22 July 2018

అనాది నుండి నేటి వరకు ప్రపంచంలో 10 మంది అత్యంత ధనికులు The 10 Richest People of All Time




 

జాన్ D. రాక్ఫెల్లర్ లేదా జెంఘీస్ ఖాన్- వీరు ఇద్దరిలో ఎవరు  ఎక్కువ డబ్బు కలిగి ఉన్నారు? ఇది చాలా కష్టమైన జవాబుతో కూడిన  ఒక సాధారణ ప్రశ్న.


ప్రసిద్ద విద్యావేత్తలు మరియు చరిత్రకారులతో జరిపిన ముఖాముఖి సంభాషణల  ఆధారంగా ప్రపంచం లో అన్ని కాలాలలో నివసించిన   సంపన్న వ్యక్తుల యొక్క ర్యాంకింగ్ తయారు చేయబడినది.  సమయ వ్యవధులు మరియు ఆర్ధిక వ్యవస్థల విస్తృత పరిధిలో సంపదను సరి పోల్చుటం కష్టంగా ఉన్నప్పటికీ, పట్టిక తయారు చేయబడినది.
ఆర్థికoగా ప్రభావవంతులైన  సంపన్నులైన  చారిత్రక వ్యక్తులను జాబితా చేయడం చాలా  కఠినమైన కార్యం అయినప్పటికీ ఒక  ప్రయత్నంచేయడం జరిగింది.
10.మన్సా ముసా (Mansa Musa)

 కాలం: 1280-1337
దేశం: మాలి
సంపద: అందరి కంటే అత్యంత ధనికుడు అని వర్ణించవచ్చు
టింబక్టు రాజు అయిన మన్సా ముసా చరిత్రలో అత్యంత ధనిక వ్యక్తిగా తరచూ పిలువబడ్డాడు. ఫెరమ్ కాలేజ్ చరిత్ర ప్రొఫెసర్ రిచర్డ్ స్మిత్ ప్రకారం, ముసా యొక్క పశ్చిమ ఆఫ్రికన్ సామ్రాజ్యం ప్రపంచంలోని అతి పెద్ద బంగారం ఉత్పత్తి ప్రాంతంగా చెప్పవచ్చు.

ముసా ఎంత గొప్పవాడు? అతని  సంపద ఖచ్చితoగా  లెక్కించడానికి వీలు లేనంతగా ఉంది. 
కొన్ని కథనాల ప్రకారం అతని మక్కా యాత్ర సమయం లో ముసా యొక్క వ్యయం చాలా విలాసవంతమైనది మరియు అది  ఈజిప్టులో ద్రవ్య సంక్షోభానికి దారితీసింది, డజన్ల కొద్దీ ఒంటెలు  వందల కొద్ది  పౌండ్ల బంగారాన్ని తీసుకువచ్చాయి. ముసా యొక్క సైన్యం 200,000 మంది పురుషులు, 40,000 ఆర్చర్లు తో కూడి ఉంది. అతని సైనిక దళాల సంఖ్య నేటి ఆధునిక అగ్రరాజ్యాల తో పోటిపడేoతగా ఉంది.

 మిచిగాన్ విశ్వవిద్యాలయ చరిత్రలోని ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అయిన రుడోల్ఫ్ వేర్ ప్రకారం ముసా యొక్క సంపదను వివరించటం అనితర సాద్యం."అతను  ఎన్నడూ చూడని ఒక ధనవంతుడైన వ్యక్తి, ," అని వేర్ అన్నాడు. అతని సంపద వివరించడానికి పదాలు లబించుట లేదు. తన తలపై ఒక బంగారు కిరీటంతో, ఒక కప్పు బంగారాన్ని పట్టుకొని  బంగారు సింహాసనంపై బంగారు రాజదండం పట్టుకున్న  అతని చిత్రాలు ఉన్నాయి. మన కల్పనలో ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉంటాడో ఉహించుకొంటే దానికి రెట్టింపు స్థాయి లో అతని వద్ద బంగారం ఉంది. అతని సంపద మానవుల  ఉహాకు అందనిది.


9.  అగస్టస్ సీజర్  (Augustus Caesar)

 అగస్టస్ సీజర్
 కాలం : 63 BC-14 AD
దేశం: రోమ్
సంపద: $ 4.6 ట్రిలియన్లు.

ప్రపంచ ఆర్థిక ఉత్పాదనలో 25% నుండి 30% వరకు ఉన్న రోమన్  సామ్రాజ్యానికి అగస్టస్ సీజర్ అధిపతి.  స్టాన్ఫోర్డ్ చరిత్ర ప్రొఫెసర్ ఇయాన్ మోరిస్, ప్రకారం, అతని సామ్రాజ్యం యొక్క ఆర్ధికవ్యవస్థలో ఐదో వంతు వ్యక్తిగత సంపదను  అగస్టస్ కలిగి ఉన్నాడు. ఆ సంపద 2014 లో సుమారు 4.6 ట్రిలియన్ డాలర్లకి  సమానం. మోరిస్ ప్రకారం  “కొంతకాలం ఈజిప్టు దేశం  మొత్తం అగస్టస్ యాజమాన్యంలో ఉంది".



8.  చక్రవర్తి షెన్జాంగ్ (Emperor Shenzong)


చక్రవర్తి షెన్జాంగ్
 కాలం : 1048-1085
దేశం: చైనా
సంపద: ప్రపంచ జిడిపిలో 25% నుంచి 30% కలిగిన సామ్రాజ్యం పాలించిన వ్యక్తి.
చైనా సాంగ్ రాజవంశం (960 - 1279) అన్ని కాలాలలో అత్యంత ఆర్థికంగా శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటి. టాంకాం విశ్వవిద్యాలయంలో చైనా సాంగ్ రాజవంశం యొక్క ఆర్థిక చరిత్రకారుడైన ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఎడ్వర్డ్స్ ప్రకారం, సాంగ్ రాజవంశం పరిపాలన కాలం లో చైనా ప్రపంచ ఆర్థిక ఉత్పాదకంలో 25% మరియు 30% కలిగి ఉంది.

 సామ్రాజ్యం యొక్క సంపదకు కారణం  దాని సాంకేతిక ఆవిష్కరణలు  మరియు పన్ను సేకరణలో అది చూపిన తీవ్ర నైపుణ్యం. ఎడ్వర్డ్స్ ప్రకారం నాటి చైనా ప్రభుత్వం పన్ను సేకరణలో  నేటి   యురోపియన్ ప్రభుత్వాల కంటే వందల సంవత్సరాల ముందు ఉంది. సాంగ్ రాజవంశం కాలం లో రాజ్యాధికారం అత్యంత కేంద్రీకృతమైందని ప్రొఫెసర్ సూచించాడు, అంటే చక్రవర్తి ఆర్థిక వ్యవస్థపై అపారమైన నియంత్రణను కలిగి ఉన్నాడు.
7. అక్బర్ చక్రవర్తి (Akbar the Great)

కాలం : 1542-1605AD
దేశం: భారతదేశం
సంపద: ప్రపంచ జిడిపిలో 25% కలిగిన  సామ్రాజ్యం కు అధిపతి పాలించబడుతుంది
మొఘల్ రాజవంశం యొక్క గొప్ప చక్రవర్తి అయిన అక్బర్ ప్రపంచ సామ్రాజ్యం యొక్క నాలుగో వంతు ఆర్ధిక సంపద కలిగిన సామ్రాజ్యాన్ని పాలించాడు. ఫార్చ్యూన్ యొక్క క్రిస్ మాథ్యూస్ అభిప్రాయం లో ఆర్ధిక చరిత్రకారుడు అంగుస్ మాడిసన్ చెప్పినట్లు అక్బర్ కాలం లో  భారతదేశపు జిడిపి ఎలిజబెతన్ ఇంగ్లాండ్ తో  పోల్చదగినది, కానీ "పాలకవర్గం, దాని విపరీత జీవనశైలి యూరోపియన్ సమాజాన్ని అధిగమించింది." 

 
భారతదేశం యొక్క కులీన/ఉన్నత   వర్గం సంపద పశ్చిమానగల  ధనిక వర్గం సoపద కంటే చాలా ఎక్కువ. ఆర్థికవేత్త బ్రంకో మిలనోవిక్ పరిశోధన (Branko Milanovic) ప్రకారం  మొఘల్ రాజవంశం, దేశ జనాభా నుండి అత్యధిక సంపదను ను వెలికితీసింది.


6.  జోసెఫ్ స్టాలిన్ (Joseph Stalin)


కాలం : 1878-1953
దేశం: రష్యా USSR
సంపద: ప్రపంచ జిడిపిలో 9.6% కలిగిన  ఒక దేశం అతని యొక్క పూర్తి నియంత్రణలో ఉన్నది.
ఆధునిక ఆర్థిక చరిత్రలో స్టాలిన్ అరుదైన వ్యక్తి: ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధికవ్యవస్థలలో ఒక దానిని నియంత్రించే సంపూర్ణ అధికారాన్ని కలిగిన నియంత. సోవియట్ యూనియన్ యొక్క సంపద నుండి స్టాలిన్ యొక్క సంపదను వేరుచేయడం నిజానికి  అసాధ్యంగా ఉన్నప్పటికీ, అతని ప్రత్యేకమైన ఆర్ధిక సంపద మరియు USSR సంపద ప్రపంచం లోని ఆర్థికవేత్తలందరిని అతనిని అన్ని సమయాలలో ప్రపంచం లోని అత్యంత ధనవంతులలో ఒకరిగా ప్రతిపాదించటానికి దారితీస్తుంది.

OECD నుండి డేటా ప్రకారం, స్టాలిన్ మరణానికి మూడు సంవత్సరాల ముందు, USSR సుమారు 9.5% ప్రపంచ ఆర్ధిక ఉత్పత్తిని కలిగిఉంది. 2014 నాటికి, ఆ స్థాయి ఉత్పత్తి దాదాపు $ 7.5 ట్రిలియన్ డాలర్లకు సమానంగా ఉంటుంది. ఆ డబ్బు నేరుగా స్టాలిన్ కు  చెందినది కానప్పటికీ, సోవియెట్ ఆర్ధిక శక్తి పై   అతను పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు.  

జార్జి ఓ. లిబెర్, బర్మింగ్ హాం లోని  అలబామా విశ్వవిద్యాలయ చరిత్ర ప్రొఫెసర్ ప్రకారo "ఆయనకు తానూ కోరుకొన్నది    ఏదైనా చేయగల అధిక నియంత్రణ శక్తీ ఉంది. "అతను ఎటువంటి అవరోధాలు లేకుండా  1/6 వంతు  భూ ఉపరితలం పై నియంత్రణను కలిగి ఉన్నాడు."

సాంప్రదాయిక భావంలో స్టాలిన్ ధనవంతుడా? ప్రొఫెసర్ లైబర్ ప్రకారం అంత ఖచ్చితంగా చెప్ప లేము. "అతను వ్యక్తిగత సంపద ను కాదు. అతను దేశం యొక్క సంపదను నియంత్రించాడు. “అయినప్పటికీ, చరిత్రలో అత్యంత ఆర్థికంగా శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో స్టాలిన్ను చేర్చకపోవడం  కష్టం. అతని సంపద అస్పష్టంగా ఉండవచ్చు, కాని దేశ ఆర్ధిక సంపదపై అతని ప్రభావం ఆపారం”.


5. ఆండ్రూ కార్నెగీ (Andrew Carnegie)


కాలం: 1835-1919
దేశం: యునైటెడ్ స్టేట్స్
సంపద : $ 372 బిలియన్

ఆండ్రూ కార్నెగీ అన్ని కాలాలలో అత్యంత ధనిక అమెరికన్. స్కాట్లాండ్ నుండి  వలస వచ్చిన  ఆండ్రూ కార్నెగీ తన కంపెనీ యు.ఎస్. స్టీల్ ను 1901 లో $ 480 మిలియన్లకు జే.పి. మోర్గాన్ కు  విక్రయించి నాడు. ఆ మొత్తo యుఎస్ జీడీపిలో సుమారు 2.1 శాతం కంటే కొంచెం ఎక్కువ. కార్నెగీ ఆర్థిక శక్తి 2014 లో 372 బిలియన్ డాలర్లకు సమానం.

4.  జాన్ D. రాక్ఫెల్లర్ (John D. Rockefeller)


కాలం: 1839-1937
దేశం: యునైటెడ్ స్టేట్స్
సంపద: $ 341 బిలియన్
రాక్ఫెల్లర్ 1863 లో పెట్రోలియం పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు మరియు 1880 నాటికి అతని  స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ 90% అమెరికా చమురు ఉత్పత్తిని నియంత్రించింది.
 న్యూయార్క్ టైమ్స్ ప్రకటించినట్లు  1918 ఫెడరల్ ఆదాయం పన్ను నివేదిక  ప్రకారం రాక్ఫెల్లర్ సుమారు $ 1.5 బిలియన్ విలువైన సంపద కలిగి ఉన్నాడు  మరియు అది US యొక్క ఆర్ధిక ఉత్పత్తి లో దాదాపు 2% సమానమైనదిగా అంచనా వేయబడింది. 2014 లో ఆతని ఆర్ధిక సంపద  341 బిలియన్ డాలర్లకు సమానం.

3.  అలాన్ రూఫస్ (ఎ.కె.ఏ. అలాన్ ది రెడ్)
(Alan Rufus (a.k.a. Alan the Red)

కాలం: 1040-1093
దేశం: ఇంగ్లాండ్
సంపద: $ 194 బిలియన్ డాలర్లు
విజేత విలియం (William the Conqueror) యొక్క మేనల్లుడు, రూఫస్, నార్మన్ ఆక్రమణలో అతని మామయ్య తో కలసి  పాల్గొన్నాడు. “ది రిచెస్ట్ ఆఫ్ ది రిచ్” గ్రంధ కర్తలు  ఫిలిప్ బెరెస్ఫోర్డ్ మరియు బిల్ రూబిన్స్టీన్, ప్రకారం, నాటి ఇంగ్లాండ్ యొక్క GDP లో 7% మొత్తాన్ని అతను కలిగి ఉన్నాడు.అతను మరణించే నాటికి సుమారు 11వేల పౌండ్స్ ను కలిగి ఉన్నాడు అది 2014 నాటికి $ 194 బిలియన్ల డాలర్లకు సమానం.  


2.  బిల్ గేట్స్ (Bill Gates)



కాలం : 1955-ఇప్పటి వరకు
దేశం: యునైటెడ్ స్టేట్స్
సంపద: 78.9 బిలియన్ డాలర్లు
 
సంపన్న జీవన వ్యక్తిగా, బిల్ గేట్స్ సంపదను సులభంగా గుర్తించడం తేలిక. ఫోర్బ్స్ పత్రిక,  మైక్రోసాఫ్ట్ స్థాపకుడి యొక్క నికర విలువని $ 78.9 బిలియన్ల గా అంచనా వేసింది. జరా సహ వ్యవస్థాపకుడు అమంగియో ఓర్టెగా కంటే ఇది $ 8 బిలియన్లు ఎక్కువ.  అతను  ప్రపంచంలో రెండవ ధనిక వ్యక్తి.



1.  చెంఘీజ్ ఖాన్ (Genghis Khan)

కాలం : 1162-1227
దేశం: మంగోలియన్ ఎంపైర్
సంపద: చాలా బోలెడంత, చాలా లెక్కలేనంత.
జెంకిస్ ఖాన్ నిస్సందేహంగా అత్యంత విజయవంతమైన మంగోలియా  సైనిక నాయకులలో ఒకడు. చైనా నుండి ఐరోపా వరకు విస్తరించిoన మంగోల్ సామ్రాజ్యం యొక్క అధిపతి.  మంగోల్ సామ్రాజ్యం చరిత్రలో అతిపెద్ద ఆక్రమిత సామ్రాజ్యాన్ని నియంత్రించింది. గొప్ప అధికారం ఉన్నప్పటికీ జెంకిస్ ఖాన్  తన సంపదను ఎన్నడూ నిలువ చేయలేదని పండితులు అంటారు. ఖాన్ యొక్క ఔదార్యము అతని విజయానికి కీలకం.

"అతని  విజయానికి మూలం విజయం లో లభించిన సంపదను  తన సైనికులతో మరియు ఇతర కమాండర్లతో పంచుకోవటం " అని మోనిస్ రాస్సాబి, CUNY క్వీన్స్ కళాశాల చరిత్రలో ప్రముఖ విద్వాంసుడు అన్నాడు.
 “జెంగ్స్ ఖాన్ మరియు మేకింగ్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్” యొక్క రచయిత అయిన జాక్ వెదర్ఫోర్డ్ మంగోల్ సైనికులు, అనేక పూర్వ-ఆధునిక సైన్యాల మాదిరిగా కాకుండా వ్యక్తిగత దోపిడిని నిషేధించారని వివరిస్తుంది. ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ప్రతి వస్తువును అధికారిక క్లర్కులు లేక్కవేసిన తర్వాత సైనికులు  మరియు వారి కుటుంబాల మధ్య పంపిణీ చేసేవారు.
  
చెంఘీస్ ఖాన్ అందులో తన వాటాను అందుకున్నాడు, కానీ అది అతనిని గొప్పగా చేయలేదు. "అతను తనకు లేదా తన కుటుంబానికి ఏ భవనాన్ని నిర్మించలేదు, ఏ దేవాలయం, ఏ సమాధిని, ఇంటిని  నిర్మించలేదు" అని వెదర్ఫోర్డ్ చెప్పాడు. "అతను ఉన్ని ఇచ్చే ఒక పశువుల కొట్టం లో  జన్మించాడు మరియు అతను ఒక ఉన్ని పశువుల కొట్టం లో మరణించాడు. మరణం తరువాత అతనిని సాధారణ వ్యక్తి వలె ఖననం చేశారు. "












No comments:

Post a Comment