15 September 2018

ఇస్లామిక్ మెడిసిన్







ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ లేదా ఇస్లామిక్ స్వర్ణయుగం  8వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు  విస్తరించినది మరియు అది విజ్ఞాన శాస్త్ర రంగం లో అనేక గొప్ప పురోగతులు సాదించినది. ఇస్లామిక్ విద్వాంసులు  ప్రపంచం అంతటా జ్ఞానం సేకరించి మరియు దానికి తాము స్వంతంగా కనుగొన్న ఆవిష్కరణలను  జోడించారు.

వారు అభివృద్ధి చేసిన ముఖ్యమైన క్షేత్రాలలో ఇస్లామిక్ మెడిసిన్ (ఔషధం) ఒకటి. ఇది ఆధునిక వైద్య విధాన  పద్దతులను పోలి యుంది. మెడిసిన్ (ఔషధ) విభాగ  చరిత్రలో ఇస్లామిక్ స్వర్ణయుగ  కాలం ఐరోపా కంటే శతాబ్దాలుగా ముందు అభివృద్ధి చెందినది. ఇస్లామిక్ మెడిసిన్ అభివృద్ధి చెందేట్టప్పటికి ఐరోపాలో వైద్యశాస్త్ర రంగం   ఇంకా చీకటి యుగాలలోనే  ఉంది.

ఇస్లామిక్ మెడిసిన్ (ఔషధం) యొక్క మూల ఆధారాలుగా   దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులను పేర్కొనవచ్చును.  జబ్బుపడిన వారి పట్ల  శ్రద్ధ చూపుట ముస్లింల విధిగా దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో పేర్కొన్నారు.  ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన ప్రకారం, అల్లాహ్ ప్రతి వ్యాధికి నివారణ చూపాడు. శరీరం మరియు ఆత్మ పట్ల శ్రద్ధ వహించడo ముస్లింల బాధ్యత అని ఆయన నమ్మారు. ఆరోగ్యానికి సంపూర్ణ మార్గదర్శకాలను అనేక హదీసులలో వివరించడం జరిగింది.
  
ఇస్లామిక్ మెడిసిన్, హాస్పిటల్స్ మరియు అర్హతలు Islamic Medicine, Hospitals and Qualifications


మెడిసిన్ (ఔషధ) చరిత్రకు ఇస్లాo యొక్క అతిపెద్ద సహకారం ఆసుపత్రుల స్థాపన. 8 వ శతాబ్దం నాటికి ఇస్లామిక్ ఆసుపత్రులు ఉనికిలో ఉన్నాయని మరియు అవి ఇస్లామిక్ ప్రపంచం అంతటా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయని రుజువులు ఉన్నాయి.

ఈ కాలం లో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు    అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత కల్పించడం కోసం పేద, గ్రామీణ ప్రాంతాల్లోకి వైద్యులు మరియు మంత్రసానులను పంపారు.  వైద్యులు మరియు ఇతర సిబ్బంది అధ్యయనం మరియు పరిశోధన కోసం పరిశోదనా శాలలను నిర్మించారు. ఈ ఆసుపత్రులు వేర్వేరు విధులను నిర్వహించేవి. కొన్ని సాధారణ జనాభా వైద్యావసారాలను తీర్చేవి, కొన్ని కుష్టు వ్యాధిగ్రస్తులు, వికలాంగులు మరియు బలహీనమైనవారికి  ప్రత్యేకమైన సేవలను అందించెవి.

నాటి వైద్య విద్యా వ్యవస్థ బాగా నిర్మాణాత్మకంగా ఉందేది మరియు నిపుణులైన వైద్యుల దగ్గిర వైద్య విద్య నేర్చుకోవటానికి విద్యార్ధులు సుదూర ప్రాంతాలనుండి వచ్చేవారు. ఇస్లామిక్ వైద్యులు తమ రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించినారు.

ప్రముఖ ఇస్లామిక్ వైద్యులు మరియు వారి ఆవిష్కరణలు (The Islamic Physicians and Their Discoveries)

అనేక మంది ఇస్లామిక్ వైద్యులు ఇస్లామిక్ స్వర్ణ యుగంలో మెడిసిన్ (ఔషధం) రంగంలో అసాధారణమైన ఆవిష్కరణలు చేశారు. వారు తమ కంటే పూర్వికులు అయిన గాలెన్ మరియు గ్రీకు విజ్ఞానంపై తమ మూలాలను  నిర్మించి వాటికి తమ  స్వంత ఆవిష్కరణలను జోడించారు. మెడిసిన్ (ఔషధం) చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడు అల్-రజి (Al-Razi)

ఇస్లామిక్ మెడిసిన్ పితామహుడు - అల్-రాజీ (రజేస్) Al Razi (rhazes)

అల్-రజి ని  ఐరోపావాసులు  రాజాస్ అని పిలుస్తారు (రాసేస్, రాసిస్, రాసి లేదా ఆర్-రజి) (850 - 923). ఇతను  ఇస్లామిక్ వైద్య పరిశోధనలో ముందంజలో ఉన్నాడు. ఇతను ఒక సఫల రచయిత మరియు ఆయన మెడిసిన్ (ఔషధం) మరియు తత్వశాస్త్రం గురించి 200 పుస్తకాలను లిఖించాడు వాటిలో ఒకటి అముద్రిత పుస్తకo. దానిలో మెడిసిన్ (ఔషధం)తో పాటు, ఇస్లామిక్ ప్రపంచానికి తెలిసిన జ్ఞానాన్ని ఒకే చోట క్రోడికరించారు.  ఈ గ్రంథం లాటిన్లోకి అనువదించబడింది మరియు పశ్చిమ వైద్య చరిత్రలో ఇది ఒక ప్రధాన మూలగ్రంధం  అయింది.

శాస్త్రీయ పద్ధతి, ప్రయోగం మరియు పరిశీలనను scientific method and promoting experimentation and observation ప్రోత్సహించటం లో  అల్-రజి(Rhazes) ప్రసిద్ది చెందాడు. బాగ్దాద్లో ఒక ఆసుపత్రిని నిర్మిస్తామని దానికి  ప్రదేశాన్ని ఎన్నుకోమని అతనిని అడిగినప్పుడు అతను బాగ్దాద్ లో ఎక్కువ పరిశుబ్రత ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోన్నాడు. రోగుల అనారోగ్యానికి కారణం అపరిశుబ్రత అని  ఆయన భావించారు. అతను బాగ్దాద్ నగర ఆసుపత్రి డైరెక్టర్ గా పనిచేశాడు మరియు ఇస్లామిక్ ఔషధ పరిశోధనలో తన కాలం గడిపాడు.

వైద్యడు (డాక్టర్) మరియు రోగి మధ్య ఉండే కీలకమైన సంబంధాన్ని గురించి  అల్ రజి విస్తృతంగా వ్రాశాడు. రోగి మరియు డాక్టర్ మద్య  ట్రస్ట్(trust) మీద నిర్మించిన సంబంధం అభివృద్ధి చేయాలని మరియు డాక్టర్ రోగికి సహాయంగా ఉండే బాధ్యత కలిగివుండటంతో, రోగి వైద్యుని సలహాను పాటించే బాధ్యతను కలిగి ఉంటాడు అని అన్నాడు.  గాలెన్ మాదిరిగా, కాకుండా ఔషధం యొక్క సంపూర్ణ నివారణ  పద్ధతి కీలకమైనదిగా భావించి  రోగి యొక్క నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని  మరియు అధునిక మెడిసిన్ లో సూచించినట్లు  రోగి దగ్గరి కుటుంబానికి కల వ్యాధులను, రోగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని  అతను నమ్మాడు.

అతని మరొక  గొప్ప ఘనత అనారోగ్యత యొక్క అవగాహన. ఇది గతంలో లక్షణాల ద్వారా వర్ణించబడింది, కానీ అల్-రజి లక్షణాలకు కారణాలను పరిశిలించాడు.   మశూచి మరియు తట్టు వ్యాధి విషయంలో, అతను రక్తo యొక్క పాత్రను గుర్తిoచాలన్నాడు. అయితే అప్పటికి  సూక్ష్మజీవుల గురించి తెలియదు. .

అల్ రజి మానవ శరీరశాస్త్రం గురించి విస్తృతంగా వ్రాసాడు మరియు మెదడు మరియు నాడీ వ్యవస్థ ఎలా కండరాల కదిలకను  నిర్వహిస్తుందో అర్థం చేసుకున్నాడు. ఆకాలం నాటికి   శరీరచేద్దo (dissection) పై ఆంక్షలు ఉన్నoదువలన అతను ఈ రంగం లో అధ్యయనాలు చేయలేదు. 

ఇస్లామిక్ మెడిసిన్ - ఇబ్న్ సిన, ది గ్రేట్ పోలిమత్(Islamic Medicine – IbnSina, the Great Polymath)

ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ సిన లేదా  అవిసెన్నా తత్వశాస్త్రం, వేదాంతశాస్త్రం, ఇస్లామిక్ ఔషధం మరియు సహజ విజ్ఞాన శాస్త్రంతో సహా అనేక అకాడెమిక్ రంగాలలో ప్రముఖమైన బహుముఖ ప్రజ్ఞాశాలి(పాలిమత్). చిన్న వయస్సులోనే వైద్యుడిగా మరియు గురువుగా పేరుపొందాడు మరియు మెడిసిన్  (ఔషధం) గురించి అనేక వివరణాత్మక గ్రంథాలను వ్రాశాడు. అతని ప్రచురణ, "ది కానన్," ఇస్లామిక్ ప్రపంచం మరియు యూరప్ లోని  వైద్యులకు  ప్రధాన గ్రంధం అయ్యింది మరియు  రోగ నిర్ధారణ మరియు చికిత్సకు ఒక వివరణాత్మక మార్గదర్శిని రూపొందించాడు.

నాడి(పల్స్) మరియు మూత్రాన్ని పరిశీలించడం ద్వారా అనేక రోగ నిర్ధారణలు చేయవచ్చని ఇబ్న్-సినా నమ్మాడు మరియు అతని “కానన్” గ్రంధం లో మూత్రం యొక్క రంగు, పరిమాణం  మరియు వాసన ద్వారా రోగనిర్ధారణ చేయటానికి వివరణ ఇవ్వబడినది.  రోగ నివారణలో ఆహారం (diet)యొక్క ప్రాధాన్యత వివరించబడినది.
 
అతని శిశు సంరక్షణకు కొన్ని సూచనలు చేసాడు మరియు అనేక రుగ్మతలకు చెడు నీరు కారణమని నమ్మాడు.  అతను నీటి పరిశుద్ధతను ఎలా తనిఖీ చేయాలనే దానిపై కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చాడు. అతని విజయాలు  ఔషధం యొక్క చరిత్ర వికాసంనకు గొప్పగా దోహదపడినవి.

ఆల్ కింది - ఇస్లామిక్ మెడిసిన్ డాక్యుమెంటర్ Al Kindi – The Documenter of Islamic Medicine

అల్-కింది (800-870), గొప్ప ఇస్లామిక్ బహుముఖ ప్రజ్ఞాశాలి.  అతను వైద్య చరిత్ర అభివృద్దికి తోడ్పడినాడు. ఈ విద్వాంసుడు గాలెన్ ద్వారా ఎక్కువగా ప్రభావితం అయ్యాడు మరియు అతను ఆనేక ప్రతిభావంతమైన రచనలను చేసాడు. తన అఖ్రాహాదిన్ Aqrabadhin (మెడికల్ ఫార్ములరి) లో, అతను వృక్ష, జంతు మరియు ఖనిజ వనరుల నుండి తయారుచేసిన అనేక ప్రిపరేషన్స్ ను    వర్ణించాడు.
 
హిప్పోక్రేట్స్ మరియు గాలెన్ వంటి పురాతన వైద్యులకు తెలిసిన ఔషధాలకు తోడూ  అతను భారత్, పర్షియా మరియు ఈజిప్టు నుండి వచ్చిన ఔషధ జ్ఞానాన్ని చేర్చాడు. అతను రాసిన పుస్తకంలో ఔషధ మూలికలు, సుగంధ సమ్మేళనాలు, మస్క్, మరియు అకర్బన మందుల సమాచారం ఉంది. మెడిసిన్ మరియు పార్మకోలోజి మధ్య విభజన గుర్తించాడు.

ఇస్లామిక్ మెడిసిన్ - ఇబ్న్ అల్ నఫీస్ మరియు రెస్పిరేటరీ సిస్టమ్ Islamic Medicine – Ibn Al Nafis and the Respiratory System

ఇబ్న్ అల్-నఫిస్ (1213 లో జన్మించాడు) శ్వాస-ప్రసరణ వ్యవస్థను బాగా అర్థం చేసుకొన్న మొట్టమొదటి పండితుడిగా మెడిసిన్ (ఔషధం) యొక్క చరిత్రలో ఖ్యాతి గాంచాడు.  హృదయం రెండు భాగాలుగా విభజించబడింది అన్నాడు  మరియు గాలెన్ ప్రతిపాదించినట్లు  గుండె యొక్క రెండు భాగాలను కలిపే రంధ్రాలు (pores) లేవని ఆయన అర్థం చేసుకున్నారు. ఆల్-నఫిస్ ప్రకారం రక్తం గుండె యొక్క ఒక వైపు నుంచి రెండో వైపుకు  ఊపిరితిత్తుల గుండా వెళుతుంది.

పల్మనరీ వ్యవస్థ యొక్క స్వభావాన్ని అర్ధం చేసుకొన్న మొదటి పండితుడు ఇబ్న్ నఫీస్.  అతను ఊపిరితిత్తులలోని రక్తం  గాలి తో కలసి ఉండును అన్నాడు. రక్తo గుండె యొక్క ఎడమ కుహరంలో "ఆత్మ" తో కలసి ఉంటుందని ప్రతిపాదించాడు.
 
అతని ఇతర పరిశీలనల ప్రకారం  హృదయం యొక్క కుడి జఠరిక, దాని చుట్టూ ఉన్న కేశనాళికల యొక్క వెబ్ ద్వారా గుండె పోషించబడును. పుపుస ధమని మరియు సిర సూక్ష్మదర్శిని రంధ్రాలచే ముడిపడి ఉన్నాయని ప్రతిపాదించి, ప్రసరణంలో కేప్పిల్లరి పాత్ర యొక్క అంశంపై అతను స్పర్శించాడు; నాలుగు శతాబ్దాల తరువాత ఈ సిద్ధాంతం తిరిగి కనుగొనబడటం మరియు కేశనాళికల యొక్క ఆలోచన మిగిలిన శరీర భాగాలకు విస్తరించబడింది.

నాడి(పల్స్) గురించి ఇస్లామిక్ మెడిసిన్   మరియు వారి కంటే ముందు ఈజిప్షియన్లకు బాగా తెలిసు  కానీ అల్-నఫిస్ పల్స్ వెనుక ఉన్న యంత్రాంగాలను mechanisms అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి. గాలెన్ ధమనులు సహజంగా కొట్టుకొంటాయని  మరియు ధమని మొత్తం ఒకేసారి సంకోచించుతుందని అంటాడు  కాని శరీరంలోనికి  రక్తాన్ని నెట్టే గుండె యొక్క చర్య ద్వారా పల్సేషన్ (pulsation) ఏర్పడుతుందని  అల్ నఫీస్ విశ్వసించాడు. గుండె యొక్క చర్య వెనుక ధమనుల యొక్క విచ్ఛేదం వెనుకబడి ఉంటుందని  మరియు అది  మొత్తం గా  ఒకేసారి సంభవించదు  అని అతను సరిగ్గా గుర్తించాడు.
 
అయితే, ఈ రక్తం యొక్క కదలిక, ఆత్మను చెదరగొట్టడానికి మార్గమని అల్ నఫీస్ నమ్మాడు, ఇది చాలా కాలం పాటు అక్కడ నివసిస్తున్నట్లయితే గుండె మండుతుంది. ధమనులలో ఆత్మ విశ్రాంతి తీసుకోవాలంటే సర్క్యులేషన్ అవసరం. అతని గుండె మరియు పల్మోనరీ సర్క్యులేషన్ సిద్ధాంతాలు ఈ అదృశ్య ఆత్మ మీద ఆధారపడినవి.   అతని ప్రతిపాదనలు శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక ప్రధాన రహదారి గా ఉన్నాయి అనుటలో ఎటువంటి సందేహం లేదు. అతని జ్ఞానం పశ్చిమ చరిత్ర లోకి బాగా ప్రసరించలేదు.

అతని ఇతర పరిశీలనలలో కొన్ని శరీర విభాగాల విచ్చేదం పై  ఆధారపడ్డాయి, వీటిలో అతను గొప్ప ప్రతిపాదకుడు మరియు అతను మెదడు, పిత్తాశయం, ఎముక నిర్మాణం మరియు నాడీ వ్యవస్థ గురించి శరీర ధర్మశాస్త్రం లో ఉన్న  అనేక దురభిప్రాయాలను సరిచేశాడు. అతని రచనల లో చాలా తక్కువ భాగం  లాటిన్లోకి  అనువదించ బడినవి మరియు  పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఆయన రచనలను సరిగా వినియోగించుకోలేదు. లియోనార్డో డా విన్సీ, గాలెన్ మరియు అవిసెన్నాపై ఆధారపడి చేసిన తప్పులను అల్ నఫీస్ అప్పటికే పరిష్కరించాడు.

ఇస్లామిక్ వైద్యానికి అతని చేసిన గొప్ప కృషి అతని ఫార్మాకోలోజికల్  (pharmacological) రచనలు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నివారణలను remedies సూచించినవి. అతను  గణితశాస్త్రం మరియు మోతాదుల ఆలోచనలను idea of dosages చికిత్సల నిర్వహణకు కూడా పరిచయం చేసినాడు.

ఇస్లామిక్ మెడిసిన్ కు  ఇతరుల సేవ:  Other Contributors to Islamic Medicine

సెరాపియన్ (Serapion) ఇతను ఒక సిరియాక్ క్రిస్టియన్. అతను 9వ శతాబ్దంలో ఫార్మకాలజీ గురించి ఒక వివరణాత్మక గ్రంథాన్ని రచించాడు. ఇది పలు వ్యాధులను వివరించింది మరియు వాటికీ  నివారణల సూచిక  తయారు చేసింది.

అల్ దినవారి Al Dinawari 'ది బుక్ ఆఫ్ ప్లాంట్స్' అనే పుస్తకాన్ని  రుపొందిoచినాడు. లాటిన్ లోకి  అనువదించబడిన ఈ పుస్తకం ఔషధం యొక్క పశ్చిమ దేశాల ఔషద చరిత్రను ప్రభావితం చేసింది.

అరబిక్ ప్రాంతాలవారికి తెలియని, వారి వైద్య పుస్తకాలకు అందని అనేక మందుల వివరాలు   తెలుసుకోవటానికి 6 వ శతాబ్దంలో పెర్షియన్ వైద్యుడు బుర్జొ Burzoe భారతదేశం లో  పర్యటించారు మరియు అనేక నిపుణులైన భారతీయ వైద్యులు మరియు వైద్యసంస్థల నుండి సమాచారాన్ని  సేకరించడంతో పాటు, అనేక రోగాల  నివారణలను కాలిఫెట్ కోసం తీసుకువచ్చారు. అనేక సంస్కృత రచనలు అరబిక్ లో అనువదించబడ్డాయి మరియు భారతీయ వైద్యం అరబిక్ వైద్యం లో మిళితం అయినది.

అల్ తబరి (810 - 855) 'ది పారడైజ్ అఫ్ విస్డమ్'The Paradise of Wisdom ' అనే పుస్తకాన్ని 850 లో రచించాడు, ఇది గాలెన్ మరియు హిప్పోక్రేట్స్ యొక్క పూర్వ రచనల మీద ఆధారపడిండి. ఇది భారతీయ మూలాల  అనువాదాల అనుభందాన్ని (appendix) కూడా కలిగివుంది. ఆ సమయంలోని  అనేక మంది వైద్యుల మాదిరిగానే, ఆ సమయంలో అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానాన్ని వివరించే వివరణాత్మక ఎన్సైక్లోపీడియాలను తయారుచేయడం లో అతను పాల్గొన్నాడు.   దురదృష్టవశాత్తు, అతని రచనలలో అధికభాగం అందుబాటులో లేవు. వాటి ప్రస్తావన మాత్రమే తరువాతి గ్రంధాలలో పేర్కొనబడినది.
అల్ తబరి గ్రంధం తొమ్మిది ఉపన్యాసాలతో రూపొందించబడింది, ప్రతి ఒక్కటి అనేక అధ్యాయాలుగా విభజించబడింది. అవి :

జనరల్ పాథాలజీ, అంతర్గత రుగ్మతల యొక్క లక్షణాలు మరియు సాధారణ చికిత్సా సూత్రాలు
తలను  ప్రభావితం చేసే వ్యాధులు మరియు పరిస్థితులు
కళ్ళు, ముక్కు, ముఖం మరియు నోటి వ్యాధులు
నాడీ వ్యాధులు
ఛాతీ మరియు గొంతు వ్యాధులు
ఉదర వ్యాధులు
కాలేయ వ్యాధులు
గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు
ప్రేగులు, మూత్ర నాళాలు, జననేంద్రియాల వ్యాధులు
అల్ హక్మ్ (మరణించినది 840) ఇస్లామిక్ ప్రపంచంలో మెడికల్ సైన్సెస్ పై  మొట్టమొదటి పుస్తకాన్ని రాశాడు మరియు ఇది శరీరశాస్త్రం, శస్త్రచికిత్స మరియు సాధారణ ఆరోగ్య సంరక్షణ గురించి సమాచారం కోసం  గ్రీక్ మూలాల పై ఆధారపడినది. .

యూహానా ఇబ్న్ మసావి Yuhanna Ibn Masawyh (777 - 857) గ్రీకు భాష నుండి అరబిక్ భాషలోకి అనువదించిన గొప్ప అనువాదకులలో ఒకరిగా భావించబడ్డాడు మరియు  అతను ఖలీఫా కు  వైద్యుడిగా పనిచేశాడు మరియు ఆసుపత్రిలో పనిచేశాడు. ఆయన “కంటి యొక్క లోపాలు'Disorders of the Eye' మరియు 'Knowledge of the Oculist Examinations' మరియు “కితా అల్ ముషజ్జర్ అల్ కబీర్ Kita al Mushajjar al-Kabir అనే అనే చిన్న పుస్తకం రచించినాడు. ఇందులో రోగాల వివరణలు, రోగనిర్ధారణ, లక్షణాలు మరియు వ్యాధుల చికిత్సల వివరాలు పొందుపరిచాడు.  

పడమట జోహన్నీటస్ Johannitus గా పిలువబడిన హుయాన్యన్ ఇబ్న్ నిషాక్ Hunayan ibn Nishaq  (808-873) ఇస్లామిక్ ఔషధ ప్రముఖులలో ఒకరు మరియు అనేక  అనేక రకాల విభాగాలను కలిగి ఉన్న వైద్య గ్రంథాల రచయిత మరియు అనువాదకుడు. గాలెన్ ద్వారా ప్రభావితుడైన అతను 'ది బుక్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు మెడిసిన్'The Book of Introduction to Medicine ' అనే పుస్తకాన్ని రచించాడు. అందులో పలు ప్రత్యేతకలు  మరియు జోడింపులు కలవు.  అతని రచన బహుశా లాటిన్ లోకి  అనువదించబడిన మొదటి ఇస్లామిక్ మెడికల్ టెక్స్ట్.

హిస్టరీ ఆఫ్ మెడిసిన్ లో ఇస్లామిక్ మెడిసిన్ స్థానం:Islamic Medicine and Its Place in the History of Medicine

ఇస్లాం స్వర్ణయుగం మేధావి మరియు శాస్త్రీయ, సాంఘిక మరియు తాత్విక పురోగమనాల సమయం. అది  ప్రపంచానికి అందించిన గొప్ప సహకారం ఇస్లామిక్ ఔషధం. ఇస్లామిక్ విద్వాంసులు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన సమాచారాన్ని సేకరించారు. దానికి వారి స్వంత పరిశీలనలు మరియు అభివృద్ధి పద్ధతులు మరియు విధానాలను  జోడించారు. ఇస్లామిక్ మెడిసిన్   ఆధునిక మెడిసిన్  యొక్క ముఖ్య ఆధారంగా రూపొందినది.  ఔషధం యొక్క చరిత్ర లో  ఇస్లామిక్ ఔషధం సాధించిన పురోగతి కాలం ఇరవయ్యో శతాబ్దం యొక్క టెక్నాలజీకి  ముందు ఉంది.

ఆధార గ్రంథ పట్టిక (Bibliography):
1.అట్వెవెల్, జి Attewell, G. (2003). ఇస్లామిక్ మెడిసిన్స్: పర్స్పెక్టివ్స్ ఆన్ ది గ్రీక్ లెగసీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇస్లామిక్ మెడికల్ ట్రెడిషన్స్ ఇన్ వెస్ట్ ఆసియా, ఇన్ సెల్లిన్, H. (ఎడ్.). మెడిసిన్ ఎక్రాస్ కల్చర్స్: హిస్టరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఇన్ నాన్-వెస్ట్రన్ కల్చర్స్, pp325-350. డోర్డ్రెచ్, ది నెదర్లాండ్స్: క్లువర్ అకాడమిక్ పబ్లిషర్స్.

2.ఏడే, A.& కార్మాక్ Ede, A. & Cormack, L.B. (2012). ఎ హిస్టరీ ఆఫ్ సైన్స్ ఇన్ సొసైటీ: ఫ్రం ది ఏన్షియంట్ గ్రీక్స్ టు ది సైంటిఫిక్ రివల్యూషన్, నార్త్ యార్క్, ఒంటారియో, కెనడా: యూనివర్శిటీ ఆఫ్ టొరాంటో ప్రెస్

3.మెరీ, J.W. Meri, J.W.  (2006). మీడివల్ ఇస్లామిక్ సివిలైజేషన్: ఎన్ ఎన్సైక్లోపెడియా. న్యూ యార్క్, NY: టేలర్ మరియు ఫ్రాన్సిస్