

కాలక్రమేణా, పెద్ద యువరాజు, వారసుడు, ఆజం జా,కు  ఇద్దరు కుమారులు, ముకర్రం జా, మీర్ బరాకత్ అలీ ఖాన్ (జననం 1933) మరియు ముఫక్కమ్ జా (జననం 1935)జన్మించారు.  1948లో రాకుమారులు ప్రసిద్ధ ఆంగ్ల ప్రభుత్వ పాఠశాల హారోకు పంపబడ్డారు. హారో తర్వాత శాండ్‌హర్స్ట్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో రాజకుమారులు చదువుకొన్నారు. విద్యాబ్యాసం అనంతరం యువరాజులు 1960ల ప్రారంభంలో భారత దేశానికి తిరిగి వచ్చారు. ఇద్దరిలో పెద్దవాడు  నిజాం మొదటి మనవడు ముఖరం జా అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి, పొడుగ్గా, మంచిగా కనిపించేవాడు మరియు బాగా మాట్లాడేవాడు. ముఖరం జా, భారత ప్రధాని, నెహ్రూ,కు మద్య   మంచి వ్యక్తిగత స్నేహ సంభందాలు కలవు.

యువరాజు ముఖరం జా కొంతకాలం ఢిల్లీలో, నెహ్రూకు సన్నిహితంగా, ఆయన ప్రైవేట్ కార్యాలయంలో, ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ముఖరం జా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రో-వైస్ ఛాన్సలర్‌గా నియమించబడ్డాడు మరియు అనేక ఇతర గౌరవాలు పొందాడు.  

యువరాజు ముఖరం జా కి గొప్ప భవిష్యత్తు ఎదురుచూసింది. వైస్ ఛాన్సలర్‌షిప్ తర్వాత ఒక రాయబారి లేదా గవర్నర్‌షిప్ అవకాశాలు కన్పించసాగినవి.  యువరాజు ముఖరం జా తాత ఏడవ నిజాం హైదరాబాద్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఏడవ నిజాం 1956లో పదవీ విరమణ చేసే వరకు గవర్నర్‌గా కొనసాగాడు.

ఆరోగ్యం క్షీణిస్తున్న కొడుకును వదిలి మనవడిని ప్రత్యక్ష వారసుడిగా గుర్తించాలని ఏడవ నిజాం భావిస్తున్నట్లు తెలిసింది. భారత ప్రభుత్వం ఈ ఆలోచనను స్వాగతించినట్లు అనిపించింది. 1959 లో, ప్రిన్స్ ముఖరం జా తన తండ్రి వలె టర్కిష్ కుటుంబంతో వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 1967లో నిజాం మరణించినప్పుడు, యువరాజును అతని తాత వారసుడిగా ప్రకటించడానికి భారత ప్రభుత్వం వెంటనే కదిలింది మరియు అతని వంశపారంపర్య బిరుదులను అధికారికంగా గుర్తించి ధృవీకరించింది. ఇక నుంచి యువరాజు ముకర్రం జాను హిజ్ ఎక్సల్టెడ్ హైనెస్, మీర్ బరాకత్ అలీ ఖాన్, ముకర్రం జా, ఎనిమిదవ నిజాం అని పిలుస్తారు.

మీర్ బరాకత్ అలీ ఖాన్, ముకర్రం జా, ఎనిమిదవ నిజాం కు  బహుశా ఏదో ఒక రోజు భారతదేశంలో అత్యున్నత పదవి వచ్చే అవకాశాలు మెండుగా కనిపించాయి. అక్టోబర్ 1967లో, కొత్త నిజాం తన 34వ పుట్టినరోజును చౌమహల్లా ప్యాలెస్‌లో ఘనంగా  జరుపుకున్నాడు.

1967 జాతీయ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి స్వతంత్ర పార్టీలోకి మాజీ పాలకులు పెద్దఎత్తున వెళ్లారు. అదే ఏడాది జూన్‌లో కాంగ్రెస్ పార్టీ,  మాజీ పాలకుల ప్రైవీ పర్సస్‌ను రద్దు చేయాలని తీర్మానం చేసింది. 1970లో రాజ్యాంగం 24వ సవరణ బిల్లును   దిగువ సభ, లోక్‌సభ ఆమోదించింది, అయితే పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఓడిపోయింది. శ్రీమతి  ఇందిరా గాంధీ, 1971 ఎన్నికలలో అఖండ విజయం సాధించారు. ప్రీవీ పర్సులు రద్దు చేయబడ్డాయి మరియు మాజీ పాలకుల యొక్క అన్ని హక్కులు మరియు అధికారాలు రద్దు చేయబడినవి.

1973లో మీర్ బరాకత్ అలీ ఖాన్, ముకర్రం జా, ఎనిమిదవ నిజాం ఆస్ట్రేలియాకు వెళ్లాడు, అక్కడ యువరాణి ఎస్రాతో అతని వివాహం వీగిపోయింది. తరువాతి సంవత్సరాలలో ఎనిమిదవ నిజాం చాలాసార్లు వివాహం చేసుకున్నాడు, చివరలో  యువరాణి ఎస్రాతో సయోధ్య కుదిరింది. ఎనిమిదవ నిజాం ఇరవై మూడు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో నివసించాడు. 1996లో ఎనిమిదవ నిజాం ముకర్రం జా టర్కీకి వెళ్ళాడు, అక్కడ ముకర్రం జా నిశ్శబ్దంగా మరియు నిరాడంబరంగా జీవించాడు మరియు 2023 లో మరణిoచాడు.

 

ఇస్లాంలో కూడా జీసస్ క్రైస్ట్ ఒక గౌరవనీయమైన వ్యక్తి Jesus Christ a Revered Figure in Islam Too

 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని చర్చిలలో శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలతో, మతపరమైన ఉత్సాహంతో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలను లైట్లు, బెలూన్లు, రిబ్బన్లతో అలంకరింస్తారు.. ఇతర మతాలకు చెందిన ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలిపే శుభ దినం క్రిస్మస్. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ముస్లింలు తమ క్రైస్తవ స్నేహితులను శాంతి సందేశంతో పలకరించడానికి తరలివచ్చారు.

క్రైస్తవం సెమిటిక్ మతం. సెమిటిక్ మతం అయిన ఇస్లాంలో జీసస్ కూడా గౌరవనీయమైన వ్యక్తి. యేసు ప్రవక్తపై విశ్వాసాన్ని సూచించే ఏకైక క్రైస్తవేతర విశ్వాసం ఇస్లాం. ఏ ముస్లిము కూడా ఏసుక్రీస్తును విశ్వసించకపోతే ముస్లిం కాదు. యేసు, దేవుని శక్తివంతమైన దూతలలో ఒకడని ముస్లింలు నమ్ముతారు.

ఇలా చెప్పేయి ఆయన అల్లాహ్  అద్వితీయుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా లేనివాడు; అందరు ఆయనపై ఆధారపడే వారే. ఆయనకు  సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. దివ్య ఖురాన్ (112: 1- 4 )

దేవుడు 1,24,000 మంది ప్రవక్తలను పంపాడని ముస్లింలు విశ్వసిస్తున్నారు మరియు దేవుని చివరి దూత అయిన ముహమ్మద్ ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం వంటి వారిలో జీసస్ కూడా ఒకరు. జీసస్ ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా అద్భుతంగా జన్మించాడని ముస్లింలు నమ్ముతారు. దేవుడి అనుమతితో చనిపోయిన వారికి ప్రాణం పోశాడని కూడా నమ్ముతాం. అలాగే, పుట్టుకతో అంధులను, కుష్ఠురోగులను దేవుని అనుమతితో స్వస్థపరిచాడు. జీసస్ మునుపటి జుడాయిక్ చట్టాన్ని ధృవీకరించడానికి దేవునిచె పంపబడ్డాడు. దేవుడు యేసుక్రీస్తును ఎంతగానో ప్రేమిస్తున్నాడని క్రైస్తవులు నమ్ముతారు, యేసుక్రీస్తును విశ్వసించే వారు శాశ్వత జీవితాన్ని పొందుతారు. దివ్య ఖురాన్ ఏసుక్రీస్తును 25 సార్లు ప్రస్తావిస్తుంది, దివ్య ఖురాన్ లో పేర్కొన్న ఇతర ప్రవక్తల కంటే ఇది ఎక్కువ.

 యేసుక్రీస్తు తల్లి “మర్యమ్” పై ప్రత్యేక అధ్యాయం“మర్యమ్”(అధ్యాయం19)  దివ్య ఖురాన్ లో వెల్లడి చేయబడింది. అంతేకాకుండా, అలి ఇమ్రాన్ (3:43 మరియు 45) అధ్యాయం ఇలా చెబుతోంది: మర్యమ్! నీవు నీ  ప్రభువుకు విదేయురాలుగా ఉండు. ఆయన సానిద్యం లో సజ్దా చెయ్యి(సాష్టoగపడు)రుకూ చేసే దాసులతో నీవు రుకూ చెయ్యి(నమ్రతగా వంగు). దేవదూతలు ఇలా అన్నారు 'మర్యమ్! అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంభందించిన శుభవార్త నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసీహ్. అతను మర్యమ్ కుమారుడు. అతడు ఇహాపరలోకాలలో గౌరవనీయుడౌతాడు.

ఇస్లాం యేసును "దేవుని దూత"గా పరిగణిస్తుంది

భూమిపై సత్యం అవతరించిన రోజుల్లో క్రిస్మస్ ఒకటి. ఈ సత్యంతో, ప్రపంచం మంచి మరియు చెడు, న్యాయం మరియు అన్యాయం, దైవిక మరియు చెడు అనే ద్వంద్వాన్ని గ్రహించగలిగింది. క్రిస్మస్‌ను జరుపుకోవడం అనేది ఈ లోతైన సత్యంలో సంతోషించడం మరియు దానిని ఇతరులతో పంచుకోవడం. వాస్తవానికి, యేసుక్రీస్తు దేవుని పరిపూర్ణమైన, వర్ణించలేని బహుమతి.

యునైటెడ్ స్టేట్స్‌లో, క్రిస్మస్ సందర్భంగా "ముస్లింలు యేసును ప్రేమిస్తారు Muslims love Jesus " అని గుర్తుచేస్తూ అనేక బిల్‌బోర్డ్స్  పెట్టబడినవి మరియు  అనేక నగరాలలో (చికాగో, హ్యూస్టన్ మరియు డల్లాస్‌లలో) క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య ఉన్న సారూప్యతలను హైలైట్ చేయడానికి పోస్టర్లు ఉంచబడినవి.   

 

30 January 2023

మౌసిలి యొక్క సోల్మైజేషన్ మరియు స్పానిష్ టేబుల్‌క్లాత్ Mawsili’s Solmization and the Spanish Tablecloth

 

వందల సంవత్సరాలుగా, ఇటాలియన్ సంగీతకారుడు, గైడో డి'అరెజ్జో (995-1033) సంగీత సంజ్ఞామానం యొక్క ఆవిష్కర్తగా ఘనత పొందారు, దానిని మనము సోలమిజేషణ్ /solmizationగా గుర్తించాము. సంగీత చరిత్రలో, సంగీత వర్ణమాలలో అమర్చబడిన గైడో యొక్క సంజ్ఞామానం ‘మి, ఫా, సోల్, లా, టి, ఉట్, రే’ తో పరిచయం లేని సంగీతకారుడు లేదా సంగీత శాస్త్రవేత్త లేడు.

1026 నుండి, సంగీత నిపుణులు గైడో డి'అరెజ్జో అనే ఇటాలియన్ బెనెడిక్టైన్ సన్యాసిని  ప్రపంచంలోని సంగీత సిద్ధాంతాన్ని మెరుగుపరచడంలో చాలా విలువైన ఆవిష్కరణకు హక్కుదారుగా గుర్తించారు. గైడో డి'అరెజ్జో యొక్క ప్రాముఖ్యత బోథియస్ మరియు జోహన్నెస్ టింక్టోరిస్ అనే ఇద్దరు ప్రముఖ యూరోపియన్ సంగీతకారుల సరిజోడి గా ఉందని అభిప్రాయపడ్డారు.  గైడో యొక్క మైక్రోలోగస్ గ్రంధం మధ్యయుగ సంగీతంపై విస్తృతంగా ప్రబావం కల్పించినది.

1780లో, జీన్ బెంజమిన్ డి లా బోర్డే (1734–1798) అనే ఫ్రెంచ్ పండితుని నుండి ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ వెలువడింది. గైడో డి'అరెజ్జో యొక్క సంజ్ఞామానం పూర్వ కాలంలో ముస్లిం సంగీత శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణకు నకిలీ అని డి లా బోర్డే నొక్కిచెప్పారు. డి లా బోర్డే యొక్క వాదన పాశ్చాత్య ప్రపంచంలోని అనేకమంది సంగీత శాస్త్రవేత్తలచే అసమంజసమైనదిగా పరిగణించబడింది. ఎందుకంటే, ఐరోపాలో అరబ్-ఇస్లామిక్ సంగీతం ప్రభావం గురించి వారికి ఆధారాలు లభించవు.

పశ్చిమాన  అనేకమంది సంగీత విద్వాంసులు అరబ్-ఇస్లామిక్ సంగీత సంప్రదాయం యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పటికీ, అది ఒక వాయిద్యం మాత్రమే, సంగీత సిద్ధాంతం యొక్క జాడ లేదు. “ది అరబ్ కంట్రిబ్యూషన్ టు మ్యూజిక్ వెస్ట్రన్ వరల్డ్” అనే వ్యాసంను రచించిన  రబాహ్ సౌద్ తన వ్యాసం  లో, డి లా బోర్డే వాదనలను సమర్థించడానికి గుయిలౌమ్ ఆండ్రే విల్లోటో (1759–1839) అనే ఫ్రెంచ్ సంగీత శాస్త్రవేత్త రచిచిన “డిస్క్రిప్షన్ డెస్ ఇన్‌స్ట్రుమెంట్స్ డి మ్యూజిక్ డెస్ ఓరియంటాక్స్” అనే వ్యాసం ఉదాహరించాడు. ఈ వ్యాసం లో విల్లోటో,  గైడో యొక్క సంజ్ఞామానాన్ని అరబ్-ఇస్లామిక్ సంగీత సంప్రదాయంలోని  సోల్మైజేషన్‌తో పోల్చాడు.

గైడో యొక్క సంజ్ఞామానం ‘Mi, Fa, Sol, La, Ti, Ut, Re ని చదివితే, అరబ్-ఇస్లామిక్ సోల్మైజేషన్‌/solmization టోన్‌ ‘మి, ఫా, షాద్, , సిన్, దల్, రా’ లలో కంపోజ్ చేయబడుతుంది. వర్ణమాల యొక్క అంశం మరియు స్వరం రెండింటిలోనూ, ఇది చాలా పోలి ఉంటుంది మరియు ధ్వనిస్తుంది. " ఇది గైడో ఆఫ్ అరెజ్జోకి నమూనాగా పనిచేసింది," అని విల్లోటో చెప్పారు.

అయితే అరబ్-ఇస్లామిక్ వర్ణమాల ఆధారంగా గైడో డి'అరెజ్జో సంగీత సంజ్ఞామానాన్ని ఎక్కడ పొందారు? గైడో, కాటలూన్యాలో చదువుకున్నాడు అని రబా సౌద్ వివరించినాడు మరియు  అరబిక్ అక్షరం (Arabic syllable) 11వ శతాబ్దపు లాటిన్ గ్రంధం లో  కనుగొనబడిందని చెప్పాడు.

ఐరోపాలో ఇస్లామిక్ సాంస్కృతిక ప్రభావం వ్యాప్తి చెందడానికి ఇస్లామిక్ దేశాల్లో అధ్యయనం చేసిన క్రైస్తవ శాస్త్రవేత్తలు కృషి చేసారు. ఇస్లామిక్ దేశాలలో చదువుకొని తర్వాత  పాశ్చాత్య ప్రపంచంలో ప్రభావం చూపిన శాస్త్రవేత్తలలో ఒకరయిన  గెర్బర్ట్ ఆరిలాక్, తరువాత సిల్వెస్టర్ II బిరుదుతో పోప్ అయ్యాడు.

గెర్బర్ట్ ఆరిలాక్,  అల్ క్వారౌయిన్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్.  గెర్బర్ట్ ఆరిలాక్,  మొరాకోలోని ఫెస్‌లో ఫాతిమా అల్ ఫిహ్రీ అనే ముస్లిం మహిళ స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం అల్ క్వారౌయిన్ యూనివర్శిటీ లో చదువుకొన్నాడు. పోప్ సిల్వెస్టర్II ఐరోపాలో శాస్త్రీయ ఆలోచనను పునరుద్ధరించడంలో మరియు అరబ్-ఇస్లామిక్ సంగీత జ్ఞానాన్ని ఐరోపాలో సంగీత సిద్ధాంతంగా వ్యాప్తి చేయడంలో దోహదపడ్డారు. తన విద్యార్థులకు విద్యను అందించడంలో, గెర్బర్ట్ ఆరిలాక్ క్వాడ్రివియం (అల్ క్వారౌయిన్) బోధనా పద్ధతిని ఉపయోగించాడు.

రబాహ్ సౌద్ ప్రకారం, ప్రసిద్ద బాగ్దాద్ ఖలీఫా  అల్-మామున్ కాలంలో జీవించిన సంగీతకారుడు ఇషాక్ అల్-మౌసిలి (767–850), గైడో యొక్క సంజ్ఞామానం వెర్షన్‌లో కనిపించిన సోల్మైజేషన్ యొక్క అసలు సృష్టికర్త అయిన ముస్లిం పండితుడు. ఇషాక్ అల్-మౌసిలి జీవిత కాలం, గైడో డి అరెజ్జో జీవితకాలం కంటే ఒక శతాబ్దం ముందుది. ఇషాక్ అల్-మౌసిలీ యొక్క సంగీత ప్రతిభ,  ఇస్లామిక్ నాగరికత యొక్క స్వర్ణయుగంలో ప్రసిద్ద సంగీతకారుడు అయిన ఇషాక్ అల్-మౌసిలీ తండ్రి ఇబ్రహీం అల్-మౌసిలి (742-804)నుండి వచ్చింది.

ఇషాక్ అల్-మౌసిలి ఉత్తర పర్షియాలోని అల్-రైలో జన్మించాడు. ఆ సమయంలో, ఇషాక్ అల్-మౌసిలి తండ్రి ఇబ్రహీం అల్-మౌసిలి పర్షియన్ సంగీతం అబ్యసిస్తున్నాడు. ఇషాక్ అల్-మౌసిలి తండ్రి ఇబ్రహీం అల్-మౌసిలి పర్షియన్ సంగీత అధ్యయనం కోసం, తన కొడుకు ఇషాక్ అల్-మౌసిలి ని  బాగ్దాద్‌కు తీసుకువచ్చాడు. తరువాత, అబ్బాసిద్ సామ్రాజ్యం మధ్యలో ఇషాక్ ఇషాక్ అల్-మౌసిలి ప్రసిద్ధ సంగీతకారుడిగా ప్రసిద్ధి చెoదాడు. నిపుణులు ఇషాక్ అల్-మౌసిలి 'ఉద్' అని పిలవబడే లుట్/వీణ ఆకారపు సంగీత వాయిద్యం వాయించడం లో ప్రసిద్ది చెందాడని తరువాత ఆ సంగీత పరికరం ఐరోపాలో లుట్/వీణగా పిలవబడుతుందని చెప్పారు. ఖలీఫ్ హరున్ అర్-రసీద్ (766–809) కాలంలో, ఇషాక్ అల్-మౌసిలీ యొక్క సంగీత వాయిద్యాలు ప్యాలెస్ సేకరణలో భాగమయ్యాయి.

ఇషాక్ అల్-మౌసిలి కాలం లో అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ (789-857) అనే బహుముఖ ప్రతిభావంతుడైన కళాకారుడు ఇషాక్ అల్-మౌసిలీ యొక్క ఉత్తమ విద్యార్థిగా కూడా గుర్తింపు పొందాడు. అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ 'ఉద్' వాయించడంలో చాలా నేర్పరి.  అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీ సాధించిన విజయాలు ప్యాలెస్ సంగీత విద్వాంసుడిగా ఇషాక్ అల్-మౌసిలీ కీర్తిని తగ్గిస్తాయని ఇషాక్ అల్-మౌసిలీ ఆందోళన చెంది బాగ్దాద్‌ని వదిలి వెళ్ళు! ఈ రాజధాని నుండి వెళ్ళిపో!అని అబూ అల్-హసన్‌ని అడిగాడు. 

ఇషాక్ అల్-మౌసిలీ అభ్యర్థనమేరకు  అబూ అల్-హసన్ బాగ్దాద్ వదిలి అండలూసియా (స్పెయిన్)లో స్థిరపడ్డాడు. జిర్యాబ్ లేదా బ్లాక్ బర్డ్ (బ్లాక్‌బర్డ్) అనే మారుపేరుతో అబూ అల్-హసన్ ను పిలుస్తారు, ఎందుకంటే అబూ అల్-హసన్ చర్మం చాలా నల్లగా ఉంటుంది, కానీ స్వరం చాలా శ్రావ్యంగా మరియు మంత్రముగ్ధులను చేస్తుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, జిరియాబ్ నిజంగా బహుముఖ కళాకారుడు. కార్డోబా పాలకుడు జిర్యాబ్‌ను అండలూసియా భూభాగంలో సాంస్కృతిక మంత్రిగా నియమించాడు.

జిర్యాబ్ యొక్క మొదటి కృషి  సంగీత పాఠశాలను స్థాపించడం. బాగ్దాద్‌లోని సంగీత సంరక్షణాలయం వలె కాకుండా, కార్డోబాలోని సంగీత పాఠశాల సంగీత శైలులు మరియు వాయిద్యాలలో ప్రయోగాలను ప్రోత్సహించింది. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం జిర్యాబ్‌ను "స్పానిష్-ఇస్లామిక్ సంగీత సంప్రదాయం యొక్క స్థాపకుడు"గా పేర్కొన్నది.

జిర్యాబ్, నుబా (లేదా నౌబా) స్వరపరిచారు, ఇది ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని శాస్త్రీయ సంగీతo లో మిళితమైన  ఒక ప్రత్యేకమైన అండలూసియన్-అరబిక్ సంగీతం. లిబియా, ట్యునీషియా మరియు తూర్పు అల్జీరియాలో, నుబాను ‘మలుఫ్’ అని పిలుస్తారు. జిర్యాబ్ 24 రకాల నుబాలను సృష్టించాడు. నుబా రూపాలు స్పానిష్ క్రైస్తవ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాయి మరియు మధ్యయుగ ఐరోపాలో సంగీతం యొక్క పురోగతిలో చాలా ప్రభావం చూపాయి 

సంగీతాన్ని వినిపించడమే కాకుండా, జిర్యాబ్ కార్డోబా, టేబుల్ మర్యాదలు మరియు హెయిర్ స్టైల్స్‌ మరియు దుస్తుల ప్రమాణాలను కూడా పరిచయం చేశాడు. జిర్యాబ్ యొక్క ఆవిష్కరణకు ముందు, స్పెయిన్‌లో భోజనాల విషయం చాలా సరళమైనది మరియు పచ్చిది కూడా. చెక్క బల్ల మీద ప్లేట్లు అస్తవ్యస్తంగా పేర్చేవారు. టేబుల్ మర్యాదలు లేవు. ఆస్పరాగస్ వంటి కొత్త పండ్లు మరియు కూరగాయలను పరిచయం చేయడం ద్వారా జిరియాబ్ నూతన "డైనింగ్ టేబుల్ కల్చర్ "ని ప్రదర్శించాడు. జిరియాబ్ త్రీ కోర్స్ మీల్స్-అపిటైజర్, ప్రధాన వంటకం మరియు డెజర్ట్ పరిచయం చేసాడు. యూరోపియన్ డైనింగ్ సంస్కృతిలో మూడు-కోర్సుల మీల్స్ సంప్రదాయం నేటికీ మనుగడలో ఉంది. 

జిర్యాబ్ యూరోపియన్ సిల్వర్ గ్లాసెస్ స్థానంలో స్పష్టమైన క్రిస్టల్ గ్లాసెస్‌ ప్రవేశ పెట్టాడు. జిరియాబ్ మీల్స్ టేబుల్ పై టేబుల్‌క్లాత్‌లను ప్రవేశపెట్టారు, వాటిపై ఫ్లవర్ వాజ్‌లను ఉంచారు. జిర్యాబ్ టూత్‌పిక్‌ను కూడా పరిచయం చేస్తూ సూప్ బౌల్స్/గిన్నెలను/లాడిల్‌ను రూపొందించాడు.

ఫ్యాషన్ రంగంలో, జిరియాబ్ కార్డోబా ప్రజలకు  ప్రతి సీజన్‌కు మరియు సందర్భానికి తగిన దుస్తులను పరిచయం చేసాడు. వసంత ఋతువులో, ప్రజలను  ముదురు రంగుల దుస్తులను ధరించమని, వేసవిలో తెల్లని బట్టలు ధరించమని మరియు శీతాకాలంలో, ఉన్ని దుస్తులను ధరించమని ప్రోత్సహిoచాడు. జిరియాబ్ కార్డోబా సమాజానికి తమను తాము ఎలా చూసుకోవాలో కూడా నేర్పించాడు. 

ఇషాక్ అల్-మౌసిలీ ద్వారా సంక్రమించిన ప్రపంచంలోని మొట్టమొదటి సంగీత సంజ్ఞామానం మరియు జిర్యాబ్ ప్రవేసపెట్టిన ఫ్యాషన్, టేబుల్ మర్యాదలు యూరప్ ప్రజలను నాగరిక ప్రజలుగా మార్చాయి, డిన్నర్ టేబుల్ వద్ద ఆహారాన్ని భుజించడం,  సంగీత కళ అనేవి ఇస్లామిక్ స్వర్ణ యుగ నాగరికత యొక్క చిహ్నాలు.

ఇషాక్ అల్-మౌసిలీ మరియు అబూ అల్-హసన్ అలీ ఇబ్న్ నఫీల చేతుల్లో సంగీతం హరమ్ కాకుండా వాస్తవానికి మొరటుత్వాన్ని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉండి, ఈ రోజు మనం ఆరాధించే పాశ్చాత్య నాగరికత యొక్క వైభవాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గొప్ప సూఫీ తత్వవేత్త జలాలుద్దీన్ రూమీ ప్రకారం హరామ్ సంగీతం అంటే ధనిక కుటుంబం డైనింగ్ టేబుల్ వద్ద చెంచాలు మరియు ఫోర్కులు చేసే  శబ్దం, ఇది వారి పేద పొరుగువారికి భయానకంగా వినబడుతుంది.