31 May 2016

నేరేడు పండు వలన లాభాలు.


వేసవి కాలం లో భారతీయ ఉపఖండం లో విస్తారం గా దొరికే పండ్ల లో జామున్ లేదా నేరెడు పoడు ఒకటి.  భారత దేశం లో నేరేడు పండు  ముదురు ఊదా రంగు లో మే నుంచి ఆగష్టు వరకు విస్తారంగా దొరుకు తుంది.  ఒక గిన్నె నేరేడు పండ్ల పై ఉప్పు చిలకరించి ఒక రుచికరమైన వేసవి అల్పాహారం గా  తింటారు. నేరేడు లో అనేక పోషక విలువలు ఉన్నాయి. నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు క్రింది విధంగా వివరించ వచ్చు.
1. మధుమేహం కు మంచిది
జామున్ లేదా నేరేడు  శరీరంలోని  రక్తo లో  చక్కెర స్థాయిని  నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది తక్కువ శక్తి మరియు తరచుగా దాహం మరియు మూత్రవిసర్జన వంటి మధుమేహ లక్షణాలను  నివారిoచును. సుక్రోజ్ లేక పోవడం మరియు జంబోలిన్(jambolin) కలిగి శరీరం లోపల పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడంను  అడ్డుకుంటుంది నేరేడు తేనెను  మధుమేహం కోసం ఒక తీపి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
2. శరీరం ను చల్లబరుచును.
నేరేడు పండు లో నీటి శాతo దాని మొత్తం బరువులో 84%కంటే ఎక్కువఉంది. ఫాస్పరస్ మరియు అయోడిన్ వంటి ఖనిజాలు కలిసి , అది చమట, వేడి పరిష్కారంలో సహాయ పడును.1 కప్ నీరుమరియు 1 కప్ ఐస్ తో 2 కప్పుల నేరేడు కాయల (విత్తనాలు లేకుండా) మిశ్రమంను  ఉప్పు, మిరియాలు, తేనె మరియు పుదీనా తో కలిపి తీసుకొన్న అది వేసవి లో ఒక చల్లని పానీయం అగును.
3. వ్యాధినిరోధక శక్తి పెంచును
విటమిన్లు B1, B2, B3 మరియు B6 పాటు, నలుపు నేరేడు పండులో  విటమిన్ సి, అంటి-ఆక్సిడెంట్ లను కలిగి అది శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెంచును. అంటి-బ్యాక్తిరియాల్ లక్షణాలు కలిగి బహిర్గత మరియు అంతర్గత ఇన్ఫెక్షన్నినివారించును.  నీరు కలిపిన నేరేడు  పొడి(powder) చర్మం మరియు చిగుళ్ళ వ్యాధుల కోసం ఒక సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు.
4. ఎముకలను పటిష్టపరుచును.
నేరేడు  లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాల ఉనికిని ఎముకలు మరియు దంతములు బలపడటానికి తోడ్పడును.ఒక గాజు గ్లాస్ పాలలో ఒక టీ-స్పూన్  నేరేడు పొడి కలిపి తీసుకొన్న అది మీ ఎముకలు బలోపేతం అవడానికి తోడ్పడును.
5. క్యాన్సర్ ను అరికడుతుంది
నేరేడు లో ఉండే పోల్యఫేనోల్స్ లో (polyphenols) క్యాన్సర్   వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని  అధ్యయనాలు నిరూపించాయి. నేరేడు కాయలను రోజు తీసుకొన్న ఇది మానవులలో కాన్సర్ వ్యాధి రాకుండా నిరోధించును.
.6. రక్తం శుద్ధి
నేరేడు లో ఉండే ఇనుము మరియు విటమిన్ సి రక్తమును  శుభ్రపర్చడానికి సహాయపడుతుంది మరియు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది.
7. మొటిమలు తొలగించును:
నేరేడు కొన్ని రకాల అస్త్రిజెంట్స్  ని కలిగి అవి బ్లాక్-హెడ్స్ ను మొటిమలను  మరియు అచ్నే(ACNE)లను నివారించును మరియు రక్తమును శుద్ది పరిచి చర్మమును  కాంతివంతంగా ఉంచును.
8. హృదయంను బలపరుస్తుంది.
నేరేడు లో  పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి అత్యవసర ఖనిజాలు ఉంటాయి అవి  అదిక రక్త పోటు వంటి  కార్డియో వాస్కులర్ పరిస్థితులను  నిరోధించడానికి ఉపయోగపడతాయి.
9 . జీర్ణ క్రియ లో సహాయ పడును.
నేరుడు లో  జీర్ణక్రియను  ప్రోత్సహించే పీచు పదార్థం ఉందును. ఇది కాలేయo మరియు ప్లీహము తద్వారా డైజెస్టివ్ ట్రాక్ట్ ను సరిగా  ఉంచడం లో ప్రేరేపిస్తుంది
గుర్తుంచుకోవలసిన విషయాలు
Ø నేరేడుపండు  తినడం లో మితం పాటించండి. రెండు రోజులకు ఒక సారి ఈ రుచికరమైన పండ్లు 100 గ్రాములు తీసుకోండి.
Ø తినడానికి ముందు ఉప్పు నీటితో కడగడం మర్చిపోవద్దు.
Ø ఖాళీ కడుపుతో నేరేడు పండు ను తినవద్దు.
Ø నేరేడు పండు తిన్న తరువాత 2 గంటల ముందు లేదా వెనుక పాలు త్రాగవద్దు.
Ø గర్భవతి మరియు పాలుఇచ్చే తల్లులు నేరేడుపండ్లు  తిన రాదు.
Ø మధుమేహం ఉన్నవారు తక్కువ  పరిమాణం లో నేరేడు పండ్లు  తినవలయును.
నేరేడు పండుగా గాక  అదనంగా నేరేడు తేనె, నేరేడు వెనిగర్ మరియు నేరేడు  ఆకుల సారం కూడా పండు వలె సమాన లాభాలను కలిగి ఉందని చెప్పవచ్చు.
కాబట్టి ఈ వేసవిలో నేరేడుపండు  రుచులను ఆస్వాదించండి మరియు ఈ రుచికరమైన పండు అందించే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఫలితాలు  పొంది ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీ గా జీవించండి.


29 May 2016

'భారతదేశం మేడ్ ఇన్' సాదించడం లో లక్షలాది మదర్సా పట్టభద్రుల సహాయం



భారతదేశం వేలకొలది మదరసాలకు నిలయం. అక్కడ   అరబిక్ మరియు ఇస్లామిక్ స్టడీస్ తో  పాటు  ఆధునిక సబ్జక్ట్స్ ఇంగ్లీష్, గణితం మరియు కంప్యూటర్ అధ్యయనo నేర్పబడును.

ఆంగ్ల భాష తో పాటు  అరబిక్ బాష   ఒక్కటే భారతదేశం లో గ్రామస్థాయి  వరకు అధ్యయనం  కోసం పూర్తి మౌలిక సదుపాయాలు కలిగిన  విదేశీ భాషగా ఉంది. మతపరమైన విద్యను అందించటం తో పాటు భారతదేశంలోని  వందల వేల కొద్ది మదరసాలలో ఫిజిక్స్, గణితం, రసాయన శాస్త్రం, హిందీ, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అధ్యయనo మొదలైన ఆధునిక విషయాలను బోధించేదరు. ఈ మదరసా  విద్యార్థులు దాదాపు 400 మిలియన్ ప్రజలు మరియు $ 6.0 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న అరబిక్ మాట్లాడే ప్రపంచానికి  చేరడం లో భారత కంపెనీల కు సహాయకారి కాగలరు.

జనవరి 2008 లో నేను ఒక వ్యాపార పర్యటనపై ఆల్జియర్స్, అల్జీరియా కు వెళ్ళాను. పూనే(ఇండియా) కు చెందిన టైర్ వ్యాపారి మరియు 40 సంవత్సరాల IT నిపుణుడు అయిన మరొక భారతీయుడు కూడా అదే హోటల్ లో బస చేసినాడు. మరుసటి రోజు హోటల్ వసారాలో కూర్చొని నేను, అతను  ప్రక్కన ఉన్న ఖాతాదారుల తో సంభాషించడం చూసాను. ఆ  సంభాషణ మొత్తం ఘోరం గా విఫలమైనది. భారతీయ వ్యాపారికి ఫ్రెంచ్ లేదా అరబిక్ రాదు లేదా అతని ఖాతాదారులకు ఆంగ్లము రాదు.

సాయంత్రం మాటల్లో అతను పరిమితంగా ఆంగ్లము మాట్లాడే  అరబిక్- వ్యాపార ప్రపంచం, (బహుశా గల్ఫ్ దేశాల్లో తప్ప) గురించి ప్రస్తావించాడు. మోటారు విడిభాగాలు, బట్టలు, టైర్లు, పారిశ్రామిక మరియు నిర్మాణ వస్తువులు మొదలగు రంగాలో  డీలర్స్ స్థాయిలో  అరబిక్ మాట్లాడటం తప్పనిసరి అని  (గల్ఫ్ దేశాల్లో కూడా) అన్నాడు.

చివరికి నేను అడిగాడు, "ఎందుకు మీరు అరబ్ ప్రపంచం లో వ్యాపారం  లో  సహాయపడటానికి ధారాళం గా అరబిక్ మరియు ఆంగ్లం మాట్లాడే ఒక భారతీయని    సహాయం  తీసుకోకూడదు అని? అతను ఒక క్షణం ఆగి “అరబిక్ మాట్లాడేవారు భారత దేశం లో దొరుకుతారా?” అని అన్నాడు.

నేను “అవును” అన్నాను". అతను "ఎక్కడ?" అని అడిగాడు.

నేను అతనిని పూనే లోని  అతిపెద్ద మసీదుకు  వెళ్లి ఇమామ్ను  కలవమని  సూచించాను. "ఇమామ్ ఖచ్చితంగా మీకు  అరబిక్ లో ధారాళంగా మరియు  ఆంగ్లం లో సహేతుకమైన స్థాయి వరకు మాట్లాడే నిపుణులను సూచించ గలరు అని అన్నాను. అతను అర్ధమైనట్లుగా నవ్వాడు. నేను మరుసటి రోజు ఉదయం విమానంలో రియాద్ చేరుకొన్నాను.

క్రిందటి  శనివారం, అదే వ్యక్తి రియాద్ లోని ఒక హోటల్ నుండి డిన్నర్ కు నన్ను ప్రేమగా ఆహ్వానించినాడు.

డిన్నర్ టేబుల్ వద్ద  అతను నన్ను 30 సంవత్సరాల ఒక గడ్డముగల మనిషి ని అరబ్ ప్రపంచo లో తన సేల్స్ మేనేజర్ గా  పరిచయం చేసాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం  అల్జీర్స్ లో జరిగిన మా సంభాషణ నుండి ఒక క్లూ తీసుకోని పూనే లోని ఒక మదరసా నుండి ఒక అరబిక్ మరియు ఇంగ్లిష్ మాట్లాడే టీచర్ ను తనకు సహాయకునిగా నియమించుకొన్నాడు. అతనికి  అమ్మకాలు మరియు మార్కెటింగ్ లో   శిక్షణ ఇచ్చాడు  మరియు ఇప్పుడు అదే వ్యక్తి మాతో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నవ్యక్తి.

అతను ఒక మంచి  ప్రొఫెషనల్ సేల్స్ మ్యాన్ గా కనిపించాడు. అతను టైర్ సంస్థకు  మంచి  ఆదాయాన్ని ఇచ్చే ప్రధాన ప్రాంతంగా అరబ్ ప్రపంచంను రూపొందించాడు.

నా స్నేహితుడు లో మిడిల్ ఈస్ట్ లో  పెరుగుతున్న తన వ్యాపార కోసం మదరసాను నుండి మరి ముగ్గురు  అరబిక్ మరియు ఆంగ్లం మాట్లాడే సేల్స్-మెన్స్ ను నియమించాడు మరియు వారు బాగా పనిచేస్తున్నారని అన్నాడు. ఇప్పుడు అతను ఇరాన్ మరియు తజికిస్థాన్ లో వ్యాపారం కోసం  ఒక పెర్షియన్ మరియు ఆంగ్లo మాట్లాడే వ్యక్తి కోసం చూస్తున్నాడు.

మదరసాలో  చదువుకున్న అమ్మకాల(sales) మేనేజర్ కూడా సంతోషంగా తన అదృష్టం  ఎలా మారిపోయిందో తన అభిప్రాయం మాతో   పంచుకున్నాడు. అతను ఒక మిడిల్ క్లాస్ పరిధిని దాటి  కొత్త కారు, ఒక మంచి అపార్ట్మెంట్ కొని  పూనే లో  ఒక మధ్య తరగతి ప్రాంతం మరియు సమాజంలో ఒక మంచి స్థితి లో ఉన్నాడు. ఈ జీవితం అతను ఎనిమిది సంవత్సరాల క్రిందట ఊహించలేదు!.

అన్నింటికన్నా ముఖ్యం ఆ తయారీదారుడు తన దృక్పదం ను ముస్లిమ్స్ ప్రత్యేకించి మదరసా విద్యార్థుల పట్ల మార్చుకొన్నాడు. ఇది చాలా సంతోషించదగిన విషయం.

గతంలో, అతను ముస్లిమ్స్ పట్ల అపనమ్మకం మరియు పగ తో ఉండేవాడు  కానీ ఇప్పుడు అపారమైన ప్రశంసలు మరియు భాగస్వామ్యం యొక్క భావనను  ముస్లింల పట్ల పెంచుకొన్నాడు. వ్యాపార సాన్నిహిత్యం స్పష్టంగా అతని  సందేహాలు తొలగింఛి  మరియు పరస్పర గౌరవం మరియు అన్యోన్యత పరిస్థితిని  అభివృద్ధి చేసింది. అతను ఇప్పుడు నలుగురు ముస్లిం ఉద్యోగుల యజమాని  ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక్క ముస్లిం ఉద్యోగి అతని వద్ద లేదు.

కొద్ది మంది కి మాత్రమే తెలుసు  ఇంగ్లీష్ తో  పాటు అద్యయనం కోసం భారతదేశం లో గ్రామస్థాయి వరకు పూర్తి మౌలిక సదుపాయాలు కలిగిన  విదేశీ భాష అరబిక్ మాత్రమే అని. భారతదేశంలో  ఉన్న వందల వేల మదరసాలలో మతపరమైన విద్యతో బాటు  ఫిజిక్స్, గణితం, రసాయన శాస్త్రం, హిందీ, ఇంగ్లీష్ వంటి ఆధునిక విషయాలను మరియు కంప్యూటర్ అధ్యయనo మొదలైనవి అక్కడ బోధన చేస్తారు.

దురదృష్టవశాత్తు, మదరసాలలో కొన్నింటికి అధికారిక గుర్తింపు మరియు ప్రభుత్వ సాయం అందుట లేదు. మదరసాలో లో విద్య పొందే  విద్యార్థులు మిలియన్ల కొద్ది  ఉన్నారు. మదరసాలో విద్యావంతులైన విద్యార్ధులు వారి విజ్ఞానం మరియు నైపుణ్యాలను  ఉపయోగించుకోవడానికి  అవకాశాలు పరిమితంగా ఉన్నాయి మరియు సాధారణంగా వీరు  స్వయం ఉపాధి, అల్పాదాయ చిన్న వ్యాపార సంస్థలలో మరియు సొంత వ్యాపారo లో ఉన్నారు.

మదరసాలకు ప్రభుత్వ  గుర్తింపు మరియు  ప్రభుత్వం నుండి అవసరమైన సాయం మరియు మద్దతు ఇచ్చిన, వారు నాణ్యమైన అరబిక్ మరియు  ఇంగ్లీష్ మాట్లాడే గ్రాడ్యుయేట్లు ఉత్పత్తి చేయగలరు మరియు ' మేడ్ ఇన్ ఇండియా ' ఉత్పత్తులను  ప్రపంచం నలుమూలల తీసుకు వెళ్ళగలరు.

22 అరబ్ దేశాల వారు తమ   పారిశ్రామిక మరియు ఆహార పదార్ధాలను ఇతర దేశాల నుండి   దిగుమతి చేసు కొంటున్నారు. మదర్సాలో విద్యార్థులకు సరిఅయిన  శిక్షణ మరియు అవకాశం ఇస్తే వారు 380 మిలియన్ వినియోగదారులు మరియు $ 6.0 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న విస్తారమైన అరబ్ ప్రాంతంలో ఉపయోగపడవచ్చు. అరబిక్ లో డబ్బింగ్ భారతీయ చలనచిత్రాలు భారీ వ్యాపారo చేయగలవు.  సాఫ్ట్-వేర్, గేమ్స్, మరియు కామిక్స్ యొక్క అరబైజేషణ్ కు (Arabization) భారీ సామర్ధ్యం ఉంది. ప్రస్తుతానికి, ఈజిప్ట్ ఈ వ్యాపారంలో దాదాపు ఒంటరిగా ఉంది. భారత్ అడుగుపెట్టిన మంచి పలితాలను సాదిoచ గలదు.

మన ప్రియతమ ప్రధాని శ్రిమోడి గారు  అన్నాట్లు “మదరసా విద్యార్ధులు ఒక చేతిలో దివ్య ఖురాన్ మరియక చేతిలో లాప్-టాప్ పట్టుకోవాలి”. అప్పుడే అయన కోరిక డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సాకారం కాగలదు మరియు విదేశి మారక ద్రవ్యం మన దేశానికి ఇబ్బడి-ముబ్బడిగా రాగలదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ చెందగలదు.


దురదృష్టవశాత్తు, ప్రస్తుతం, భారత తయారీదారులు పక్కన పొరుగున  ఉన్న $ 6.0 ట్రిలియన్ల అరబ్   ఆర్ధిక వ్యవస్థ ను పక్కన బెట్టి, $ 15.0 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ గల యునైటెడ్ స్టేట్స్   లక్ష్యంగా దృష్టి సారించారు.













రంజాన్ కోసం సిద్ధమవ్వండి!



“ యా అల్లాహ్! మమ్ములను రజబ్ మరియు షాబాన్ లో ఆశ్విరదించు మరియు రమదాన్ లో మంచి ఆరోగ్యం ఇవ్వు”. అమీన్.
నేను రంజాన్ కోసం ఒక వ్యాసం రాస్తున్నప్పుడు ఒక స్నేహితురాలు అడిగింది  "మీరు ఏమి రాయాలనుకుంటున్నారు?  మనకు రంజాన్ గురించి అంతా తెలుసు ఇంకా ప్రత్యేకంగా రాయ వలసింది ఏమి ఉంది?   పైగా దానిని గురించి ప్రతిదీ మళ్ళీ మళ్ళి వింటున్నాము కదా!
రంజాన్ కు సంభందించిన ఆయతులు మరియు హదిస్సు లు మనకు తెలుసు, అవి మన విశ్వాసం ఉన్నతవరకు అలాగే ఉంటాయి. కాని మనం వాటిని అనేక సార్లు విన్నాము అన్న భావన వాస్తవం గా మనలను అది మరింత జవాబుదారీగా చేస్తుంది. మనం మార్గదర్శకత్వం కోసం  జ్ఞానం ను మరింతగా పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అలహందుల్లా! మనకు చిన్నతనం నుండి రంజాన్ యొక్క సిద్ధాంతాలను బోధించుతారు. దువా ను  ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకు తీసుకు వేళ్ళదాము. మనం ఈ దీవించిన నెల(రంజాన్) ఎంపిక గ్రహీతలు గా ఉన్నాము. అల్లాహ్ (SWT) ప్రార్థనా ఇతర చర్యలు కాకుండా, ఉపవాసం నాకు(విశ్వాసికి) మాత్రమే అని చెప్పాడు. అది ఎంత   గౌరవం! మనం  అల్లాహ్ (SWT) చే వ్యక్తిగతంగా బహుమతి పొందటం కోసం ఏదైనా చేయాల్సిన అవకాశం ఉంది. మనము ఒక ఇష్టమైన అతిధి కోసం  బాగా సన్నాహాలు చేస్తాము అలాగే రంజాన్ వంటి విలువైన పవిత్ర మాసం కోసం  ముందుగానే సిద్ధం అవుదాము.

ఆర్గనైజింగ్
పుస్తకాలు / టేపులను / దువా కరపత్రాలు ఒకే చోట సేకరించండి, రంజాన్ సమయంలో విలువైన సమయం ను వృధా చేయవద్దు.  కొన్ని పుస్తకాలు ఇచ్చి/లేక తీసుకోని ఉంటె వాటిని రంజాన్ ముందు సంబంధిత యజమానులకు చేర్చండి
 ' రంజాన్' ను స్వాగతిస్తూ చర్చకార్యక్రమం కు   హాజరుకండి  లేదా నిర్వహించండి  మరియు స్నేహితులు, బంధువులను ఆహ్వానించoడి.
మీరు తరాబి  ప్రార్ధనల కోసం వెళ్ళడం కొరకు ప్రణాళిక వేయండి. మహిళలకొరకు స్వాగత  వేదికలు తెలుసుకోండి. ముందే పిల్లల రక్షణ మరియు రవాణా ఏర్పాట్లు చేయండి.
కొనుగోలు:

ఉపావాసం విరమణ కొరకు మరియు దువా కొరకు ఖర్జూరాలు  చిన్న ప్యాకెట్లగా  ప్యాక్  చేయండి. రంజాన్ రెండు వారాల ముందు మసీదు, లేదా మీ కుటుంబం లోని  వ్యక్తులకు  మరియు స్నేహితులకు బహుమతి గా ఈ ప్యాకెట్లు ఇవ్వండి.
మీ చేయవలసిన పనులు పూర్తి చేయండి లేదా ఈద్ తర్వాత ముఖ్యం కాని విషయాలు  వాయిదా వెయ్యండి.
రంజాన్ ప్రారంభానికి గుర్తుగా పిల్లలకు చిన్న బహుమతులు కొనుగోలు చేయండి. వారికి కొన్ని బూరలు, క్యాండి ఇవ్వండి వారు  ఈద్ వరకు రోజులు లెక్కబెట్టుకొంటారు.
ఈద్ కోసం ముందే బట్టల షాపింగ్ పూర్తి చేయండి.
కుటుంబం, స్నేహితులు మరియు పనివారు మరియు పిల్లల  కోసం ఈద్ బహుమతులు కొనుగోలుచేయండి. ఈద్ పార్టీ ప్రణాళిక ఉంటే, రంజాన్ ముందు సన్నాహాలు ప్రారంబించండి.
పనివారి కోసం  బహుమతులు ఇవ్వడం  లో మీ పిల్లల సహాయం తీసుకోండి.
.ప్రతిబింబిస్తూ
రంజాన్ ముందు తప్పిన ఉపవాసాలను పూర్తి చేయండి.
ప్రార్ధన నియమాలు పిల్లలకు నేర్పండి.
  మీ మునుపటి రంజాన్ రోజులను సమిక్షించుకొని  మరియు ఈ సంవత్సరం లక్ష్యాలను నిర్ణయిoచుకోండి. ప్రతి రోజు మునుపటి కంటే బాగా ఉండాలి అదేవిధంగా, రెండు రంజాన్ రోజులు ఒకే విధంగా ఉండకూడదు. మీరు చేసిన మంచి గురించి  ఆలోచించండి మరియు మునుపటి తప్పులు చేయకండి.  రంజాన్ నెలలోని చివరి పది రాత్రులు ప్రత్యేక, నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొండి.
సమయం విలువ గుర్తించండి. రమదాన్ నెలలో అనవసర  విషయాలు నుండి దూరంగా ఉండాలని అనుకోండి.
గృహ విధులు
సమోసాలు, రోల్స్, కేబాబ్స్, చట్నీలు ముందుగానే చేయండి.
మద్యస్థంగా ఉండండి. ఇఫ్తార్ తరువాత భోజనం భారీగా తినవద్దు, దానివల్ల అసౌకర్యం పొందవద్దు.
ఇంటిని  శుభ్రపరిచే కార్యక్రమము రంజాన్ ముందు నిర్వహించండి. ఉపవాసం సమయం లో ఎక్కువ గృహ పనులు పెట్టుకోవద్దు.
సాంఘికంగా
సాధ్యమైనంత వరకు విలాసవంతమైన ఇఫ్తార్ పార్టీలు ఇవ్వకండి. మసీదుకు ఇఫ్తార్ పంపoడి లేదా  అర్హమైన ఇరుగు పొరుగు కుటుంబానికి ఇఫ్తార్ భోజనం ఇవ్వండి. అందువలన శుభాలు పొందండి.
మీరు రంజాన్ కు ముందు ఫోన్ లో అందరు బంధువులను పలకరించండి వారి దువా పొందండి.
కుటుంబ సమయం
మీరు ఒక కొత్త సున్నత్ పాటించండి.మిస్వాక్ ఉపయోగించండి. నిద్రించే ముందు వజూ చేయండి.
పిల్లలకు పనులను అప్పగించండి అందువలన  మీకు  శ్రమ తక్కువగా ఉంటుంది, మరియు పిల్లలు  రంజాన్ యొక్క ఆత్మ(spirit) లోకి పొతారు.
ఒక సదకా బాక్స్ తయారు  చేయండి మరియు ప్రతి రోజు అందులో కొంత వేయటానికి కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. 
ఉత్తమ రంజాన్ పొందటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. అల్లాహ్ శుభాలు పొందండి.