“ యా అల్లాహ్! మమ్ములను రజబ్
మరియు షాబాన్ లో ఆశ్విరదించు మరియు రమదాన్ లో మంచి ఆరోగ్యం ఇవ్వు”. అమీన్.
నేను రంజాన్ కోసం ఒక వ్యాసం రాస్తున్నప్పుడు
ఒక స్నేహితురాలు అడిగింది "మీరు ఏమి
రాయాలనుకుంటున్నారు? మనకు రంజాన్ గురించి అంతా
తెలుసు ఇంకా ప్రత్యేకంగా రాయ వలసింది ఏమి ఉంది? పైగా దానిని గురించి ప్రతిదీ మళ్ళీ మళ్ళి
వింటున్నాము కదా!
రంజాన్ కు సంభందించిన ఆయతులు
మరియు హదిస్సు లు మనకు తెలుసు, అవి మన విశ్వాసం ఉన్నతవరకు అలాగే ఉంటాయి. కాని మనం వాటిని
అనేక సార్లు విన్నాము అన్న భావన వాస్తవం గా మనలను అది మరింత జవాబుదారీగా చేస్తుంది.
మనం మార్గదర్శకత్వం కోసం జ్ఞానం ను
మరింతగా పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అలహందుల్లా! మనకు చిన్నతనం
నుండి రంజాన్ యొక్క సిద్ధాంతాలను బోధించుతారు. దువా ను ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకు తీసుకు వేళ్ళదాము. మనం
ఈ దీవించిన నెల(రంజాన్) ఎంపిక గ్రహీతలు గా ఉన్నాము. అల్లాహ్ (SWT) ప్రార్థనా ఇతర
చర్యలు కాకుండా, ఉపవాసం నాకు(విశ్వాసికి)
మాత్రమే అని చెప్పాడు. అది ఎంత గౌరవం! మనం
అల్లాహ్ (SWT) చే వ్యక్తిగతంగా
బహుమతి పొందటం కోసం ఏదైనా చేయాల్సిన అవకాశం ఉంది. మనము ఒక ఇష్టమైన అతిధి కోసం బాగా సన్నాహాలు చేస్తాము అలాగే రంజాన్ వంటి విలువైన
పవిత్ర మాసం కోసం ముందుగానే సిద్ధం అవుదాము.
ఆర్గనైజింగ్
పుస్తకాలు / టేపులను / దువా కరపత్రాలు
ఒకే చోట సేకరించండి, రంజాన్ సమయంలో విలువైన సమయం ను వృధా చేయవద్దు. కొన్ని పుస్తకాలు ఇచ్చి/లేక తీసుకోని ఉంటె
వాటిని రంజాన్ ముందు సంబంధిత యజమానులకు చేర్చండి
' రంజాన్' ను స్వాగతిస్తూ
చర్చకార్యక్రమం కు హాజరుకండి లేదా నిర్వహించండి మరియు స్నేహితులు, బంధువులను
ఆహ్వానించoడి.
మీరు తరాబి ప్రార్ధనల కోసం వెళ్ళడం కొరకు ప్రణాళిక వేయండి.
మహిళలకొరకు స్వాగత వేదికలు తెలుసుకోండి. ముందే
పిల్లల రక్షణ మరియు రవాణా ఏర్పాట్లు చేయండి.
కొనుగోలు:
ఉపావాసం విరమణ కొరకు మరియు దువా
కొరకు ఖర్జూరాలు చిన్న ప్యాకెట్లగా ప్యాక్ చేయండి. రంజాన్ రెండు వారాల ముందు మసీదు, లేదా మీ కుటుంబం
లోని వ్యక్తులకు మరియు స్నేహితులకు బహుమతి గా ఈ ప్యాకెట్లు
ఇవ్వండి.
మీ చేయవలసిన పనులు పూర్తి చేయండి
లేదా ఈద్ తర్వాత ముఖ్యం కాని విషయాలు వాయిదా
వెయ్యండి.
రంజాన్ ప్రారంభానికి గుర్తుగా పిల్లలకు
చిన్న బహుమతులు కొనుగోలు చేయండి.
వారికి కొన్ని బూరలు, క్యాండి ఇవ్వండి వారు ఈద్ వరకు రోజులు లెక్కబెట్టుకొంటారు.
ఈద్ కోసం ముందే బట్టల షాపింగ్ పూర్తి
చేయండి.
కుటుంబం, స్నేహితులు మరియు
పనివారు మరియు పిల్లల కోసం ఈద్ బహుమతులు కొనుగోలుచేయండి.
ఈద్ పార్టీ ప్రణాళిక ఉంటే, రంజాన్ ముందు సన్నాహాలు
ప్రారంబించండి.
పనివారి కోసం బహుమతులు ఇవ్వడం లో మీ పిల్లల సహాయం తీసుకోండి.
.ప్రతిబింబిస్తూ
రంజాన్ ముందు తప్పిన ఉపవాసాలను
పూర్తి చేయండి.
ప్రార్ధన నియమాలు పిల్లలకు
నేర్పండి.
మీ మునుపటి రంజాన్
రోజులను సమిక్షించుకొని మరియు ఈ సంవత్సరం లక్ష్యాలను
నిర్ణయిoచుకోండి. ప్రతి రోజు మునుపటి కంటే బాగా ఉండాలి అదేవిధంగా, రెండు రంజాన్
రోజులు ఒకే విధంగా ఉండకూడదు. మీరు చేసిన మంచి గురించి ఆలోచించండి మరియు మునుపటి తప్పులు చేయకండి. రంజాన్ నెలలోని చివరి పది రాత్రులు ప్రత్యేక, నిర్దిష్ట లక్ష్యాలను
నిర్ణయించుకొండి.
సమయం విలువ గుర్తించండి. రమదాన్
నెలలో అనవసర విషయాలు నుండి దూరంగా ఉండాలని
అనుకోండి.
గృహ విధులు
సమోసాలు, రోల్స్, కేబాబ్స్, చట్నీలు ముందుగానే
చేయండి.
మద్యస్థంగా ఉండండి. ఇఫ్తార్
తరువాత భోజనం భారీగా తినవద్దు, దానివల్ల అసౌకర్యం పొందవద్దు.
ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమము రంజాన్ ముందు
నిర్వహించండి. ఉపవాసం సమయం
లో ఎక్కువ గృహ పనులు పెట్టుకోవద్దు.
సాంఘికంగా
సాధ్యమైనంత వరకు విలాసవంతమైన ఇఫ్తార్
పార్టీలు ఇవ్వకండి. మసీదుకు ఇఫ్తార్ పంపoడి లేదా అర్హమైన ఇరుగు పొరుగు కుటుంబానికి ఇఫ్తార్
భోజనం ఇవ్వండి. అందువలన శుభాలు పొందండి.
మీరు రంజాన్ కు ముందు ఫోన్ లో
అందరు బంధువులను పలకరించండి వారి దువా పొందండి.
కుటుంబ సమయం
మీరు ఒక కొత్త సున్నత్ పాటించండి.మిస్వాక్
ఉపయోగించండి. నిద్రించే ముందు వజూ చేయండి.
పిల్లలకు పనులను అప్పగించండి
అందువలన మీకు శ్రమ తక్కువగా ఉంటుంది, మరియు పిల్లలు
రంజాన్ యొక్క ఆత్మ(spirit) లోకి పొతారు.
ఒక సదకా బాక్స్ తయారు చేయండి మరియు ప్రతి రోజు అందులో కొంత వేయటానికి కుటుంబ
సభ్యులను ప్రోత్సహించండి.
ఉత్తమ రంజాన్ పొందటానికి అన్ని ఏర్పాట్లు చేయండి.
అల్లాహ్ శుభాలు పొందండి.
No comments:
Post a Comment