25 July 2018

ఇస్లాం మరియు సముద్రం (Islam and the Sea)



“సముద్రంలో మీ ఓడలను నడిపెవాడే మీ (అసలు) ప్రభువు, తద్వారా మీరు అయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు”.  దివ్య ఖుర్ఆన్ 17:66.










 కొంతమంది పండితుల అభిప్రాయం లో  ప్రారంభం లో ఇస్లాం భూమి (land) కి సంభందించిన ధర్మం. పంతొమ్మిదవ శతాబ్దపు  ఫ్రెంచ్ పండితుడు ఎర్నెస్ట్ రెనాన్ (1892)  ఇస్లాం ను "ఎడారి ధర్మం అని అన్నాడు.  వాస్తవానికి ఎడారి వర్తక నగరాలు మక్కా మరియు మదీనా.

ఒంటెల బ్యాండ్లు మరియు సంచరజీవులు అయిన  ఎడారి బెడువిన్ ప్రజలు  అరబ్ మరియు ముస్లిం సంస్కృతి యొక్క కాల్పనిక చిహ్నాలు. మూడోవ  ఖలీఫా మరియు తోలి ఇస్లాం ధర్మం  యొక్క అత్యంత ప్రభావవంతమైన మరియు గౌరవనీయ నాయకులలో ఒకరైన ఉమర్(ర) సముద్రం విశ్వాసులను అవినీతిపరులు చేస్తుందని అభిప్రాయ పడ్డాడు.

ఇస్లాం ఉష్ణమండల ఆఫ్రికా మరియు మధ్య ఆసియా యొక్క మంచుతో కప్పబడిన పర్వతాలు గల విభిన్న వాతావరణాల గల భూమి పై   విస్తరించింది. ప్రారంభంలో  ఇస్లాం భూ మార్గాలు, భూ సైన్యాలు మరియు భూవ్యాప్త వాణిజ్యంపై (land routes, land armies and land trade)  దృష్టి పెట్టింది. ట్యునీషియా, అల్జీరియా మరియు మొరాకో దేశాల్లో విజయం సాధించిన ప్రఖ్యాత ముస్లిం విజేత 'ఉక్బా ఇబ్న్ నఫీ' 'Uqba ibn Nafi' (d. 683 AD) చేతిలోని విజయ పతాకం  అట్లాంటిక్ సముద్రం చేరుకున్నప్పుడు మాత్రమే ఎగరటం  ఆగిపోయింది. 

భూ మార్గాల ప్రాముఖ్యత తక్కువ కాదు. ఇస్లాం పెరుగుదల ఎడారి జీవితంను ప్రభావితం చేసింది. ముస్లిం యోధుల ఎడారి స్థావరాలు,  నగరాల ఆక్రమణ కు  స్థావరాలు అయినాయి. ఖలీఫాల  ఇస్లామిక్  సామ్రాజ్యం ఎడారిలో ప్రయాణానికి, తీర్థయాత్రకు, మరియు సంచార బెడుయోన్ దాడులను నియంత్రించడానికి హామీ ఇచ్చినది. బాగ్దాద్ నుండి మక్కాకి ప్రయాణ యోగ్యమైన రహదారిని గొప్ప అబ్బాసిద్ ఖలీఫా హరున్ అల్ రషీద్ భార్య నిర్మించినది.

సాంకేతిక పరిజ్ఞానం, ఎడారి వాణిజ్యం, యోధుల కోసం ఉన్నతమైన ఒంటె జీను యొక్క ఆవిష్కరణలు  ప్రాoరభ ఇస్లాం యొక్క విజయవంతమైన విస్తరణలో ఖచ్చితంగా ముఖ్యమైనవి అయినప్పటికీ, సముద్రం దాని మార్గాల్లో ఇస్లాం మతం ప్రారంభం లో వ్యాప్తి చెందలేదు. ఈ విధంగా ఇస్లాం ప్రారంభ దశలలో భూమార్గానికే పరిమితం అయ్యినది 

అయితే నిజానికి ఇస్లాం వికాసoలో  ముస్లిం యోధులు, బోధకులు, వర్తకులు మరియు ప్రయాణికులు దక్షిణ మధ్యధరా, ఎర్ర సముద్రం, మరియు ఆఫ్రికన్ అట్లాంటిక్ ప్రాంతాలలో కాకుండా, విస్తారమైన హిందూ మహాసముద్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిoచారు. ముస్లిం వర్తకులు మరియు వారి ప్రభావం వలన శాంతియుత ధర్మ మార్పిడి యొక్క విస్తరణ తో ఇస్లాం నాగరికత సముద్ర నాగరికత అయింది. ఇస్లాం పూర్వ దశలలో, సముద్ర  బోధకులు మరియు ఒంటె-స్వారీ యోధులచే వ్యాప్తి చెందినది.  ముస్లింలు నార్త్ ఆఫ్రికన్ కోస్ట్ తమ  గుప్పెడిలో ఉంచుకొన్నారు మరియు వ్యవస్థీకృత ఒట్టోమన్ నేవీ నాటి బలమైన నావికా దళాలలో ఒకటిగా ఉంది.
ఇస్లాం యొక్క నేవీ: ది అరబ్-బైజాంటైన్ వార్స్ Islam's Navy: The Arab-Byzantine Wars:


ఇస్లాం యొక్క పెరుగుదలకు ముందే, అరబ్బులు సముద్రయానం లో  ప్రసిధ్ధి గాంచారు, ప్రత్యేకంగా వారు అరేబియా మరియు ఎర్ర సముద్ర తీరాల వెంట వాణిజ్యం నిర్వహించేవారు. దివ్య ఖురాన్ లో సముద్ర యానం గురిoచిన ఆయతుల ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే, మక్కా నుండి ముస్లింల మొట్టమొదటి హిజ్రా నెగస్ పాలించే  ఇథియోపియా కు ఒక చిన్న సముద్ర ప్రయాణంగా జరిగింది. రాజు నేగాస్ అతని ఇదియోపియా దేశం   బహిష్కరింపబడిన ముస్లింల సమూహాన్ని స్వాగతించారు. శతాబ్దాలుగా క్రైస్తవ ఇథియోపియా అరేబియా ద్వీపకల్పం మధ్య రాకపోకలు ఉండేది. వాస్తవానికి, షీబా రాణి యొక్క కల్పిత భూమి లో ఇథియోపియా లేదా యెమెన్లు  కలవు అని చెప్పబడింది.
  
సిరియాలోని  పాల్మిరా వంటి గొప్ప ఎడారి నౌకాశ్రయాల ద్వారా  భూ వాణిజ్యo, సంభవించింది, అరబ్ దేశాలలో బలమైన సముద్ర వాణిజ్యం జరిగేది. వేల సంవత్సరాల నుండి కతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు బహ్రెయిన్ వంటి గల్ఫ్  దేశాలనుండి మేలుజాతి   ముత్యాలు భారతదేశం మరియు పశ్చిమానికి రవాణా చేయబడుతున్నాయి.

గల్ఫ్ గిరిజనులు మొట్టమొదటిసారిగా ఇస్లాం మతంలోకి మారారు. బహుశా, ఈ దేశాల సముద్రయాన ప్రజలు నావికా దళ నిర్మాణం మరియు నిర్వహణలో చురుకైన పాత్ర పోషిoచారు.వీరి సహాయం తో అరబ్లు బైజాంటైన్ నావికాదళానికి దీటుగా సొంత  నావికా దళం ను  నిర్మించారు.  

నౌకాశ్రయాల్లో అత్యంత ప్రసిద్ధమైనది కాన్స్టాంటినోపుల్: ఇది ప్రపంచంలోని ఉత్తమ-రక్షిత నగరం. ముస్లిం వ్యాప్తి దాటికి తూర్పున పెర్షియన్ సామ్రాజ్యం 650 ల నాటికి దాసోహం అంది కాని  బైజాంటైన్లు వారి  అత్యుత్తమ నౌకాదళo సహాయం తో ముస్లిమ్స్ ఆధిపత్యానికి ఎదురు నిలిచారు.  అరబ్బులు  పూర్తి విజయం భూమి మరియు సముద్రం రెండింటి ద్వారా మాత్రమే సాధించవచ్చని త్వరలో గ్రహించారు.

ఐదవ ఖలీఫా  మరియు ఉమయ్యద్ రాజవంశ స్థాపకుడు అయిన ముఆవియా  Mu'awiya  ఇస్లామీయ ఖిలాఫత్ స్థాపనకు  ముందు గొప్ప జనరల్ గా ప్రసిద్ది చెందారు. బైజాంటైన్లను ఓడించడానికి ముస్లిం నేవీని నిర్మించాలనే ఆలోచన ముఆవియా  Mu'awiya   చేసారు. 649 CE లో సైప్రస్ తో  సహా తూర్పు మధ్యధరా ద్వీపాలకు మరియు కోటలకు వ్యతిరేకంగా ముఆవియా  Mu'awiya  సైనిక దాడులు జరిపారు. అబ్దుల్లా ఇబ్న్ సాద్ ఇబ్న్ అబీ అల్ సార్, ఈజిప్ట్ యొక్క గవర్నర్, మొదటి, వ్యవస్థీకృత అరబ్ / ఈజిప్షియన్ నావికా దళమును నిర్మించాడు.

బహుశా తన అస్పష్ట నేపథ్యం కారణంగా, ఇస్లాం యొక్క మొదటి నౌకాదళ విజయాలు భూ యుద్ధాల వలే ప్రసిద్ది పొందలేదు. అబ్దుల్లా అనేక వ్యవస్థీకృత బైజాంటైన్ దాడులను తిప్పికొట్టినాడు వాటిలో, 646 లో అలెగ్జాండ్రియా పై జరిగిన దాటి  ఒకటి. 655 AD నాటికి అబ్దుల్లా బైజాoటైన్ చక్రవర్తి కాన్స్టన్స్ II స్వయంగా నాయకత్వం వహించిన రాయల్ బైజాoటైన్ నావికాదళమును మాస్ట్స్ లేదా ఫియోనిక్స్ యుద్ధం లో ఓడించినాడు.672 లో ముస్లిం సైన్యాలు, నౌకలు బైజాoటైన్లను  వారి చివరి, గొప్ప కోట అయిన కాన్స్తంటినోపుల్ నుంచి ప్రారదోలినవి. 

నావికుడు సింద్ బాద్ కథలు,  అతని నౌకా ప్రయాణాలు అత్యంత ప్రసిద్ది చెందినవి. సింద్ బాద్ ఇస్లామిక్ వాణిజ్యం మరియు నౌకా ప్రయాణం యొక్క శక్తివంతమైన ప్రతిబింబం. ఆఫ్రికా తూర్పు తీరం విలువైన వస్తువులకు ప్రసిద్ధి చెందింది. సింద్ బాద్ ఆఫ్రికా తీరం వెంట జరిపిన ప్రయాణాలు,  సాహస గాధలు అనేక అరబ్  సాహస నావికులకు  ప్రేరణ కల్గించినవి. 
  

అలాగే సింద్ బాద్ గా  మధ్య ప్రాచ్యంలో ప్రసిద్ధి చెందిన ఇబ్న్ బతూత యాత్రలు ప్రాముఖ్యతను సంతరించుకోన్నవి. యూరేసియా మరియు ఆఫ్రికా అంతటా ఇబ్న్ బతూత తన జీవితకాలంలో 70,000 మైళ్ళు ప్రయాణించారు. అతను మధ్యధరా సముద్రం,  హిందూ మహాసముద్రంలో, ప్రత్యేకించి అరేబియా సముద్రం జరిపిన నావికా యాత్రలు ప్రసిద్ది చెందినవి. రాస్ డన్ పండితుడు ఇబ్న్ బతూత మొట్టమొదటి సముద్రయానం యెమెన్ దక్షిణ తీరం లో జరిగింది అని  వివరించాడు,

ఇబ్న్ బతూత, మాల్దీవు ద్వీపాలలో ఇస్లాం  ప్రచారం చేసాడు. ద్వీపాలు అంతటా ఇస్లాం స్వీకరించబడినది. మాల్దీవ్ లో ఇబ్న్ బతూత, క్వాడి లేదా ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డాడు అక్కడి సాంఘిక దురాచారాల నిర్మూలనకు ప్రయత్నించాడు. 

మధ్యధరా సముద్రం లో ముస్లిం వాణిజ్యం మరియు నావికాదళ శక్తి ఆల్మోహడ్స్Almohads పాలకుల క్రింద పన్నెండవ శతాబ్దంలో విస్తరించినది.  ఆల్మహద్ నావికాదళం "సిసిలియన్” గా పిలువబడే  అనుభవజ్ఞుడైన అడ్మిరల్ “అహ్మద్ అల్ సిఖిల్లి " నాయకత్వం లో ఉంది.  తూర్పు మధ్యధరాలోని క్రైస్తవ క్రూసేడర్స్ కు  వ్యతిరేకంగా యుద్ధాల్లో సహాయం చేయమని “అహ్మద్ అల్ సిఖిల్లి” ని  సలాదిన్ కోరారు. చరిత్రకారుడు ఇబ్న్ ఖాల్డన్ అతిశయోక్తిగా, ఒక క్రైస్తవ చెక్క కూడా మధ్యధరా సముద్రం లో  ముస్లిం నౌకాదళ అనుమతి లేకుండా ప్రయాణించదు అని అన్నాడు.  
పదమూడవ శతాబ్దంలో అల్మోహడ్ సామ్రాజ్యం పతనం ఉత్తర ఆఫ్రికన్ ముస్లిం నావికాదళ  క్షీణతకు దారితీసింది. యూరోపియన్, ముఖ్యంగా ఇటాలియన్ వర్తకులు మధ్యధరా ప్రాంతంలో ముస్లిం వ్యాపారులను అధిగమించటం ప్రారంభించారు, ధరలను నిర్ణయించి, మార్కెట్ను ఆదేశించారు. ఒట్టోమన్ నావిక దళం   పెరుగుదల వరకు యూరోపియన్ నావికా విస్తరణ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోలేదు.

ది ఒట్టోమన్ ఫ్లీట్ The Ottoman Fleet:

14 వ శతాబ్దం ప్రారంభంలో ఒట్టోమన్ నావికా దళం అప్పటికే చిన్న విజయాలు సాధించి, చిన్న చిన్న ద్వీపాలను ఒట్టోమన్ సామ్రాజ్యం లో కలిపింది. 15 వ శతాబ్దం మొదటి భాగంలో, ఓట్టోమాన్ వారి గొప్ప ప్రత్యర్థి వెనిస్ కు  వ్యతిరేకంగా విజయం సాధించారు. ఒట్టోమన్ల యొక్క అతి ముఖ్యమైన విజయం కాన్స్టాంటినోపుల్ యొక్క విజయం. 1453 లో కాన్స్టాంటినోపుల్ పేరు ఇస్తాంబుల్ గా మార్చబడింది. ఈ విజయం తరువాత ఒట్టోమన్లు ​​వారి సముద్ర-ఆధారిత రాజ్యం విస్తరించారు. ఏజియన్ Aegean మరియు ఉత్తర ఆఫ్రికాలో చాలా వరకు భూమిని స్వాధీనం పరచుకున్నారు. ఈ కాలం లో ఒట్టోమన్లు ​​ఇతర యూరోపియన్ శక్తులు, ప్రత్యేకించి ఫ్రాన్స్ తో  అనుబంధం కలిగి ఉన్నారు.

1571 లో లెపాంటో యుద్ధం లో ఓడిన , ఒట్టోమన్లు  మరుసటి సంవత్సరం సైప్రస్ను, స్పెయిన్ నుంచి ట్యునీషియా స్వాధీన పరచు కొన్నారు.  17 వ శతాబ్దంలో ఒట్టోమన్లు ​​ఇంగ్లీష్ తీరాల సమీపంలో బ్రిస్టల్ ఛానల్ లోని  లొండి Lundy ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు ఐర్లాండ్, స్వీడన్, స్కాట్లాండ్ మరియు ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాలపై దాడి చేశారు. హిందూ మహాసముద్రంలో పోర్చుగీస్ కు వ్యతిరేకంగా అనేక విజయాలు పొందారు. ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ, ఒట్టోమన్లు మధ్యధరా ప్రాంతాలలో పదిహేడవ మరియు పద్దెనిమిదవ శతాబ్దాలలో విజేతలుగా నిలిచారు.  చివరకు బ్రిటీష్, ఫ్రెంచ్ మరియు రష్యన్ల నావికా కూటమి చేతిలో  నవరినో Navarino (1827) యుద్ధంలో ఒట్టోమన్ దళం తుడిచి పెట్టుకు  పోయింది.  ఆర్థిక తిరోగమనం, స్తబ్దత మరియు 19 వ శతాబ్దం యొక్క గొప్ప "శక్తుల సమతుల్యత balance of powers"  చివరికి ఒట్టోమన్ నావికా దళమును పరాజయం పొందేటట్లు చేసింది.


ముగింపు:

"ఎడారి వీరుల"ధర్మం గా  పెరోoదిన ఇస్లాం, నావికా రంగంలో పేరు సాదించిన 19 వ శతాబ్దానికి వారి క్రైస్తవ మరియు ఐరోపా ప్రత్యర్ధులను అధిగమించించ లేక పోయింది. పెరుగుతున్న పశ్చిమ దేశాల నావికా ప్రాబల్యంను  ముస్లిం నావికా దళం అరికట్టలేక పోయినది.  నిజానికి ఫ్రాన్స్ మరియు డచ్ నావికా దళాలు ఇంగ్లీష్ నావికా శక్తికి వ్యతిరేకం గా ముస్లిమ్స్ తో జత కట్టి బాగు పడినవి. పరిస్థితులు, మరియు బహుశా అదృష్టం వలన , సముద్రాలు అంతటా పశ్చిమ నావికా దళ ఆధిపత్యం కొనసాగింది