ప్రార్థనలు(Salah) మరియు ప్రార్థనా (Salah) రకాలు
ప్రార్ధనలను
(Salah ) నాలుగు విభాగాలుగా వర్గీకరించవచ్చు
1. ఫర్జ్ ప్రార్ధనలు (FARD
PRAYERS): ఫికా న్యాయ వేత్తల దృష్టి
లో ఫర్జ్ ప్రార్ధనలు తప్పనిసరి అయినవి. హంబలి ఫికా ప్రకారం వాటిని పాటించని ఎడల
అతను నాన్-ముస్లింగా పరిగణిoచబడతాడు. మిగతా
సున్ని ఫికా న్యాయ వేత్తల దృష్టిలో
అతను పాపిగా (sinner) గా భావించబడతాడు. అందరు సున్ని ఫికా న్యాయవేత్తలు ఫర్జ్
ప్రార్ధనలను తప్పని సరిగా పాటించ మంటారు.
ప్రతి
రోజు 5 ప్రార్ధనలు: ఫజర్,జోహ్ర్,అసర్, మగ్రిబ్ మరియు ఇషా.
జుమ్మా
(శుక్రవారం) ప్రార్ధనలు: పురుషులు ప్రత్యెక జుమ్మా ప్రార్ధన కు
హాజరు అగుట చేయవలయును మరియు స్త్రీలు
ఇంటిలో ప్రార్ధన చేయుదురు.
జనాజః
ప్రార్ధన:
చనిపొయినవారి కోసం జరిపే ప్రార్ధన
2. వాజిబ్ ప్రార్ధనలు:(WAJIB
PRAYERS):
కొంత మంది దృష్టిలో వాజిబ్ ప్రార్ధనలు తప్పనిసరి,
కొంతమంది దృష్టిలో ప్రతి రోజు 5ప్రార్ధనలకు హాజరు అగుట తప్పనిసరి మిగతా ప్రార్ధనలు అన్ని ఐచ్చికాలు (optional).
వితర్
(WITR):
ఇషా
ప్రార్ధన తరువాత జరిపే దానిని వితర్ అందురు. కొంత మంది ముస్లింల దృష్టిలో వితర్
వాజిబ్. కొంతమంది దీనిని ఐచ్చికం అని అందురు. వేరు వేరు ఫికా న్యాయవేత్తల దృష్టి లో దీనిలో ఒకటి నుంచి పదకొండు రకాత్ లు ఉండును.సాధారణంగా వితర్ ప్రార్ధన మూడు
రకాత్ల తో చేయబడును.
ఈద్ (EID) ప్రార్ధన: సాధరణంగా ఈద్ ప్రార్ధన
ఈద్-ఉల్-ఫితర్ లేదా ఈద్-ఉల్-అదా ఉదయం జరపబడును. రెండు రకాత్ లు అందులో మొదటి రకాత్
ముందు ఏడూ తక్బిర్లు రెండోవ రకత్ ముందు ఐదు తక్బిర్లు చదవ బడును.
ప్రార్ధన అనంతరం కుత్బా చదవబడును. కాని కుత్భా ఈద్ నమాజ్ లో అంతర్భాగం కాదు.ఈద్
ప్రార్ధన సూర్యోదయం మరియు మద్యాన్న సమయం మద్య అనగా ఫజ్ర్ మరియు జోహ్ర్ మద్య
నిర్వహించబడును.
3. సున్నత్ ప్రార్ధనలు(SUNNAH
PRAYERS): సున్నత్ ప్రార్ధనలు తప్పనిసరి
కానివి మరియు ఐచ్చికమైనవి.వీటిని ప్రవక్త(స) నిర్వహించెను.
ప్రతి
రోజు ఐదు ప్రార్ధనలకు ముందు మరియు తరువాత ప్రార్ధనలు:(BEFORE
AND AFTER THE 5 DAILY PRAYERS):
ప్రవక్త(స)
రోజువారి చదివే ఐదు ప్రార్ధనలతో బాటు చదవలసిన కనీస రకాత్ల
కన్నా అధిక రకాత్లు చదివే వారు వాటిని సున్నత్ ప్రార్ధనలు అని పిలిచేవారు. సున్నత్
చదవక పోయిన నమాజ్ అoగికరించబడును. కాని ప్రవక్త (స) వాటిని చదివేవారు కావున సున్నత్
ప్రార్ధనలను కుడా చదవలయును.
ఇస్తిఖారః(
ISTIKHAARAH):
ఏదైనా
ఒక విషయం పై ముస్లిం కు మార్గదర్సకత్వం అవసరమైన చదివే ప్రార్ధన ఉదా: వివాహ విషయం. ఇస్తిఖారః ప్రార్ధనకు రెండు
రకాత్ లు చదవలయును. చదివిన తరువాత దువా చేయవలయును.దానిని ఇస్తిఖారః( ISTIKHAARAH) అందురు. దినిఅర్థం
హృదయపూర్వకంగా రెండు రకాత్ ల ప్రార్ధన చేసి తరువాత ఇస్తిఖరః చేయవలయును. ఈ
ప్రార్ధనను ఎ సమయము లో నైనా చేయవచ్చు.
తహజ్జుద్
(TAHAJJUD): రాత్రి సమయం లో చేసే ప్రార్ధనను తహజ్జుద్ అని అందురు.
రాత్రి కొoచం సేపు నిద్రించిన తరువాత లేచి చేసి ప్రార్ధన తహజ్జుద్ ప్రార్ధన. దీనిని
ఆచరించిన వారికి అల్లాహ్ అశ్విర్వాదములు మెండుగా లబించును.
తరావిహ్
(TARAWIH):
వీటిని
పవ్రిత్ర రమదాన్ మాసములో ఆచరించెదరు. వీటిని వ్యక్తిగతంగా,సమూహంగా, ఇంటిలోనూ,
మస్జిద్ అందు మరియు పబ్లిక్ స్థలములో ఆచరించవచ్చును. పాటించవలసిన కనీస రకాత్లు
ఎనిమిది.
4. నఫ్ల్ ప్రార్ధనలు(NAFL
PRAYERS): నఫ్ల్ ప్రార్ధనలు
ఐచ్చికమైనవి. వేటిని రోజువారి ఐదు ప్రార్ధనలతో లేదా వేరే సమయం లో చదవ వచ్చును.
ఇష్రాక్
ప్రార్ధన (ISHRAQ PRAYER): ఈ ప్రార్ధన సమయం
5-10నిమిషములు ఉండును.సూర్యోదయం తరువాత రెండు రకాత్లతో చదవ బడును. దీనివలన అధిక పుణ్యం లబించును.
దువా
ప్రార్ధన(DUHA PRAYER): దువా ప్రార్ధన సూర్యోదయం తో
ప్రారంభమై మద్యానం(merridian) ముగియును. రెండు రకాతుల నుంచి నాలుగు లేదా పన్నేoడు
రకాత్లు చదవ బడును. సాదరంగా ¼ వంతు రోజు గడిచిన పిదప
చదవబడును.చేసిన తప్పులను క్షమించమని చేసే ప్రార్ధన ఇది.
తహితుల్
మస్జిద్ (TAHIYATUL MASJID): దీనిని మస్జిద్యే సలాం అని
కుడా అందురు.దీనిలో మస్జిద్ లోనికి రాగానే రెండు రకాతులు చదవలయును. అల్లాహ్ కృప
పొందే ఉద్దేశం తో మస్జిద్ ను గౌరవిస్తూ ఈ ప్రార్ధన చేయుదురు.
ఖావ్ఫ్(KHAWF): ఖావ్ఫ్ అనగా భీతి/బయం అని అర్థము. భయం సందర్భం లో ఈ ప్రార్ధన
చేయబడును. ప్రవక్త(స) ఉహుద్ యుద్ద సందర్భం గా ఈ నమాజ్ చేసెను. యుద్దరంగమున
రోజువారి ఐదు ప్రార్ధనలకు బదులుగా ఈ ప్రార్ధన జరుప బడును.
ప్రయాణ
ప్రార్ధన(JOURNEY PRAYER): ఒక వ్యక్తి
ప్రయాణిస్తున్నప్పుడు లేదా ప్రయాణం నుంచి తిరిగి వచ్చినప్పుడు చదవలయును. దీనిని
మస్జిద్ లో రెండు రకాత్ల తో చదువుట ఉపయోగకరం.
No comments:
Post a Comment