27 February 2019

తగ్గుతున్న హిందూ-ముస్లిం సంతానోత్పత్తి గ్యాప్ ఏమి చెబుతున్నది?) (What a narrowing Hindu-Muslim fertility gap tells us)



-

'మొత్తం సంతానోత్పత్తి రేటు', అనేది ఒక మహిళ తన జీవితకాలంలో జన్మ నిచ్చే పిల్లల సగటు సంఖ్య అని చెప్పవచ్చు. సుమారు 40 సంవత్సరాల తరువాత, రెండు వర్గాల(హిందూ-ముస్లిం) మధ్య సంతానోత్పత్తి (fertility gap) గ్యాప్ తగ్గించడం ప్రారంభించింది. వారి జనాభా శాతం (population shares) తీవ్రంగా మారక పోవటానికి అది  ఒక  కారణం

భారతదేశంలో ఒక ముస్లిం గృహం సగటున హిందూ కుటుంబాల కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తుంది అనే భావన అనేక రకాలైన కల్పిత వాదనలకు   మూలమైనది. ముస్లింలలో అధిక సంతానోత్పత్తి వలన  భారతదేశ జనాభాలో వారి శాతంను గణనీయంగా పెరుగుతుందని  మరియు దేశ జనాభా లో హిందువుల శాతం తగ్గుతుందనే కల్పిత భయాలు ప్రచారంలో ఉన్నాయి.
2015-16 లో నిర్వహించిన తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం దీనికి ఆధారాలు లేవు. అనేక దశాబ్దాల తరువాత  మొట్ట మొదటిసారి హిందువులు మరియు ముస్లింల మధ్య సంతానోత్పత్తి గ్యాప్ తగ్గుతుందని (narrowed) అని సర్వే తెలుపుతోంది.


'మొత్తం సంతానోత్పత్తి రేటు', అనేది ఒక మహిళ తన జీవితకాలంలో జన్మ నిచ్చే పిల్లల సగటు సంఖ్య. 2005-06 NFHS ప్రకారం, 'మొత్తం సంతానోత్పత్తి రేటు'ముస్లిం మహిళా  3.4 పిల్లలకు మరియు హిందు మహిళా  2.6 పిల్లలకు జన్మ నిచ్చును   లేదా 30.8 శాతం సంతానోత్పత్తి గ్యాప్ (fertility gap) ఇద్దిరి మద్య ఉన్నది.  తాజాగా 2015-16 లో NFHS డేటా ప్రకారం ఈ గ్యాప్ 23.8% కు తగ్గించబడింది మరియు రెండు వర్గాల మహిళలు  ముందు కంటే తక్కువ పిల్లలను కలిగి ఉన్నారు.
రెండు వర్గాల మధ్య సంతానోత్పత్తి గ్యాప్ తగ్గడం దాదాపు 40 సంవత్సరాల తర్వాత జరుగుతుంది.
స్వాతంత్ర సమయములో, ముస్లిం సంతానోత్పత్తి హిందూ సంతానోత్పత్తి రేట్   కన్నా 10% ఎక్కువ ఉంది. ఈ గ్యాప్ 1970 లలో పెరుగుతూ వచ్చింది, దీనికి ప్రధానంగా హిందువులు  గర్భనిరోధకత ఎక్కువగా పాటించడం కారణం అని చెప్పవచ్చు.   ఇది 1990  వరకు కొనసాగింది మరియు గ్యాప్  30% దాటింది.




జనాభా గణన 1991 డేటా దిన్ని చూపిస్తుంది. (చార్టు 2 ఎ) 40 ఏళ్ల దాటిన వివిధ వయస్సుల బ్యాండ్ల వారికి అనగా ( పునరుత్పత్తి చక్రం పూర్తి చేసిన వారు)ముస్లిం మహిళలకు మరియు హిందూ మహిళలకు పిల్లల జననాలు చూపిస్తుంది. నిష్పత్తి 1 పారిటీని సూచిస్తుంది, మరియు నిష్పతి 1 కంటే ఎక్కువ ముస్లిం జననాలు సూచిస్తుంది. ఉదాహరణకి, 1.25 శాతం ముస్లింల సంతానోత్పత్తి రేటు హిందువుల కంటే 25 శాతం ఎక్కువ)


65 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళల నుండి 40-44 ఏళ్లలోపు వయస్సున్న మహిళలలో   పరిశిలించినప్పుడు నిష్పతి 1.11 నుండి 1.25 వరకు పెరుగుతున్నది. ఈ వయస్సు లోని రెండు వర్గాల యువ మహిళలలో, ముస్లిం మహిళలలో ఎక్కువ పుట్టుకలను సూచిస్తున్నాయి. 1970 లలో ఇది హిందువులు మరియు ముస్లింల మధ్య గర్భనిరోధక వాడకంలో వ్యత్యాసం కారణంగా జరిగింది. 1991 లలో 65 ఏళ్ల+ వయస్సు ఉన్న రెండు వర్గాలకు చెందిన మహిళలకలో  భేదం తక్కువగా ఉంది అనగా వారు వారి పునరుత్పాదక చక్రాన్ని1970 పూర్తి చేసినారు.


ఈ వైవిధ్యం కు కారణం జనాభా పరిణామ క్రమంలో, సంతానోత్పత్తి లెవెల్స్   తగ్గడం  1970 లో భారతదేశంలో ప్రారంభమైంది. అర్బన్ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల కన్నా   సంతానోత్పత్తి పరివర్తనకు (fertility transition) దారితీశాయి. ఫలితంగా, పట్టణ ప్రాంతాల్లో హిందూ-ముస్లిం సంతానోత్పత్తి విభిన్నత (fertility differential) 1991 లో బాగా పెరిగింది.
 



2011 సెన్సస్  మరియు ఎన్.హెచ్.హెచ్ఎస్ రెండు సంతానోత్పత్తిని 30% వద్ద స్థిరీకరించాయి. 2011 లో 55-59 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీల(1991 నాటికి వారి పునరుత్పాదక చక్రం పూర్తి చేసిన మహిళలు) నుండి 45-49 సంవత్సరాల మహిళలను (2001 నాటికి వారి పునరుత్పాదక చక్రం పూర్తి చేసిన వారు ) పరిశిలించినప్పుడు సంతానోత్పత్తి గ్యాప్ 1.31-1.34 లేదా 31-34% వరకు ఉంది.

సంతానోత్పత్తిని ప్రభావితం చేసే పేదరికం వంటి ఇతర అంశాలు పూర్తిగా ముస్లింల సంతానోత్పత్తి గురించి వివరిoచలేవు. 1993-94 NSSO నివేదిక లోని డేటా ఆధారంగా, సగటు కుటుంబ పరిమాణం ముస్లింలలో  అధికం.

 

ఈ గ్యాప్ ఉంది, కానీ ఇప్పుడు అది తగ్గుతుంది. జనాభా పరివర్తనలో, హిందువులు(మెజార్టీ) మరియు ముస్లింలు(మైనార్టీ) మధ్య ఈ అంతరం ప్రారంభంలో పెరుగుతుంది- హిందువులు(మెజార్టీ) స్థిరమైన విలువకు చేరుకునే వరకు జరుగుతుంది. దీనిని  సాధారణంగా 'భర్తీ సంతానోత్పత్తి స్థాయి replacement fertility level’' అంటారు. భారతదేశంలో, ఇది మహిళకు 2.1 మంది పిల్లలుగా పరిగణించబడుతుంది

ముస్లింల సంతానోత్పత్తి తగ్గిపోతున్నప్పటికీ, హిందూ సంతానోత్పత్తి స్థాయి స్థిరీకరించే వరకు సంతానోత్పత్తి గ్యాప్ తగ్గదు. NFHS-4 సమాచారం ప్రకారం హిందువులు ఇప్పుడు భర్తీ సంతానోత్పత్తి సాధించారు మరియు హిందూ-ముస్లిం సంతానోత్పత్తి విరామం 7 శాత౦ పాయింట్లు తగ్గింది, జనాభా గణన 2021 జనాభాలో సంతానోత్పత్తి గ్యాప్ మరింత తగ్గుతుంది.

దివంగత జనాభా శాస్త్రవేత్త P.N. మారి భట్ ప్రకారం 2021 నాటికి హిందువులు భర్తీ సంతనోత్పతి చేరగలరు మరియు 2061 నాటికి స్థిరమైన జనాభాను సాధించవచ్చని అంచనా వేశారు. ముస్లింలు 2031 నాటికి భర్తీ సంతానోత్పత్తి సాధించడానికి మరియు 2101 నాటికి జనాభా స్థిరీకరణను పొందుతారు మరియు భారతదేశ జనాభాలో 18.8% ఉంటారు.  భట్ 2011 అంచనాలు 2011 సెన్సస్ గణాంకాలకు  చాలా దగ్గరగా ఉన్నాయి.